Martin Guptill
-
మార్టిన్ గప్టిల్ ఊచకోత.. 42 బంతుల్లో 160 పరుగులు! వీడియో వైరల్
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. లెజెండ్స్ 90 లీగ్ టోర్నీలో గప్టిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గప్టిల్.. సోమవారం రాయ్‌పూర్ వేదికగా బిగ్ బాయ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గప్టిల్, ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంతో రాయ్‌పూర్ స్టేడియం దద్దరిల్లిపోయింది. కేవలం 49 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గప్టిల్.. 16 సిక్స్‌లు, 12 ఫోర్లతో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ రిషి ధావన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు.తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ వారియర్స్ నిర్ణీత 90 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్ జట్టు.. నిర్ణీత 90 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. బిగ్ బాయ్స్ బ్యాటర్లలో రాబిన్ బిస్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సౌరబ్ తివారీ(37) పరుగులతో రాణించారు. ఛత్తీస్‌గఢ్ వారియర్స్ బౌలర్లలో మనన్ శర్మ రెండు, అభిమన్యు మిథన్, ఖాలీం ఖాన్ తలా వికెట్ సాధించారు.తిరుగులేని గప్టిల్..కాగా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో గప్టిల్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 16 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతనిథ్యం వహించిన గప్టిల్.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా గప్టిల్ ఉన్నాడు. 122 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 3531 పరుగులు చేశాడు. వన్డేల్లోనూ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (7,346) చేసిన మూడో బ్యాటర్‌గా ఉన్నాడు. అతడి కంటే ముందు రాస్ టేలర్ (8,607), స్టీఫెన్ ప్లెమింగ్ (8,007) ఉన్నారు.చదవండి: ICC Champions Trophy: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు Absolute carnage in Raipur! 🤯 Martin Guptill goes absolutely berserk, smashing 160 runs off just 49 deliveries, including 16 maximums! 😱#Legend90onFanCode pic.twitter.com/6Bpkw4aEA4— FanCode (@FanCode) February 10, 2025 -
మార్టిన్ గప్తిల్ మహోగ్రరూపం.. 11 బంతుల్లో 62 పరుగులు
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా కోణార్క్ సూర్యాస్ ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో సథరన్ సూపర్ స్టార్స్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ మహోగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్.. 54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సథరన్ సూపర్ స్టార్స్ కోణార్క్ సూర్యాస్ ఒడిశాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యాస్ ఒడిశా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రిచర్డ్ లెవి 21 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. యూసఫ్ పఠాన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ సూపర్ స్టార్స్ కేవలం 16 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్టిన్ గప్తిల్ ఒంటిచేత్తో సూపర్ స్టార్స్‌ను గెలిపించాడు. శ్రీవట్స్ గోస్వామి 18, మసకద్జ 20, పవన్ నేగి 14 పరుగులు చేశారు.VINTAGE MARTIN GUPTILL. 🔥6,6,6,4,6,6 - 34 runs in a single over in the LLC. 🤯 pic.twitter.com/0LG9g55Lry— Mufaddal Vohra (@mufaddal_vohra) October 2, 2024ఒకే ఓవర్లో 34 పరుగులునవిన్ స్టీవర్ట్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో మార్టిన్ గప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో గప్తిల్ ఐదు సిక్సర్లు, బౌండరీ సహా 34 పరుగులు పిండుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో నవిన్ స్టీవర్ట్ వేసిన మరో ఓవర్లోనూ గప్తిల్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో గప్తిల్ 29 పరుగులు (నాలుగు సిక్సర్లు, బౌండరీ) సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నవిన్ వేసిన రెండు ఓవర్లలో గప్తిల్ 11 బంతులు ఎదుర్కొని 62 పరుగులు రాబట్టాడు.నిన్న ఒకే ఓవర్లో 30 పరుగులునిన్న మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గప్తిల్ చెలరేగిపోయాడు. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్లో 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు. చదవండి: విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ -
శివాలెత్తిన గప్తిల్.. ఒకే ఓవర్లో..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సథరన్ సూపర్ స్టార్స్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్.. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు. గప్తిల్ శివాలెత్తిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ సూపర్ స్టార్స్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు) 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సథరన్ సూపర్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో గోస్వామి 18, మసకద్జ 1, చతురంగ డిసిల్వ 26, చిరాగ్ గాంధీ 36, పవన్ నేగి 8, జెసల్ కరియా 1, చిగుంబర 20 (నాటౌట్), సుబోత్ భాటి 1 (నాటౌట్) పరుగు చేశారు. మణిపాల్ టైగర్స్ బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనురీత్ సింగ్, పియెనార్, రాహుల్ శుక్లా, ఏంజెలో పెరీరా తలో వికెట్ దక్కించుకున్నారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. హమీద్ హసన్ (3/20), అబ్దుర్ రజాక్ (2/30), మోను కుమార్ (2/44), జెసల్ కరియా (2/29), పవన్ నేగి (1/0) ధాటికి 13.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో ఉతప్ప 17, అసేల గుణరత్నే 22, తిసార పెరీరా 37, అనురీత్ సింగ్ 10, హర్భజన్ సింగ్ 11, ఏంజెలో పెరీరా 5 పరుగులు చేయగా.. సౌరభ్ తివారి, అమిత్ వర్మ, పియెనార్ డకౌట్లు అయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సథరన్ సూపర్ స్టార్స్ ప్రస్తుత ఎల్ఎల్సీ ఎడిషన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది.టైగర్స్ ఇంకా బోణి కొట్టాల్సి ఉంది. చదవండి: భారత్‌కు బిగ్ షాక్.. ఆసీస్ సిరీస్‌కూ స్టార్ ప్లేయర్ దూరం! -
టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!?
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి. భారత్ విషయానికి వస్తే గ్రూపు-ఏలో ఉంది. గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు పాకిస్తాన్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడుతుంది. అనంతరం జూన్ 9న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే.. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు చేరే జట్లను న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంచనా వేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కచ్చితంగా సెమీస్‌కు చేరుతాయని, నాలుగో జట్టుగా ఇంగ్లండ్ లేదా పాకిస్తాన్ వచ్చే అవకాశముందని గప్టిల్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ తరపున 112 టీ20లు ఆడిన గప్టిల్ 3531 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా గప్టిల్ కొనసాగుతున్నాడు. -
NZ VS AUS 1st T20: టిమ్ సౌథీ రికార్డు
న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ టిమ్ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు. సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్ గప్తిల్‌ను అధిగమించాడు. గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్‌తో కలుపుకుని 123 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్లో 110 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్‌లు ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఆసీస్ గెలుపులో మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
IND VS AUS 3rd ODI: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ అయ్యేలోపు 5 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్ న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 4 సిక్సర్ల దూరంలో (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (38 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (18) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్ ఔట్ కాగా.. విరాట్ క్రీజ్‌లోకి వచ్చాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 78/1గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 275 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
శివాలెత్తిన గప్తిల్.. 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో బౌండరీ, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. గప్తిల్‌కు పోలార్డ్ (32 బంతుల్లో 46; ఫోర్, 4 సిక్సర్లు), మార్క్ దెయాల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. Raise your bat Martin Guptill. What a knock from the kiwi sensation 🙌 #CPL23 #BRvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Betbarter @BetBarteronline pic.twitter.com/GdqWmEzPx5 — CPL T20 (@CPL) August 31, 2023 నైట్‌రైడర్స్‌లో గప్తిల్, పోలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్ (6), ఆండ్రీ రసెల్ (5), డ్వేన్ బ్రావో (0) లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. గప్తిల్ ధాటికి బార్బడోస్ బౌలర్ ఓబెద్ మెక్కాయ్ బలయ్యాడు. అతను 4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. గప్తిల్ మరో బార్బడోస్ బౌలర్ రకీమ్ కార్న్‌వాల్‌ను కూడా ఆడుకున్నాడు. కార్న్‌వాల్ కేవలం 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. బార్బడోస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2.. కైస్ అహ్మద్, వాన్ డర్ మెర్వ్ తలో వికెట్ దక్కించుకున్నారు. వకార్ దెబ్బకు కుప్పకూలిన బార్బడోస్.. నైట్‌రైడర్స్ నిర్ధేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బార్బడోస్.. వకార్ సలామ్ కైల్ (3.1-0-14-4), ఆండ్రీ రసెల్ (2-0-13-2), అకీల్ హొసేన్ (4-0-16-2), సునీల్ నరైన్ (2-0-11-1) దెబ్బకు 12.1 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రకీమ్ కార్న్‌వాల్, కైల్ మేయర్స్ డకౌట్లు కాగా.. లారీ ఈవాన్స్ (5), అథనేజ్ (2), కెవిన్ విక్హమ్ (9), యంగ్ (3), వాన్ డర్ మెర్వ్ (3), ఓబెద్ మెక్ కాయ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జేసన్ హోల్డర్ (14), రోవ్‌మన్ పావెల్ (10), కైస్ అహ్మద్ (10 నాటౌట్) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. -
మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో..
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో క్వెట్టా గ్లాడియేటర్స్ 5 మ్యాచ్‌ల తర్వాత ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గ్లాడియేటర్స్.. 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. గ్లాడియేటర్స్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (56 బంతుల్లో 86; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన అర్ధసెంచరీతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. గప్తిల్‌కు మరో ఎండ్ నుంచి ఎవరి సపోర్ట్ లేనప్పటికీ, ఒంటరి పోరాటంచేసి తన జట్టును గెలిపించుకున్నాడు. గప్తిల్‌కు సర్ఫరాజ్ అహ్మద్ (29), మహ్మద్ నవాజ్ (15), డ్వేన్ ప్రిటోరియస్ (10 నాటౌట్) నుంచి ఓ మోస్తరు మద్దతు లభించింది. కరాచీ బౌలర్లలో తబ్రేజ్ షంషి 2 వికెట్లు పడగొట్టగా.. ఆమెర్ యామిన్, ముహ్మద్ మూసా, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు కరాచీ ఇన్నింగ్స్‌లో రొస్సింగ్టన్ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఇమాద్ వసీం (30 నాటౌట్), ఆమెర్ యామిన్ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నసీం షా, ఐమల్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ నవాజ్, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 7) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పెషావర్ జల్మీ-లాహోర్ ఖలందర్స్ తలపడనుండగా.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇస్లామాబాద్-ముల్తాన్ సుల్తాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
న్యూజిలాండ్ ఓపెనర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులు!వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో గుప్టిల్ క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే శనివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుప్టిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న గుప్టిల్.. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 168 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఆసీస్ పేసర్ ఆండ్రూ టైకు గుప్టిల్ చుక్కలు చూపించాడు. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన టై బౌలింగ్‌లో గుప్టిల్.. 3 సిక్స్‌లు, మూడు ఫోర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇక గుప్టిల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా.. గ్లాడియేటర్స్ తొలుత 168 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 169 లక్క్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ.. 162 పరుగులకే పరిమితమైంది. దీంతో కరాచీ కింగ్స్‌పై గ్లాడియేటర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీలో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఇదే తొలి విజయం. చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు 4⃣6⃣4⃣6⃣6⃣4⃣ Martin Guptill teed off against Andrew Tye in the 19th over🚀 (via @thepslt20) #PSL2023 #KKvQG pic.twitter.com/R7JJ7ZHJic — ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2023 -
సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న మరో న్యూజిలాండ్ ఆటగాడు! ఇకపై
New Zealand Cricket- Martin Guptill: గతంలో.. స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోం.. తాజాగా స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్.. న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు. గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బుధవారం ప్రకటన చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 జట్టుకు గప్టిల్ ఎంపికైనప్పటికీ ఆస్ట్రేలియా గడ్డ మీద ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20 ఫార్మాట్లో మెరుగైన రికార్డు ఉన్న గప్టిల్‌ను కాదని ఫిన్ అలెన్‌ను ఓపెనర్‌గా ఆడించింది యాజమాన్యం. ఇక ఈ టోర్నీలో కివీస్ సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గప్టిల్.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. చర్చించిన తర్వాతే ఈ నేపథ్యంలో అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ బోర్డు ఈ స్టార్ బ్యాటర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అనేక చర్చల అనంతరం గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. గప్టిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నా.. జాతీయ జట్టు సెలక్షన్ సమయంలో అతడి పేరును పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఎన్‌జెడ్‌సీ స్పష్టం చేస్తోంది. దేశవాళీ క్రికెట్ జట్టు ఎంపిక సమయంలోనూ అతడికి ప్రాధాన్యం ఉంటుంది’’ అని తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ విషయంపై స్పందించిన 36 ఏళ్ల గప్టిల్.. ‘‘దేశం తరఫున ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. బ్లాక్‌క్యాప్స్‌కు ఆడే సమయంలో నాకు సహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నా అవసరాల మేరకు ఇతర ఆప్షన్లు చూసుకోవాల్సి ఉంది. ఇతర అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అద్భుత రికార్డులు అలాగే కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికీ నేను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్ తరఫున టీ20లలో 122 మ్యాచ్‌లు ఆడి 3531 పరుగులు చేశాడు గప్టిల్. ఈ ఫార్మాట్లో న్యూజిలాండ్ టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. గుడ్ బై చెప్పినట్లే! అదే విధంగా 47 టెస్టుల్లో 2586, 198 వన్డేల్లో 7346 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 18 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్న ఈ స్టార్ బ్యాటర్.. టీ20లలో రెండె సెంచరీలు, 20 అర్ధ శతకాలు సాధించాడు. కాగా న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకునే వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో గప్టిల్ అనధికారికంగా ఎన్జెడ్సీకి గుడ్‌బై చెప్పినట్లే! చదవండి: Cristiano Ronaldo: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను! -
సిక్సర్ల విషయంలో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల విషయంలో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టి20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే టి20ల్లో అత్యధికి సిక్సర్ల రికార్డును రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్.. ఓవరాల్‌గా 176 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 172 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా.. క్రిస్ గేల్ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లి 104 సిక్సర్లతో టీమిండియా తరపున టి20ల్లో వంద సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్, కెప్టెన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో గెలిపించాడు. జంపాకు 3 వికెట్లు దక్కాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టి20 ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతుంది. చదవండి: బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా -
Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ!
India Vs Australia T20 Series 2022- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో హిట్‌మ్యాన్ ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో 3620 పరుగులు సాధించాడు. నాలుగు శతకాలు.. 28 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక టీ20లలో హిట్‌మ్యాన్ అత్యధిక స్కోరు 118. అదే విధంగా ఈ ఫార్మాట్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 323 ఫోర్లు, 171 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో టీమిండియా సారథి అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. రెండు సిక్సర్లు కొట్టాడంటే! మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మొదలుకానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక్క సిక్స్ కొడితే.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డును సరిచేస్తాడు. రెండు సిక్సర్లు గనుక బాదితే గప్టిల్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇక గప్టిల్ ఇప్పటి వరకు 121 అంతర్జాతీయ టీ20లు ఆడి 172 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ శర్మ 171 సిక్సర్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. వీరి తర్వాత.. వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్‌గేల్ 124, ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ 120, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 117 సిక్సర్లతో టాప్-5లో కొనసాగుతున్నారు. చదవండి: T20 WC 2022: పంత్ ఆ స్థానానికి సరిపోడు! అతడిని ఆడించకపోవడమే మంచిది: భారత మాజీ ఓపెనర్ CSA 2022 Auction- Kavya Maran: ఆ వేలంలో హైలెట్‌గా కావ్య.. ఎంఐతో పోటీపడి! యువ హిట్టర్ కోసం భారీ ధర! -
ప్రపంచ రికార్డుకు 10 పరుగుల దూరంలో హిట్‌మ్యాన్
మరికొద్ది గంటల్లో టీమిండియా, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. టి20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు పాకిస్తాన్ మాత్రం భారత్‌పై మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఎవరు గెలుస్తారన్న సంగతి పక్కనబెడితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఒక అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ 3497 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 3487 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కేవలం పది పరుగుల దూరంలో మాత్రమే ఉన్న రోహిత్‌కు ఈ రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక మూడో స్థానంలో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి 99 మ్యాచ్‌ల్లో 3308 పరుగులతో ఉన్నాడు. కాగా కోహ్లికి పాకిస్తాన్‌తో మ్యాచ్ వందో టి20 కావడం విశేషం. మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కనున్నాడు. చదవండి: Asia Cup 2022: ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తే రూ. 5000 జరిమానా..! -
WI Vs NZ: రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన గప్టిల్.. మరోసారి ప్రపంచ నంబర్ 1గా!
