హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ రాత పరీక్షలో సెట్-ఎ పేపర్‌లో 10వ ప్రశ్నకు(ఫిజిక్స్) ఇచ్చిన ఆప్షన్లన్నీ తప్పులేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తించింది. దీంతో ఆ ప్రశ్నకు సంబంధించి 4 మార్కులను పరీక్ష రాసిన విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. సెట్-బి పేపర్‌లో 87వ ప్రశ్నకు, సెట్-సిలో 51వ ప్రశ్నకు, సెట్-డిలో 17వ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులందరికీ 4 మార్కులు ఇస్తామని పేర్కొంది.
అలాగే సెట్-ఎ పేపర్‌లో 15వ ప్రశ్నకు 3, 4వ ఆప్షన్లు రెండూ సరైనవేనని స్పష్టం చేసింది. పరీక్ష తుది కీని వెబ్‌సైట్‌లో విడుదల చేస్తూ ఈ వివరాలు తెలిపింది. ఏప్రిల్ 10న జరిగిన ఆన్‌లైన్ పరీక్షలో 3, 9, 23వ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానాలు లేవని, ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున విద్యార్థులందరికీ 12 మార్కులను ఇస్తామని పేర్కొంది.
జేఈఈ మెయిన్‌లో అందరికీ 4 మార్కులు
Published Thu, May 7 2015 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement