
డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మళ్లీ ఎంపికయ్యాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్ కోసం ఇండియా ఛాంపియన్స్ మేనేజ్‌మెంట్ యువీని కెప్టెన్‌గా నియమించింది. యువీ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్ డబ్ల్యూసీఎల్ ఈ ఏడాది జులైలో (18 నుంచి) యునైటెడ్ కింగ్‌డమ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.
డబ్ల్యూసీఎల్ మొదటి సీజన్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు పాల్గొనగా.. ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. తొలి సీజన్‌లో భారత్ తరఫున యువీతో పాటు సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించారు.
ఈ సీజన్‌లో భారత జట్టులో మరో స్టార్ కూడా చేరనున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ సీజన్‌లో ఇండియా ఛాంపియన్స్‌తో జతకట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడు. డబ్ల్యూసీఎల్‌లో ఇండియా ఛాంపియన్స్‌కు సుమంత్ బల్, సల్మాన్ అహ్మద్, జస్పాల్ బహ్రా ఓనర్లు వ్యవహరిస్తున్నారు. డబ్ల్యూసీఎల్ టోర్నీలో అంతర్జాతీయ వేదికపై మెరిసిన చాలా మంది స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ప్రైవేటు యాజమాన్యం అండర్‌లో జరుగుతుంది.
కాగా, డబ్ల్యూసీఎల్ రెండో సీజన్‌లో పాకిస్తాన్‌కు కొత్త సారధి వచ్చాడు. ఈ సీజన్ కోసం పాక్ ఛాంపియన్స్ మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ వెటరన్ వికెట్ కీపర్ 2023 నుంచి కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. సర్ఫరాజ్ చేరిక పాకిస్తాన్ ఛాంపియన్స్‌కు బూస్టప్ ఇస్తుంది.
గత సీజన్ పాక్‌కు యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, అబ్దుల్ రజాక్, కమ్రాన్ అక్మల్, వాహబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు.
గత సీజన్‌లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..
అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment