లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా కోణార్క్ సూర్యాస్ ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో సథరన్ సూపర్ స్టార్స్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ మహోగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్.. 54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సథరన్ సూపర్ స్టార్స్ కోణార్క్ సూర్యాస్ ఒడిశాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యాస్ ఒడిశా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రిచర్డ్ లెవి 21 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. యూసఫ్ పఠాన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.
అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ సూపర్ స్టార్స్ కేవలం 16 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్టిన్ గప్తిల్ ఒంటిచేత్తో సూపర్ స్టార్స్‌ను గెలిపించాడు. శ్రీవట్స్ గోస్వామి 18, మసకద్జ 20, పవన్ నేగి 14 పరుగులు చేశారు.
VINTAGE MARTIN GUPTILL. 🔥
6,6,6,4,6,6 - 34 runs in a single over in the LLC. 🤯 pic.twitter.com/0LG9g55Lry— Mufaddal Vohra (@mufaddal_vohra) October 2, 2024
ఒకే ఓవర్‌లో 34 పరుగులు
నవిన్ స్టీవర్ట్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో మార్టిన్ గప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌లో గప్తిల్ ఐదు సిక్సర్లు, బౌండరీ సహా 34 పరుగులు పిండుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో నవిన్ స్టీవర్ట్ వేసిన మరో ఓవర్‌లోనూ గప్తిల్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో గప్తిల్ 29 పరుగులు (నాలుగు సిక్సర్లు, బౌండరీ) సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నవిన్ వేసిన రెండు ఓవర్లలో గప్తిల్ 11 బంతులు ఎదుర్కొని 62 పరుగులు రాబట్టాడు.
నిన్న ఒకే ఓవర్‌లో 30 పరుగులు
నిన్న మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గప్తిల్ చెలరేగిపోయాడు. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్‌లో 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు.
చదవండి: విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment