Legends League Cricket
-
యూసఫ్ పఠాన్ ఊచకోత.. అయినా పాపం?(వీడియో)
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ-2024 విజేతగా సదరన్ సూపర్ స్టార్స్ నిలిచింది. శ్రీనగర్ వేదికగా కోణార్క్ సూర్యస్, సదరన్ సూపర్ స్టార్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరు సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. కోణార్క్ సూర్యస్పై సూపర్ ఓవర్లో సదరన్ జట్టు విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.సూపర్ స్టార్స్ బ్యాటర్లలో జింబాబ్వే మాజీ కెప్టెన్ హ్యామిల్టన్ మసకద్జ(58 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోణార్క్ సూర్యాస్ ఒడిశా బౌలర్లలో మునవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్ పఠాన్, దివేశ్ పఠానియా తలో వికెట్ సాధించారు.యూసఫ్ విరోచిత పోరాటం..అనంతరం లక్ష్యచేధనలో కోణార్క్ సూర్యస్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.కాగా 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సూర్యస్ జట్టును యూసఫ్ పఠాన్ తన విరోచిత ఇన్నింగ్స్‌తో పోటీలో ఉంచాడు. ఈ మ్యాచ్‌లో పఠాన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కొణార్క్ జట్టు 13 పరుగులు చేసింది. ఆ తర్వాత సదరన్ జట్టు కేవలం 4 బంతుల్లోనే టార్గెట్‌ను అందుకుంది. సదరన్ స్టార్ బ్యాటర్ గుప్టిల్ వరుసగా రెండు సిక్స్‌లు బాది తమ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ సంచలన నిర్ణయం.. క్లాసెన్‌కు రూ.23 కోట్లు! Maturity is when you realize Yusuf Pathan can still make into main Indian side.Gem of a knock in the final, 85 of 38 balls 🥶pic.twitter.com/SJmRWLVjUI— Sujeet Suman (@sujeetsuman1991) October 16, 2024 -
LLC 2024 Final: రెచ్చిపోయిన మసకద్జ
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 సీజన్ ఫైనల్లో సదరన్ సూపర్ స్టార్స్, కోణార్క్ సూర్యాస్ ఒడిశా జట్లు పోటీపడుతున్నాయి. శ్రీనగర్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) జరుగుతున్న ఫైనల్లో కోణార్క్ సూర్యాస్ ఒడిశా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కోణార్క్ సూర్యాస్ ఒడిశా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. హ్యామిల్టన్ మసకద్జ మెరుపు ఇన్నింగ్స్ (58 బంతుల్లో 83; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి సూపర్ స్టార్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. సూపర్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్ 27, శ్రీవట్స్ గోస్వామి 0, పవన్ నేగి 33, చతురంగ డిసిల్వ 9, చిరాగ్ గాంధీ 0, ఎల్టన్ చిగుంబర ఒక్క పరుగు చేశారు. దిల్షన్ మునవీర వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సూపర్ స్టార్స్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించింది. కోణార్క్ సూర్యాస్ ఒడిశా బౌలర్లలో మునవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇర్ఫాన్ పఠాన్, దివేశ్ పఠానియా తలో వికెట్ దక్కించుకున్నారు. -
దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్, కోణార్క్ సూర్యాస్ ఒడిశా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్తొలుత బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యాస్ పఠాన్ సోదరులు చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇర్ఫాన్ పఠాన్ 47 బంతుల్లో 62, యూసఫ్ పఠాన్ 21 బంతుల్లో 43 పరుగులు చేసి కోణార్క్ సూర్యాస్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కోణార్క్ సూర్యాస్ ఇన్నింగ్స్‌లో పఠాన్ బ్రదర్స్‌తో పాటు రిచర్డ్ లెవి మాత్రమే రెండంకెల స్కోర్ (22) చేశాడు. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సదరన్ స్టార్స్ బౌలర్లలో హమిద్, రజాక్, సుబోత్ భాటి, కేదార్ జాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సదరన్ స్టార్స్.. హమిల్టన్ మసకద్జ (67), పవన్ నేగి (40 నాటౌట్) సత్తా చాటడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. సదరన్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్ 4, శ్రీవట్స్ గోస్వామి 23, చిరాగ్ గాంధీ 7 పరుగులు చేశారు. కోణార్క్ సూర్యాస్ బౌలర్లలో దివేశ్ పథానియా, వినయ్ కుమార్, అప్పన్న తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పఠాన్ సోదరులు మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించినా కోణార్క్ సూర్యాస్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సదరన్ స్టార్స్ ఫైనల్‌కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం -
LLC 2024: క్రిస్ గేల్ ఊచకోత.. ధావన్ మెరుపులు (వీడియో)
విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి తమలో ఏమాత్రం జోరుతగ్గలేదని మరోసారి నిరూపించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)2024లో గేల్, ధావన్ మెరుపులు మెరిపించారు.ఈ లీగ్‌లో గుజరాత్ గ్రేట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు.. శుక్రవారం కోనార్క్ సూర్యాస్ ఓడిశా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోనార్క్ జట్టు కెప్టెన్ టాస్ గెలిచి తొలుత గుజరాత్ టీమ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించాడు.గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వ్యాన్ వాయక్(2)ను ఆదిలోనే పేసర్ వినయ్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గేల్..ధావన్‌తో కలిసి ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.గేల్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేయగా.. ధావన్ 24 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో ప్రసన్న(31) పరుగులతో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది.అనంతం 142 పరుగుల లక్ష్యంతో దిగిన కోనార్క్ కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోనార్క్ బ్యాటర్లలో మునివీరా(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓబ్రియన్(43) పరుగులతో రాణించాడు.Chris Gayle 🤝 Shikhar Dhawan. 🔥- Gabbar and universe Boss together in the LLC. 🤯 pic.twitter.com/N8r4pbtQ3f— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024 -
సూపర్ క్యాచ్.. వైరల్ వీడియో
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2024లో ఓ సూపర్ క్యాచ్ నమోదైంది. తోయమ్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ సూపర్ క్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు షాన్ మార్ష్ ఆడిన భారీ షాట్‌ను టైగర్స్ ఆటగాడు ఏంజెలో పెరీరా అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. గుణరత్నే బౌలింగ్‌లో పెరీరా ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.A great juggling catch by Angelo Perera in the LLC. 😄 pic.twitter.com/t5GyFNJ4hb— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మణిపాల్ టైగర్స్, తోయమ్ హైదరాబాద్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ 'టై'గా (ఇరు జట్ల స్కోర్లు సమం) ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్‌పై మణిపాల్ టైగర్స్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిసార పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టైగర్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఏంజెలో పెరీరా (18), పియెనార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో గురుకీరత్ సింగ్, బిపుల్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. ఉడాన, నువాన్ ప్రదీప్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి టైగర్స్ చేసినన్ని పరుగులే (144) చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. హైదరాబాద్‌ను గెలిపించేందుకు స్టువర్ట్ బిన్నీ (20 నాటౌట్), గురుకీరత్ సింగ్ మాన్ (37 నాటౌట్), షాన్ మార్ష్ (38) విఫలయత్నం చేశారు.సూపర్ ఓవర్ సాగిందిలా..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన తోయమ్ హైదరాబాద్ వికెట్ నష్టానికి కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ మూడు బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. బిపుల్ శర్మ బౌలింగ్‌లో డేనియల్ క్రిస్టియన్ సిక్సర్ బాది టైగర్స్‌ను గెలిపించాడు.చదవండి: డబుల్ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్ -
రసవత్తరంగా సాగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2024లో భాగంగా మణిపాల్ టైగర్స్, తోయమ్ హైదరాబాద్ మధ్య నిన్న (అక్టోబర్ 3) జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ 'టై'గా (ఇరు జట్ల స్కోర్లు సమం) ముగియడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తోయమ్ హైదరాబాద్‌పై మణిపాల్ టైగర్స్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిసార పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టైగర్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఏంజెలో పెరీరా (18), పియెనార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. వీరి మినహా టైగర్స్ ఇన్నింగ్స్ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా లేవు. తోయమ్ హైదరాబాద్ బౌలర్లలో గురుకీరత్ సింగ్, బిపుల్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. ఉడాన, నువాన్ ప్రదీప్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన తోయమ్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి టైగర్స్ చేసినన్ని పరుగులే (144) చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తోయమ్ హైదరాబాద్‌ను గెలిపించేందుకు స్టువర్ట్ బిన్నీ (20 నాటౌట్), గురుకీరత్ సింగ్ మాన్ (37 నాటౌట్), షాన్ మార్ష్ (38) విఫలయత్నం చేశారు.సూపర్ ఓవర్ సాగిందిలా..సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన తోయమ్ హైదరాబాద్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఐదు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ మూడు బంతుల్లోనే విజయతీరాలకు చేరింది. బిపుల్ శర్మ బౌలింగ్‌లో డేనియల్ క్రిస్టియన్ సిక్సర్ బాది టైగర్స్‌ను గెలిపించాడు. చదవండి: బోణీ బాగుండాలి -
మార్టిన్ గప్తిల్ మహోగ్రరూపం.. 11 బంతుల్లో 62 పరుగులు
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా కోణార్క్ సూర్యాస్ ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో సథరన్ సూపర్ స్టార్స్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ మహోగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్.. 54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సథరన్ సూపర్ స్టార్స్ కోణార్క్ సూర్యాస్ ఒడిశాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యాస్ ఒడిశా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రిచర్డ్ లెవి 21 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. యూసఫ్ పఠాన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ సూపర్ స్టార్స్ కేవలం 16 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్టిన్ గప్తిల్ ఒంటిచేత్తో సూపర్ స్టార్స్‌ను గెలిపించాడు. శ్రీవట్స్ గోస్వామి 18, మసకద్జ 20, పవన్ నేగి 14 పరుగులు చేశారు.VINTAGE MARTIN GUPTILL. 🔥6,6,6,4,6,6 - 34 runs in a single over in the LLC. 🤯 pic.twitter.com/0LG9g55Lry— Mufaddal Vohra (@mufaddal_vohra) October 2, 2024ఒకే ఓవర్లో 34 పరుగులునవిన్ స్టీవర్ట్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో మార్టిన్ గప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో గప్తిల్ ఐదు సిక్సర్లు, బౌండరీ సహా 34 పరుగులు పిండుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో నవిన్ స్టీవర్ట్ వేసిన మరో ఓవర్లోనూ గప్తిల్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో గప్తిల్ 29 పరుగులు (నాలుగు సిక్సర్లు, బౌండరీ) సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నవిన్ వేసిన రెండు ఓవర్లలో గప్తిల్ 11 బంతులు ఎదుర్కొని 62 పరుగులు రాబట్టాడు.నిన్న ఒకే ఓవర్లో 30 పరుగులునిన్న మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గప్తిల్ చెలరేగిపోయాడు. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్లో 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు. చదవండి: విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ -
శివాలెత్తిన గప్తిల్.. ఒకే ఓవర్లో..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సథరన్ సూపర్ స్టార్స్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్.. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు. గప్తిల్ శివాలెత్తిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ సూపర్ స్టార్స్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు) 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సథరన్ సూపర్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో గోస్వామి 18, మసకద్జ 1, చతురంగ డిసిల్వ 26, చిరాగ్ గాంధీ 36, పవన్ నేగి 8, జెసల్ కరియా 1, చిగుంబర 20 (నాటౌట్), సుబోత్ భాటి 1 (నాటౌట్) పరుగు చేశారు. మణిపాల్ టైగర్స్ బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనురీత్ సింగ్, పియెనార్, రాహుల్ శుక్లా, ఏంజెలో పెరీరా తలో వికెట్ దక్కించుకున్నారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. హమీద్ హసన్ (3/20), అబ్దుర్ రజాక్ (2/30), మోను కుమార్ (2/44), జెసల్ కరియా (2/29), పవన్ నేగి (1/0) ధాటికి 13.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో ఉతప్ప 17, అసేల గుణరత్నే 22, తిసార పెరీరా 37, అనురీత్ సింగ్ 10, హర్భజన్ సింగ్ 11, ఏంజెలో పెరీరా 5 పరుగులు చేయగా.. సౌరభ్ తివారి, అమిత్ వర్మ, పియెనార్ డకౌట్లు అయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సథరన్ సూపర్ స్టార్స్ ప్రస్తుత ఎల్ఎల్సీ ఎడిషన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది.టైగర్స్ ఇంకా బోణి కొట్టాల్సి ఉంది. చదవండి: భారత్‌కు బిగ్ షాక్.. ఆసీస్ సిరీస్‌కూ స్టార్ ప్లేయర్ దూరం! -
LLC 2024: బెన్ డంక్ మెరుపు హాఫ్ సెంచరీ
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బెన్ డంక్ మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. సథరన్ సూపర్ స్టార్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 25) జరుగుతున్న మ్యాచ్‌లో డంక్ 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. డంక్కు ఆష్లే నర్స్ (24 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు). డ్వేన్ స్మిత్ (33 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫయాజ్ ఫజల్ 9, నమన్ ఓజా 16 పరుగులు చేసి ఔట్ కాగా.. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో జేసల్ కరియ రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్దుర్ రజాక్, పవన్ నేగి తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ స్టార్స్ రెండు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. మార్టిన్ గప్తిల్ 14, శ్రీవట్స్ గోస్వామి 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.చదవండి: కోహ్లిలో ఊపు తగ్గింది.. సచిన్ రికార్డులు బద్దలు కొట్టలేడు: ఆసీస్ మాజీ -
రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా సథరన్ సూపర్ స్టార్స్‌తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ధవన్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్‌పై పైచేయి సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ మెరుపు అర్ద సెంచరీతో (28 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్టిన్ గప్తిల్ 22, హమిల్టన్ మసకద్జ 20, దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ (1), పార్థివ్ పటేల్ (4),పవన్ నేగి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ గ్రేట్స్ బౌలర్లలో మనన్ శర్మ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ప్లంకెట్, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ గ్రేట్స్.. శిఖర్ ధవన్ మినహా ఎవరూ రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధవన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ ఈ మ్యాచ్‌లో 15 పరుగులకే ఔటయ్యాడు. లెండిల్ సిమన్స్ 7, మొహమ్మద్ కైఫ్ 5, అస్గర్ అఫ్ఘాన్ 3, మనన్ శర్మ 10 పరుగులు చేశారు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో పవన్ నేగి 3, అబ్దుర్ రజాక్ 2, చతురంగ డిసిల్వ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా -
వాన్ విక్ మెరుపు సెంచరీ.. రైనా టీమ్‌పై ధవన్ జట్టు ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. తొయమ్ హైదరాబాద్‌తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వాన్ విక్ మెరుపు శతకం సాధించాడు. వాన్ విక్ 69 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్న తొయమ్ హైదరాబాద్‌పై శిఖర్ ధవన్ జట్టు గుజరాత్ గ్రేట్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసిన సురేశ్ రైనా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పీటర్ ట్రెగో 36 (నాటౌట్), గుర్కీరత్ సింగ్ 26, వాల్టన్ 17, క్లార్క్ 15, వర్కర్ 13 పరుగులు చేశారు. షాన్ మార్ష్ (1), స్టువర్ట్ బిన్ని (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్లంకెట్, మనన్ శర్మ, ప్రసన్న తలో రెండు వికెట్లు తీయగా.. గాబ్రియెల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. వాన్ విక్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వాన్ విక్ ఒంటిరి పోరాటం చేయగా.. శిఖర్ ధవన్ (21), లెండిల్ సిమన్స్ (20), యశ్పాల్ శర్మ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇసురు ఉడాన, గుర్కీరత్ మాన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
ముగిసిన లెజెండ్స్ లీగ్ వేలం.. భారీ ధర అతడికే
లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)-2024 సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ క్రికెట్ టోర్నీ.. ఇప్పుడు మూడో సీజన్‌కు సిద్దమవుతోంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గోనునున్నాయి. తొలి సీజన్(2022)లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా.. రెండువ సీజన్లో మణిపాల్ టైగార్స్ ఛాంపియన్‌గా అవతరించింది.ఇక ఇది ఇలా ఉండగా.. ఎల్ఎల్సీ మూడో సీజన్‌కు సంబంధించిన వేలం ముంబై వేదికగా గురువారం(ఆగస్టు 29)న జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఎల్ఎల్సీ సీజన్లో భాగం కావడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. వేలానికి ముందే శిఖర్ ధావన్‌ను గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకోగా.. కార్తీక్‌తో సదరన్ సూపర్ స్టార్స్ ఒప్పందం కుదర్చుకుంది.అయితే ధావన్, కార్తీక్‌ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఎంత మొత్తం వెచ్చించియో వెల్లడించలేదు. వీరిద్దరూ మినహా మిగితా క్రికెటర్లందరూ వేలంలో పాల్గోనున్నారు. మొత్తం ఈ వేలంలో దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గోనగా.. 97 మంది మాత్రమే అమ్ముడు పోయారు. ఈ 97 మంది క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఆరు ఫ్రాంచైజీలు మొత్తం రూ. 39.63 కోట్లు వెచ్చించాయి. ఈ వేలంలో శ్రీలంకకు చెందిన ఇసురు ఉదానా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. అర్బనైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది.ఉదానా తర్వాత భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ నిలిచాడు. అతడిని కూడా అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా బ్రెట్‌లీ, దిల్షాన్, షాన్ మార్ష్, ఫించ్, ఆమ్లా వంటి దిగ్గజ క్రికెటర్లు అమ్ముడుపోలేదు.వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..మణిపాల్ టైగర్స్హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, తిసర పెరీరా, షెల్డన్ కాట్రెల్, డాన్ క్రిస్టియన్, ఏంజెలో పెరీరా, మనోజ్ తివారీ, అసేలా గుణరత్నే, సోలమన్ మిరే, అనురీత్ సింగ్, అబు నెచిమ్, అమిత్ వర్మ, ఇమ్రాన్ ఖాన్, రాహుల్ శుక్లా, అమిటోజ్ సింగ్, ప్రవీణ్ గుప్తా, సౌరభ్ గుప్తా .ఇండియా క్యాపిటల్స్ యాష్లే నర్స్, బెన్ డంక్, డ్వేన్ స్మిత్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, నమన్ ఓజా, ధవల్ కులకర్ణి, క్రిస్ మ్ఫోఫు, ఫైజ్ ఫజల్, ఇక్బాల్ అబ్దుల్లా, కిర్క్ ఎడ్వర్డ్స్, రాహుల్ శర్మ, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వరరావు, భరత్ చిప్లి, పర్వీందర్ అవానా, పవన్ సుయాల్, మురళీ సుయాల్ విజయ్, ఇయాన్ బెల్.గుజరాత్ జెయింట్స్క్రిస్ గేల్, లియామ్ ప్లంకెట్, మోర్నే వాన్ వైక్, లెండిల్ సిమన్స్, అసోహర్ అఫోహాన్, జెరోమ్ టేలర్, పరాస్ ఖాడా, సీక్కుగే ప్రసన్న, కమౌ లెవర్రాక్, సైబ్రాండ్ ఎనోయెల్బ్రెచ్ట్, షానన్ గాబ్రియేల్, సమర్ క్వాద్రీ, మహమ్మద్ కైఫ్, శ్రీసన్హవాన్, శ్రీసన్హవాన్.కోణార్క్ సూర్యస్ ఒడిశాఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, కెవిన్ ఓ బ్రియాన్, రాస్ టేలర్, వినయ్ కుమార్, రిచర్డ్ లెవీ, దిల్షన్ మునవీర, షాబాజ్ నదీమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, బెన్ లాఫ్లిన్, రాజేష్ బిష్ణోయ్, ప్రవీణ్ తాంబే, దివేష్ పఠానియా, కేపీ అప్పన్న, అంబటి రాయుడు, అంబటి రాయుడు.సదరన్ సూపర్ స్టార్స్దినేష్ కార్తీక్, ఎల్టన్ చిగుంబుర, హామిల్టన్ మసకద్జా, పవన్ నేగి, జీవన్ మెండిస్, సురంగ లక్మల్, శ్రీవత్స్ గోస్వామి, హమీద్ హసన్, నాథన్ కౌల్టర్ నైల్, చిరాగ్ గాంధీ, సుబోత్ భాటి, రాబిన్ బిస్ట్, జెసల్ కరీ, చతురంగ డి సిల్వా, మోను కుమార్అర్బన్రైజర్స్ హైదరాబాద్సురేష్ రైనా (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, టినో బెస్ట్, స్టువర్ట్ బిన్నీ, క్రిస్టోఫర్ ఎంఫోఫు, అస్గర్ ఆఫ్ఘన్, చమర కపుగెదెరా, పీటర్ ట్రెగో, రిక్కీ క్లార్క్, పవన్ సుయాల్, ప్రజ్ఞాన్ ఓజా, శివ కాంత్ శుక్లా, సుదీప్ త్యాగి, తిరుమలశెట్టి సుమన్, యోగేష్ నగర్, షాదాబ్ జకాతి, జెరోమ్ టేలర్, గురుకీరత్ మాన్, అమిత్ పౌనికర్, దేవేంద్ర బిషూ. -
టీమిండియా స్టార్ రీ ఎంట్రీ.. ఆ జట్టులో చేరిక
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తాను భాగం కానున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత కూడా ఆటగాడిగా కొనసాగే అవకాశం టీ20 లీగ్‌ల ద్వారా దక్కిందని.. మరోసారి మైదానంలో దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే వెల్లడించాడు.ఇటీవలే రిటైర్మెంట్కాగా ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ చెన్నై క్రికెటర్.. సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డీకే ఈ ఏడాది జూన్ 1న ప్రకటన విడుదల చేశాడు. అనంతరం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో జట్టు కట్టిన దినేశ్ కార్తిక్.. ఈ లీగ్‌లో ఆడనున్న భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.ఆ జట్టులో చేరిన డీకేఇక తాజాగా లెజెండ్స్ లీగ్‌లోనూ పాల్గొనన్నుట్లు తెలిపాడు. ఈ టీ20 లీగ్‌లో సదరన్ సూపర్‌స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు మంగళవారం వెల్లడించాడు. అభిమానుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నానని.. తనలో ఆడగల సత్తా ఉన్నంత కాలం క్రికెటర్‌గా కొనసాగుతానని డీకే పేర్కొన్నాడు. మైదానంలో దిగేందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.కాగా 2004 నుంచి 2022 వరకు టీమిండియాకు ఆడిన దినేశ్ కార్తిక్.. 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లలో భాగమయ్యాడు. టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20లలో 686 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 4842 రన్స్ స్కోరు చేశాడు.ఇక శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తాను లెజెండ్స్ లీగ్‌లో పాల్గొననున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గబ్బర్ సోమవారం ప్రకటించాడు.తాజాగా డీకే సైతం ఇదే బాటలో నడవడం విశేషం. ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, క్రిస్ గేల్,ఆరోన్ ఫించ్ తదితర మాజీ క్రికెటర్లు ఇప్పటికే భాగమయ్యారు. కాగా సెప్టెంబరు 29న లెజెండ్స్ లీగ్ వేలం జరుగనుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
అభిమానులకు శుభవార్త!.. శిఖర్ ధావన్ రీఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. తాను ఇంకా ఫిట్‌గానే ఉన్నానని.. ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)లో భాగం కానున్నట్లు ధావన్ వెల్లడించాడు.వినోదం పంచేందుకు సిద్ధంరిటైర్మెంట్ తర్వాత కూడా తాను ఆటగాడిగా ముందుకు సాగేందుకు దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నాడు. క్రికెట్ తన జీవితంలో భాగమని.. త్వరలోనే తన స్నేహితులతో కలిసి మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నట్లు తెలిపాడు. తన అభిమానులకు వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నానని.. వారితో కలిసి కొత్త జ్ఞాపకాలు పోగు చేసుకునేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు గబ్బర్ తెలిపాడు.రిటైర్మెంట్ అనంతరంఇందుకు సంబంధించి శిఖర్ ధావన్ పేరిట ఎల్ఎల్సీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తాను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. పద్నాలుగేళ్లకు పైగా టీమిండియా క్రికెటర్‌గా కొనసాగిన ఈ మాజీ ఓపెనర్‌కు గత రెండేళ్లుగా అవకాశాలు కరువయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ జట్టులో పాతుకుపోగా.. గబ్బర్‌కు నిరాశే ఎదురైంది.ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ధావన్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, క్రికెటర్‌గా మాత్రం తాను కొనసాగుతానని.. అందుకు లెజెండ్స్ లీగ్ రూపంలో కొత్త అవకాశం వచ్చిందని తాజాగా వెల్లడించాడు. కాగా 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2022లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. మొత్తంగా టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు ధావన్.లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆరు జట్లుటీ20 ఫార్మాట్లో నిర్వహిస్తోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భిల్వారా కింగ్స్, గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్‌స్టార్స్, అర్బనైజర్స్ హైదరాబాద్ పేరిట ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్ సహా విదేశీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, ఉపుల్ తరంగ, డ్వేన్ స్మిత్, మార్టిన్ గప్టిల్ తదితరులు భాగమవుతున్నారు. తాజాగా శిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే, అతడు ఏ జట్టుకు ఆడనున్నది తెలియాల్సి ఉంది. సెప్టెంబరులో ఈ లీగ్ ఆరంభం కానుంది. -
యువరాజ్ ఫెయిల్..బెంగాల్ ఎంపీ తుపాన్ ఇన్నింగ్స్! వీడియో వైరల్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. సోమవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యూసఫ్ పఠాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 48 బంతులు ఎదుర్కొన్న యూసఫ్ పఠాన్ 78 పరుగులు చేశాడు.కానీ ఆఖరిలో ఔట్ కావడంతో జట్టును గెలిపించలేకపోయాడు. యూసఫ్‌తో పాటు అంబటి రాయడు(26) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్(19) మరోసారి ఫెయిల్ అయ్యాడు.ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడిల్, కౌల్టర్‌నైల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. లాగ్లిన్, క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో క్రిస్టియన్(69) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాన్ మార్ష్(41) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో కులకర్ణి రెండు, ఆర్పీ సింగ్, అనురీత్, హార్భజన్ సింగ్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జూలై 10న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. -
WCL 2024: భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు సర్వం సిద్దం.. సీట్లన్నీ ఫుల్
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్ధిలు సిద్దమయ్యారు.అయితే ఈసారి ఇరు దేశాల మాజీ క్రికెటర్ల వంతు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా జూలై 6 (శనివారం) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న ఇరు జట్లు ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి.సీట్లు ఫుల్..ఇక దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన మొత్తం టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయి. మొత్తం 23000 సీట్లు అమ్ముడు పోయినట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన ఏ మ్యాచ్ టిక్కట్లకు అంత డిమాండ్ లేదు. కానీ భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లు మాత్రం హాట్‌కేకుల్లా సేల్ అయిపోయాయి.చాలా సంతోషంగా ఉంది: యూనిస్ ఖాన్ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. "ఈ టోర్నీలో భారత్‌తో తలపడేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము.అంతేకాకుండా మళ్లీ ఛానళ్ల తర్వాత భారత్‌తో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం మేము అన్ని విధాలగా సిద్దమయ్యాము. ఎందుకంటే ఇది ఒక గేమ్ మాత్రమే కాదు.. మా దేశానికి సంబంధించిన గౌరవమని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు. -
నేటి నుంచి (జులై 3) మరో క్రికెట్ పండుగ.. జులై 6న భారత్-పాక్ మ్యాచ్
టీ20 వరల్డ్‌కప్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో క్రికెట్ పండుగ మొదలైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 3) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు (ఇండియా ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటున్నాయి. లెజెండ్స్ క్రికెట్‌కు సంబంధించి ఈ టోర్నీని వరల్డ్‌కప్‌గా పరిగణించవచ్చు. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, హెర్షల్ గిబ్స్, షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్, బ్రెట్ లీ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. సింగిల్ రౌండ్ ఫార్మాట్లో జరిగే (ప్రతి జట్టు మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది) ఈ టోర్నీ జులై 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సింగిల్ రౌండ్ తర్వాత టాప్-4లో ఉండే జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జులై 6న జరుగనుంది.జట్ల వివరాలు..భారత్ ఛాంపియన్స్: యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, పవన్ నేగిఆస్ట్రేలియా ఛాంపియన్స్: బ్రెట్ లీ, టిమ్ పైన్, షాన్ మార్ష్, బెన్ కట్టింగ్, బెన్ డంక్, డిర్క్ నాన్స్, డాన్ క్రిస్టియన్, బెన్ లాఫ్లిన్, ఆరోన్ ఫించ్, బ్రాడ్ హాడిన్, కల్లమ్ ఫెర్గూసన్, పీటర్ సిడిల్, జేవియర్ డోహెర్టీ, నాథన్ కౌల్టర్ నైల్, జాన్ హేస్టింగ్స్ఇంగ్లండ్ ఛాంపియన్స్: కెవిన్ పీటర్సన్, రవి బొపారా, ఇయాన్ బెల్, సమిత్ పటేల్, ఒవైస్ షా, ఫిలిప్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, సాజిద్ మహమూద్, అజ్మల్ షాజాద్, ఉస్మాన్ అఫ్జల్, ర్యాన్ సైడ్‌బాటమ్, స్టీఫెన్ ప్యారీ, స్టువర్ట్ మీకర్, కెవిన్ ఓ'బ్రియన్వెస్టిండీస్ ఛాంపియన్స్: డారెన్ సామీ, క్రిస్ గేల్, శామ్యూల్ బద్రీ, రవి రాంపాల్, కేస్రిక్ విలియమ్స్, జాసన్ మహమ్మద్, నవిన్ స్టీవర్ట్, డ్వేన్ స్మిత్, యాష్లే నర్స్, సులీమాన్ బెన్, చాడ్విక్ వాల్టన్, జెరోమ్ టేలర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్, కిర్క్ ఎడ్వర్డ్స్, జోనాథన్ కార్టర్దక్షిణాఫ్రికా ఛాంపియన్స్: జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, ఇమ్రాన్ తాహిర్, మఖాయా ంటిని, డేల్ స్టెయిన్, అష్వెల్ ప్రిన్స్, నీల్ మెక్కెంజీ, ర్యాన్ మెక్లారెన్, జస్టిన్ ఒంటాంగ్, రోరీ క్లీన్‌వెల్ట్, జెపి డుమిని, రిచర్డ్ లెవి, డేన్ విలాస్, వెర్నాన్ ఫిలాండర్,పాకిస్తాన్ ఛాంపియన్స్: యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, అబ్దుల్ రజాక్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సోహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, తన్వీర్ అహ్మద్, ముహమ్మద్ హఫీజ్, అమీర్ యామిన్, షోయబ్ మాలిక్, సోహైబ్ మక్సూద్, ఉమర్జెల్ ఖాన్ అక్మల్,షెడ్యూల్..బుధవారం, జూలై 03ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్గురువారం, జూలై 04సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్శుక్రవారం, జూలై 05ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇండియా వర్సెస్ వెస్టిండీస్శనివారం, జూలై 06ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియాఇండియా వర్సెస్ పాకిస్థాన్ఆదివారం, జూలై 07సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్సోమవారం, జూలై 08ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియామంగళవారం, జూలై 09వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్బుధవారం, జూలై 10వెస్టిండీస్ వర్సెస్ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాబుధవారం, జూలై 12మొదటి సెమీ ఫైనల్- TBA vs TBAరెండవ సెమీ ఫైనల్- TBA vs TBAశనివారం, జూలై 13ఫైనల్ మ్యాచ్ - TBA vs TBA -
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కింద ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యోని పటేల్, పీ ఆకాష్ అనే ఇద్దరు ఇద్దరు ఇండియన్స్ లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో అనాధికర మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించినట్లు శ్రీలంక పోలీసులు గుర్తించారు. మార్చి 8న, మార్చి 19న కెండీలోని పల్లెకెలే స్టేడియంలో జరిగిన మ్యాచులను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు భారతీయులు బెయిల్ మీద బయటికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకూ దేశం వదిలి వెళ్లకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది.ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీ ఫైనల్లో రాజస్తాన్ కింగ్స్, న్యూయార్క్ సూపర్ స్ట్రైయికర్స్ జట్లు తలపడ్డాయి. రాజస్తాన్ కింగ్స్ జట్టు ఛాంపియన్స్‌గా నిలిచింది. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిలో ఒకడైన పటేల్, లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఆడిన క్యాండీ కాంప్ ఆర్మీ టీమ్‌కి యజమాని కావడం గమనార్హం. కాగా ఈ ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా న్యూజిలండ్ మాజీ క్రికెటర్ నీల్ బ్రూమ్, శ్రీలంక ఛీప్ సెలక్టర్ ఉపుల్ తరంగ.. క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ స్పెషల్ ఇగ్వెస్టిగేషన్ యూనిట్‌కి ఫిర్యాదు చేశారు. -
శ్రీలంక ఆటగాడి ఉగ్రరూపం.. సురేశ్ రైనా పోరాటం వృధా
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇవాళ (మార్చి 11) ఢిల్లీ డెవిల్స్, న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రయికర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ యువరాజ్ సింగ్ సారధ్యం వహించిన న్యూయార్క్ జట్టు.. సురేశ్ రైనా నాయకత్వంలోని ఢిల్లీ డెవిల్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది. తిరిమన్నే విశ్వరూపం.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. లంక ఆటగాడు లహీరు తిరిమన్నే (39 బంతుల్లో 90; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో తిరిమన్నే మినహా ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో అనురీత్ సింగ్, మల్హోత్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అబ్దుల్లా, అమితోజ్సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సురేశ్ రైనా పోరాటం వృధా.. 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురేశ్ రైనా (35 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరివరకు అజేయంగా నిలిచాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటి రాయుడు (19) నిరాశపరిచాడు. న్యూయార్క్ బౌలర్లలో ఉదాన 3 వికెట్లు పడగొట్టగా.. రాహుల్ శర్మ, గ్రాండ్‌హోమ్ తలో వికెట్ పడగొట్టారు. -
గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు
లెజెండ్స్ లీగ్‌లో టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్- శ్రీశాంత్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వీరిదద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం గంభీర్‌ను ఉద్దేశించి శ్రీశాంత్ చేసిన ఓ పోస్ట్.. ఈ గొడవకు మరింత అజ్యం పోసింది. గంభీర్ తనను పదే పదే ఫిక్సర్ అన్నాడని, అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీశాంత్ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అయితే.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిషనర్ శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీశాంత్ టోర్నమెంట్ కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని కమిషనర్ నోటీస్‌లో పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో శ్రీశాంత్ పోస్ట్ చేసిన వీడియోలు తొలగించిన తర్వాతనే అతనితో చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ వివాదంపై అంపైర్లు ఇచ్చిన నివేదికలో శ్రీశాంత్‌ను శ్రీశాంత్‌ను గంభీర్ ఫిక్సర్ అన్నాడని ఎక్కడా పేర్కొనలేదు. కాగా వీరిద్దరూ భారత తరుపన కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. చదవండి: IPL 2024: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!? -
చిత్తైన గంభీర్ జట్టు.. ఫైనల్లో హర్భజన్ టీమ్
లెజెండ్స్ లీగ్ 2023 ఎడిషన్ తుది అంకానికి చేరింది. ఫైనల్లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. క్వాలిఫయర్-1లో విజయం సాధించడం ద్వారా అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరింది. నిన్న (డిసెంబర్ 7) జరిగిన క్వాలిఫయర్-2లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా టైగర్స్‌ను ఓడించడం ద్వారా హర్భజన్ సింగ్ సారథ్యంలోని మణిపాల్ టైగర్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్.. కెవిన్ పీటర్సన్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మెక్‌క్లెనెగన్, తిసార పెరీరా తలో 3 వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించారు. అనంతరం బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అసేల గుణరత్నే (39 నాటౌట్), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (38 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టైగర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో చాడ్విక్ వాల్టన్ (33), ఏంజెలో పెరీరా (35) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన, దిల్హర ఫెర్నాండో, ఈశ్వర్ పాండే తలో వికెట్ పడగొట్టారు. టోర్నీ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 9న జరుగనుంది. టైటిల్ కోసం అర్బన్ రైజర్స్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ తలపడతాయి. -
గంభీర్ నన్ను ఫిక్సర్ అన్నాడు.. దూషించాడు: శ్రీశాంత్ ఆరోపణ
గౌతమ్ గంభీర్...ఎస్.శ్రీశాంత్...భారత జట్టు తరఫున కలిసి 49 మ్యాచ్‌లు ఆడారు. 2007 టి20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములు. రిటైర్మెంట్ తర్వాత ‘సీనియర్లు’గా లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో ఆడుతున్నారు. కానీ ఆవేశకావేశాలకు మారుపేరైన వీరిద్దరు ఇలాంటి వెటరన్ టోర్నీలో కూడా గొడవ పడ్డారు. గంభీర్ తనను పదే పదే ‘ఫిక్సర్’ అంటూ దూషించాడని శ్రీశాంత్ ఆరోపించాడు. బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ తర్వాత ఒక వీడియో విడుదల చేసిన శ్రీశాంత్ ‘నా తప్పు ఏమీ లేకపోయినా గంభీర్ నన్ను అనరాని మాటలు అన్నాడు. అది సరైంది కాదు’ అని అన్నాడు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే మరో వీడియోలో దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు. S Sreesanth on Gautam Gambhir: "He kept calling me a fixer".pic.twitter.com/qPtSdEXTjp — Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023 ‘ఫిక్సర్, ఫిక్సర్, నువ్వు ఫిక్సర్‌వి అంటూ పదే పదే గంభీర్ అన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా అతను మాత్రం అలాంటి దూషణలు కొనసాగించాడు. నేను ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. అసలు అతనికి ఎందుకు కోపం వచి్చందో, ఎందుకు అలా అన్నాడో నాకు అస్సలు అర్థం కాలేదు’ అని వివరించాడు. ఈ ఘటనపై గంభీర్ వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు కానీ తాను చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ట్విట్టర్లో పెట్టాడు. Smile when the world is all about attention! pic.twitter.com/GCvbl7dpnX — Gautam Gambhir (@GautamGambhir) December 7, 2023 ఎల్ఎల్సీలో తగిన నిబంధనలు, ప్రమాణాలు పాటిస్తున్నామని, ఘటనపై విచారణ చేస్తామని మాత్రం టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఆ తర్వాత దీనిని కొనసాగించిన శ్రీశాంత్... ‘నువ్వు అందరితో ఇలాగే ఉంటావు, సీనియర్లను కూడా గౌరవించవు. నన్ను అలా అనే హక్కు నీకు లేదు. అయినా నువ్వు సుప్రీం కోర్టుకంటే ఎక్కువా’ అని ప్రశ్నించాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా... సుప్రీం కోర్టు ఆదేశాలతో దానిని ఏడేళ్లకు తగ్గించడంతో 2020లో అతని నిషేధం ముగిసింది. -
బాహాబాహీకి దిగిన గంభీర్-శ్రీశాంత్
లెజెండ్స్ లీగ్ 2023లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ (ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్), శ్రీశాంత్ (గుజరాత్ జెయింట్స్) గొడవపడ్డారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ సందర్భంగా ఈ ఇద్దరు బాహాబాహీకి దిగినంత పని చేశారు. శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన అనంతరం గొడవ మొదలైంది. వరుస బంతుల్లో 10 పరుగులు రావడంతో సహనం కోల్పోయిన శ్రీశాంత్.. ఆమరుసటి బంతిని డాట్ బాల్‌గా మలిచి గంభీర్‌ను కవ్వించాడు. అసలే ముక్కోపి అయిన గంభీర్.. శ్రీశాంత్ కవ్వింపుకు నోటితో సమాధానం చెప్పాడు. మ్యాచ్ మధ్యలో కొద్ది సేపు ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సహచర ఆటగాళ్లు ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంపైర్లు ఈ ఇద్దరూ బాహాబాహీకి దిగకుండా వారించారు. ఓ దశలో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది. గంభీర్-శ్రీశాంత్ కొట్టుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. గొడవ సద్దుమణిగిన అనంతరం మ్యాచ్ సాఫీగా సాగింది. గొడవ తర్వాత గంభీర్ మరింత చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను 30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Heated conversation between Gautam Gambhir and S Sreesanth in the LLC. pic.twitter.com/Cjl99SWAWK — Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023 ఈ మ్యాచ్‌లో గంభీర్‌తో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 3 ఓవర్లు వేసిన శ్రీశాంత్ వికెట్ పడగొట్టి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్..క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో లక్ష్యానికి దగ్గర వరకు వెళ్లి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కాగా, గంభీర్, శ్రీశాంత్‌లకు గొడవలేమీ కొత్త కాదు. ఈ ఇద్దరూ మైదానంలో చాలా సందర్భాల్లో వేర్వేరు ఆటగాళ్లతో బాహాబాహీకి దిగారు. గంభీర్.. విరాట్ కోహ్లి, షాహిద్ అఫ్రిది లాంటి వారితో గొడవపడగా. శ్రీశాంత్ సహచరుడు హర్భజన్ సింగ్ చేతిలో చెంపదెబ్బ తిని వార్తల్లో నిలిచాడు. గంభీర్ ఇటీవలి ఐపీఎల్ సీజన్ సందర్భంగానూ విరాట్ కోహ్లితో గొడవపడ్డాడు. -
గర్జించిన గంభీర్.. క్రిస్ గేల్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై ఇండియా క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో పోరాడినప్పటికీ గుజరాత్‌ను గెలిపించలేకపోయారు. క్యాపిటల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి గుజరాత్ 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గర్జించిన గంభీర్.. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కిర్క్ ఎడ్వర్డ్స్ (26), కెవిన్ పీటర్సన్ (26), రికార్డో పావెల్ (28), బెన్ డంక్ (30), చిప్లి (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఎమ్రిట్, రజత్ భాటియా చెరో 2 వికెట్లు.. శ్రీశాంత్, లడ్డా, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు. Gambhir 🤝 Knock-out game. Captain Gambhir lead by example in LLC.....!!!!!pic.twitter.com/ZN6edPYZtb— Johns. (@CricCrazyJohns) December 6, 2023 గేల్ పోరాటం వృధా.. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. క్రిస్ గేల్, కెవిన్ ఓబ్రెయిన్ పోరాడినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. గేల్, ఓబ్రెయిన్ క్రీజ్‌లో ఉండగా.. గుజరాత్ గెలుపు సునాయాసమేనని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్లకు ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాక్ కల్లిస్ (11), రిచర్డ్ లెవి (11), అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (13) విఫలమయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో రస్టీ థీరన్, ఈశ్వర్ పాండే చెరో 2 వికెట్లు.. ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన తలో వికెట్ దక్కించుకున్నారు. -
మిచౌంగ్ ఎఫెక్ట్: విశాఖలో లెజెండ్స్ మ్యాచ్ రద్దు.. ఇక్కడ గెలిచిన జట్లు ఇవే
Urbanrisers Hyderabad vs Manipal Tigers: మిచౌంగ్ తుపాను ప్రభావం లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌పై పడింది. విశాఖపట్నంలో సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. కాగా లెజెండ్స్ టీ20 లీగ్ తాజా సీజన్లో భాగంగా విశాఖలో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. డిసెంబరు 2న ఇండియా క్యాపిటల్స్- మణిపాల్ టైగర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో గౌతం గంభీర్ ఇండియా క్యాపిటల్స్ సేన.. హర్భజన్ సింగ్ సారథ్యంలోని మణిపాల్ చేతిలో ఓడిపోయింది. ఇక డిసెంబరు 3 నాటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్- సదరన్ సూపర్ స్టార్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో నగరంలో ఆఖరిదైన మ్యాచ్ అర్బన్ రైజర్స్ హైదరాబాద్- మణిపాల్ టైగర్స్ మధ్య సోమవారం సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే, తుపాను మిచౌంగ్ కారణంగా వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక ఈ టోర్నమెంట్లో భాగంగా తదుపరి మ్యాచ్‌లు ఆడేందుకు క్వాలిఫై అయిన గుజరాత్ జెయింట్స్, మణిపాల్ టైగర్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్ జట్లు సూరత్‌కు బయలుదేరి వెళ్లనున్నాయి. చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
LLC 2023: బోల్తా పడిన సూపర్‌స్టార్స్
విశాఖ స్పోర్ట్స్: కచ్చితంగా విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్ బోల్తాపడింది. పీఎంపాలెంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ–20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టీ–20 లీగ్‌లో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. నాకౌట్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. జెయింట్స్కెప్టెన్ కెవిన్ టాస్ గెలిచి లక్ష్య ఛేదనకే మొగ్గుచూపడంతో సూపర్ స్టార్స్ రాస్ టేలర్ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తరంగ, జెస్సీ ఓపెనర్స్‌గా రాగా.. శ్రీశాంత్ ఇన్నింగ్స్ తొలి బంతిని విసిరాడు. జట్టు స్కోర్ 18 పరుగుల వద్ద ఈశ్వర్ చౌదరి ఓవర్లో జెస్సీ వికెట్ల వెనుక రావల్‌కు దొరికిపోయి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు తరంగ– శ్రీవత్స్ 55 పరుగులు జోడించడంతో పాటు బౌండరీల మోత మోగించారు. చివరికి సదరన్ సూపర్ స్టార్స్ జట్టు ఎనిమిది వికెట్లకు 159 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. ప్రతిగా బ్యాటింగ్ ప్రారంభించిన జెయింట్స్ ఓపెనర్ ధ్రువ్ రావల్ డకౌట్‌గా తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో మరో ఓపెనర్ కెవిన్(29) వెనుదిరగ్గా అతని స్థానంలో వచ్చిన రిజర్డ్ కేవలం ఒక పరుగే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ స్థితిలో వచ్చిన అభిషేక్(81) 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో అభిమానులను అలరించాడు. అతనికి చిరాగ్(21)తోడయ్యాడు. చివర్లో చిగుంబురా(21) 10 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది మరో ఎనిమిది బంతులుండగానే జట్టును విజయతీరానికి చేర్చాడు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో అభిమానులు హాజరై మ్యాచ్‌ను వీక్షించారు. నేడు మణిపాల్ టైగర్స్‌తో అర్బన్ రైజర్స్ ఢీ లీగ్‌లో చివరి మ్యాచ్ సోమవారం మణిపాల్ టైగర్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు మూడేసి మ్యాచ్‌ల్లో విజయంతో, ఓ పరాజయంతో ఆరేసి పాయింట్లు సాధించాయి. జెయింట్స్ ఏడు పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్‌కు వర్షం పడే సూచనలున్నాయి. ఒకవేళ వర్షం పడకుండా పూర్తి మ్యాచ్ జరిగితే జెయింట్స్ ఆధిక్యాన్ని కోల్పోనుంది. కాగా.. ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించిన క్యాపిటల్స్, సూపర్‌స్టార్స్, కింగ్స్ జట్లు మూడేసి పాయింట్లతో లీగ్‌ను ముగించాయి. కాస్త మెరుగైన రన్‌రేట్‌తో క్యాపిటల్స్ జట్టు నాకవుట్‌కు చేరుకుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ–20 నాకవుట్ మ్యాచ్‌లు సూరత్‌లో జరగనున్నాయి. -
నేటినుంచి విశాఖలో లెజెండ్స్ క్రికెట్
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియంలో ముగిసే లీగ్‌దశ చివరి ఫేజ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎల్ఎల్సీ నాకవుట్‌కు చేరుకుంటాయని ఏసీఏ అపెక్స్ కౌ న్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి తెలి పారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో చివరి దశ పోటీల్లో భాగంగా శనివారం తలపడనున్న జట్ల ఆటగాళ్లు శుక్రవారం విశాఖ చేరుకున్నారని చెప్పారు. నాకవుట్ పోటీలు సూరత్‌లో జరుగనున్నాయన్నారు. ఇండియా కాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్‌తో పాటు సదరన్ సూపర్‌స్టార్స్ జట్ల సభ్యులు విశాఖ చేరుకోగా ఎయిర్‌పోర్టులో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఘనంగా స్వాగతం పలికిందని తెలిపారు. అర్బన్‌రైజర్స్ జట్టు శనివారం విశాఖ చేరుకోనుందని చెప్పారు. విశాఖలో మ్యాచ్‌లు.. శనివారం రాత్రి ఏడుగంటలకు ఇండియా కాపిటల్స్ జట్టుతో మణిపాల్ టైగర్స్ తలపడనుండగా, ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు గుజరాత్ జెయింట్స్‌తో సదరన్ సూపర్‌స్టార్స్ జట్టు తలపడనుంది. 4వ తేదీ రాత్రి ఏడుగంటలకు లీగ్ దశలో చివరి మ్యాచ్ రాత్రి ఏడుగంటలకు మణిపాల్ టైగర్స్‌తో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. -
Vizag: ఐపీఎల్ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా! ఇప్పుడు లెజెండ్స్ లీగ్‌లో..
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్ అభివృద్ధి కోసం అన్ని జిల్లాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణను సైతం దిగ్విజయంగా పూర్తి చేస్తున్న తాము.. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) ఆతిథ్యంలోనూ భాగం కానున్నామని హర్షం వ్యక్తం చేశారు. దాదాపు వంద మంది క్రికెటర్లు నగరానికి క్రికెట్ ప్రమోషన్లో భాగంగా విశాఖలోని పీఎంపాలెంలో గల డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడు ఎల్ఎల్సీ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం నుంచి సోమవారం వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దాదాపు వంద మంది క్రికెటర్లు టోర్నమెంట్లో పాల్గొననున్నారని గోపినాథ్‌రెడ్డి తెలిపారు. భారత్- ఆస్ట్రేలియా, భారత్- సౌతాఫ్రికా మ్యాచ్‌లు గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్ స్టార్స్, అర్బన్‌రైజర్స్, హైదరాబాద్ జట్లు ఇక్కడ జరిగే మ్యాచ్‌లలో పాల్గొంటాయని వెల్లడించారు. అదే విధంగా... ఏసీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 19న ఇండియా – ఆస్ట్రేలియా వన్డే, నవంబర్ 23న ఇండియా – ఆస్ట్రేలియా టీ–20, గతేడాది జూన్ 14న ఇండియా- సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ–20 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించామని ఈ సందర్భంగా గోపినాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ‘‘ఇవే గాకుండా వైజాగ్‌లో ఫ్లడ్ లైట్స్‌లో ఏపీఎల్, విజయనగరంలో డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్ జరిపి ఆంధ్ర క్రీడాకారులకు ఐపీఎల్ అవకాశాలను పెంచడం జరిగింది. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం ఏపీలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ కోసం ఏసీఏ ఆధ్వర్యంలో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని గోపినాథ్‌రెడ్డి తెలిపారు. లెజెండ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్.. ►డిసెంబరు- 2 సాయంత్రం 7 గంటలకు: ఇండియా క్యాపిటల్స్ – మణిపాల్ టైగర్స్ ►డిసెంబరు- 3 మధ్యాహ్నం 3 గంటలకు: గుజరాత్ జైంట్స్–సదరన్ సూపర్‌స్టార్స్ ►డిసెంబరు- 4 సాయంత్రం 7 గంటలకుః మణిపాల్ టైగర్స్–అర్బన్ రైజర్స్ హైదరాబాద్. కాగా మాజీ క్రికెటర్ల సారథ్యంలో సాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ నవంబరు 18న మొదలైంది. ఈ టీ20 లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ డిసెంబరు 9న సూరత్‌లో జరుగనుంది. చదవండి: ఆడేది 3 మ్యాచ్‌లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం -
LLC 2023: వైజాగ్‌లో లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లు
సాక్షి, విశాఖపట్నం: లెజెండ్స్ క్రికెట్ లీగ్ టీ–20 తొలి దశ మ్యాచ్‌లకు విశాఖ కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 2 నుంచి 4 వరకు గల షెడ్యూల్లో భాగంగా ఇక్కడ ఐదు జట్లు ప్రత్యర్థులతో తలపడనున్నాయి. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన దాదాపు 70 మంది క్రికెటర్లు వైజాగ్‌కు రానున్నారు. ►ఇక మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారథిగా వ్యవహరించే ఇండియా క్యాపిటల్స్ కెవిన్ పీటర్స్‌న్, యశ్పాల్సింగ్, రిచర్డ్ పావెల్, మునాఫ్ పాటేల్, దిల్హార్ ఫెర్నాండో తదితరులు ఉన్నారు. ►మరోవైపు.. హర్బజన్‌సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించే మణిపాల్ టైగర్స్ జట్టులో ఎస్. బద్రినాథ్, రాబిన్ ఊతప్ప, మహ్మద్ కైఫ్, ప్రవీణ్‌కుమార్, పంకజ్ సింగ్, మిశ్చెల్, కారీ అండర్సెన్ ఉన్నారు ►అదే విధంగా.. సురేష్ రైనా సారథిగా వ్యవహరించే అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, ప్రజ్జాన్ ఓజా, టినో బెస్ట్, చమర కాపుగెందర భాగం కానున్నారు. ►ఇక పార్థీవ్ పటేల్ కెప్టెన్‌గా వ్యవహరించే గుజరాత్ జైంట్స్ జట్టులో క్రిస్ గేల్, కెవిన్ ఓ బ్రియన్, హమీద్ రజా, ఎస్. శ్రీశాంత్ ఉండనున్నారు. ►అదేవిధంగా ఆరోన్ ఫించ్ సారథిగా ఉన్న సదరన్ సూపర్‌స్టార్స్ జట్టులో అబ్దుల్ రజాక్, టేలర్, ఉపుల్ తరంగ, అశోక్ దిండా తదితరులు ఉన్నారు. షెడ్యూల్ ఇలా.. ►డిసెంబర్ 2- సాయంత్రం 7 గంటలకు ఇండియా క్యాపిటల్స్- మణిపాల్ టైగర్స్ ►3-మధ్యాహ్నం 3 గంటలకు గుజరాత్ జైంట్స్- సదరన్ సూపర్ స్టార్స్ ►4- సాయంత్రం 7 గంటలకు మణిపాల్ టైగర్స్- అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కాగా రాంచి వేదికగా నవంబరు 18న మొదలైన లెజెండ్స్ లీగ్ డిసెంబరు 9న సూరత్‌లో జరిగే ఫైనల్‌తో ముగియనుంది. -
సురేశ్ రైనా మెరుపులు.. కెవిన్ పీటర్సన్ పోరాటం వృధా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గురువారం (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ సారథ్యం వహిస్తున్న ఇండియా క్యాపిటల్స్‌పై సురేశ్ రైనా నాయకత్వంలోని అర్భన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప తేడాతో (3 పరుగులు) విజయం సాధించింది. ఈ టోర్నీలో అర్భన్‌రైజర్స్ వరుసగా రెండో విజయం సాధించగా.. ఇండియా క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అర్భన్‌రైజర్స్.. గుర్కీరత్ సింగ్ (54 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), సురేశ్ రైనా (27 బంతుల్లో 46; 6 ఫోర్లు, సిక్స్), పీటర్ ట్రెగో (20 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అర్భన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (3), మార్టిన్ గప్తిల్ (2), స్టువర్ట్ బిన్నీ (1)నిరాశపరిచారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2 వికెట్లు పడగొట్టగా.. రస్టీ థీరన్, మునాఫ్ పటేల్, కేపీ అప్పన్న తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాపిటల్స్.. గెలుపు కోసం ఆఖరి బంతి వరకు పోరాడి, స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ (48 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆష్లే నర్స్ (25 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రికార్డో పావెల్ (26) పర్వాలేదనిపించగా.. గౌతమ్ గంభీర్ (0), హషీమ్ ఆమ్లా (5), బెన్ డంక్ (5) విఫలమయ్యారు. అర్భన్‌రైజర్స్ బౌలర్లలో క్రిస్ మోఫు 2 వికెట్లు పడగొట్టగా.. పీటర్ ట్రెగో, టీనో బెస్ట్, పవన్ సుయల్ తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 24) మణిపాల్ టైగర్స్, భిల్వారా కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. -
మళ్లీ మొదలెట్టిన క్రిస్ గేల్.. అవకాశం వచ్చినా సెంచరీ చేయలేకపోయిన సిమన్స్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్ ఝులిపించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో భాగంగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు ఆడుతున్న గేల్.. భిల్వారా కింగ్స్‌తో నిన్న (నవంబర్ 22) జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. జెయింట్స్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (28), అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (24), ఖురానా (24 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జాక్ కలిస్ (14), కెవిన్ ఓబ్రెయిన్ (11), కెప్టెన్ పార్థివ్ పటేల్ (8) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. భిల్వారా బౌలర్లలో రాహుల్ శర్మ, జెసల్ కరియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బార్న్‌వెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్.. గుజరాత్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్ ఇన్నింగ్స్‌లో లెండిల్ సిమన్స్ (61 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. కింగ్స్ గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా సిమన్స్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. కనీసం రెండు పరుగులు చేయగలిగినా సిమన్స్ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. కింగ్స్ ఇన్నింగ్స్‌లో తిలకరత్నే దిల్షన్ (1), యూసఫ్ పఠాన్ (5), కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జెయింట్స్ బౌలర్లలో రయాద్ ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ చెరో 2 వికెట్లు, శ్రీశాంత్, లడ్డా, రజత్ భాటియా తలో వికెట్ దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 23) ఇండియా క్యాపిటల్స్, అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
హర్భజన్ మాయాజాలం.. కలిస్, గేల్ మెరుపులు వృధా
లెజెండ్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో నిన్న (నవంబర్ 20) జరిగిన మ్యాచ్‌లో మణిపాల్ టైగర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్.. హ్యామిల్టన్ మసకద్జ (37), తిసార పెరీరా (32), రాబిన్ ఉతప్ప (23) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జెయింట్స్ బౌలర్లలో రజత్ భాటియా 3, ట్రెంట్ జాన్స్టన్ 2, ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ, లడ్డా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్.. పర్వీందర్ అవానా (3-0-19-4), హర్భజన్ సింగ్ (4-1-14-2), తిసార పెరీరా (2-0-6-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. క్రిస్ గేల్ (24 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్), జాక్ కలిస్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), పార్థివ్ పటేల్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్) జెయింట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 21) సథరన్ సూపర్ స్టార్స్, అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
విరుచుకుపడిన ఇర్ఫాన్ పఠాన్.. 19 బంతుల్లోనే 9 సిక్సర్ల సాయంతో..!
లెజెండ్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ మెరుపులతో ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా క్యాపిటల్స్, గత సీజన్ రన్నరప్ భిల్వారా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదయ్యాయి. రాణించిన గంభీర్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్.. గౌతమ్ గంభీర్ (35 బంతుల్లో 63; 8 ఫోర్లు, సిక్స్), కిర్క్ ఎడ్వర్డ్స్ (31 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బెన్ డంక్ (16 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), థీరన్ (3 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో హషీమ్ ఆమ్లా (3), రికార్డో పావెల్ (0) లాంటి స్టార్లు విఫలమయ్యారు. భిల్వారా బౌలర్లలో అనురీత్ సింగ్ 4, రాహుల్ శర్మ 2, జెసల్ కారియా, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ పడగొట్టారు. ఇర్ఫాన్ పఠాన్ చెడుగుడు.. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భిల్వారా కింగ్స్.. సోలొమోన్ మైర్ (40 బంతుల్లో 70; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (19 బంతుల్లో 65 నాటౌట్; ఫోర్, 9 సిక్సర్లు) అర్ధశతకాలతో విరుచుకుపడటంతో 19.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. కింగ్స్ ఇన్నింగ్స్‌లో రాబిన్ బిస్త్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్), యూసఫ్ పఠాన్్ (6 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్), క్రిస్టఫర్ బామ్వెల్ (12 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2, రస్టీ థీరన్ 2, ప్రవీణ్ తాంబే ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భిల్వారా కింగ్స్ గత ఎడిషన్ ఫైనల్లో క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. -
గౌతం గంభీర్ విధ్వంసం.. కేవలం 35 బంతుల్లోనే!
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్‌కు తెరలేచింది. ఈ లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో రాంఛీ వేదికగా ఇండియా క్యాపిటల్స్,భిల్వారా కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భిల్వారా కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ ఇండియా క్యాపిటల్స్‌ను తొలుత బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇండియా క్యాపిటల్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా క్యాపిటల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గంభీర్ కేవలం 35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు క్రిక్ ఎడ్వర్డ్స్(59), బెన్ డంక్(16 బంతుల్లో 37), నర్స్(34) పరుగలు చేశాడు. భిల్వారా కింగ్స్ బౌలర్లలో అనురిత్ సింగ్ 4 వికెట్లతో అదరగొట్టాడు. చదవండి: ఆసీస్‌తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్ శర్మ -
యూసఫ్ పఠాన్ వీరబాదుడు.. మరోసారి రెచ్చిపోయిన స్టువర్ట్ బిన్నీ
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నిన్న (మార్చి 25) ఇండోర్ నైట్స్-గౌహతి అవెంజర్స్, వైజాగ్ టైటాన్స్-పట్నా వారియర్స్ జట్లు తలపడ్డాయి. గౌహతితో జరిగిన మ్యాచ్‌లో ఇండోర్ నైట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. పట్నాపై వైజాగ్ టైటాన్స్ 78 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తరంగ, యూసఫ్ వీరబాదుడు.. అయినా ప్రయోజనం లేదు..! ఇండోర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గౌహతి.. ఉపుల్ తరంగ (27 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (23 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆఖర్లో అనురీత్ సింగ్ (22 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండోర్.. ఫిల్ మస్టర్డ్ (45 బంతుల్లో 80; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ శర్మ (50 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. స్టువర్ట్ బిన్నీ మరోసారి.. పట్నాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ టైటాన్స్.. సన్నీ సింగ్ (45 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ(29 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్.. వైజాగ్ బౌలర్లు తిసార పెరీరా (2/2), ఆశిష్ నునివాల్ (2/18), ఇషాన్ మల్హోత్రా (2/18), భారత్ అవస్తి (1/14) ధాటికి 17.5 ఓవర్లలో 131 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. పట్నా ఇన్నింగ్స్‌లో బిస్లా (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లోనూ బిన్నీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
స్టువర్ట్ బిన్నీ ఊచకోత.. రిచర్డ్ లెవి విధ్వంసం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా వైజాగ్ టైటాన్స్, నాగ్‌పూర్ నింజాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్ టైటాన్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ వీరేంద్ర సెహ్వాగ్ (18 బంతుల్లో 27; 6 ఫోర్లు), నిక్ కాంప్టన్ (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, సిక్స్), మల్కన్ సింగ్ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (18 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టువర్ట్ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎడాపెడా బౌండరీలు సిక్సర్లు బాదాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్ రిచర్డ్ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినప్పటికీ గెలవలేకపోయింది. ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లెవి 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. లెవికి మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో నింజాస్ ఓటమిపాలైంది. అభిమన్యు ఖోద్ (42) పర్వాలేదనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్లో నింజాస్ గెలుపుకు 10 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన స్టువర్ట్ బిన్నీ.. హర్భజన్ సింగ్‌ను కట్టడి చేయగలిగాడు. ఆఖరి బంతికి సిక్సర్ అవసరం కాగా, భజ్జీ బౌండరీతో సరిపెట్టుకున్నాడు. -
సురేశ్ రైనా విశ్వరూపం.. 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 (LLC Masters) పూర్తయిన వెంటనే మరో లెజెండ్స్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఘాజియాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో నిన్న (మార్చి 22) ఇండోర్ నైట్స్, నాగ్‌పూర్ నింజాస్ జట్లు తలపడగా.. ఇండోర్ నైట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోర్ నైట్స్.. ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బంతుల్లో 90 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. After LLC Masters, Suresh Raina joined the Indore Knights squad to participate in the ongoing Legends Cricket Trophy.#SureshRaina #LLCMasters #LegendsLeagueCricket #CSK https://t.co/olITh4nprx — CricTracker (@Cricketracker) March 23, 2023 నింజాస్ బౌలర్లలో కుల్దీప్ హుడా 4 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్ను కుల్దీప్ హుడా (42 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బౌలింగ్‌లో చెలరేగిన హుడా బ్యాటింగ్‌లోనూ విజృంభించి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి నింజాస్ 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులకు పరిమితం కావడంతో 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ బౌలర్లలో కపిల్ రాణా 3, రాజేశ్ ధాబి 2, జితేందర్ గిరి, సునీల్ చెరో వికెట్ పడగొట్టారు. నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (13), వీరేంద్ర సింగ్ (15), అభిమన్యు (13), రితేందర్ సింగ్ సోధి (11) విఫలం కాగా.. సత్నమ్ సింగ్ (32), ప్రిన్స్ పర్వాలేదనిపించాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేతృత్వంలో బరిలోకి దిగిన నింజాస్‌కు ఈ టోర్నీలో ఇది తొలి ఓటమి. ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ స్టార్లు వివిధ టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
తరంగ విధ్వంసం.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా ఆసియా లయన్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 ఛాంపియన్స్‌గా ఆసియా లయన్స్ నిలిచింది. దోహా వేదికగా జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో ఆసియా లయన్స్ చిత్తు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్.. కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి 16.1ఓవర్లలోనే ఛేదించింది. ఆసియా బ్యాటర్లలో ఓపెనర్లు ఉపుల్ తరంగ(28 బంతుల్లో 57 పరుగులు), తిలకరత్నే దిల్షాన్(58) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. తరంగ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం మిస్బా-ఉల్-హక్(9), మహమ్మద్ హఫీజ్(9) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. వరల్డ్ జెయింట్స్ బ్యాటర్లలో జాక్వెస్ కల్లిస్(54 బంతుల్లో 78 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు రాస్ టేలర్(32) పరుగులతో రాణించాడు. ఆసియా బౌలర్లలో స్పిన్నర్ రజాక్ రెండు వికెట్లు సాధించగా.. పెరీరా ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: Indian Wells: ‘నంబర్‌వన్’ అల్కరాజ్.. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సొంతం -
వయసు పెరిగినా వన్నె తగ్గలేదు..
మహ్మద్ కైఫ్.. టీమిండియా క్రికెట్లో మేటి ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్ కంటే తన ఫీల్డింగ్ విన్యాసాలతోనే జట్టులో ఎక్కువకాలం కొనసాగాడు. కైఫ్ ఫీల్డ్‌లో ఉంటే అతని వైపు వచ్చిన బంతి అతన్ని దాటుకొని వెళ్లడం అసాధ్యం. ఎన్నోసార్లు తన మెరుపు ఫీల్డింగ్‌తో అలరించిన కైఫ్ అద్భుతమైన క్యాచ్‌లు కూడా చాలానే తీసుకున్నాడు. 2002-06 మధ్యలో టీమిండియా తరపున కైఫ్ 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా వింటేజ్ కైఫ్‌ను తలపించాడు. శనివారం ఆసియా లయన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కైఫ్ మూడు క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇందులో రెండు క్యాచ్‌లు అయితే డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకోవడం విశేషం. స్టన్నింగ్ క్యాచ్‌లతో వయసు పెరిగినా వన్నె తగ్గలేదని నిరూపించాడు. తొలుత ఆసియా లయన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ప్రజ్ఞాన్ ఓజా వేసిన 8వ ఓవర్లో ఉపుల్ తరంగను స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఓజా వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడాడు. బంతి వేగం చూస్తే కచ్చితంగా బౌండరీ వెళ్లేలా కనిపించింది. కానీ స్క్వేర్‌లెగ్‌లో ఉన్న కైఫ్ ఒక్క ఉదుటన డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కైఫ్ మరోసారి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపెట్టాడు. ప్రవీణ్ తాంబే వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని మహ్మద్ హఫీజ్ లాంగాఫ్ దిశగా ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న కైఫ్ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్ ఓటమి చవిచూసింది. 85 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఆసియా లయన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్ 16.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. Vintage Kaif! 🔥@MohammadKaif #LegendsLeagueCricket #YahanSabBossHain pic.twitter.com/9Gc4qO5Cyl — FanCode (@FanCode) March 18, 2023 చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు LLC 2023: గంభీర్ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి -
గంభీర్ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి
దోహా వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. మార్చి 20న జరిగే ఫైనల్లో వరల్డ్ జెయింట్స్‌ను ఢీకొట్టేందుకు ఆసియా లయన్స్ అర్హత సాధించింది. నిన్న (మార్చి 18) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని ఆసియా లయన్స్.. గౌతమ్ గంభీర్ సారధ్యంలోని ఇండియా మహారాజాస్ను 85 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. The Lions roar their way to the finals! 🦁💥@AsiaLionsLLC won by 85 runs in the ultimate showdown of this season! 🎊#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/ZEyo1I76gC — Legends League Cricket (@llct20) March 18, 2023 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్.. ఉపుల్ తరంగ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), తిలకరత్నే దిల్షాన్ (26 బంతుల్లో 27; 2 ఫోర్లు), మహ్మద్ హఫీజ్ (24 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అస్ఘర్ అఫ్ఘాన్ (24 బంతుల్లో 34 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), తిసార పెరీరా (12 బంతుల్లో 24; 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. Tharanga Thriller!🏏👏 Ladies and Gentlemen, @upultharanga44 is the @officialskyexch Legend of the match! 🎉🔥#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/3HhkbPoKd5 — Legends League Cricket (@llct20) March 18, 2023 మహారాజాస్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, ప్రజ్ఞాన్ ఓజా తలో 2 వికెట్లు, ప్రవీణ్ తాంబే ఓ వికెట్ పడగొట్టగా.. మహ్మద్ కైఫ్ అత్యద్భుతమైన 3 క్యాచ్‌లు పట్టి మ్యాచ్‌ను రక్తి కట్టించాడు. మహారాజాస్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 15 పరుగులు సమర్పించుకున్నారు. Kaif-tastic, Kaif-alicious, Kaif-a-mazing! 💥👑 The legend @MohammadKaif shows how it's done the kaifway! #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #MohammadKaif pic.twitter.com/GsJm8xAcLN — Legends League Cricket (@llct20) March 18, 2023 అనంతరం ఛేదనకు దిగిన మహారాజాస్.. ఆసియా సింహాల బౌలర్ల ధాటికి 16.4 ఓవర్లలో 106 పరుగులకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మహారాజాస్ ఇన్నింగ్స్‌లో రాబిన్ ఉతప్ప (15), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (32), మహ్మద్ కైఫ్ (14), సురేశ్ రైనా (18) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. యూసఫ్ పఠాన్ (9), ఇర్ఫాన్ పఠాన్ (3), మన్విందర్ బిస్లా (8), స్టువర్ట్ బిన్నీ (0), అశోక్ దిండా (2), ప్రవీణ్ తాంబే (0) నిరాశపరిచారు. Despite the defeat, @GautamGambhir is the @rariohq Boss Cap Holder for the runs. #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/II4hvjRxmG — Legends League Cricket (@llct20) March 18, 2023 లయన్స్ బౌలర్లలో సోహైల్ తన్వీర్, అబ్దుర్ రజాక్, మహ్మద్ హఫీజ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఇసురు ఉడాన, షాహిద్ అఫ్రిది, తిలకరత్నే దిల్షాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. .@sohailmalik614 successfully owns the @rariohq Boss Cap for the wickets after today's amazing performance!#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/DXatiJujiI — Legends League Cricket (@llct20) March 18, 2023 -
సురేష్ రైనా సూపర్ సిక్సర్.. కొంచెం కూడా జోరు తగ్గలేదు! వీడియో వైరల్
లెజెండ్స్ లీగ్-2023లో భాగంగా బుధవారం వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇండియా మహారాజాస్ పరాజయం పాలైనప్పటికీ.. ఆ జట్టు బ్యాటర్, టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రైనా.. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేశాడు. మహారాజాస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన పనేసర్ బౌలింగ్‌లో ఐదో బంతికి.. ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి బౌలర్ తలపై నుంచి అద్భుతమైన సిక్స్ రైనా బాదాడు. ఈ సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా తప్పుకున్నప్పటికీ అతడిలో ఏ మాత్రం జోరు తగ్గలేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది రైనా ఐపీఎల్లో ఆడాలని కోరుకుంటున్నారు. A classic @ImRaina shot! 🔥@IndMaharajasLLC #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/FtdhpF5B4U — Legends League Cricket (@llct20) March 15, 2023 -
"నాటు నాటు" స్టెప్పులతో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్లు
RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచానికి ఈ పాట ఫోబియా పట్టుకుంది. ఎక్కడ చూసినా జనాల ఈ పాటకు స్టెప్పులేస్తూ దర్శనిమిస్తున్నారు. సోషల్‌మీడియా మాధ్యమాల్లో అయితే ఈ పాటకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నాటు నాటు పాటకు కాలు కదుపుతున్నారు. తాజాగా ఇద్దరు టీమిండియా మాజీలు కూడా ఈ పాటకు స్టెప్పేసి ఇరగదీశారు. Those are some sweet feet, I tell you what! 😍@IndMaharajasLLC @harbhajan_singh @ImRaina #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/Kv9y1ss6bs — Legends League Cricket (@llct20) March 15, 2023 లెజెండ్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు పాటకు చిందేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. సీఎస్కే మాజీ క్రికెటర్లను అభిమానులు రామ్‌చరణ్, తారక్‌లతో పోలుస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాజాస్.. సురేశ్ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బిస్లా (36), ఇర్ఫాన్ పఠాన్ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరల్డ్ జెయింట్స్ బౌలర్లు బ్రెట్ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్ (4-0-27-2) చెలరేగారు. అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్‌కు షేన్ వాట్సన్ (26), సమిత్ పటేల్ (12) సహకరించారు. మహారాజాస్ బౌలర్లలో యుసఫ్ పఠాన్ (4-0-14-2), ప్రవీణ్ తాంబే (4-0-22-1), హర్భజన్ సింగ్ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. లీగ్‌లో మహారాజాస్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్‌లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి. -
సచిన్ రికార్డు బద్దలు కొట్టేది అతడే.. 110 సెంచరీలతో: పాక్ మాజీ పేసర్
OTD- Sachin Tendulkar 100 Centuries: పదకొండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ టోర్నీ-2012లో భాగంగా మార్చి 16న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సచిన్ ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 147 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 114 పరుగులు సాధించాడు. ఫలితం ఏదైనా ఈ మ్యాచ్ మాత్రం భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక ఇప్పటి వరకు సచిన్ సాధించిన ఈ అత్యంత అరుదైన రికార్డుకు చేరువగా రాగలిగింది టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మాత్రమే! ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇటీవలే కోహ్లి 75వ శతకం నమోదు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో తాజా సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశమే హద్దు సచిన్ టెండుల్కర్తో ఎన్నో మ్యాచ్‌లలో తలపడిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా కోహ్లికే ఉందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ భారం దిగిపోయిన తర్వాత పరుగుల యంత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడని అక్తర్ పేర్కొన్నాడు. 110 సెంచరీలు చేస్తాడు ‘‘విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఇప్పుడు తనపై కెప్టెన్సీ భారం లేదు. మానసికంగా ఒత్తిడి లేదు. కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టే వీలు కలిగింది. కోహ్లి 110 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డును బ్రేక్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. పరుగుల దాహంతో ఉన్న కోహ్లికి ఈ ఫీట్ అసాధ్యమేమీ కాదు’’ అని షోయబ్ అక్తర్ ఏఎన్ఐతో వ్యాఖ్యానించాడు. కాగా సచిన్ టెండుల్కర్.. అంతర్జాతీయ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు సాధించాడు. కోహ్లి ఇప్పటి వరకు వన్డేల్లో 46, టెస్టులో 28, టీ20లలో ఒక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వంద సెంచరీల మార్కుకు ఇంకా 25 శతకాల దూరంలో ఉన్నాడు. ఇక 34 ఏళ్ల కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సమాయత్తమవుతున్నాడు. ఇదిలా ఉంటే అక్తర్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ఆసియా లయన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2023: కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా! PSL 2023: పోలార్డ్పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..! -
క్రిస్ గేల్ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్ బాస్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. బాస్.. గతంలో బంతిని ఎలా చెడుగుడు ఆడేవాడో ఇప్పుడు అదే రీతిలో చెలరేగుతున్నాడు. గేల్ 43 ఏళ్ల వయసులోనూ యువకుల తరహాలో భారీ షాట్లు ఆడి ఔరా అనిపిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 15) ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి పాత రోజులు గుర్తు చేశాడు. అంతేకాక అతని జట్టు వరల్డ్ జెయింట్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. It’s the man with the moves!🏏👏 Ladies and Gentlemen, @henrygayle is the @officialskyexch Legend of the match! 🎉🔥#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/eht1CY7rP6 — Legends League Cricket (@llct20) March 15, 2023 వివరాల్లోకి వెళితే.. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్.. బ్రెట్ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్ (4-0-27-2) చెలరేగడడంతో ప్రత్యర్ధిని 136 పరుగులకే కట్టడి చేసింది. మహారాజాస్ టీమ్‌లో సురేశ్ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా.. బిస్లా (36), ఇర్ఫాన్ పఠాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. What a solid display!!! @WorldGiantsLLC pic.twitter.com/JYzOxr7K2q — Legends League Cricket (@llct20) March 15, 2023 అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్‌కు షేన్ వాట్సన్ (26), సమిత్ పటేల్ (12) సహకరించారు. మహారాజాస్ బౌలర్లలో యుసఫ్ పఠాన్ (4-0-14-2), ప్రవీణ్ తాంబే (4-0-22-1), హర్భజన్ సింగ్ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. Giants on top! A statement by the defending champions as we are close to the finals! 💪🏏@WorldGiantsLLC @henrygayle @AaronFinch5 @ShaneRWatson33 @BrettLee_58 @RossLTaylor #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/mvLoF2Ruos — Legends League Cricket (@llct20) March 15, 2023 లీగ్‌లో మహారాజాస్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్‌లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి. Points Table Update after Match Day 5. Table has been toppled from top to bottom! World Giants made a huge jump to the top spot after today’s win with the Lions shifting down to second, and the Maharajas drops to third consequently.#SkyexchnetLLCMasters #YahanSabBossHain pic.twitter.com/hDHT1I9uVO — Legends League Cricket (@llct20) March 15, 2023 .@harbhajan_singh is still the @rariohq Boss Cap Holder for the most wickets!#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/EnVV0j2Rad — Legends League Cricket (@llct20) March 15, 2023 .@GautamGambhir still holds his ground as the @rariohq Boss Cap Holder for the highest runs. #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/3zKKssdcka — Legends League Cricket (@llct20) March 15, 2023 Grind, Giggles, and Greatness! Gayle! ⚡💪💥 The legend of the match spills the tea on today's performance, daily routine secrets, and getting ready for tomorrow's showdown! @henrygayle#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/SwpRB1gopG — Legends League Cricket (@llct20) March 15, 2023 -
ఉతప్ప ఊచకోత.. గంభీర్ గర్జన
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్లో ఇండియా మహారాజాస్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన మహారాజాస్.. నిన్న (మార్చి 14) ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన మహారాజాస్.. లయన్స్‌ను 157 పరుగులకు కట్టడి చేసింది. A great feeling to get the first win under the belt 💪🏾 Always a pleasure to bat along with my brother @GautamGambhir !! pic.twitter.com/uUSU54NMfN — Robin Aiyuda Uthappa (@robbieuthappa) March 14, 2023 ఉపుల్ తరంగ (48 బంతుల్లో 69; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలకరత్నే దిల్షన్ (27 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్), అబ్దుర్ రజాక్ (17 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హఫీజ్ (2), కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ (0), అస్ఘర్ అఫ్ఘాన్ (15) విఫలం కాగా.. మహారాజాస్ బౌలర్లలో సురేశ్ రైనా 2, స్టువర్ట్ బిన్నీ, హర్భజన్ సింగ్, ప్రవీణ్ తాంబే తలో వికెట్ పడగొట్టారు. .@GautamGambhir is still on the top for @rariohq Boss Cap Holder for the highest runs. @VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/95wb1UmUn2 — Legends League Cricket (@llct20) March 14, 2023 అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మహారాజస్.. వికెట్ కూడా నష్టపోకుండానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (39 బంతుల్లో 88 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (36 బంతుల్లో 61 నాటౌట్; 12 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 12.3 ఓవర్లలోనే ఇండియా మహారాజాస్ విజయం సాధించారు. .@harbhajan_singh bounce back to his top spot for @rariohq Boss Cap Holder for the most wickets after tonight’s game!@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/f3JVRL10VR — Legends League Cricket (@llct20) March 14, 2023 లయన్స్ బౌలర్లను ఉతప్ప ఊచకోత కోయగా, గంభీర్ ప్రత్యర్ధి బౌలర్లపై సింహగర్జన చేశాడు. గంభీర్‌కు ఈ సీజన్లో ఇది వరుసగా 3వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 15) వరల్డ్ జెయింట్స్ జట్టు.. ఇండియా మహారాజాస్‌తో తలపడనుంది. Match Day 5: A duel reloaded! ⚡ Will the Maharajas win back-to-back and cease the top spot? Or will the Giants topple the Maharajas back to bottom? Tune in tonight at 8 PM IST to find out! @VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/jRB3xzdu88 — Legends League Cricket (@llct20) March 15, 2023 కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహారాజాస్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధించింది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహారాజాస్.. రెండో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. నిన్న ఆసియా లయన్స్‌పై గెలుపొందడంతో మహారాజాస్ టీమ్ బోణీ విజయం సాధించింది. Points Table Update after Match Day 4. The table has changed on the lower half! Maharajas make a majestic leap to second place while Asia Lions hold their ground at the top.@VisitQatar #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/XSHt2svlBK — Legends League Cricket (@llct20) March 14, 2023 -
చెలరేగిన మిస్బా, అఫ్రిది.. వరల్డ్ జెయింట్స్‌ను చిత్తు చేసిన ఆసియా సింహాలు
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో నిన్న (మార్చి 13) జరిగిన మ్యాచ్‌లో ఆసియా సింహాలు రెచ్చిపోయాయి. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత లయన్స్ బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా ఆ జట్టు 35 పరుగుల తేడాతో వరల్డ్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. Roaring with pride after a victorious night! 🦁🔥@VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/0kzmqdGPzn — Legends League Cricket (@llct20) March 13, 2023 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. తిలకరత్నే దిల్షన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), మిస్బా ఉల్ హాక్ (19 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జెయింట్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. తరంగ (1), తిసార పెరీరా (10), షాహిద్ అఫ్రిది (2) విఫలంకాగా.. రికార్డో పావెల్, క్రిస్ గేల్, పాల్ కాలింగ్‌వుడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. Job done! 💪🦁 pic.twitter.com/vSdDOClUae — Legends League Cricket (@llct20) March 13, 2023 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసియా లయన్స్.. 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులకు మాత్రమే పరిమితమై లీగ్‌లో తొలి ఓటమిని నమోదు చేసింది. లెండిల్ సిమన్స్ (14), షేన్ వాట్సన్ (3), ఆరోన్ ఫించ్ (2), రికార్డో పావెల్ (0) విఫలం కాగా.. క్రిస్ గేల్ (16 బంతుల్లో 23; 3 సిక్సర్లు) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. Lions Roared Tonight! 🦁🔥 pic.twitter.com/6hy266Swph — Legends League Cricket (@llct20) March 13, 2023 ఆసియా లయన్స్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది (2-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-9-1) రాణించగా.. అబ్దుర్ రజాక్ (2-1-2-2) అదరగొట్టాడు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) ఆసియా లయన్స్, ఇండియా మహరాజాస్లో తలపడనుంది. కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహరాజాస్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహరాజాస్.. రెండో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. మహరాజాస్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. -
LLC 2023: గంభీర్ దగ్గరికి వచ్చి ఆఫ్రిది ఆరా.. వీడియో వైరల్! ఎవరున్నా అంతే!
Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్- 2023లో భాగంగా ఇండియా మహరాజాస్- ఆసియా లయన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇండియా కెప్టెన్ గౌతం గంభీర్ పట్ల లయన్స్ సారథి షాహిద్ ఆఫ్రిది వ్యవహరించి తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దోహా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసియా లయన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మిస్బా ఉల్ హక్ అద్భుత అర్ధ శతకం(73)కి తోడు ఓపెనర్ ఉపుల్ తరంగ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్రిది బృందం 6 వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా మహరాజాస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ గౌతం గంభీర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. కాగా గంభీర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెల్మెట్‌కు బంతి తాకింది. ఇండియా ఇన్నింగ్స్ 12వ ఓవర్లో అబ్దుల్ వేసిన బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీకి తరలించేందుకు గౌతీ ప్రయత్నించాడు. అయితే, బాల్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి తర్వాత హెల్మెట్‌కు తగిలింది. అయితే, బంతి మరీ అంత బలంగా తాకకపోవడంతో గౌతీ- మహ్మద్ కైఫ్ పరుగు పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో గౌతీ దగ్గరికి వెళ్లిన ఆఫ్రిది.. బాల్ హెల్మెట్‌కు తాకిన విషయం గురించి ఆరా తీశాడు. సమస్య ఏమీ లేదు కదా! అన్నట్లు గౌతీతో వ్యాఖ్యానించగా.. అదేమీ లేదని అతడు బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అయితే, బిగ్ హార్ట్ అంటూ ఆఫ్రిదిని పొగుడుతూ క్యాప్షన్ జతచేయడం పట్ల గంభీర్ ఫ్యాన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఓ ఆటగాడిగా క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు.. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మైదానం లోపల, వెలుపలా గంభీర్- ఆఫ్రిది మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ వీడియో నెట్టింట ఇలా చక్కర్లు కొడుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. గంభీర్ తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ మురళీ విజయ్ 25, మహ్మద్ కైఫ్ 22 పరుగులతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ ఇండియా మహరాజాస్‌పై విజయం సాధించింది. చదవండి: Rohit Sharma: రోహిత్ అరుదైన రికార్డు.. సచిన్, కోహ్లితో పాటు ఆ జాబితాలో! అజారుద్దీన్ తర్వాత.. NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ 'Big-hearted' Shahid Afridi inquires if Gautam Gambhir is ok after that blow ❤️#Cricket pic.twitter.com/EqEodDs52f — Cricket Pakistan (@cricketpakcompk) March 10, 2023