♦ పరీక్ష తేదీని ప్రకటించిన గౌహతి ఐఐటీ
♦ అడ్వాన్స్‌డ్‌కు 2 లక్షల మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 2016 మే 22న నిర్వహిస్తామని గౌహతి ఐఐటీ ప్రకటించింది. తొలుత మే 22 లేదా 24న ఈ పరీక్ష ఉండొచ్చని ఐఐటీ వర్గాలు పేర్కొన్నప్పటికీ మే 22నే పరీక్ష జరుపుతామని గౌహతి ఐఐటీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో టాప్ 1.5 లక్షల మంది విద్యార్థులనే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులుగా ప్రకటిస్తుండగా ఇకపై జేఈఈ మెయిన్‌లో అత్యధిక మార్కులు సాధించిన టాప్ 2 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా గౌహతి ఐఐటీ పేర్కొంది. మరోవైపు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2016 నోటిఫికేషన్ త్వరలోనే జారీ కానుంది.
ప్రస్తుతం జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు (స్కోర్) ఇస్తున్న 40 శాతం వెయిటేజీని (మరో 60 శాతం జేఈఈ మెయిన్ స్కోర్‌కు ఇస్తారు) రద్దు చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సమర్పించిన సిఫార్సు నివేదికలో పేర్కొనగా.. దీనిపై కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మరో మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ఆ తరువాత సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జేఈఈ మెయిన్-2016 నోటిఫికేషన్‌ను జారీ చే సే అవకాశం ఉంది. మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తులకు సంబంధించిన వివరాలను రెండు, మూడు రోజుల్లో గౌహతి ఐఐటీ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మే 22న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
Published Mon, Nov 9 2015 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM
Advertisement