Central Board of Secondary Education
-
జూలై 7న సెంట్రల్ టెట్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) వచ్చే జూలై 7న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు www. ctet. nic. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష ఫీజును వచ్చే నెల 8వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించింది. ఒక పేపరుకు దరఖాస్తు చేస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.350 పరీక్ష ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపింది. పేపరు–1, పేపరు–2 రెండు పరీక్షలు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.600 చెల్లించాలని పేర్కొంది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- రేపే జేఈఈ మెయిన్ పరీక్ష - 8, 9 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. దాదాపు 13 లక్షల మంది ఈ పరీక్షకు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 69,467 మంది, ఏపీ నుంచి 80 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కు నిర్వహించే పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. 9.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. హైదరాబాద్, ఖమ్మం,వరంగల్‌లలో కేంద్రాలు..: జేఈఈ పరీక్షలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో, ఏపీలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆఫ్‌లైన్ పరీక్షకు నిర్ణయించిన సమయాల్లోనే ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలకు మరో 25 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. పరీక్షలో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానినికి 4 మార్కుల చొప్పున 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో తప్పు సమాధానానికి ఒక్క మార్కు తగ్గుతుంది. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ ప్రధాన నిబంధనలు.. ► పేపర్–1 పరీక్షకు ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ► ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థుల తనిఖీ ఉంటుంది. ► పరీక్ష హాలులోకి మాత్రం ఉదయం 9 గంటలకు అనుమతిస్తారు. ► 9.20 గంటలకు ప్రశ్నపత్రం ఓఎంఆర్ బుక్‌లెట్‌ను ఇస్తారు. దాన్ని 9.25 గంటలకు తెరవాలి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ► 9.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ► హాల్‌టికెట్, గుర్తింపుకార్డు తప్ప మరేవీ అనుమతించరు. ► కాలిక్యులేటర్లు, అవి ఉండే గడియారాలు, సెల్ఫోన్లను అనుమతించరు. ► పరీక్ష బ్లూ/బ్లాక్ పెన్‌తోనే రాయాలి. పెన్సిల్‌ను అనుమతించరు. -
కార్యరూపం దాల్చని మంత్రి కామినేని హామీ
‘నీట్’ రాయాలంటే విజయవాడ వెళ్లాల్సిందే చిత్తూరు :రాయలసీమ పరిధిలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో బైపీసీ చదువుతున్న విద్యార్థులకు తిరుపతిలో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న హామీ ఇచ్చారు. ఈ హామీతో రాయలసీమలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరుపతికి పరీక్ష కేంద్రం వస్తుందని అప్పట్లో ఆశించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు సమీపిస్తున్నా తిరుపతిలో పరీక్ష కేంద్రం ఏర్పాటుపై మంత్రి కామినేని నుంచి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నీట్’కు విద్యార్థులు నమోదు చేసుకున్న వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో తిరుపతి పరీక్ష కేంద్రాన్ని చూపకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతిలోనే ఎయిమ్స్, ఏపీపీఎస్సీ, జిప్‌మార్ పరీక్షలు ఎయిమ్స్, ఏపీపీఎస్సీ, జిప్మర్ తదితర పోటీ పరీక్షలు తిరుపతిలో కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. నీట్ పరీక్షను మాత్రం తిరుపతిలో నిర్వహించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ‘నీట్’ కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నంలలో నిర్వహిస్తే తమ పిల్లలు అంత దూరం వెళ్లి పరీక్షలు ఎలా రాయగలరని తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. పరీక్ష కేంద్రం మార్పులు, విద్యార్థుల వివరాల పొరపాట్లను వెబ్సైట్లో సరిదిద్దుకునేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉందని ‘నీట్’ జాయింట్ సెక్రటరీ నోటిఫికేషన్లో తెలియజేశారు. ఆ గడువు ముగిసేలోగా ఉన్నతాధికారులు స్పందించి తిరుపతిలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సీబీఎస్ఈ పదో తరగతికీ బోర్డు పరీక్ష తప్పనిసరి!
ఆప్షనల్ విధానం తొలగింపు 2017–18 నుంచి అమలు సీబీఎస్ఈ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ సిలబస్ స్కూళ్ల లో ఇన్నాళ్లు ఆప్షనల్‌గా ఉన్న పదో తరగతి బోర్డు పరీక్ష విధానం ఇక నుంచి తప్పనిసరి కానుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో స్కూళ్లలో పదో తరగతిలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్ష నల్ విధానాన్ని కేంద్రం తొలగించింది. రాష్ట్ర సిలబస్‌లోని పదో తరగతి పరీక్షల తరహా విధానాన్ని సీబీఎస్ఈ స్కూళ్లలోనూ అమలు చేయనుంది. దాంతో 2017–18 నుంచి సీబీఎస్ఈ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులంతా బోర్డు పరీక్షకు హాజరు కావాల్సిందే. ఇన్నాళ్లు సీబీఎస్ఈ స్కూళ్లలోని టెన్త్ విద్యార్థులు కావాలనుకుంటే బోర్డు పరీక్షకు హాజరు కావచ్చు. లేదా అదే పాఠశాలలో 11వ తరగతి చదవాలనుకుంటే ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా 11వ తరగతికి వెళ్లిపోవచ్చు. ఇంటర్లో చేరాలనుకునే సీబీ ఎస్ఈ స్కూళ్ల విద్యార్థులే ఎక్కువగా బోర్డు పరీక్షలు రాసేవారు. కానీ 2017–18 నుంచి అలా కుదరదు. వారంతా బోర్డు పరీక్షలు రాసి పాసవాల్సిందే. ఈ మేరకు పదో తరగతి కొత్త పరీక్ష విధానంపై సీబీఎస్ఈ చైర్మన్ ఆర్కే చతుర్వేది మంగళ వారం ఉత్వరులు జారీ చేశారు. పదో తరగతి కొత్త పరీక్షల విధా నం పై వివరాలతో కూడిన ఉత్తర్వులను దేశంలోని అన్ని సీబీఎస్ఈ స్కూళ్లకు పంపారు. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు మాత్రం పాత విధానమే వర్తిస్తుందని ఆయన వివరించారు. ఇదీ పరీక్షల విధానం... ► కొత్త విధానంలో ప్రతి సబ్జెక్టులో 100 మార్కులుంటాయి. 80 మార్కులు రాత పరీ క్షకు, 20 ఇంటర్నల్ అసెస్మెంట్కు ఇస్తారు. వీటిల్లో ఒక్కోదాంట్లో 33% మార్కులు సాధించాలి. ఇంటర్నల్స్‌లో పీరియాడిక్ టెస్టు లకు 10 మార్కులు, నోట్ బుక్ సబ్మిషన్, అసైన్మెంట్ల పూర్తి, నోటు బుక్ నీట్నెస్కు 5 మార్కులు, వినడం, రాయడం, చదవడం, ప్రాక్టికల్స్, ప్రాజెక్టు వంటి నైపుణ్యాలకు 5 మార్కులుంటాయి. పీరియాడిక్ టెస్టులను ఒక విద్యా సంవత్సరంలో 3 కంటే ఎక్కువ నిర్వహించకూడదు. వాటిల్లో ఉత్తమమైన రెండింటిని పరిగణనలోకి తీసుకోవాలి. ► ఇప్పటిదాకా ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా 11వ తరగతికి ప్రమోట్ చేసే పద్ధతిలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు పూర్తయిన సిలబస్, విద్యార్థి మార్కులు, పనితీరు ఆధా రంగా ప్రమోట్ చేసేవారు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి దాకా బోధించిన సిలబస్‌లోనే బోర్డు పరీక్ష నిర్వహించే వారు. ఇకపై 2017–18 నుంచి అమల్లోకి వచ్చే బోర్డు పరీక్షలో 100 % సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. 12వ తరగతిలో ఉన్నట్లే 9 పాయింట్ల గ్రేడింగ్ విధానం ఉంటుంది. కో కరిక్యులర్ యాక్టివి టీస్‌కు 5 పాయింట్ల గ్రేడింగ్ విధానం కొన సాగుతుంది. పదో తరగతి అసెస్మెంట్ విధానాన్నే ఆరు నుంచి తొమ్మిదో తరగతి దాకా కూడా అమలు చేస్తారు. -
సీబీఎస్ఈ స్కూళ్ల నియంత్రణపై విద్యాశాఖ దృష్టి
- ప్రవేశాలు, ఫీజుల విధానంపై పాఠశాల విద్యా డెరైక్టర్ ఆరా - త్వరలోనే వాటి నియంత్రణకు కార్యాచరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) స్కూళ్ల నియంత్రణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా వాటిలో అమలు చేస్తున్న ఫీజుల విషయంలో నియంత్రణ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సీబీఎస్ఈ స్కూళ్లలో ప్రవేశాల విధానం, ఫీజుల నియంత్రణకు సంబంధించిన అంశాలపై మంగళవారం పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ పలువురు డీఈవోలు, డిప్యూటీ ఈవో లతో చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర సిలబస్‌తో కొనసాగు తున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ఆలోచనలు చేస్తున్న విద్యాశాఖ ఇపుడు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి స్కూళ్ల విషయంలోనూ పక్కా చర్యలు చేపట్టాలన్న ఆలోచనలు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఫీజుల వసూలు విధానంపై తనిఖీలు చేసి, ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ స్కూళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఇన్నాళ్లు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లను పట్టించుకోని విద్యాశాఖ.. వాటి నియంత్రణ విషయంలో ఎలా ముందుకు సాగవచ్చన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ గతంలో రాసిన లేఖను కూడా పరిశీలిస్తోంది. సీబీఎస్ఈ స్కూళ్లపై నియంత్రణాధికారం రాష్ట్రాలదే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్ల ఫీజులు, నియంత్రణాధికారం విషయంలో తమ పరిధిలోని అధికారాలు ఏంటని పేర్కొంటూ 2014 ఏప్రిల్17న రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు అథారిటీ, అప్పటి ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి ఎంహెచ్ఆర్డీకి లేఖ రాశారు. దానిపై స్పందిస్తూ 2014 జూన్ 14న మానవ వనరుల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అలోక్ జవహర్ ఎస్ఎస్ఏకు లేఖ రాశారు. అందులో రాష్ట్రాల్లో ఆయా స్కూళ్ల నియంత్రణాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఆయా స్కూళ్ల ఏర్పాటుకు నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలే వాటిలో విద్యార్థుల నుంచి వసూలు చేయాల్సిన కనీస, గరిష్ట ఫీజులను నిర్ణరుుంచాలని వివరించారు. ఆ లేఖ ఉమ్మడి రాష్ట్రంలో రాసిందే అరుునప్పటికీ విభజన తరువాత కూడా వర్తిస్తుంది. కాబట్టి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో ప్రధానంగా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 3న ఆఫ్‌లైన్‌లో, 9, 10 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఈ నెల 27న విడుదల చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల లింక్‌ను జేఈఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఈ స్కోర్ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసే టాప్ 2 లక్షల మందిని ఎంపిక చేయనుంది. ఈ నెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గువాహటి ఐఐటీ చర్యలు చేపట్టింది. -
సీబీఎస్ఈ పరీక్షల డేటాషీట్ విడుదల
ఈ ఏడాది సీనియర్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (12వ తరగతి), సెంకడరీ స్కూల్ ఎడ్యుకేషన్ (పదో తరగతి) పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్థుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజాగా డేటాషీట్ విడుదల చేసింది. సీబీఎస్ఈ పరిధిలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 1వ తేదీ నుంచి ప్రారంభమై.. మార్చి 28వ తేదీన ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు మార్చ్ 1న ప్రారంభమై.. ఏప్రిల్ 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ (www.cbse.nic.in.) లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. -
జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాల్లో భారీగా కోత
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు 2016 ఏప్రిల్ 3వ తేదీన ఆఫ్‌లైన్‌లో, 9, 10 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించతలపెట్టిన జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) భారీగా తగ్గించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా 2015 జేఈఈ మెయిన్ పరీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన కేంద్రాలతో పోల్చితే 2016 పరీక్షకు ఏర్పాటు చేసే కేంద్రాల సంఖ్యను సగానికంటే ఎక్కువ కోత పెట్టింది. 2015 పరీక్షకు దేశవ్యాప్తంగా 283 కేంద్రాలను ఏర్పాటు చేయగా, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే పరీక్ష నిర్వహణ కేంద్రాలను 132కు తగ్గించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత పరీక్షకు 28 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2016లో నిర్వహించే పరీక్షకు 7 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పరీక్ష సమయంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను 12 లక్షల నుంచి 13 లక్షలమంది వరకు రాస్తారని అధికారులు అంచనా వేస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2 లక్షల వరకు రాస్తారని తెలుస్తోంది. ఈసారి మరిన్ని ఇబ్బందులు.. గత మూడేళ్లలో రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 15 నుంచి 28 వరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు ఈసారి పరీక్ష సమయంలో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. సీబీఎస్ఈ ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాల కంటే ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను ఎక్కువగా తగ్గించింది. 2015 జేఈఈ మెయిన్ పరీక్ష కోసం తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌లలో ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు కేంద్రాలు ఏర్పాటు చేయగా, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లలో ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే అభ్యర్థులు ఎక్కువ శాతం ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష రాస్తుండటంతో ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని తల్లిదండ్రులు ఏటా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కాని 2016 పరీక్షకు కూడా సీబీఎస్ఈ ఆ మూడు పట్టణాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క కేంద్రాన్ని కూడా పెంచలేదు. పైగా ఈసారి కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను కూడా ఇవ్వలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2015 జేఈఈ మెయిన్ పరీక్షకు 22 పట్టణాల్లో (అనంతపూర్, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కర్నూలు, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం) ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, గుంటూరు, తిరుపతిలో మాత్రమే ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక 2016 జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షకు కేంద్రాలను నాలుగు పట్టణాలకే పరిమితం చేసింది. రెండు పట్టణాల్లో ఆఫ్‌లైన్ పరీక్షలను పెంచింది. ఏపీలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. బసకూ ఇక్కట్లే! వివిధ పట్టణాల్లో ఎక్కువ మొత్తంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన సమయంలోనే ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీలన్నీ నిండిపోయేవి. రెండు రోజుల ముందే లాడ్జీల్లో వసతి దొరకని పరిస్థితులు ఎదురయ్యాయి. కేంద్రాలను కుదించడంతో ఈసారి పరీక్ష సమయంలో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. నాలుగైదు రోజుల ముందు వెళ్లినా లాడ్జీల్లో రూములు దొరుకుతాయా? లేదా? అన్న ఆందోళన అప్పుడే తల్లిదండ్రుల్లో మొదలైంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్ఈ స్పందించి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. -
జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటన వాయిదా
26 లేదా 27న ర్యాంకులు? సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 24న ర్యాంకులను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వాటిని వాయిదా వేసింది. ఈనెల 25 వరకు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులు, విద్యార్థుల ఇంటర్మీడి యెట్/12వ తరగతి ఫలితాల సమాచారాన్ని అందజేయాలని బుధవారం ప్రకటన జారీ చేసింది. 25లోగా ఫలితాల సమాచారం ఇవ్వని బోర్డులకు చెందిన విద్యార్థులకు ర్యాంకులు ఇవ్వడం కుదరదని, ఇందుకు తాము బాధ్యులం కాబోమని స్పష్టం చేసింది. తాజా ప్రకటన నేపథ్యంలో ఆల్ ఇండియా ర్యాంకులు ఈనెల 26 లేదా 27న వెల్లడించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటన వాయిదా పడిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఉమ్మడి ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఆన్లైన్ వెబ్ ఆప్షన్లను ప్రక్రియ కూడా వాయిదా పడింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే విషయాన్ని ఈనెల 26న ప్రకటిస్తామని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటి వెల్లడించింది. -
జేఈఈ మెయిన్‌లో అందరికీ 4 మార్కులు
హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ రాత పరీక్షలో సెట్-ఎ పేపర్లో 10వ ప్రశ్నకు(ఫిజిక్స్) ఇచ్చిన ఆప్షన్లన్నీ తప్పులేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గుర్తించింది. దీంతో ఆ ప్రశ్నకు సంబంధించి 4 మార్కులను పరీక్ష రాసిన విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. సెట్-బి పేపర్లో 87వ ప్రశ్నకు, సెట్-సిలో 51వ ప్రశ్నకు, సెట్-డిలో 17వ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులందరికీ 4 మార్కులు ఇస్తామని పేర్కొంది. అలాగే సెట్-ఎ పేపర్లో 15వ ప్రశ్నకు 3, 4వ ఆప్షన్లు రెండూ సరైనవేనని స్పష్టం చేసింది. పరీక్ష తుది కీని వెబ్సైట్లో విడుదల చేస్తూ ఈ వివరాలు తెలిపింది. ఏప్రిల్ 10న జరిగిన ఆన్లైన్ పరీక్షలో 3, 9, 23వ ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానాలు లేవని, ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున విద్యార్థులందరికీ 12 మార్కులను ఇస్తామని పేర్కొంది. -
ఉపాధ్యాయ అర్హతకు సీటెట్!
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)... సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష. దీనిలో అర్హత సాధించడం ద్వారా కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, టిబెటన్ పాఠశాలలు, ఇతర అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలతోపాటు టెట్ నిర్వహించని రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా కెరీర్ ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు! తాజాగా సీటెట్-2015 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు... నోటిఫికేషన్ సీటెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు (1 నుంచి 5వ తరగతి) పేపర్-1లో అర్హత సాధించాలి. ఉన్నత పాఠశాలలో (6 నుంచి 8 తరగతి) ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. రెండు స్థాయిల్లో అంటే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉపాధ్యాయ అర్హత కోసం రెండు పేపర్లలో అర్హత సాధించాలి. పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వారికి అర్హత సర్టిఫికెట్ ఇస్తారు. సీటెట్ స్కోర్ ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి ఏడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. పరీక్ష విధానం: సీటెట్‌ను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం ప్రశ్నల సంఖ్య 150. మార్కులు 150. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు. పేపర్-1 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 మ్యాథమెటిక్స్ 30 30 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 30 మొత్తం 150 150 పేపర్-2 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ (లేదా)సోషల్ సైన్స్ 60 60 మొత్తం 150 150 పేపర్ -1 అర్హత: అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా)లో ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు/ తత్సమానం పేపర్-2 అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా)ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. (లేదా) కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఏడాది వ్యవధి ఉన్న బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ తత్సమానం ప్రిపరేషన్: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజిలో విద్యార్థుల వయసుకనుగుణంగా టీచింగ్, లెర్నింగ్, ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి సైకాలజీలోని కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. లాంగ్వేజ్ విభాగంలో సంబంధిత మాధ్యమంలో అభ్యర్థి ప్రొఫిషియెన్సీతోపాటు కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. కాబట్టి బేసిక్ గ్రామర్ మీద పట్టు పెంచుకోవాలి. కాంప్రెహెన్షన్, ఫొనెటిక్స్, లెటర్ రైటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సోషల్ సైన్స్‌లో ఎక్కువగా కాన్సెప్ట్స్, ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ విభాగంలో రాణించేందుకు పేపర్ -1కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎన్సీఈఆర్టీ/ సీబీఎస్ఈ పుస్తకాల్లోని సిలబస్‌కు అనుగుణంగా ప్రిపేరవ్వాలి. పేపర్-2కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదో తరగతి సిలబస్‌ను ఔపోసన పట్టాలి. అయితే ప్రశ్నల కఠినతా స్థాయి మాత్రం పేపర్-1కు పదోతరగతి స్థాయిలో, పేపర్-2కు సీనియర్ సెకండరీ స్థాయి వరకు ఉంటాయి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను అవగాహన పెంచుకుని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 8, 2015. పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2015. వివరాలకు: http://ctet.nic.in/ -
బహుళ ప్రయోజనాల.. నెట్
ఈసారి నెట్ నిర్వహణలో కీలకమైన మార్పు.. యూజీసీ తరపున పరీక్షను ఈసారి నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పర్య వేక్షిస్తుంది. ఇది తప్ప ఎటువంటి మార్పులు లేవు. నెట్ పరీక్షను ఈ సారి 79 ప్రధాన సబ్జెక్ట్‌లలో నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్‌గా: రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పేపర్లు.. పేపర్-1, 2, 3గా ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. వివరాలు.. పేపర్ మార్కులు పశ్నలు సమయం 1 100 60 ప్రశ్నల్లో 50 సాధించాలి 75 ని. 2 100 50 ప్రశ్నలను సాధించాలి 75 ని. 3 150 75 ప్రశ్నలను సాధించాలి 150 ని. అర్హత మార్కులు: పేపర్లు, కేటగిరీల వారీగా వేర్వేరు అర్హత మార్కులను నిర్ణయించారు. ప్రతి పేపర్లో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన వారిని మాత్రమే తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. వివరాలు.. కేటగిరీ పేపర్-1 పేపర్-2 పేపర్-3 జనరల్ 40 40 75 బీసీ 35 35 60 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ 35 35 60 ప్రయోజనాలు: నెట్లో అర్హత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్స్టిట్యూట్లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్/ సెట్ క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు.. ఐదేళ్లపాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐటీ/ఐఐఎస్సీ వంటి ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి.. పరిగణించే అర్హతల్లో నెట్/ జేఆర్ఎఫ్ అర్హతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. ప్రిపరేషన్ పేపర్-1: ఈ పేపర్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. దీని కోసం మెథడాలజీ, కాంప్రెహెన్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్ట్ పరిజ్ఞానం బాగా ఉన్న అభ్యర్థులు పేపర్-1పై దృష్టి పెట్టాలి. ఇందులోని 60 ప్రశ్నలలో 50 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. గమనించాల్సిన అంశం.. అభ్యర్థులు 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే..మొదట ప్రయత్నించిన 50 ప్రశ్నలనే మూల్యాంకన చేస్తారు. కాబట్టి సమాధానం కచ్చితంగా తెలిసిన ప్రశ్నలనే ఎంచుకోవాలి. పేపర్-2, పేపర్-3: ఇవి సబ్జెక్ట్ పేపర్లే అయినప్పటికీ ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరుగుతుంది. దీన్ని గుర్తించి తదనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. గత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుని ఏయే ఆధ్యాయాలకు ఎంత వెయిటేజీ ఉంటుందో గమనించి ఆ మేరకు ప్రిపరేషన్ సాగించాలి. ఒక్కొక్క అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నప్పుడే సంబంధిత అంశంపై మాక్‌టెస్ట్‌లు రాయడం ఉపయోగకరం. మాక్‌టెస్ట్‌లకు హాజరుకావడం వల్ల వేగంగా సమాధానాన్ని గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది. డిస్క్రిప్టివ్ ఓరియెంటేషన్‌తో: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నప్పటికీ విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ ఓరియెంటేషన్‌తో సాగించాలి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఏ ఒక్క అంశాన్నీ విస్మరించకుండా విస్తృత స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. అప్పుడే సబ్జెక్ట్‌లో ఎంత లోతైన ప్రశ్న అడిగినా సమాధానం గుర్తించడం సాధ్యం. నెట్లో కనీస అర్హత మార్కులను నిర్ణయించినప్పటికీ..60 నుంచి 70 శాతం మార్కులు పొందే దిశగా కృషి చేయాలి. సెట్-నెట్: ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) నోటిఫికేషన్ వెలువడింది. కాబట్టి సెట్ కు సమాంతరంగా నెట్ ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే నిర్వహించే సంస్థలు వేర్వేరు తప్ప మిగతా అంశాలన్నీ దాదాపు నెట్,సెట్ విషయంలో ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా నెట్ తర్వాత సెట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్ ప్రిపరేషన్ సెట్ కూడా ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ సమాచారం అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు) మాస్టర్ డిగ్రీ లేదా తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్: 28 సంవత్సరాలు (డిసెంబర్ 1, 2014 నాటికి). లెక్చరర్‌షిప్‌నకు ఎటువంటి వయోపరిమితి లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్-రూ.450, బీసీ- రూ. 225 (నాన్క్రీ మిలేయర్), ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ- రూ.110. ఫీజును చలాన్ రూపంలో చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశించిన విధంగా కో-ఆర్డినేటింగ్ యూనివర్సిటీలకు పంపాలి. ఆన్లైన్ దరఖాస్తు, చలాన్ తీసుకునేందుకు చివరి తేదీ: నవంబర్ 15, 2014. చలాన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 18, 2014. దరఖాస్తు, అటెండెంట్ స్లిప్, అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 19, 2014. కో-ఆర్డినేటింగ్ యూనివర్సిటీలో ప్రింట్ అవుట్ దరఖాస్తు, సంబంధిత సర్టిఫికెట్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 25, 2014. పరీక్ష తేదీ: డిసెంబర్ 28, 2014. వెబ్సైట్: http://cbsenet.nic.in -
10 నుంచి సెట్ దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్, ఏపీ సెట్స్) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు... వచ్చే ఏడాది జనవరి 4 జరిగే సెట్‌కు అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.100 అపరాధ రుసుముతో నవంబరు 1 నుంచి 8 వరకు, రూ.200 అపరాధ రుసముతో 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 27 సబ్జెక్టులకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నాయి. రెగ్యులర్, దూరవిద్యలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు సెట్‌కు అర్హులు. కాగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను ఇక నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) చేపట్టనునట్లు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
పోటాపోటీగా ‘స్వచ్ఛ్ విద్యాలయ్’
గాంధీ జయంతి సందర్భంగా ‘స్వచ్ఛ్ భారత్.. స్వచ్ఛ్ విద్యాలయ్’ ప్రారంభం సాక్షి, ముంబై : నగరంలోని పలు పాఠశాలలు కేవలం విద్య లో మాత్రమే గ్రేడ్ సంపాదించడమేకాకుండా తమ పాఠశాల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచి గ్రేడ్ సాధించేందుకు పోటీ పడనున్నారు. ఇందుకు గాను ఆయా పాఠశాలలకు నగదు బహుమతి కూడా లభించనుంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘స్వచ్ఛ్ భారత్..స్వచ్ఛ్ విద్యాలయ’ అనే ప్రచారాన్ని మానవ వనరుల అభివృద్ధి మం త్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిశుభ్రత పాటించిన పాఠశాలలకు రివార్డులను అందించనుంది. పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తారో వారికి గ్రేడుల వారీగా రేటింగ్‌ను ప్రకటించి నగదు బహుమతిని అందించనుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయా పాఠశాలలు తమ పాఠశాలలో పారిశుధ్యానికి సంబంధించి స్థితిగతులను అక్టోబర్ 31వ తేదీవరకు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఎక్కువగా స్కోర్ చేసిన పాఠశాలలకు ‘గ్రీన్ రేటింగ్’ ఇవ్వనున్నారు. అదేవిధంగా నగదు బహుమతిగా రూ.లక్ష ఇవ్వనున్నారు. అలాగే ‘బ్లూ రేటింగ్’ సాధించిన పాఠశాలలకు రూ.75 వేలు, ‘యెల్లో రేటింగ్’ వచ్చి న పాఠశాలలకు రూ.25 వేలు అందించనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించనుంది. ఈ జీవో ను సీబీఎస్ఈ తనకు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రణాళిక రచించింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలతోపాటు విద్యార్థులను కూడా ఈ డ్రైవ్‌లో భాగస్వాములను చేసేందుకు నిర్ణయించింది. పాఠశాల తరగతి గదులు, టాయిలెట్లు, లేబరేటరీలు, ఆట మైదానాలు, వంట గదులను శుభ్రంగా ఉంచడంలో వీరందరూ కృషిచేస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో అన్ని సీబీఎస్ఈ పాఠశాల లే కాకుండా ఇతర బోర్డులు కూడా పాల్గొననున్నాయి. ఇందుకు సంబంధించి తాము ఓ ప్రణాళికను కూడా రూపొందించామని అంధేరీకి చెందిన సీబీ ఎస్ఈ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ దీప్షిక శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రి య ద్వారా చాలా మంది విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుందని మరో ప్రిన్సిపల్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా పరిశుభ్రత విలువ తెలుస్తుందని తెలిపారు. -
ఉపాధ్యాయ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్
విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారు కొన్ని నిర్దేశిత ప్రమాణాలను అందుకోవాల్సిఉంటుంది.. దేశంలో ఉపాధ్యాయ విద్యను పర్యవేక్షించే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) కూడా ఆ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది.. ఈ క్రమంలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అమల్లోకి వచ్చింది.. దీన్ని రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ వివరాలు.. సెంట్రల్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులుగా కెరీర్‌గా ప్రారంభించాలనుకునే వారు సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహిస్తుంది. రెండు పేపర్లుగా: సీటెట్ రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్-1:1 నుంచి 5 తరగతులకు ఉద్దేశించింది. అంటే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు ఈ పేపర్‌కు హాజరు కావాలి. అర్హత: 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఈ కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా) లో ఉత్తీర్ణత. లేదా 45 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఐఈడీ) ఉత్తీర్ణత/చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.పేపర్-2:6 నుంచి 8 తరగతులకు ఉద్దేశించింది. అంటే ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు ఈ పేపర్‌కు హాజరు కావాలి. అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ పూర్తి చేసిన/ చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఐఈడీ) ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువు తున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు బీఏ/ బీఎస్సీ బీఈడీ/ బీఏఎడ్/ బీఎస్సీఎడ్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువు తున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చదువుతున్న విద్యార్థులు. పరీక్ష విధానం: పరీక్షను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాల సమయం కేటాయించారు. వివరాలు.. పేపర్-1 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 మ్యాథమెటిక్స్ 30 30 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 30 మొత్తం 150 150 పేపర్-2 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 ఎంచుకున్న సబ్జెక్ట్ 60 60 మొత్తం 150 150 ఎంచుకున్న సబ్జెక్ట్‌లో మ్యాథమెటిక్స్, సైన్స్ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్, సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల నుంచి 30 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. సోషల్ స్టడీస్ అభ్యర్థులకు మాత్రం ఆ సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ప్రయోజనం: పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వారికి అర్హత సర్టిఫికెట్ ఇస్తారు. సీటెట్ స్కోర్ ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి ఏడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. సీటెట్‌లో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు (కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ తదితర పాఠశాలలు), చండీగఢ్, దాద్రా-నగర్ హవేలీ, డయ్యూడామన్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని పాఠశాలలు, నేషనల్ క్యాపిటల్ టెరీటరీ న్యూఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు/స్థానిక సంస్థల నిర్వహణలో ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం సీటెట్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 4, 2014. పరీక్ష తేదీ: సెప్టెంబర్ 21, 2014. వివరాలకు: http://ctet.nic.in/ ప్రిపరేషన్ సీటెట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ మాదిరిగానే ఉంటుంది. కానీ టెట్‌తో పోల్చితే ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో అడుగుతారు. కాబట్టి సంబంధిత సబ్జెక్ట్‌ల పదజాలంపై పట్టు ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు.సైకాలజీని అభ్యసనం చేసేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా, సమన్వయం చేస్తూ చదవాలి. కీలకాంశాలైన శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం- మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్)లను గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను అనుసరించి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.లాంగ్వేజ్ విభాగంలో గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ.. ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో.. బేసిక్ గ్రామర్ మీద పట్టు చాలా అవసరం. ఈ క్రమంలో.. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రొవెర్బ్స్, కొశ్చన్స్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్-ప్యాసివ్ వాయిస్, కాంప్రెహెన్షన్, ఫొనెటిక్స్, లెటర్ రైటింగ్, సింపుల్- కాంపౌండ్- కాంప్లెక్స్ సెంటెన్సెస్.. ఇలా గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని ఔపోసన పట్టాలి. సబ్జెక్ట్‌ల విషయానికొస్తే.. ఎన్సీఆర్టీఈ పుస్తకాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిని అప్లికేషన్ పద్ధతిలో అడుగుతారు. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. పాఠ్యాంశాల చివరన ఇచ్చే ప్రాక్టీస్ బిట్స్ చదవాలి. కంటెంట్ చదివేటప్పుడు.. ఏదైనా ఒక అంశం 3, 4, 5 తరగతి పుస్తకాల్లో ఉండి.. 6, 7, 8, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమైతే.. ఆ అంశాలన్నింటినీ ఒకేసారి చదవడం వల్ల సమన్వయం ఏర్పడుతుంది. తమ నేపథ్యానికి చెందని పాఠ్యాంశాలు (అంటే.. బయాలజీ వాళ్లు గణితం చదవడం, తెలుగు, ఇంగ్లిష్ అభ్యర్థులు సోషల్ స్టడీస్ చదవడం) చదివేటప్పుడు కొంత ఇబ్బందికి గురవడం సహజం. కాబట్టి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠ్యాంశాల విషయంలో సిలబస్‌ను అనుసరిస్తూ.. ప్రతి పాఠ్యాంశం వెనుక ఇచ్చిన బిట్స్‌ను ఔపోసన పడితే సులభంగానే ఈ సమస్యను అధిగమించొచుెు్చథడాలజీ విషయంలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఎవాల్యుయేషన్, ల్యాబ్, రిలేషన్ టు అదర్ సబ్జెక్ట్స్, టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం), రీసెంట్ ట్రెండ్స్(ఇటీవలి కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు/పథకాలు), డెవలప్మెంట్ ఆఫ్ కరికుల్యం వంటివి ప్రధాన అంశాలు. -
మళ్లీ అదే అన్యాయం!
