టీ20 వరల్డ్‌కప్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో క్రికెట్ పండుగ మొదలైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 3) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు (ఇండియా ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటున్నాయి.
లెజెండ్స్ క్రికెట్‌కు సంబంధించి ఈ టోర్నీని వరల్డ్‌కప్‌గా పరిగణించవచ్చు. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, హెర్షల్ గిబ్స్, షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్, బ్రెట్ లీ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.
సింగిల్ రౌండ్ ఫార్మాట్‌లో జరిగే (ప్రతి జట్టు మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది) ఈ టోర్నీ జులై 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సింగిల్ రౌండ్ తర్వాత టాప్-4లో ఉండే జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జులై 6న జరుగనుంది.
జట్ల వివరాలు..
భారత్ ఛాంపియన్స్: యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, పవన్ నేగి
ఆస్ట్రేలియా ఛాంపియన్స్: బ్రెట్ లీ, టిమ్ పైన్, షాన్ మార్ష్, బెన్ కట్టింగ్, బెన్ డంక్, డిర్క్ నాన్స్, డాన్ క్రిస్టియన్, బెన్ లాఫ్లిన్, ఆరోన్ ఫించ్, బ్రాడ్ హాడిన్, కల్లమ్ ఫెర్గూసన్, పీటర్ సిడిల్, జేవియర్ డోహెర్టీ, నాథన్ కౌల్టర్ నైల్, జాన్ హేస్టింగ్స్
ఇంగ్లండ్ ఛాంపియన్స్: కెవిన్ పీటర్సన్, రవి బొపారా, ఇయాన్ బెల్, సమిత్ పటేల్, ఒవైస్ షా, ఫిలిప్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, సాజిద్ మహమూద్, అజ్మల్ షాజాద్, ఉస్మాన్ అఫ్జల్, ర్యాన్ సైడ్‌బాటమ్, స్టీఫెన్ ప్యారీ, స్టువర్ట్ మీకర్, కెవిన్ ఓ'బ్రియన్
వెస్టిండీస్ ఛాంపియన్స్: డారెన్ సామీ, క్రిస్ గేల్, శామ్యూల్ బద్రీ, రవి రాంపాల్, కేస్రిక్ విలియమ్స్, జాసన్ మహమ్మద్, నవిన్ స్టీవర్ట్, డ్వేన్ స్మిత్, యాష్లే నర్స్, సులీమాన్ బెన్, చాడ్విక్ వాల్టన్, జెరోమ్ టేలర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్, కిర్క్ ఎడ్వర్డ్స్, జోనాథన్ కార్టర్
దక్షిణాఫ్రికా ఛాంపియన్స్: జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, ఇమ్రాన్ తాహిర్, మఖాయా ంటిని, డేల్ స్టెయిన్, అష్వెల్ ప్రిన్స్, నీల్ మెక్‌కెంజీ, ర్యాన్ మెక్‌లారెన్, జస్టిన్ ఒంటాంగ్, రోరీ క్లీన్‌వెల్ట్, జెపి డుమిని, రిచర్డ్ లెవి, డేన్ విలాస్, వెర్నాన్ ఫిలాండర్,
పాకిస్తాన్ ఛాంపియన్స్: యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, అబ్దుల్ రజాక్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సోహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, తన్వీర్ అహ్మద్, ముహమ్మద్ హఫీజ్, అమీర్ యామిన్, షోయబ్ మాలిక్, సోహైబ్ మక్సూద్, ఉమర్జెల్ ఖాన్ అక్మల్,
షెడ్యూల్..
బుధవారం, జూలై 03
ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్
గురువారం, జూలై 04
సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్
పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్
శుక్రవారం, జూలై 05
ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
ఇండియా వర్సెస్ వెస్టిండీస్
శనివారం, జూలై 06
ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా
ఇండియా వర్సెస్ పాకిస్థాన్
ఆదివారం, జూలై 07
సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్
ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్
సోమవారం, జూలై 08
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
మంగళవారం, జూలై 09
వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్
దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్
బుధవారం, జూలై 10
వెస్టిండీస్ వర్సెస్‌ఆస్ట్రేలియా
ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
బుధవారం, జూలై 12
మొదటి సెమీ ఫైనల్- TBA vs TBA
రెండవ సెమీ ఫైనల్- TBA vs TBA
శనివారం, జూలై 13
ఫైనల్ మ్యాచ్ - TBA vs TBA
Comments
Please login to add a commentAdd a comment