విరబూసిన ‘గిరి’ కుసుమాలు | 'JEE' national ranked | Sakshi
Sakshi News home page

విరబూసిన ‘గిరి’ కుసుమాలు

Published Fri, Jul 3 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

'JEE' national ranked

పేదరికాన్ని జరుుంచారు..
ఒకరు డాక్టర్.. మరొకరు ‘జేఈఈ’ జాతీయ ర్యాంకర్

 
కష్టజీవుల ఇంట జన్మించారు.. ఇష్టపడి చదివారు.. ఉన్నత ర్యాంకులు సాధించారు.. తల్లిదండ్రులు లేకున్నా ఒకరు అనుకున్న లక్ష్యానికి చేరుకుని డాక్టర్ అయ్యూరు.. అమ్మానాన్న ఉన్న ఓ బిడ్డ ఆలిండియూ జేఈఈ మెరుున్స్‌లో మొదటి ర్యాంకు సాధించాడు.. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న ‘జేఈఈ’ ర్యాంకర్ దాతలు ముందుకొస్తేనే చదువు సాగుతుందంటున్నారు.. గురిచూసి చదివిన గిరిజన బిడ్డలకు పలువురు సాయం అందించాలని కోరుతున్నారు.
 
నర్సంపేట : జఫర్‌గఢ్ మండలం ఓబులాపూర్‌తండాకు చెందిన బానోతు మంగ్తు, కమలి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కొడుకు వెంకన్న 2015 జేఈఈ ఎస్టీ కేటగిరీ వికలాంగ విభాగంలో ఆలిండియూ నంబర్-1 ర్యాంక్ సాధించాడు. 1 నుంచి 5 వరకు దేవరుప్పులలోని సెరుుండీ జాండీ స్కూల్, 6 నుంచి 10 వరకు వరంగల్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ నర్సంపేటలోని కాకతీయు జూనియుర్ కళాశాలలో పూర్తి చేశాడు. జేఈఈ ఫలితాల్లో ఎస్టీ పీడబ్ల్యూడీ విభాగంలో ఆలిండియూ మొదటి ర్యాంక్ సాధించిన విషయుం విదితమే. వెంకన్న తన కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని గురువారం ‘సాక్షి’కి వివరించారు. తమకు నాలుగెకరాల వ్యవసాయు భూమి ఉంది. అమ్మానాన్నలు ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. అన్నయ్య శివకువూర్ ఏఐఈఈ ఈలో 150వ ర్యాంక్ వచ్చింది. ఎంటెక్‌లో తమిళనాడులోని తిరుచ్చిలో సీటు వచ్చినా ఆర్థిక స్తోవుత లేక ఈ ఏడాది ఏమి చేయూలో తెలియుని పరిస్థితి. ప్రస్తుతం నేను జాతీయు స్థారుులో మొదటి ర్యాంక్ సాధించినా నాలుగేళ్లకు రూ.4లక్షలు అవసరం కావాల్సి వస్తుండటంతో కుటుంబం ఆలోచనలో పడిందని వివరించాడు. కాగా, ఆర్థిక సాయం చేయదలచిన దాత లు సెల్ నం.8608571733కి ఫోన్ చేయూలని కోరాడు. కాగా, కాక తీయు కళాశాలకు చెందిన వెంకన్న ర్యాంక్ సాధించడంతో ఆర్డీఓ రావుకృష్ణారెడ్డి, డెరైక్టర్ గోగుల ప్రభాకర్‌రెడ్డి, సృజనారెడ్డి, వీరవుళ్ల వూధవరెడ్డి, వీరారెడ్డితోపాటు పలు వురు ఘనంగా సన్మానించారు.
 
రుణం తీర్చుకుంటా..
 తల్లిదండ్రుల కష్టాలను దగ్గరుండి చూశా. కష్టం చేసి అన్నను, నన్ను చదివించారు. వుంచి ర్యాంక్‌లు సాధించి వారికి కొంత సంతోషం కలిగించాం. భవిష్యత్‌లో వురెన్ని కష్టాలు ఎదురైనా వుంచి ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటా.          - బానోతు వెంకన్న
 
మరిపెడ : మరిపెడ మండలం వీరారం శివారు కేలోతుతండాకు చెందిన కేలోతు భీముడు, భద్రి దంపతులు. వారికి ముగ్గురు కొడుకులు వెంకన్న, హరినాయక్, సిరినాయక్, ముగ్గురు కుమార్తెలు సక్కు, కౌసల్య, మంగాదేవి ఉన్నారు. పెద్ద కొడుకు వెంకన్న పదకొండో ఏటనే తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో మృతిచెందారు. అప్పుడు హరి, సిరి చిన్నపిల్లలు. తండ్రి మృతిచెందిన తర్వాత వెంకన్న తీవ్రంగా కలత చెందాడు. పట్టుదలతో ఇద్దరు తమ్ముళ్లలో ఒకరిని డాక్టర్‌ను చేయాలనే పట్టుదలతో నాలుగెరాల భూమిలో పంట పండిస్తూ.. ఇద్దరు తమ్ముళ్లను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పెద్ద తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు మూడెకరాల భూమి పోయి.. ఎకరం మాత్రమే మిగిలింది. అన్న కష్టాన్ని, తల్లిదండ్రుల మరణాన్ని గుర్తు చేసుకుంటూ నిరంతరం కష్టపడి చదివిన సిరినాయక్ ఇటీవలే ఆలిండియా ఎస్టీ కేటగిరీలో 25వ ర్యాంక్ సాధించాడు. ఆలిండియా వైద్య కళాశాల(ఏఐఐఎంఎస్) ఢిల్లీలో ఎండీ(ఓబీఎస్, గైనిక్)లో ప్రవేశం పొంది జిల్లాకే వన్నె తెచ్చాడు. 1 నుంచి 5వ తరగతి వరకు వీరారం ప్రభుత్వ పాఠశాల, 6 నుంచి 10 వరకు జనగామలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఇంటర్మిడియట్ ఏపీఆర్‌జేసీ కృష్టా జిల్లా నిమ్మకూరు, ఎంబీబీఎస్ హైదరాబాద్‌లోని కామినేనిలో పూర్తి చేశాడు. ఇదే ఏడాది ఏఐఐఎంఎస్‌కు ఎంట్రన్స్ రాసి ర్యాంక్ సాధించాడు. అయితే తన రెండో అన్న హరి ముందుగానే ఉద్యోగంలో చేరి.. సిరికి పెద్దన్న వెంకన్నతోపాటు చేదోడు వాదోడుగా నిలిచాడు. హరి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నతస్థాయికి ఎదగడంతో తండావాసులతోపాటు మండల ప్రజలు హర్షిస్తున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement