సీబీఎస్‌ఈ పదో తరగతికీ బోర్డు పరీక్ష తప్పనిసరి!
- ఆప్షనల్ విధానం తొలగింపు
- 2017–18 నుంచి అమలు
- సీబీఎస్‌ఈ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ సిలబస్ స్కూళ్ల లో ఇన్నాళ్లు ఆప్షనల్‌గా ఉన్న పదో తరగతి బోర్డు పరీక్ష విధానం ఇక నుంచి తప్పనిసరి కానుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పరిధిలో స్కూళ్లలో పదో తరగతిలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్ష నల్ విధానాన్ని కేంద్రం తొలగించింది. రాష్ట్ర సిలబస్‌లోని పదో తరగతి పరీక్షల తరహా విధానాన్ని సీబీఎస్‌ఈ స్కూళ్లలోనూ అమలు చేయనుంది. దాంతో 2017–18 నుంచి సీబీఎస్‌ఈ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులంతా బోర్డు పరీక్షకు హాజరు కావాల్సిందే. ఇన్నాళ్లు సీబీఎస్‌ఈ స్కూళ్లలోని టెన్త్ విద్యార్థులు కావాలనుకుంటే బోర్డు పరీక్షకు హాజరు కావచ్చు.
లేదా అదే పాఠశాలలో 11వ తరగతి చదవాలనుకుంటే ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా 11వ తరగతికి వెళ్లిపోవచ్చు. ఇంటర్‌లో చేరాలనుకునే సీబీ ఎస్‌ఈ స్కూళ్ల విద్యార్థులే ఎక్కువగా బోర్డు పరీక్షలు రాసేవారు. కానీ 2017–18 నుంచి అలా కుదరదు. వారంతా బోర్డు పరీక్షలు రాసి పాసవాల్సిందే. ఈ మేరకు పదో తరగతి కొత్త పరీక్ష విధానంపై సీబీఎస్‌ఈ చైర్మన్ ఆర్‌కే చతుర్వేది మంగళ వారం ఉత్వరులు జారీ చేశారు. పదో తరగతి కొత్త పరీక్షల విధా నం పై వివరాలతో కూడిన ఉత్తర్వులను దేశంలోని అన్ని సీబీఎస్‌ఈ స్కూళ్లకు పంపారు. 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు మాత్రం పాత విధానమే వర్తిస్తుందని ఆయన వివరించారు.
ఇదీ పరీక్షల విధానం...
► కొత్త విధానంలో ప్రతి సబ్జెక్టులో 100 మార్కులుంటాయి. 80 మార్కులు రాత పరీ క్షకు, 20 ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఇస్తారు. వీటిల్లో ఒక్కోదాంట్లో 33% మార్కులు సాధించాలి. ఇంటర్నల్స్‌లో పీరియాడిక్ టెస్టు లకు 10 మార్కులు, నోట్ బుక్ సబ్మిషన్, అసైన్‌మెంట్ల పూర్తి, నోటు బుక్ నీట్‌నెస్‌కు 5 మార్కులు, వినడం, రాయడం, చదవడం, ప్రాక్టికల్స్, ప్రాజెక్టు వంటి నైపుణ్యాలకు 5 మార్కులుంటాయి. పీరియాడిక్ టెస్టులను ఒక విద్యా సంవత్సరంలో 3 కంటే ఎక్కువ నిర్వహించకూడదు. వాటిల్లో ఉత్తమమైన రెండింటిని పరిగణనలోకి తీసుకోవాలి.
► ఇప్పటిదాకా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా 11వ తరగతికి ప్రమోట్ చేసే పద్ధతిలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు పూర్తయిన సిలబస్, విద్యార్థి మార్కులు, పనితీరు ఆధా రంగా ప్రమోట్ చేసేవారు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి దాకా బోధించిన సిలబస్‌లోనే బోర్డు పరీక్ష నిర్వహించే వారు. ఇకపై 2017–18 నుంచి అమల్లోకి వచ్చే బోర్డు పరీక్షలో 100 % సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులకు మార్కులు, గ్రేడ్‌లు ఇస్తారు. 12వ తరగతిలో ఉన్నట్లే 9 పాయింట్ల గ్రేడింగ్ విధానం ఉంటుంది. కో కరిక్యులర్ యాక్టివి టీస్‌కు 5 పాయింట్ల గ్రేడింగ్ విధానం కొన సాగుతుంది. పదో తరగతి అసెస్‌మెంట్ విధానాన్నే ఆరు నుంచి తొమ్మిదో తరగతి దాకా కూడా అమలు చేస్తారు.