ఐఐటీ అభ్యర్థులకు టాప్-20 పర్సంటైల్ గండం తెలుగు విద్యార్థులకు 92 శాతం కటాఫ్ ఇంటర్ రెండేళ్లకు 920 లేదా సెకండ్ ఇయర్లో 492 మార్కులు ఉంటేనే సీటు ఇతర రాష్ట్రాల పోల్చితే మనోళ్లకే అత్యధిక కటాఫ్ అస్సాం విద్యార్థులకు 292మార్కులు వస్తే చాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానంతో తీవ్ర అన్యాయం హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యా సంస్థల్లో అడ్మిషన్ల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ విషయంలో గందరగోళం తలెత్తగా.. తాజాగా మరో విషయం తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మార్కులతో పాటు ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన ఇంటర్మీడియట్ మార్కుల ప్రకారం టాప్-20 పర్సంటైల్‌లో ఉంటేనే ఐఐటీలో సీటు పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ టాప్ 20 పర్సంటైల్ జాబితాలో లేకపోతే సదరు విద్యార్థికి ఐఐటీ అడ్మిషన్ దక్కదన్నమాట! ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సీబీఎస్ఈ అధికారులు వివిధ రాష్ట్రాల టాప్-20 పర్సంటైల్‌కు సంబంధించిన కటాఫ్ మార్కులను ప్రకటించారు. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 1000 మార్కులకు గాను జనరల్ అభ్యర్థికి కనీసం 920 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్క ద్వితీయ సంవత్సరం మార్కులనే పరిగణనలోకి తీసుకుంటే 530 మార్కులకు గాను 492 కంటే ఎక్కువ మార్కులు రావాలి. అలాంటి విద్యార్థులే ఐఐటీలో చేరేందుకు అర్హులు. ఇంటర్లో ఈ మేరకు టాప్-20 పర్సంటైల్ కటాఫ్ మార్కులు(92 శాతం) సాధించకుంటే.. ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించినా ప్రయోజనం ఉండదు. అయితే ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఈ కటాఫ్ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి మెరిట్‌తో ప్రవేశాలు కల్పించాల్సిన ఐఐటీల్లో ఇలాంటి పొంతన లేని విధానాలతో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇతర రాష్ట్ర విద్యార్థులతో పోల్చుకుంటే రాష్ట్ర విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినా ఐఐటీలో సీటు పొందలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇంటర్ లేదా 12వ తరగతి మార్కులను ఇప్పటికీ పంపించని వారి విషయంలో మాత్రం కటాఫ్ మార్కులు మరో రకంగా ఉన్నాయి. సీబీఎస్ఈ అర్హత పరీక్షలో ప్రకటించిన మేరకు జనరల్ అభ్యర్థికి 83.2% మార్కులు వస్తే చాలు!. సీబీఎస్ఈ విధానాన్నే అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకుండా ఒక్కో రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోని పోటీని బట్టి కటాఫ్ మార్కులను నిర్ణయించడం సమస్యకు కారణం అవుతోంది. దీనిపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాగా, మన ఇంటర్ బోర్డు విద్యార్థులకు సీబీఎస్ఈ రెండు రకాల అవకాశం కల్పించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కులను మాత్రమే కటాఫ్ కోసం చూపించవచ్చు లేదా రెండేళ్ల మార్కులనూ పరిగణనలోకి తీసుకునేందుకు చూపించుకోవచ్చు. మార్కులు ఇవ్వకుంటే సీబీఎస్ఈ కటాఫ్ వర్తించనుంది. దీని ప్రకారం ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 83.2%, ఓబీసీకి 82 %, ఎస్సీలకు 74%, ఎస్టీలకు 73.2 శాతం మార్కులు వస్తే చాలు. పాలిటెక్నిక్ విద్యార్థులకు షాక్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లకు సీబీఎస్ఈ షాక్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ వారు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్‌లో చేరేందుకు అనర్హులని తాజాగా పేర్కొంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం వారికి 12వ తరగతి సర్టిఫికెట్ లేనందున పాలిటెక్నిక్ విద్యార్థులు అనర్హులని స్పష్టం చేసింది. మరోవైపు 12వ తరగతి/తత్సమాన పరీక్ష మార్కులను ధ్రువీకరించేందుకు చేసేందుకు గడువును జులై 3 వరకు పొడిగించింది. గత నెల 27 వరకు మొదట్లో చివరి తేదీగా ప్రకటించినా దానిని సోమవారం వరకు పొడగించింది. తాజాగా 3వ తేదీ వరకు మళ్లీ పొడిగించింది. దీనిప్రకారం జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను ఈ నెల 7న ప్రకటించనుంది. ఈ మేరకు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు సెంట్రల్ సీట్ అలాట్మెంట్ బోర్డు గతంలో ప్రకటించిన ప్రవేశాల షెడ్యూల్ మారనుంది. -
సర్కారీ స్కూళ్ల హవా
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల - 99.6 శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించిన ఢిల్లీ విద్యార్థి సార్థక్ అగర్వాల్ సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పన్నెండో తరగతి ఫలితాల్లో ఢిల్లీ సర్కారీ పాఠశాలలు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. దేశంలోని మిగతా సీబీఎస్ఈ అనుబంధ సంస్థల కంటే నగరంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. గురువారం విడుదల చేసిన పన్నెండో తరగతి ఫలితాల్లో 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 88.62 శాతం మంది పాస్ అయ్యారని సీబీఎస్ఈ తెలిపింది. గతేడాది 85.17 శాతం ఉత్తీర్ణత సాధించిన ఢిల్లీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈసారి 86.66 శాతంతో ప్రభంజనం సృష్టించాయి. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో ఉత్తీర్ణత శాతం 97.56 నుంచి 98.02 శాతానికి పెరిగింది. ఇదిలావుండగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో గతేడాది 97.06 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 93.94కి పడిపోయింది. కాగా, ఢిల్లీ ప్రాంతంలో సైన్స్ విద్యార్థులలో డీపీఎస్ వసంత్ కుంజ్‌కు చెందిన సార్థక్ అగర్వాల్ అగ్రస్థానంలో నిలిచాడు. అతనికి 99.6 శాతం మార్కులు వచ్చాయి. కామర్స్ విభాగంలో డీపీఎస్ ఆర్కే పురం విద్యార్థిని వ్రుందా 98.4 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించింది. బాలికలదే పైచేయి సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. బాలుర కన్నా పది శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. 91.72 శాతం మంది బాలికలు, 82.09 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కూడా 91.42 శాతంతో బాలికలు, 82.44 శాతంతో బాలురు ఉత్తీర్ణత సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచినట్టు భావిస్తున్న సర్థాక్ అగర్వాల్ మాట్లాడుతూ తాను ఎలాంటి ట్యూషన్‌కు వెళ్లలేదని, పరీక్షలకు ముందు చదువుపైనే ఎక్కువ ఏకాగ్రత సాధించానని తెలిపాడు. సెంట్రల్ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి పాఠశాల విద్యార్థి జి.హరికృష్ణ కామర్స్ విభాగంలో 99.2 శాతంతో మొదటి స్థానంలో నిలిచాడు. డీపీఎస్ ఇంద్రాపుర విద్యార్థి ముగ్ధ్ సేథియా, వసంత్ వాలీ పాఠశాలకు చెందిన వసుధా దీక్షిత్ హ్యుమనీటిస్ విభాగంలో 98.8 శాతంతో టాపర్లుగా నిలిచారు. చీటింగ్ కేసులు నమోదు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీలోనే అత్యధికంగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పొల్చుకుంటే మాస్ కాపీరాయుళ్ల సంఖ్య తగ్గింది. గతేడాది 25 కేసులు నమోదు కాగా, ఈసారి వాటి సంఖ్య 13కి తగ్గిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఏడు కేసులతో పాట్నా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, డెహ్రాడూన్, పంచ్‌కుల, గౌహతి, చెన్నై, అలహాబాద్‌లు ఉన్నాయి. కేజ్రీవాల్ కుమార్తెకు 96 శాతం మార్కులు న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత 96 శాతం మార్కులు సాధించింది. ‘ నా తల్లిదండ్రులే నాకు ఆదర్శప్రాయులు. ఐఐటీలో ఏదో ఒక కోర్సును చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఐఐటీలో అడ్మిషన్ సంపాదించడమే’నని సైన్స్ విభాగ విద్యార్థిని అయిన హర్షిత తెలిపింది. -
సీబీఎస్ఈ టెన్త ఫలితాల్లో బాలికలదే పైచేయి
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీ ఎస్ఈ) 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 98.87 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు సీబీఎస్ఈ అధికారులు వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచే యి సాధించారని, వీరి ఉత్తీర్ణతా శాతం 99.06గా ఉందని తెలిపారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 98.74గా ఉందన్నారు. కాగా, దేశం మొత్తంలో తిరువనంతపురం రీజియన్ 99.96 శాతంతో అత్యధిక మార్కులు సాధించి ప్రథమస్థానం కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఈ నెల 19న విడుదలైన ఫలితాల్లో చెన్నై రీజియన్ కూడా సత్తా చాటిందన్నారు. మొత్తం 1, 32,7250 మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారని, గత ఏడాదితో పోల్చుకుంటే 5.51 శాతం ఎక్కువని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హాజ రైన విద్యార్థుల్లో 99.89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.