సీబీఎస్‌ఈ స్కూళ్ల నియంత్రణపై విద్యాశాఖ దృష్టి | Education is focused on the regulation of CBSE schools | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ స్కూళ్ల నియంత్రణపై విద్యాశాఖ దృష్టి

Published Wed, Nov 9 2016 5:08 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

సీబీఎస్‌ఈ స్కూళ్ల నియంత్రణపై విద్యాశాఖ దృష్టి - Sakshi

సీబీఎస్‌ఈ స్కూళ్ల నియంత్రణపై విద్యాశాఖ దృష్టి

- ప్రవేశాలు, ఫీజుల విధానంపై పాఠశాల విద్యా డెరైక్టర్ ఆరా
- త్వరలోనే వాటి నియంత్రణకు కార్యాచరణ  
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) స్కూళ్ల నియంత్రణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా వాటిలో అమలు చేస్తున్న ఫీజుల విషయంలో నియంత్రణ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సీబీఎస్‌ఈ స్కూళ్లలో ప్రవేశాల విధానం, ఫీజుల నియంత్రణకు సంబంధించిన అంశాలపై మంగళవారం పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ పలువురు డీఈవోలు, డిప్యూటీ ఈవో లతో చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర సిలబస్‌తో కొనసాగు తున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ఆలోచనలు చేస్తున్న విద్యాశాఖ ఇపుడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి స్కూళ్ల విషయంలోనూ పక్కా చర్యలు చేపట్టాలన్న ఆలోచనలు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఫీజుల వసూలు విధానంపై తనిఖీలు చేసి, ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీబీఎస్‌ఈ స్కూళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఇన్నాళ్లు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లను పట్టించుకోని విద్యాశాఖ.. వాటి నియంత్రణ విషయంలో ఎలా ముందుకు సాగవచ్చన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ గతంలో రాసిన లేఖను కూడా పరిశీలిస్తోంది.

 సీబీఎస్‌ఈ స్కూళ్లపై నియంత్రణాధికారం రాష్ట్రాలదే
 సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్ల ఫీజులు, నియంత్రణాధికారం విషయంలో తమ పరిధిలోని అధికారాలు ఏంటని పేర్కొంటూ 2014 ఏప్రిల్17న రాష్ట్రంలో విద్యాహక్కు  చట్టం అమలు అథారిటీ, అప్పటి ఎస్‌ఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి ఎంహెచ్‌ఆర్డీకి లేఖ రాశారు. దానిపై స్పందిస్తూ 2014 జూన్ 14న మానవ వనరుల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అలోక్ జవహర్ ఎస్‌ఎస్‌ఏకు లేఖ రాశారు. అందులో రాష్ట్రాల్లో ఆయా స్కూళ్ల నియంత్రణాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఆయా స్కూళ్ల ఏర్పాటుకు నిరభ్యంతర పత్రాలు జారీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలే వాటిలో విద్యార్థుల నుంచి వసూలు చేయాల్సిన కనీస, గరిష్ట ఫీజులను నిర్ణరుుంచాలని వివరించారు. ఆ లేఖ ఉమ్మడి రాష్ట్రంలో రాసిందే అరుునప్పటికీ విభజన తరువాత కూడా వర్తిస్తుంది. కాబట్టి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లలో ప్రధానంగా ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement