JEE Main
-
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల జోరు
సాక్షి, అమరావతి: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్–2025 జవనరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జనవరి సెషన్‌కు అక్టోబర్ 28 దరఖాస్తుల విండో ప్రారంభమైనా... మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త విధానాలు, అర్హత ప్రమాణాల మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంది.ఐచ్ఛిక ప్రశ్నలు, వయసు పరిమితి తొలగింపు..కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్–బీలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్–బీలోని ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలకు బదులు ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.టై బ్రేక్ రూల్స్ మార్పు...– జేఈఈ మెయిన్–2025లో ఒకే మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థుల ర్యాంకుల టై బ్రేక్ రూల్స్‌ను ఎన్టీఏ సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరీక్ష రాసేవారి వయసు, దరఖాస్తు సంఖ్యను ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు.– విద్యార్థులు ఒకే మొత్తం స్కోర్‌ను సాధిస్తే సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. – గణితంలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు టై సమయంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు.– గణితంలోను ఒకే మార్కులు వచ్చినప్పుడు ఫిజిక్స్‌లో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా ఒకే మార్కులు సాధిస్తే కెమిస్ట్రీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.– వీటి ద్వారా టై సమస్య కొలిక్కి రాకపోతే అన్ని సబ్జెక్ట్‌లలో సరైన సమాధానాలకు, సరికాని సమాధానాల నిష్పత్తి తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. వీటిల్లోను నిష్పత్తి టై అయితే గణితం, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వరుసగా సరికాని సమాధానాల నిష్పత్తులను గుర్తిస్తారు. – ఈ అన్ని దశల తర్వాత కూడా టై మిగిలి ఉంటే అభ్యర్థులకు అదే ర్యాంక్ కేటాయిస్తారు. దేశ, విదేశాల్లో తగ్గిన పరీక్ష కేంద్రాల నగరాలు..దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించే నగరాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించడంతోపాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లను తగ్గించారు. తెలంగాణాలో రెండు కొత్తగా రెండు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే...అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.ఏపీలో పరీక్ష కేంద్రాలు తొలగించిన పట్టణాలుఅమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు. -
దర్జాగా సర్టిఫికెట్ల దందా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల దందా కొనసాగుతోంది. సర్వీసు చార్జీల కింద రూ.45 తీసుకోవాల్సి ఉండగా సర్టిఫికెట్‌కు రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. ఎన్ఐటీలు, ఐఐటీలు, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం ముందుగా నిర్వహించే జేఈఈ మెయిన్‌కు అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివే పిల్లల తల్లిదండ్రులు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కేంద్రాల నిర్వాహకులు భారీ దందాకు తెరలేపారు. తల్లిదండ్రులకు అవసరం కాబట్టి ప్రాంతాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.500 నుంచి రూ.1,000 వరకు, కొన్నిచోట్ల రూ.4,000 వరకు కూడా వసూలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది, అంటెండర్లతో కుమ్మౖMð్క ఈ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జేఈఈ మెయిన్ అని కాకుండా సాధారణ రోజుల్లో సైతం తహశీల్దార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకుని కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ముట్టకపోతే దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచేస్తున్నారని, కొంతకాలం తర్వాత ఏదో ఒక కారణంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులుండటం గమనార్హం. పౌరసేవకు ఎగనామం దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం పౌరసేవల పరిధిలోకి తెచ్చింది. నామమాత్రపు రుసుంతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానం ప్రారంభించింది. అయితే దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు తహసీల్ కార్యాలయాల సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రూ.45 సర్వీసు చార్జీ ఉండే ఓబీసీ సర్టిఫికెట్ కావాలంటే పట్టణ ప్రాంతాల్లోని పలుచోట్ల రూ.4,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000 వరకు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. తామే ఆన్లైన్లో దరఖాస్తు చేసి, ఆ పత్రాలను తహసీల్దార్ కార్యాలయానికి పంపించి, ఆమోదించేలా చూస్తామని చెప్పి వసూళ్లు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 70 వేల మంది తల్లిదండ్రులపై ప్రభావం అక్టోబర్ 28వ తేదీన జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ జారీ అయింది. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీతో గడువు ముగియనుంది. కాగా ఏదైనా రిజర్వేషన్ వర్తించాలంటే సంబంధిత సర్టిఫికెట్లు కావాల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 95 వేల మంది హాజరు కానుండగా, అందులో దాదాపు 70 వేలమందికి ఈ సర్టిఫికెట్లు అవసరమని అంచనా. దీనిని అసరాగా చేసుకొని మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్ కార్యాలయాల సిబ్బంది దందాకు తెరతీశారు. సొమ్ము దండుకున్నా దబాయింపులేహైదరాబాద్లోని కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తన కుమారుడి కోసం (జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసేందుకు) ఓబీసీ సర్టిఫికెట్ అవసరమైంది. దరఖాస్తు చేద్దామని స్థానిక మీ సేవా కేంద్రానికి వెళ్లారు. అక్కడి నిర్వాహకుడు.. ‘మేమే దరఖాస్తు చేస్తాం.. దరఖాస్తు ఫారాన్ని మేమే తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చి ఆన్లైన్లో ఆమోదం పొందేలా చేస్తాం.. అందుకు రూ.1,000 ఖర్చు అవుతుంది’అని చెప్పాడు. రూ.45 దరఖాస్తుకు అంత చెల్లించాలా? అని శ్రీనివాస్.. బాలానగర్‌లోని మరో మీ సేవ కేంద్రానికి వెళ్లి అడగ్గా అక్కడా ఇదే సమాధానం ఎదురైంది. గత్యంతరం లేక రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేశాడు. 12 రోజులు గడిచినా దరఖాస్తును కార్యాలయ సిబ్బంది కనీసం ఓపెన్ కూడా చేయలేదు. మీ సేవ కేంద్రం నిర్వాహకుడిని అడిగితే ‘అవుతుందిలే.. చేస్తాం.. తహసీల్దార్ కార్యాలయంలో చేయించే వ్యక్తి బిజీగా ఉన్నాడు..’అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీనివాస్ నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కిషోర్ అనే వ్యక్తిని కలిశారు. అతను ‘మీరు నేరుగా ఎలా వస్తారు..’అంటూ మండిపడ్డాడు. దీంతో శ్రీనివాస్ అక్కడ ఉన్న ఇతర సిబ్బందిని సంప్రదించారు. అంతా కుమ్మక్కే కావడంతో.. ‘మీ దరఖాస్తు ఫారమే లేదు. మీరివ్వలేదు..’అంటూ వాళ్లు బుకాయించారు. రెండురోజులు తిరిగి విసిగిపోయిన శ్రీనివాస్ చివరకు తహసీల్దార్‌ను కలిసి పరిస్థితి వివరించాడు. ఆన్లైన్ ఫారం ప్రింట్ తీసి ఫైల్ సిద్ధం చేయాలని తహసీల్దార్ కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అయినా వారు పలు కొర్రీలు పెట్టారు. దీంతో శ్రీనివాస్ మళ్లీ తహసీల్దార్‌ను కలవడంతో ఎట్టకేలకు సర్టిఫికెట్ జారీ అయ్యింది. -
విద్యార్థులకు ఆధార్.. బాధార్..
ప్రభుత్వం నుంచి పొందే సేవలన్నింటినీ ఆధార్‌తో ముడిపెట్టడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నత విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలోను ఆధార్ కార్డునే పరిగణనలోకి తీసుకుంటుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ఆధార్ కార్డును గుర్తింపు ధ్రువీకరణగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఆధార్ సమస్య వేధిస్తోంది. జనవరిలో జరగనున్న జేఈఈ మెయిన్–2025 మొదటి సెషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు గడువు ఈనెల 22న ముగియనుంది. దరఖాస్తు చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలు విద్యార్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ప్రధానంగా ఆధార్ కార్డులోను, టెన్త్ సర్టిఫికెట్లోను విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా ఒకే విధంగా ఉండాలనే నిబంధన చాలా ఇబ్బందిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 20 వేలమందికిపైగా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఆధార్‌కార్డు, టెన్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయగానే నేమ్స్ మిస్ మ్యాచ్ అని చూపిస్తోందని ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. –గుంటూరు ఎడ్యుకేషన్ఆధార్ కేంద్రాల వద్ద ఆలస్యం దీంతో జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క గుంటూరు నగరంలోనే వందలమంది విద్యార్థులు నెలరోజులుగా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పేర్ల సవరణల కోసం ప్రయత్నిస్తున్నారు. పేరులో తప్పుల సవరణ, బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పు ఒకేసారి చేయడం కుదరదని, మరోసారి రావాలని ఆయా కేంద్రాల సిబ్బంది చెబుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుకు గడువు సమీపిస్తుండటం వారిని కలవరపరుస్తోంది. ఆధార్‌కార్డులో సవరణలకు 15 రోజుల నుంచి నెలరోజుల సమయం పట్టడం కూడా ఇబ్బందిగా మారింది. తగినన్నిఆధార్ కేంద్రాలేవి?జేఈఈ మెయిన్‌తోపాటు ఇంటర్మీడియెట్, అపార్ నమోదు కోసం ఆధార్‌లో సవరణలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే ఉన్న ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చి గుంటూరులోని ప్రైవేటు జూనియర్ కళాశాలల హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆధార్ కార్డులో సవరణలు కోసం ఎక్కడో మారుమూల ఉన్న ఊర్ల నుంచి తల్లిదండ్రులు వచి్చ, పిల్లలను వెంటబెట్టుకుని ఆ«ధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉండాలంటే వారికి కష్టంగా ఉంటోంది. పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సిన విద్యార్థుల సమయం ఆధార్ కేంద్రాల వద్దే గడిచిపోతోంది. దీనికితోడు గుంటూరులో చంద్రమౌళీనగర్‌లోని పోస్టాఫీసులో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఇటీవల మూసేశారు. విద్యార్థుల కోసం ఆధార్ సవరణలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జిల్లా అధికారులు తరువాత పట్టించుకోలేదు. -
‘నన్ను క్షమించండి’.. జేఈఈ పరీక్ష ఫెయిల్ అవ్వడంతో..!
న్యూఢిల్లీ: చిన్న చిన్న కారణాలతోనే విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అమ్మానాన్న తిట్టారని, మొబైల్ కొనివ్వలేదని, పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ప్రేమ విఫలమైందని, డిప్రెషన్ వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి పెద్దవాళ్ల వరకు క్షణికావేశంలో తమను తామే చంపేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది.జేఈఈ మెయిన్స్ పరీక్షలో పాస్ కాలేదని మనస్తాపం చెందిన 17 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి తన ఇంటర్ పూర్తికాగానే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే చదువులో ఒత్తిడి కారణంగా పరీక్ష పాస్ కాలేదు. ఆమె అనుకున్న అంచనాలను చేరుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో శుక్రవారం రాత్రి షాహిన్ భాగ్‌లోని బిల్డింగ్‌లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వద్ద సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో‘ నన్ను క్షమించండి.. నేను సాధించలేకపోయాను. జేఈఈ పరీక్షను క్లియర్ చేయలేకపోయాను’ అని రాసి ఉంది. అయితే పరీక్షలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి తెలియజేసిందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ప్రైవేట్ ఉగ్యోగి కాగా, ఆమె తల్లి గృహిణి. -
మెయిన్‌లోనూ మనోళ్లు టాప్ గేర్‌లో
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో ఈ ఏడాది కూడా తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి 11 జాతీయ ర్యాంకుల్లో మూడింటిని తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన హందేకర్ విదిత్ ఐదో ర్యాంకు, ముత్తవరపు అనూప్ 6వ ర్యాంకు, వెంకట సాయితేజ మాదినేని 7వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, దేశంలో 56 మందికి వందశాతం పర్సంటైల్ వస్తే, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. అందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించగా, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మంది ఆ జాబితాలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో మూడో స్థానంలో తెలంగాణజేఈఈ మెయిన్‌లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఈ ఏడాది ఎక్కువ మంది జేఈఈ మెయిన్ రాయడంతో అన్ని కేటగిరీల్లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ పెరిగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో మే 10 వరకు గడువు ఉంది. మే 17 నుంచి 26 మధ్య అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీ చేస్తారు. వంద పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులుతెలంగాణ: హందేకర్ విదిత్(5), ముత్తవరపు అనూప్(6), వెంకట సాయితేజ మాదినేని(7), రెడ్డి అనిల్(9), రోహన్ సాయిబాబా(12), శ్రీయాశస్ మోహన్ కల్లూరి(13), కేసం చెన్నబసవరెడ్డి(14), మురికినాటి సాయి దివ్య తేజరెడ్డి(15), రిషి శేఖర్ శుక్లా(19), తవ్వ దినేశ్ రెడ్డి(24), గంగ శ్రేయాస్(35), పొలిశెట్టి రితిష్ బాలాజీ(39), తమటం జయదేవ్ రెడ్డి(43), మావూరు జస్విత్(49), దొరిసాల శ్రీనివాసరెడ్డి (52). ఆంధ్రప్రదేశ్: చింటు సతీష్ కుమార్ (8), షేక్ సూరజ్ (17), మాకినేని జిష్ణు సాయి(18), తోటంశెట్టి నిఖిలేష్(20), అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి(21), తోట సాయికార్తీక్ (23), మురసాని సాయి యశ్వంత్ రెడ్డి(36). ♦ ఈడబ్యూఎస్ విభాగంలో తొలి 6 స్థానాల్లో ఇద్దరు ఆంధ్రా, నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేసం చెన్నబసవరెడ్డి మొదటిస్థానంలో నిలవగా, తోటంశెట్టి నిఖిలేష్ మూడో స్థానంలో నిలిచాడు.♦ తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో మరువూరి జస్వంత్ వందశాతం, ఎస్టీ కోటాలో జగన్నాధం మోహిత్ 99 శాతం పర్సంటైల్ సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో చుంకిచర్ల శ్రీచరణ్ జాతీయ ర్యాంకర్‌గా నిలిచారు. ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: హందేకర్ విదిత్జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, తల్లి ప్రభుత్వ టీచర్. వారి చేయూతతోనే నేను ముందుకెళ్లాను. నాకు ఐఐటీ–బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని ఉంది. ఆ తర్వాత స్టార్టప్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్‌తోనే ఈ ర్యాంకు సాధించాను. -
జేఈఈ మెయిన్‌కు రికార్డు స్థాయిలో హాజరు
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్ పేపర్–1 (బీఈ/బీటెక్) పరీక్ష 95.80 శాతం, పేపర్–2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్‌కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు. 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలు.. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్–1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం. దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించారు. రెండో సెషన్ తేదీల్లో మార్పు.. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్దరాత్రి 11.50 గంటల వరకు సెషన్–2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు. -
55,000 వరకు నేషనల్ లెవల్
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు కోసం ఈ నెల 15 వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తమకు ఏ ర్యాంకు వస్తుంది? ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే ఉత్సుకత విద్యార్థుల్లో నెలకొంది. గతేడాది జేఈఈ అంచనాలు, ఈసారి పేపర్ విధానాన్ని పరిశీలిస్తే జేఈఈ మెయిన్‌లో 55 వేల వరకు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏదో ఒక కోర్సులో, ఎక్కడో ఒకచోట సీటు ఖాయమని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్‌కు 60 వేలు, ఓబీసీలకు 65 వేలు, ఎస్సీలకు 1.20 లక్షలు, ఎస్టీలకు 3 లక్షలు, పీడబ్ల్యూడీలకు 8 లక్షల ర్యాంకు వచ్చినా జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. అయితే కంప్యూటర్ సైన్స్, నచ్చిన కాలేజీలో సీటు కోసం మాత్రం పోటీ ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్, సూర్తాల్, తిరుచాపల్లి వంటి ఎన్ఐటీ కాలేజీల్లో సీటు రావాలంటే జేఈఈ మెయిన్‌లో 5 వేలలోపు ర్యాంకు వరకే ఆశలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 30 నుంచి దరఖాస్తులకు అవకాశం... ఈ నెల 30 నుంచి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశాల అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. ఈసారి జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రాశారు. వారిలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీలతోపాటు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ–కేటగిరీ సీట్లలో ప్రాధాన్యం పొందుతారు. దేశవ్యాప్తంగా ఈసారి 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులకు అనుమతించడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెంచడమే దీనికి కారణం. ఐఐటీల్లో 16,053 సీట్లు, ఎన్ఐటీల్లో 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 16 వేలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 6,078 సీట్లున్నాయి. గతేడాది పర్సంటైల్‌ను పరిశీలిస్తే జనరల్ కేటగిరీలో 88.41 పర్సంటేల్ వస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. ఓబీసీ ఎన్‌సీఎల్‌కు 67.00, ఈడబ్ల్యూఎస్‌కు 63.11, ఎస్సీలకు 43.08, ఎస్టీలకు 26.77, పీడబ్ల్యూడీలకు 0.003 పర్సంటేల్తో అడ్వాన్స్డ్ కటాఫ్ ఖరారైంది. ఈసారి కూడా పోటీని బట్టి కటాఫ్ గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి.. జేఈఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ వచ్చిన వారు సాధారణంగా అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. మెయిన్‌లో అర్హత పొంది, 55 వేల ర్యాంకు వరకు వస్తే మాత్రం ఎన్ఐటీ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. ర్యాంకు ఎంతో తెలిశాక ఆచితూచి అడుగేయాలి. కాలేజీతో ప్రాధాన్యం లేదనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ర్యాంకులను బట్టి ముందుకెళ్లాలి. కోరుకున్న కోర్సు, కాలేజీనే కావాలనుకుంటే వచ్చిన ర్యాంకును బట్టి సీటు వస్తుందో లేదో చూసుకోవాలి. లేకుంటే లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని వచ్చే ఏడాది మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించడమే మంచిది. – ఎంఎన్ రావు, జేఈఈ మెయిన్ బోధన నిపుణుడు -
జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ లెటర్లు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ –2023 సెకండ్ సెషన్ పరీక్షలకు సిటీ ఇంటిమేషన్ లెటర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ https:// jee main. nta.nic.in/' నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. మెయిన్ సెకండ్ సెషన్ ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 290 పట్టణాలతో పాటు విదేశాల్లోని 24 పట్టణాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 25 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటుచేసింది. విద్యార్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయాలో తెలియజేసేలా ఎన్టీఏ ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్లను ముందుగా విడుదల చేస్తుంది. విద్యార్థులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి, పరీక్షల రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి చేరుకోవడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు వారి దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా సిటీ ఇంటిమేషన్ లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లతో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశానికి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. వీటిని కూడా త్వరలోనే ఎన్టీఏ విడుదల చేయనుంది. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఏర్పడితే 011–40759000 ఫోన్ నెంబర్లో లేదా "jeemain@nta.ac.in.' ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. విద్యార్థులు ఎన్టీఏ అధికారక వెబ్సైట్లలో వచ్చే సూచనలను అనుసరించాలని సూచించింది. -
జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు
న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) పేపర్ లీక్ కేసులో రష్యన్ వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అదుపులోకి తీసుకుంది. సదరు రష్యన్ వ్యక్తిని మిఖాయిల్ షార్గిన్‌గా అధికారులు గుర్తించారు. నిందితుడు జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ఐలియన్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడంలో సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. మిఖాయిల్ కజికిస్తాన్‌లోని అల్మాటీ నుంచి భారత్‌కు వచ్చేందుకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడంతో ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాదు జేఈఈ మెయిన్స్‌తో సహా వివిధ ఆన్లైన్ పరీక్షల్లో కొందరు విదేశీయులు కుమ్మక్కై హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ మాట్లాడుతూ... జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షను నిర్వహించే ఐలియన్ సాఫ్ట్‌వేర్‌ను మిఖాయిల్ షార్గిన్ హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూపొందించింది. పరీక్ష సమయంలో అనుమానిత అభ్యర్థుల కంప్యూటర్ సిస్టమ్‌ను హ్యాక్ చేయండలో ఈ నిందితులు సహకరించినట్లు తేలింది. దీంతో అతనికి నోటీసులు జారి చేసినట్లు పేర్కొంది. (చదవండి: విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్‌గా ప్రయాణించిన విమానం) -
23 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి మొదటి దశలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 20 నుంచి మొదలవ్వాల్సిన పరీక్షను 23కు మార్చారు. తొలి విడత పరీక్షలు ఈ నెల 29 వరకూ జరుగుతాయి. ఆడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను శనివారం నుంచే అనుమతించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పూర్తిగా ఆన్లైన్ మోడ్‌లో దేశవ్యాప్తంగా 501 ప్రాంతాల్లో మెయిన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎవరెవరికి ఎక్కడ పరీక్ష అనే విషయాన్ని జేఈఈ మెయిన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష రాసే పట్టణం పేరు మాత్రమే వెబ్సైట్లో ఉంటుందని, పరీక్ష కేంద్రం ఎక్కడనేది హాల్ టిక్కెట్లో ఇస్తామని తెలిపింది. పరీక్షలోనూ మార్పులు రెండేళ్ళ కోవిడ్ తర్వాత నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఈసారి కొంత కఠినంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. పరీక్ష విధానంలో మార్పులే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. గత రెండేళ్ళుగా సెక్షన్–ఏలో నెగెటివ్ మార్కింగ్ ఉండేది. ఇప్పుడు దీన్ని సెక్షన్–బీలో కూడా పెడుతున్నారు. ఈ విభాగంలో ఇచ్చే న్యూమరికల్ ప్రశ్నలకు దీన్ని పెట్టడం వల్ల విద్యార్థులు ఆచితూచి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నపత్రం మొత్తం 20 మార్కులకు ఉంటుంది. ఇదిలా ఉండగా, గతంలో మొత్తం 90 (ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు) ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. దీంతో మొత్తం మార్కుల సంఖ్య 360గా ఉండేది. ఇప్పుడు 90 ప్రశ్నల్లో 75కే జవాబు ఇవ్వాలి. మిగతా 15 చాయిస్‌గా తీసుకోవచ్చు. దీంతో ప్రశ్నపత్రం 300 మార్కులకే ఉండనుంది. సమాన మార్కులు వస్తే టై బ్రేకర్ విధానం 2021లో రద్దు చేసిన టై బ్రేకర్ విధానాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్ళీ తెరమీదకు తెచ్చింది. ర్యాంకుల్లో సమానమైన స్కోర్ సాధించినప్పుడు వయసును కూడా ప్రామాణికంగా తీసుకోవడం ఈ విధానంలో ప్రత్యేకత. ఇద్దరు విద్యార్థులు పరీక్షలో సమానమైన మార్కులు సాధిస్తే ముందుగా గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీల మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆ తర్వాత తప్పు సమాధానాల నిష్పత్తిని సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో మార్కులు ఉంటే వయసును పరిగణనలోనికి తీసుకుంటారు. అప్పుడు కూడా ఇద్దరూ సమానంగా ఉంటే, ముందు ఎవరు దరఖాస్తు చేశారో చూసి ర్యాంకులు నిర్ధారిస్తారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష మొదటి విడత ఈ నెల 23 నుంచి 29 వరకూ , ఆ తర్వాత జూలై 21 నుంచి 30 వరకూ రెండో విడత జరుగుతుంది. కోవిడ్ సమయంలో నాలుగు విడతల పరీక్ష విధానాన్ని రెండు విడతలుగా మార్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. -
జేఈఈ మెయిన్–2022 నిబంధనల్లో మార్పులు.. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 నిబంధనల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసినందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో అన్ని సెక్షన్ల ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్‌ను అమలు చేయనున్నామని ఎన్టీఏ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నందున అభ్యర్థులు సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలని, తప్పుడు సమాధానాలు గుర్తిస్తే మార్కుల్లో కోత పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో సెక్షన్–ఎ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బి లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్‌తో పాటు బీఆర్క్‌కు సంబంధించిన పేపర్ 2ఏలోని సెక్షన్–బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. ప్రశ్నల్లో విద్యార్థులకు చాయిస్ కరోనా కారణంగా కాలేజీలు ఆలస్యంగా తెరచుకోవడంతో 2021–22 విద్యా సంవత్సరంలోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను కుదించాయి. అయితే ఎన్టీఏ సిలబస్ కుదించలేదు. అయితే విద్యార్థులకు ఉపశమనంగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్1, పేపర్ 2ఏ, 2బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్‌ను ఇచ్చింది. ఆయా విభాగాల్లో తమకు వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబు ఇవ్వవచ్చు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రశ్న పత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే అందిస్తారు. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్ తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందస్తు దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది హాజరు జేఈఈ మెయిన్‌ను 2021లో నాలుగు విడతలుగా నిర్వహించగా ఈసారి రెండు విడతలకే పరిమితం చేశారు. తొలి విడత ఈనెల 20 నుంచి 29 వరకు, మలివిడత జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఈనెల 1 నుంచి ప్రారంభమైన మలివిడత దరఖాస్తు ప్రక్రియ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది వరకు హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది మెయిన్ రాసే అవకాశం ఉంది. చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు ఈసారి అభ్యర్థి చిరునామాను అనుసరించి మాత్రమే సమీపంలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశమిచ్చిన ఎన్టీఏ.. వాటిలో ఒకదానిని కేటాయిస్తుంది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలను కూడా ఎంపిక చేసుకొనే విధానముండేది. అయితే 2021 మెయిన్‌లో కొందరు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడడం, మాస్ కాపీయింగ్ జరగడంతో సీబీఐ విచారణ, అరెస్టులు కూడా చోటుచేసుకున్నందున ఈసారి ఆ విధానాన్ని మార్చారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 334 నుంచి 514కు ఎన్టీఏ పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో 29 పరీక్ష కేంద్రాల్లో ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు ఇవీ అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం -
ఏప్రిల్ 16 నుంచి జేఈఈ మెయిన్స్
సాక్షి,హైదరాబాద్: జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్) నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను రెండు దఫాలుగా నిర్వహిస్తోంది. మొదటిదఫా పరీక్ష ఏప్రిల్ 16 నుంచి 21 వరకూ, రెండో దఫా పరీక్ష మే 24 నుంచి 29 వరకూ ఉంటుంది. పరీక్ష నెగెటివ్ మార్కులతో ఆన్లైన్ ద్వారానే చేపడతారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన ఫీజు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. పేపర్–1 (బీఈ, బీటెక్ విద్యార్థులకు) మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమెస్ట్రీ పేపర్లతో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ మొదటి షిఫ్ట్, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ రెండో షిఫ్ట్ ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పేపర్–2 (బీఆర్క్ విద్యార్థులకు) మేథ్స్, ఆప్టిట్యూట్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ ఉంటుందని తెలిపింది. ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఉంటుందని పేర్కొంది. పేపర్–2 బి (బీ ప్లానింగ్ విద్యార్థులకు) ఆప్టిట్యూట్ టెస్ట్, ప్లానింగ్‌పై మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. పూర్తి వివరాలు, బ్రోచర్ ్జ్ఛ్ఛఝ్చజీn.n్ట్చ.nజీఛి.జీn వెబ్సైట్లో లభిస్తాయని ఎన్టీఏ తెలిపింది. -
ఇక ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్‌ను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌ను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు. 2021 నుంచి భారత్‌లోని పలు ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని జేఏబీ నిర్ణయించిందని మంత్రి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం దిశగా మరిన్ని నిర్ణయాలకు ఇది దారితీయనుంది. ఇక భారత్‌లో వైద్య విద్య ప్రవేశ పరీక్షల నీట్‌ను మాత్రమే 11 భాషల్లో నిర్వహించనున్నారు. -
డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే అంతే!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులారా.. బీ అలర్ట్! ఏప్రిల్‌లో నిర్వహించే జేఈఈ పరీక్ష రాసేందుకు విద్యార్థి ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పొరపాటున రెండోసారి రిజిస్ట్రేషన్ చేస్తే అతని మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధ నను ఎన్టీఏ వెలువరించింది. ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఉంటుందని.. ఈ అవకాశాన్ని మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను ఈనెల 8వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 7వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సబ్మిషన్, 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. దీంతో విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతంలో.. రిజిస్ట్రేషన్ సమయంలో ఒకసారి ఏమైనా పొరపాట్లు దొర్లితే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ అవకాశాన్ని తొలగిస్తూ.. రెండోసారి దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని వెల్లడించింది. -
జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జేఈఈ మెయిన్ నిర్వహించే పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పెంచింది. జనవరిలో జరిగిన మొదటి దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 7 పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా, ఏప్రిల్‌లో నిర్వహిం చనున్న రెండో దఫా జేఈఈ మెయిన్ పరీక్షను 9 పట్టణాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జనవరిలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహించిన ఎన్టీఏ ఏప్రిల్‌లో వాటితోపాటు అదనంగా కోదాడ, నిజామాబాద్‌లోనూ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు ఎన్టీఏ 2 దఫాలుగా జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దఫా పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఇక ఏప్రిల్ 7 నుంచి 20 మధ్య నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను శుక్రవారం ప్రారంభించింది. వచ్చే నెల 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్కు, 8 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనుంది. జనవరిలో జరిగిన పరీక్షతోపాటు, ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎందు లో ఎక్కువ స్కోర్ లభిస్తే దానిని పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత తుది ర్యాంకులను ప్రకటించనుంది. ఆ ర్యాంకుల ఆధారంగా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశా లు చేపట్టనుంది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వ హించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా జేఈ ఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ (స్కోర్) సాధించిన 2.24 లక్షల మంది అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోనుంది. జేఈఈ మెయి న్ ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల ప్రక్రి యను ఐఐటీ రూర్కీ చేపట్టనుంది. ఆ పరీక్షను మే 19న నిర్వహించనుంది. ఏప్రిల్‌లోనూ నాలుగు రోజులే! జనవరిలో జేఈఈ మెయిన్‌ను 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్‌లలో నిర్వహించిన ఎన్టీఏ ఏప్రిల్‌లోనూ 4 రోజుల పాటు ప్రతి రోజు 2 షిఫ్ట్‌లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించనుంది. మొదటి దఫా పరీక్షలకు హాజ రుకాని 60 వేల మంది విద్యార్థులు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. వారితోపాటు మొదటి దఫా పరీక్షలకు హాజరైన వారిలోనూ 99% మంది తమ స్కోర్‌ను పెంచుకునేందుకు రెండో దఫా పరీక్షకు హాజరుకానున్నారు. కొంతమంది కొత్త విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ పరీక్ష షెడ్యూల్.. ఆన్లైన్లో పరీక్షలను ప్రతి రోజు 2 షిఫ్ట్‌లుగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి షిఫ్ట్ పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సి ఉంది. ఉదయం పరీక్షకు 8:30లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. పరీక్ష హాల్లోకి ఉదయం పరీక్షకు 8:45 గంటల నుంచి 9 వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 వరకు అనుమతిస్తారు. -
జేఈఈ.. దరఖాస్తులు అంతంతేనోయి
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గడచిన మూడేళ్లలో 1.5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఓ వైపు జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థలు, మరోవైపు రాష్ట్రాలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను జేఈఈ మెయిన్ ద్వారానే భర్తీ చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నా.. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. 2015–16 విద్యా సంవత్సరంలో 12.93 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, 2018–19లో 11.35 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. ఏదో పరీక్ష రాద్దామనే ఉద్దేశంతో కాకుండా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే విద్యార్థులే దరఖాస్తు చేసుకుంటున్నారని, దరఖాస్తులు తగ్గడానికి అదే కారణమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇక ప్రవేశాల విషయానికి వస్తే.. నాలుగేళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే కొంత మెరుగైనా ఇంకా సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఇంకా మిగులే.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. గతంలో కంటే సీట్ల మిగులు అధికంగా ఉంటోంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించడం, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు ఇంటర్ మార్కులు 75% (ఎస్సీ, ఎస్టీలకు 65%) ఉంటే చాలన్న సడలింపు ఇచ్చినా సీట్ల మిగులు తగ్గడం లేదు. సీట్ల మిగులు ఉండకుండా చూసేందుకు మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం వెయిటేజీ తొలగింపు, సడలింపులు వంటి చర్యలు చేపట్టడంతోపాటు ఏడు విడతలుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. 2014–15 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో కేవలం 3 సీట్లు మిగిలిపోగా, 2017–18లో 121 సీట్లు మిగిలిపోయాయి. అడ్వాన్స్‌డ్‌కు అర్హుల సంఖ్య పెంచినా.. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నా పరిస్థితి అలానే ఉంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 1.5 లక్షల మంది విద్యార్థులను గతంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా తీసుకునేవారు. క్రమంగా దాన్ని టాప్ 2 లక్షలకు, టాప్ 2.2 లక్షలకు, ప్రస్తుతం టాప్ 2.24 లక్షలకు పెంచింది. అయినా సీట్ల మిగులు పెరుగుతోంది. అయితే కాన్పూర్, హైదరాబాద్ ఐఐటీల్లో మాత్రం నాలుగేళ్లుగా ఒక్కసీటు కూడా మిగలకపోవడం విశేషం. -
నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2న నిర్వ హించిన జేఈఈ మెయిన్ ఫలితాలు నేడు (గురువారం) విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 78 వేల మంది హాజరయ్యారు. ఈ నెల 28 నుంచి మే 2 వరకు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.20 లక్షల మంది నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నారు. -
జేఈఈ–2018 నిర్వహణకు నూతన జేఏబీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2018లో) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షల నిర్వహణకు జేఈఈ అపెక్స్ బోర్డును (జేఏబీ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. అనంత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కేంద్రం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను 2013 నుంచి నిర్వహిస్తోంది. అయితే 2018–19 విద్యా సంవత్సరం నుంచి చేపట్టే ప్రవేశాల కోసం 2018లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల నిర్వహణకు కొత్త అపెక్స్ బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మావన వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ జేఈఈ అపెక్స్ బోర్డు గౌరవాధ్యక్షుడు: ప్రొఫెసర్ ఎం.ఎస్. అనంత్, ఐఐటీ మద్రాసు మాజీ డైరెక్టర్, మెంబర్ సెక్రటరీ: సీబీఎస్ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సభ్యులు: ఐఐటీ బాంబే, కాన్పూర్, ఖరగ్‌పూర్, ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ సూరత్కల్, ఎన్ఐటీ తిరుచ్చి, ట్రిపుల్ఐటీ ఢిల్లీ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, బిట్, మెస్రా, రాంచీ డీమ్డ్ యూనివర్సిటీల ప్రతినిధులు, సీబీఎస్ఈ చైర్మన్, నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ డైరెక్టర్ జనరల్, సీ–డాక్ డైరెక్టర్ జనరల్, ఎంహెచ్ఆర్డీ అదనపు కార్యదర్శి/సంయుక్త కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలతోపాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వ హించే జేఈఈ మెయిన్- 2017 దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) దృష్టి సారిం చింది. దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన ఇన్ఫర్మే షన్ బ్రోచర్‌ను బుధవారం అర్ధరాత్రి తరువాత లేదా గురువారం ఉదయం జేఈఈ మెయిన్ వెబ్ సైట్(jeemain.nic.in)లో అందు బాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి జనవరి 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వచ్చు. పరీక్ష ఫీజును జనవరి 3 వరకు చెల్లించ వచ్చు. ఇక ఈసారి జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆధార్ సహాయక కేంద్రా లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని హైదరా బాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తా మని ప్రకటించింది. ఇంకా ఆధార్ తీసుకోనివారు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సహాయక కేంద్రా ల్లో సంప్రదించి ఆధార్‌కు ఎన్ రోల్ చేసుకోవచ్చు. ఆ ఎన్రోల్ మెంట్ నంబర్‌తో జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఏదైనా సహాయక కేంద్రంలో ఆధార్ నమోదుకు అవకాశం లేకపోతే వారు ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడా జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయక కేంద్రాల వివరాలను వెబ్సైట్లో పొందవచ్చు. ఐఐటీల్లో విదేశీ విద్యార్థుల ఫీజు 6లక్షలు ఐఐటీల్లో చేరే విదేశీ విద్యార్థులకు ఫీజును ఐఐటీ కౌన్సిల్ నిర్ణరుుంచినట్లు తెలిసింది. మన దేశ విద్యార్థులకు ఫీజును ఇటీవలే రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచిన ఐఐటీ కౌన్సిల్, విదేశీ విద్యార్థుల నుంచి వసూలు చేసే వార్షిక ఫీజును రూ.6 లక్షలుగా నిర్ణరుుంచింది. -
వచ్చే నెలలో జేఈఈ మెయిన్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌కు వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశ ం కల్పించేలా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రవేశాల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఇకపై ఇంటర్మీడియెట్ మార్కులతో పెద్దగా పని లేదు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీటు కావాలనుకునే విద్యార్థులు ఇకపై జేఈఈ మెయిన్‌లో ర్యాంకుతోపాటు ఇంటర్లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 65 శాతం) మార్కులు సాధిస్తే చాలు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను సీబీఎస్ఈ ఖరారు చేస్తోంది. వాటి ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తోంది. అయితే ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఐఐటీల కౌన్సిల్ 2015 అక్టోబర్‌లో నిర్వహించిన సమావేశంలో అభిప్రాయానికి వచ్చింది. దీంతో జేఈఈ పరీక్షలో సంస్కరణలపై కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారుకు పరిగణనలోకి తీసుకుంటున్న వెయిటేజీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే టాప్-20 పర్సంటైల్‌లో ఉన్నా సరిపోతుందని పేర్కొంది. ఆ సిఫారసుల మేరకు విద్యార్థుల ఇంటర్ మార్కులకు ఇస్తున్న 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫీజును పెంచిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్ష ఫీజును కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. -
ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్!
ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్.. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షను 2017-18 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ 2న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జారీ చేసే అవకాశముంది. ఇందుకోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ మొదటి ఆదివారం (2న) జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్షను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత నాలుగైదు రోజులకు ఆన్లైన్ పరీక్షలు వరుసగా నాలుగు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మే 21న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవల ఐఐటీల కౌన్సిల్ స్పష్టం చేసిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలోనే ప్రకటించేందుకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది. ఫలితాలు వెల్లడించిన రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. -
పర్సంటైల్ నార్మలైజేషన్ విధానమిదీ..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంటర్ బోర్డుల పరిధిలో చదివిన వి ద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు, ప్రతిభావంతులకే సీట్లు కేటాయించేందుకు ర్యాంకు ఖరారులో పర్సంటైల్ నార్మలైజేషన్ విధానాన్ని సీబీ ఎస్ఈ అమలు చేస్తోంది. దీనిద్వారా వచ్చిన తుది ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల వంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడుతోంది. పర్సంటైల్ లెక్కించే విధానం, నార్మలైజేషన్ విధానాన్ని సీబీఎస్ఈ ప్రకటించింది. నార్మలైజ్డ్ బోర్డు స్కోర్ లెకి ్కంపు ఇలా.. (ఓ విద్యార్థిని ఉదాహరణగా తీసుకుంటే..) జేఈఈ మెయిన్‌లో మొత్తం 360 మార్కులకుగాను గరిష్టంగా వచ్చిన మార్కులు 355 అనుకుందాం (దీనిని బీ1గా పరిగణించాలి). అలాగే జేఈఈ మెయిన్ పరీక్షకు రాష్ట్ర బోర్డు నుంచి హాజరైన విద్యార్థుల్లో ఓ విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో అత్యధికంగా 350 మార్కులు సాధించాడనుకుంటే (దీనిని బీ2గా పరిగణించాలి)... అతని నార్మలైజ్డ్ బోర్డు స్కోరును ‘బీఫైనల్= 0.5(బీ1+బీ2) ఫార్ములాతో లెక్కిస్తారు. అంటే బీఫైనల్ = 0.5(355+350) = 352.5 (ఇది ఆ విద్యార్థి నార్మలైజ్డ్ బోర్డు స్కోరు) జేఈఈ మెయిన్‌లో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ (ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది కనుక) ఇచ్చి... దానికి నార్మలైజ్ చేసిన ఇంటర్ బోర్డు స్కోరును కలిపి (60:40 రేషియోలో) ఆ విద్యార్థి కాంపొజిట్ స్కోర్‌ను నిర్ధారిస్తారు. అన్ని రాష్ట్రాల విద్యార్థులకు కాంపొజిట్ స్కోర్‌ను లెక్కించి.. ఎక్కువ స్కోర్ వచ్చిన వారి నుంచి మొదలుకొని (టాప్ నుంచి కిందకి) ర్యాంకులు ఖరారు చేస్తారు. ఇక్కడ విద్యార్థికి జేఈఈ మెయిన్‌లో 350 (అగ్రిగేట్) మార్కులు వచ్చాయనుకుంటే... అతడి కాంపొజిట్ స్కోర్‌ను (సి=0.6xవిద్యార్థి అగ్రిగేట్ మార్కులు +0.4xబీఫైనల్) ప్రకారం లెక్కిస్తారు. అంటే సీ = 0.6x350+0.4x352.5 = 351 (ఇది ఆ విద్యార్థి కాంపొజిట్ స్కోర్) ► పర్సంటైల్ నిర్ణయించేందుకు మార్కులను వెయ్యిగా కాకుండా ప్రతి సబ్జెక్టులో గరిష్టంగా 100 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ, ఏపీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోని ఐదు ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను 50 శాతానికి తగ్గించి పర్సంటైల్ నార్మలైజేషన్ చేసి, కాంపొజిట్ స్కోర్‌ను నిర్ధారిస్తారు. -
వెబ్సైట్లో జేఈఈ మెయిన్ కీ
22 వరకు అభ్యంతరాల స్వీకరణ 27న జేఈఈ ఫలితాలు.. అందుబాటులో ప్రశ్నపత్రాలు సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష కీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఈ నెల 3న జరిగిన ఆఫ్‌లైన్, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్ష కీ పేపర్లను సోమవారం http://jeemain.nic.in వెబ్సైట్లో ఉంచింది. కీలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 22 లోగా తెలియజేయాలని సూచించింది. వాటికి సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఇందుకోసం వేర్వేరుగా లింక్‌లను ఇచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్వర్డ్ పొందుపరిచి కీలను పొందొచ్చని తెలిపింది. అలాగే జేఈఈ మెయిన్ పరీక్షల ప్రశ్న పత్రాలను కూడా అందుబాటులో ఉంచింది. ఆఫ్‌లైన్ పరీక్షకు సంబంధించిన ఈ, ఎఫ్, జీ, హెచ్ కోడ్ ప్రశ్న పత్రాలు, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా వెబ్సైట్లో ఉంచింది. ఇక ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇక ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 30న లేదా అంతకన్నా ముందే విడుదల చేస్తామని వివరించింది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 59,731 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 70 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు ఈనెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అత ్యధిక మార్కులు సాధించిన టాప్ 2 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించింది. ఐఐ టీల్లో ప్రవేశాల కోసం మే 22న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది. వాటి ఫలితాలను జూన్ 12న ప్రకటించి, జూన్ 20న సీట్లు కేటాయించనుంది. -
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు సిద్ధం
- పేర్లలో తప్పులుంటే ఇంటర్ బోర్డుల ద్వారా సరిదిద్దుంచుకోవాలి సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశానికి సంబంధించి ఏప్రిల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కు (జేఈఈ మెయిన్-2016) సంబంధించి ఇ-అడ్మిట్‌కార్డులను సెంట్రల్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిద్ధం చేసింది. ఇప్పటికే ఫీజులు చెల్లించిన అభ్యర్ధుల ఇ-అడ్మిట్ కార్డులను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేఈఈమెయిన్.ఎన్ఐసీ.ఇన్’’ వెబ్సైట్లోకి సీబీఎస్ఈ అప్లోడ్ చేసింది. ఆయా అభ్యర్ధులు తమ, బోర్డుల సమాచారాన్ని అప్లోడ్ చేసి ఈ ఇ-అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇ-అడ్మిట్‌కార్డుల్లో అభ్యర్ధుల పేర్లలో ఏమైనా తప్పులు దొర్లితే అభ్యర్ధులు బోర్డులో ఏపేరు ఉంటే అదే మాదిరిగా జేఈఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి ఇ-అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆతదుపరి బోర్డుల ద్వారా పేర్లలోని తప్పులను సరిచేయించుకోవాలి. బోర్డులు ఆయా అభ్యర్ధుల సమాచారాన్ని పంపినప్పుడు జేఈఈ డేటాలోకి వాటిని అప్లోడ్ చేస్తారు. కనుక అభ్యర్ధులు వెంటనే ఇ-అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్ చేసుకొని తప్పులుంటే బోర్డుల ద్వారా సరిచేయించుకోవాలి. ఇ-అడ్మిట్‌కార్డులు డౌన్లోడ్ కానిపక్షంలో అభ్యర్ధులు సీబీఎస్ఈ హెల్ప్లైన్లు 7042399520, 521, 524, 525, 526, 528లలో ఉదయం పదినుంచి సాయంతరం అయిదున్నరలోపు సంప్రదించాలని సీబీఎస్ఈ పేర్కొంది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు వెనుకంజ!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించిన వారిలోనూ ఏటా 30 శాతం మంది ఈ పరీక్షలు రాయడం లేదు. ఏటా జేఈఈ మెయిన్ రాసే దాదాపు 12 లక్షల మందిలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు టాప్ 1.50 లక్షల మందిని ఎంపిక చేస్తే అందులోనూ 30 శాతం మంది పరీక్షలకు హాజరు కాకపోవడంతో ఆ ప్రభావం ప్రవేశాలపైనా పడుతోంది. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటుండగా, అర్హత సాధిస్తున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. మరోవైపు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు ఎంపిక చేసిన వారిలో 20 శాతం నుంచి 30 శాతం మంది పరీక్షకు హాజరు కాకపోవడం ఐఐటీల్లో సీట్లు మిగిలిపోవడానికి ఓ కారణం అవుతోంది. 2015 జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 1.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేయగా పరీక్షకు 1,17,238 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 32,742 మంది విద్యార్థులు పరీక్షకే హాజరు కాలేదు. ఇందులో 25,259 మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు రిజిస్టర్ చేసుకోకుండా పరీక్ష రాయకపోగా, మరో 7,503 మంది రిజిస్టర్ చేసుకున్నా పరీక్ష రాయలేదు. ఇదీ గత ఏడాదే కాదు గడిచిన మూడునాలుగేళ్లుగా ఇదే తంతు. ఇలా 2013లో 24 వేల మంది, 2014 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 26 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. ఇటీవల ఐఐటీలు గత మూడు నాలుగేళ్లలో పరీక్షలు, వాటికి హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య, చేరుతున్న వారి సంఖ్యను బయటకు తీశాయి. ఇలా పరీక్షకు గైర్హాజరవుతున్న తీరు కూడా ఐఐటీల్లో ప్రవేశాలపై ప్రభావం చూపుతోందన్న ఓ అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసే వారి సంఖ్యను 2016లో 2 లక్షలకు పెంచాలని నిర్ణయించాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 2 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఎంపిక చేయనున్నాయి. ఏప్రిల్ 3న జరిగే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో టాప్ 2 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించనున్నాయి.