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును గప్టిల్ బద్దలు కొట్టాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడో టీ20 సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా విండీస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గప్టిల్ 13 బంతుల్లో 15 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 3497 పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్లో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా గప్టిల్- రోహిత్ శర్మ మధ్య నెంబర్ 1 స్థానం కోసం పోటీ కొనసాగుతూనే ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో కివీస్ 145 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య వెస్టిండీస్.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్(53), బ్రూక్స్(56 నాటౌట్) విజృంభించడంతో జయకేతనం ఎగురవేసింది. 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. తద్వారా 8 వికెట్ల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకుంది. ఇక మొదటి రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ వరుసగా 13, 90 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల జాబితాలో టాప్-5లో ఉన్న పురుష క్రికెటర్లు 1.మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)- 3497 2.రోహిత్ శర్మ(ఇండియా)- 3487 3.విరాట్ కోహ్లి(ఇండియా)- 3308 4.పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్)- 2975 5.ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 2855 చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన Rishabh Pant- Urvashi Rautela: మరీ అంత స్ట్రెస్ తీసుకోకు: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ మరో కౌంటర్! Martin Guptill to the top! The @BLACKCAPS opener goes to No.1, though there is an Asia Cup around the corner for two batters in the chasing pack 🏏 More on Guptill's record and #WIvNZ: https://t.co/aws5Z9q9hL pic.twitter.com/cTijVVXjPY — ICC (@ICC) August 15, 2022 -
రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా
న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ టి20 క్రికెట్ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుధవారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్ 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(3379 పరుగులు) రికార్డును బద్దలు కొట్టి 3399 పరుగులతో టాప్ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 128 మ్యాచ్‌ల్లో 3379 పరుగులు చేయగా.. ఇందులో నాలుగు సెంచరీలు, 26 అర్థసెంచరీలు సాధించాడు. ఇక మార్టిన్ గప్టిల్ 116 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 20 అర్థ సెంచరీలతో 3399 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో రోహిత్ ఉండగా.. మూడో స్థానంలో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి(3308 పరుగులు), ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్(2894 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్(2855 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా కివీస్ తరపున టి20ల్లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడు మార్టిన్ గప్టిల్. ఇంతకముందు మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్(2140 పరుగులు) మాత్రమే ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్కాట్లాండ్పై కివీస్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫిన్ అలెన్(56 బంతుల్లో 101, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం చేయగా.. గప్టిల్ 40, నీషమ్ 30 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కాట్లాండ్ బ్యాటర్స్‌లో గాలమ్ మెక్లీడ్ 33, క్రిస్ గ్రీవ్స్ 31 పరుగులు చేశారు. చదవండి: Shubman Gill: సెంచరీ మిస్ అయినా దిగ్గజాల సరసన చోటు -
మొన్న టీమిండియా.. ఇప్పుడు కివీస్‌ను వణికించారు! అట్లుంటది మాతోటి!
Ireland Vs New Zealand ODI Series 2022: ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో టీమిండియాకే చెమటలు పట్టించింది ఐర్లాండ్. ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసి నాలుగు పరుగుల తేడాతో హార్దిక్ పాండ్యా సేన చేతిలో ఓడింది. అయినా.. ప్రత్యర్థి జట్టుతో పాటు అభిమానుల ప్రశంసలు అందుకుంది. అదే తరహాలో శుక్రవారం నాటి మూడో వన్డేలోనూ చివరి వరకు ఐర్లాండ్ జట్టు పోరాడిన తీరు అద్భుతం. అట్లుంటది మాతోని ఇప్పటికే కివీస్‌కు సిరీస్ సమర్పించుకున్న ఐర్లాండ్.. డబ్లిన్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 361 పరుగుల భారీ స్కోరు ఛేదించే దిశగా పయనించి న్యూజిలాండ్ ఆటగాళ్లను వణికించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 120 పరుగులతో అదరగొడితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హ్యారీ టెక్టార్ 108 పరుగులు సాధించాడు.కానీ ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. బై రూపంలో ఒక పరుగు మాత్రమే లభించడంతో ఆండ్రూ బృందం పర్యాటక కివీస్ ముందు తలవంచక తప్పలేదు. పసికూన కాదు! ఈ నేపథ్యంలో ఐర్లాండ్ ఓడినా అసాధారణ ఆట తీరుతో మనసులు మాత్రం గెలుచుకుందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా, కివీస్ వంటి మేటి జట్లకే వణుకు పుట్టించింది ఇకపై ఐర్లాండ్ పసికూన కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ సైతం ఐర్లాండ్ పోరాట పటిమను కొనియాడాడు. A special moment for Paul Stirling. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/Tyg4ykcTcW — Cricket Ireland (@cricketireland) July 15, 2022 మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా ఇలాంటి పిచ్ రూపొందించినందుకు గ్రౌండ్స్‌మెన్‌కు క్రెడిట్ ఇవ్వాలి. మేము బ్యాటింగ్ చేసే సమయంలో హార్డ్‌గా ఉంది. ఐర్లాండ్ బ్యాటర్లు సైతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. అయితే, వారు ఆడిన విధానం అమోఘం. మేము ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారు పోరాడిన తీరు అద్భుతం. ఐర్లాండ్ జట్టు రోజురోజుకీ తమ ఆటను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆకట్టుకుంటోంది’’ అని కొనియాడాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ.. ‘‘ఇదొక అద్భుతమైన మ్యాచ్. మేము చాలా బాగా ఆడాము. కానీ ఓటమి పాలయ్యాం. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఐరిష్ జెర్సీలోని ఆటగాళ్లు రెండు సెంచరీలు నమోదు చేయడం సూపర్. టెక్టర్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. రెండు వారాల వ్యవధిలో రెండు శతకాలు బాదాడు. ఈ ఏడాది మాకు ఇదే ఆఖరి వన్డే అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. అయితే, మరిన్ని టీ20 మ్యాచ్‌లు ఆడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ వరుసగా ఒక వికెట్, మూడు వికెట్లు, ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. Harry Tector has only been dismissed once before reaching 50 in his last nine ODI innings. What a talent. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/LlFUkf0Xe3 — Cricket Ireland (@cricketireland) July 15, 2022 ఐర్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే వేదిక: ది విలేజ్, డబ్లిన్ టాస్: న్యూజిలాండ్- బ్యాటింగ్ న్యూజిలాండ్ స్కోరు: 360/6 (50) ఐర్లాండ్ స్కోరు: 359/9 (50) విజేత: ఒక పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్టిన్ గప్టిల్(126 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు) -
విరాట్ కోహ్లిని ఊరిస్తున్న ప్రపంచ రికార్డు.. తొలి ఆటగాడిగా!
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పడు టీ20 సిరీస్‌కు సిద్దమైంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి16న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ విండీస్- భారత్ మధ్య ప్రారంభం కానుంది. ఇక తొలి టీ20కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రానున్న టీ20 సిరీస్‌లో కోహ్లి మరో 75 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. తొలి స్ధానంలో 3299 పరుగులతో న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ ఉండగా, రెండో స్ధానంలో 3227 పరుగులతో కోహ్లి రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక మూడో స్ధానంలో 3197 పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. మరో వైపు టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే ఒక వికెట్ సాధిస్తే అంతర్జాతీయ టీ20ల్లో భారత తరుపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడు. జస్ప్రీత్ బుమ్రా 66 వికెట్లు పడగొట్టి తొలి స్ధానంలో ఉండగా, చాహల్ 65 వికెట్లు సాధించి రెండో స్ధానంలో ఉన్నాడు. చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్! -
విరాట్ కోహ్లి ఔట్.. కేఎల్ రాహుల్ ఒక్కడే
Virat Kohli Out From Top 10 ICC T20 Batting Rankings.. ఐసీసీ బుధవారం టి20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్కడే టాప్-5 లో నిలిచాడు. ఇక టి20 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్-10 నుంచి ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో రోహిత్, రాహుల్ మంచి ప్రదర్శన కనబరిచారు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 80 పరుగులు చేశాడు. దీంతో తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకొని 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్ ఇక సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 809 పాయింట్లతో టాప్ స్థానాన్ని కాపాడుకోగా.. 805 పాయింట్లతో డేవిడ్ మలాన్(ఇంగ్లండ్) రెండో స్థానంలో.. దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్రమ్ 796 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 735 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ చాలా రోజుల తర్వాత టాప్‌టెన్‌లో చోటు సంపాదించాడు. గప్టిల్ 658 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో వనిందు హసరంగ(శ్రీలంక) 797 పాయింట్లతో తొలి స్థానం.. తబ్రెయిజ్ షంసీ(దక్షిణాఫ్రికా) 784 పాయింట్లతో రెండో స్థానం.. ఆడమ్ జంపా(ఆస్ట్రేలియా) 725 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో టాప్‌టెన్‌లో ఒక్కరు కూడా లేరు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ(అప్గానిస్తాన్).. 265 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్).. 231 పాయింట్లతో రెండో స్థానంలో.. లియామ్ లివింగ్‌స్టోన్( ఇంగ్లండ్).. 179 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. చదవండి: Ravichandran Ashwin: ఫైనల్ తర్వాత ఇప్పుడే మళ్లీ.. అశ్విన్ ముంగిట అరుదైన రికార్డులు! -
కోహ్లి రికార్డు బద్దలు .. టి20 చరిత్రలో తొలి బ్యాటర్‌గా గప్టిల్
Martin Guptill Breaks Kohli Record Most Runs In T20Is.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ టి20 క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గప్టిల్ అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన ఔటైన గప్టిల్ ఇప్పటివరకు కివీస్ తరపున 111 మ్యాచ్‌ల్లో 3246 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌లో ఉన్న కోహ్లిని దాటి మార్టిన్ తొలి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి 95 మ్యాచ్‌ల్లో 3227 పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ 118 మ్యాచ్‌ల్లో 3086 పరుగులతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియా నుంచి కెప్టెన్ ఆరోన్ ఫించ్ 83 మ్యాచ్‌ల్లో 2608 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: Harshal Patel: 30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర -
గప్టిల్ సీరియస్ లుక్.. దీపక్ చహర్ స్టన్నింగ్ రియాక్షన్
Martin Guptill Vs Deepak Chahar Stunning Looks.. టీమిండియాతో జరుగుతున్న టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో మార్టిన్ గప్టిల్, బౌలర్ దీపక్ చహర్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో చహర్ వేసిన తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. అప్పుడు గప్టిల్ దీపక్ చహర్‌ను చూస్తూ సీరియస్‌గా లుక్ ఇచ్చాడు. అయితే తర్వాతి బంతిని కూడా గప్టిల్ సిక్స్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో గప్టిల్ కథ ముగిసింది. ఈసారి దీపక్ చహర్ వంతు వచ్చింది. పెవిలియన్ వెళ్తున్న గప్టిల్వైపు దీపక్ సీరియస్ లుక్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Deepak chahar is known for this 👀pic.twitter.com/TyZMPrD9pY — VIVO IPL 2022 | Wear a Mask 😷 (@IPL2022_) November 17, 2021 -
ENG Vs NZ : కివీస్ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు
3 Big Records For New Zeland Players Vs ENG Semi Final Match T20 Wc 2021.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కాగా 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ సూపర్ ఓవర్లో ఓడిన సంగతి తెలిసిందే. ఫైనల్, సూపర్ ఓవర్ టై కావడంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ అనూహ్యంగా విశ్వవిజేతగా అవతరించింది. దీంతో న్యూజిలాండ్‌కు నిరాశే ఎదురైంది. తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఇరుజట్లు సెమీస్‌లో ఎదురుపడగా.. ఇంగ్లండ్ ఫెవరెట్‌గా కనిపిస్తుంది. అయితే కివీస్ ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. చదవండి: Sunil Gavaskar: సెమిఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు టిమ్ సౌథీ: కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ.. శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ రికార్డును బ్రేక్ చేసే అవకాశం లభించింది. ఇప్పటివరకు మలింగ 84 టి20ల్లో 107 వికెట్లు తీశాడు. టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మలింగ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా సౌథీ 88 మ్యాచ్‌ల్లో 106 వికెట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సౌథీ ఒక్క వికెట్ తీస్తే మలింగతో సమానంగా.. రెండు వికెట్లు తీస్తే మలింగను దాటి రెండో స్థానంలో నిలవనున్నాడు. ఇక మొదటి స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(94 మ్యాచ్‌ల్లో117 వికెట్లు) ఉన్నాడు. చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా! కేన్ విలియమ్సన్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టి20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు 69 పరుగులు కావాల్సి ఉంది. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కేన్ మామ 69 పరుగులు చేస్తే ఈ మార్క్‌ను అందుకున్న మూడో కివీస్ బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఇంతకముందు కివీస్ తరపున మార్టిన్ గప్టిల్, బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నారు. మార్టిన్ గప్టిల్: కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 112 పరుగులు చేస్తే టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేయడం కాస్త కష్టసాధ్యమైనప్పటికీ గప్టిల్ వేగంగా ఆడితే మాత్రం రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం గప్టిల్ 107 మ్యాచ్‌ల్లో 3115 పరుగులు చేశాడు. ఇక తొలి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి 95 మ్యాచ్‌ల్లో 3227 పరుగులు చేశాడు. మూడో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 116 మ్యాచ్‌ల్లో 3038 పరుగులతో ఉన్నాడు. చదవండి: Daryl Mitchell: ఇది ఫీల్డింగ్ అంటే.. క్యాచ్ పట్టకపోయినా హీరో అయ్యాడు -
Martin Guptill: 93 పరుగులు.. 90 నిమిషాలు.. 4 కిలోల బరువు తగ్గాను!
When I came off the field after batting, I'd lost about 4.4 kilos" - Martin Guptill: ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేడిమి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ సాధారణ ఉష్ణోగ్రతలే 30 డిగ్రీలు దాటుతాయి. ఇక దుబాయ్‌లో ఈ ఏడాది ఇప్పటికే రికార్డు స్థాయిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. ఇలాంటి చోట మధ్యాహ్నం బయటకు రావాలంటే ‘చుక్కలు’ కనిపించడం ఖాయం. అలాంటిది గంటల కొద్దీ క్రీజులో నిలబడే క్రికెటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెమటతో తడిసిపోక తప్పదు. ముఖ్యంగా ఆసియేతర దేశాల ఆటగాళ్లు ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం కష్టమే. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గఫ్టిల్ కూడా ఇదే మాట అంటున్నాడు. చెలరేగిన గప్టిల్ టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ యూఏఈ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నవంబరు 3న న్యూజిలాండ్... దుబాయ్ మైదానం(మధ్యాహ్నం మూడున్నరకు మ్యాచ్- 33 డిగ్రీల ఉష్ణోగ్రత)లో స్కాట్లాండ్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్... గఫ్టిల్ చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఇందులో గప్టిల్ ఒక్కడే 93 పరుగులు(56 బంతుల్లో) సాధించడం విశేషం. చాలా సేపు క్రీజులో నిలబడి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించగా... గప్టిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గప్టిల్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు చెమటపడుతూనే ఉందని.. దాదాపు నాలుగున్నర కిలోల బరువు కోల్పోయానన్నాడు. ‘‘మైదానంలోకి వచ్చిన తర్వాత ఉక్కపోత ఎక్కువైంది. 4.4 కిలోల బరువు కోల్పోయినట్లు అనిపించింది. దీంతో వెంటనే హైడ్రేటింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను’’అని గప్టిల్ చెప్పుకొచ్చాడు. యూఏఈ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ... శుభారంభం లభించకపోయినా.. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం(105 పరుగులు) నమోదు చేయడం కలిసి వచ్చిందన్నాడు. పరస్పర అవగాహనతో ముందుకు సాగామని.. స్వదేశంలోనూ పలు మ్యాచ్‌లలో మంచి పార్ట్నర్షిప్ సాధించామని గప్టిల్ చెప్పుకొచ్చాడు. చదవండి: T20 WC 2021 Ind Vs Afg: అప్పుడైతే ఏకంగా 218.. ఆ మ్యాచ్‌లో 186.. రైనా ఒక్కడే సెంచరీతో.. -
న్యూజిలాండ్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం!
Martin Guptill Injury: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమి చెందిన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ భారత్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సూపర్-12 రౌండ్లో భాగంగా మంగళవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన హరీస్ రవూఫ్.. రెండో బంతికే గప్టిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే రవూఫ్ వేసిన బంతి నేరుగా గప్టిల్ కాలికి తగిలి వికెట్లను తాకింది. ఈ క్రమంలో గుప్టిల్ బొటనవేలుకు గాయమైంది. దీంతో అతడు ఫీల్డింగ్‌కు రాలేదు. దీనిపై స్పందించిన న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. మ్యాచ్‌లో గప్టిల్ బోటనవేలుకు గాయమైంది. ఈ క్రమంలో గప్టిల్‌ను స్కానింగ్‌కు పంపినట్లు అతడు తెలిపాడు. గప్టిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని స్టెడ్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ (27), డేవన్ కాన్వే (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాక్ పేసర్ హారిస్ రవూఫ్ నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్ ఇన్నింగ్స్‌ను కుదేల్ చేశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు... కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11) సహా హఫీజ్ (11) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరడంతో.. పాక్ ఒక దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది . చివర్లో ఆసిఫ్ అలీ 12 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో (27) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో పాక్ విజయం సాధించింది. చదవండి: Shoaib Malik: సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడు: జహీర్ ఖాన్ -
పాక్‌తో గెలవడం కష్టమే.. కానీ ప్రయత్నిస్తాం
Martin Guptil Comments Vs Pakistan Match In T20 Worldcup.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పాకిస్తాన్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.''రానున్న టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్ మిగతా అన్ని మ్యాచ్‌ల కంటే కాస్త కఠినంగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌తో గెలవడం మాకు కష్టతరమైన పనిగా అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ జట్టు బలంగా తయారైందని.. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. టెస్టులు.. పరిమిత ఓవర్ల సంగతి ఎలా ఉన్నా టి20ల్లో మాత్రం పాక్ ఎప్పుడు బలంగానే కనిపిస్తుంది. ఆ జట్టుతో సిరీస్ రద్దు కాకపోయుంటే బాగుండేదనిపిస్తుంది. ఒకవేళ ఆ సిరీస్ మేము ఆడి ఉంటే పాకిస్తాన్ ఆటతీరు మరింత స్పష్టంగా తెలిసేది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2021: టాస్ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్ చేరినట్టేనా! కాగా టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్ ఏలో ఉన్న న్యూజిలాండ్‌తో పాటు పాకిస్తాన్, భారత్, అఫ్గానిస్తాన్‌తో పాటు టోర్నీకి అర్హత సాధించే జట్లు ఉండనున్నాయి. ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ముఖాముఖిగా ఐదుసార్లు తలపడగా.. 3-2 తేడాతో పాకిస్తాన్ ఆధిక్యంలో ఉంది. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు ఇరు జట్లు టి20ల్లో 24సార్లు తలపడగా.. 10 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించగా.. మిగిలిన 14 సార్లు పాకిస్తాన్ గెలిచింది. కాగా న్యూజిలాండ్ అక్టోబర్ 26న తమ మొదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. చదవండి: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే... పాక్ జట్టుకు బంపర్ ఆఫర్.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడిస్తే.. -
ఆ జాబితాలో ఫించ్ కూడా చేరాడు..
వెల్లింగ్టన్: ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ఫించ్ విధ్వంసకర వీరుల జాబితాలో చేరాడు. టీ20ల్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 135 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ (127) రెండో స్థానంలో, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (113) మూడో స్థానంలో, న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మన్రో (107) నాలుగులో, విండీస్ యోధుడు గేల్ (105) ఐదో స్థానంలో ఉన్నారు. తాజాగా ఫించ్ వీరి సరసన చేరాడు. కాగా, టీ20 ఫార్మాట్లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా ఫించే కావడం విశేషం. ఫించ్ 70 ఇన్సింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, 14 అర్థ సెంచరీల సాయంతో 2,310 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా. సహచర ఆటగాడు వార్నర్ 81 మ్యాచ్‌ల్లో సెంచరీ, 18 అర్ధ సెంచరీల సాయంతో 2,265 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఫింఛ్ (55 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ 50 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఆసీస్ 2-2తో సమంగా నిలిచింది. -
అయ్యో గప్టిల్.. ఎంత పొరపాటాయే!
ఆక్లాండ్: టీమిండియాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు రనౌట్ల రూపంలో కీలక వికెట్లు చేజార్చుకుంటున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాల్గో టీ20లో మున్రోను విరాట్ కోహ్లి అద్భుతమైన రీతిలో రనౌట్ చేయగా, తొలి వన్డేలో నికోలస్‌ను సైతం కోహ్లినే రనౌట్ చేశాడు. ఈ రెండు సందర్భాల్లోనూ న్యూజిలాండ్ అనవసరపు పరుగు కోసం యత్నించి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు రెండో వన్డేలో సైతం అదే పొరపాటును మార్టిన్ గప్టిల్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసే ఊపులో ఉన్న గప్టిల్ సింగిల్ కోసం ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. (ఇక్కడ చదవండి: గప్టిల్ నయా రికార్డు) గప్టిల్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగుల వద్ద ఉండగా రనౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 30 ఓవర్ రెండో బంతిని రాస్ టేలర్ షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే దానికి సింగిల్‌కు రమ్మంటూ గప్టిల్‌ను పిలిచాడు. దాంతో ఇద్దరూ పరుగు కోసం ప్రయత్నిస్తుండగా శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకుని కీపర్ రాహుల్ విసిరాడు. దాంతో వెంటనే రాహుల్ వికెట్లను గిరటేయడం, గప్టిల్ ఎటువంటి అనుమానం లేకుండా పెవిలియన్‌కు చేరుకోవడం జరిగిపోయాయి. అది రనౌట్ అని కచ్చితంగా గప్టిల్‌కు తెలియడంతో థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం వేచి ఉండకుండానే మైదానాన్ని వీడాడు. ఈ మైదానంలో గప్టిల్‌కు విశేషమైన రికార్డు ఉంది. ఇక్కడ ఈ మ్యాచ్ ముందు వరకూ చూస్తే గప్టిల్ 15 ఇన్నింగ్స్‌ల్లో 61కి పైగా సగటుతో 739 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో గప్టిల్ హాఫ్ సెంచరీ సాధించినా, సెంచరీ సాధించే అవకాశాన్ని మిస్సయ్యాడు. గప్టిల్ ఔట్‌తో 157 పరుగుల వద్ద కివీస్ మూడో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు బ్లండెల్(22), నికోలస్(41)లు ఔటయ్యారు.(ఇక్కడ చదవండి: షమీని ఎందుకు తీసినట్లు?) -
గప్టిల్ నయా రికార్డు
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ నయా రికార్డు సాధించాడు. న్యూజిలాండ్ తరఫున సొంత గడ్డపై అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డును లిఖించాడు. ఈ క్రమంలోనే వెటరన్ ఆటగాడు రాస్ టేలర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈడెన్ పార్క్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో గప్టిల్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో గప్టిల్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత స్వదేశంలో అత్యధిక పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ స్వదేశంలో 92 ఇన్నింగ్స్‌ల్లో గప్టిల్ 4,023 పరుగులు సాధించాడు. దాంతో రాస్ టేలర్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అయితే గప్టిల్‌తో పాటు టేలర్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడుతుండటం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను గప్టిల్-నికోలస్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన తర్వాత నికోలస్(41) ఔటయ్యాడు. చహల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, గప్టిల్ హాఫ్‌సెంచరీతో మెరిశాడు. నికోలస్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్లండెల్(22) ఎంతో సేపు ఆడలేదు. శార్దూల్ ఠాకూర్ వేసిన 27 ఓవర్ మూడో బంతికి బ్లండెల్ ఔటయ్యాడు. దాంతో 142 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. -
బుమ్రాపై గప్టిల్ ప్రశంసలు
ఆక్లాండ్: భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఈడెన్ పార్క్ ట్రాక్ స్లోగా స్పందించిన కారణంగానే తాము బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయామని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేర్కొన్నాడు. భారత్‌కు దాసోహం కావడానికి పిచ్ ప్రధాన కారణమన్నాడు. ఇక భారత సమిష్ట ప్రదర్శనపై గప్టిల్ ప్రశంసలు కురిపించాడు. భారత్ ఆల్‌రౌండ్‌తో అదరగొట్టి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిందన్నాడు. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై గప్టిల్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా బౌలింగ్ అద్భుతమని, అతని బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగడం చాలా కష్టమన్నాడు. మ్యాచ్ తర్వాత గప్టిల్ మాట్లాడుతూ.. ‘పిచ్ చాలా మందకొడిగా మారిపోయింది. పిచ్ కారణంగానే మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. పిచ్ మరీ నెమ్మదించడంతో బ్యాటింగ్ చేయడం కష్టం అయ్యింది. మా టాప్-4 ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సింది. కానీ పిచ్ సహకరించని కారణంగా సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. పిచ్ నుంచి వచ్చిన సహకారాన్ని భారత బౌలర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రధానంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా మాకు దడపుట్టించాడు. ఆది నుంచి చివరి వరకూ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మమ్మల్ని నియంత్రించాడు. బుమ్రాపై ఎదురుదాడికి దిగడం చాలా కష్టమైంది. మేము 170 పరుగులు చేస్తే పోరాడే వాళ్లం. కానీ టీమిండియా అద్భుతమైన బౌలింగ్‌తో అది సాధ్యం కాలేదు. వారు చాలా డాట్ బాల్స్ వేశారు. దాంతోనే మేము భారీ పరుగులు చేయలేకపోయాం. ఇక భారత్ బ్యాటింగ్‌లో కూడా మెరిసింది. వారు చక్కటి భాగస్వామ్యాలు సాధించారు. భారత్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు, మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. మేము ఎంత గొప్పగా బౌలింగ్ వేసినా కేఎల్ రాహుల్-శ్రేయస్ అయ్యర్లు కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాం. ఫలితంగా మరో ఓటమి చవిచూశాం’ అని గప్టిల్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ఆడుతూ... పాడుతూ...) -
ఆ ‘ఓవర్ త్రో’పై కుండబద్దలు కొట్టిన స్టోక్స్
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో ‘ఓవర్ త్రో’కు ఆరు పరుగులు కేటాయించడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ‘ఓవర్ త్రో’కు ఇచ్చిన అదనపు పరుగులు అవసరం లేదని తాను ఎంపైర్‌తో చెప్పినట్టు వచ్చిన కథనాలపై తాజాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అంపైర్ వద్దకు వెళ్లి.. అదనపు నాలుగు పరుగులు వద్దని కోరినట్టు వచ్చిన కథనాలన్నీ వదంతులేనని అతను తేల్చిచెప్పాడు. బీబీసీ పొడ్‌క్యాస్ట్‌లో మాట్లాడిన స్టోక్స్.. గుండెల మీద చేయి వేసుకొని నిజాయితీగా చెప్తున్నా. నేను ఎంపైర్ వద్దకు వెళ్లి.. అలాంటిదేమీ చెప్పలేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ బౌలర్ టామ్ లాథమ్ వద్దకు వెళ్లి క్షమాపణ అడిగానని, అలాగే కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌ను క్షమించమని కోరానని వెల్లడించాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ విజయంలో ‘6 పరుగుల ఓవర్‌త్రో’ పాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటగా.. అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం, బ్యాటింగ్ కొనసాగించిన స్టోక్స్ ఆ తర్వాత మ్యాచ్‌ను ‘టై’ వరకు తీసుకురావడం జరిగాయి. వాస్తవానికి దానికి 5 పరుగులు ఇవ్వాల్సిందని మాజీ అంపైర్లు విమర్శించారు కూడా. అయితే, నిజానికి స్టోక్స్.. ఆ ఓవర్‌త్రో ద్వారా వచ్చిన 4 అదనపు పరుగులు తమకు వద్దని అంపైర్లకు చెప్పినట్లుగా అండర్సన్ వెల్లడించడంతోపాటు.. అసలు అదనపు పరుగులు వద్దని స్టోక్స్ వేడుకున్నా అంపైర్లు వినిపించుకోలేదని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్ ఈ కథనాలన్నింటినీ కొట్టిపారేస్తూ.. క్లారిటీ ఇచ్చారు. -
నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్
ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తన జీవితంలోనే ఓ దుర్దినమని, అద్భుతం కూడా అని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తెలిపాడు. యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించిన మెగా ఫైనల్ టై కావడం... అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడం తెలిసిందే. అయితే గెలుపు ముంగిట నిలిచి దురదృష్టంతో కివీస్ టైటిల్ అందుకోకపోవడంలో గప్టిల్‌ది కాదనలేని పరోక్షపాత్ర. ఆద్యాంతం ఆకట్టుకున్న ఈ ఫైనల్ అనంతరం ఎక్కడా మాట్లాడని గప్టిల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ‘లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగి వారం పూర్తైందని నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నా క్రికెట్ జీవితంలో అది ఓ అద్భుతమైన దినం, అత్యంత దుర్దినంగా కూడా భావిస్తున్నాను. ఎన్నో విభిన్నమైన భావోద్వేగాలకు వేదికగా ఆ మ్యాచ్ నిలిచింది. కానీ న్యూజిలాండ్ తరఫున, గొప్ప సహచరులతో ఆడటాన్ని గర్వంగా ఫీలవుతున్నా. మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదో అద్భుతం.’ అని గప్టిల్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram Hard to believe it’s been a week since that incredible Final at Lords. I think it was both the best and worst day of my cricketing life! So many different emotions, but mainly proud to represent New Zealand and play for the @blackcapsnz alongside a great group of mates. Thank you to everyone for all your support, it has been amazing. 🇳🇿 A post shared by Martin Guptill (@martyguptill31) on Jul 22, 2019 at 1:11pm PDT టైటిల్ అందకుండా న్యూజిలాండ్‌ను దురదృష్టం గప్టిల్ రూపంలో వెంటాడింది. కివీస్ డెత్ బౌలర్లు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను భారీ షాట్లు కొట్టకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. ఈ సమయంలో గప్టిల్ విసిరిన బంతి నేరుగా బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్‌కు 6 పరుగులు ఇచ్చారు. ఇది మ్యాచ్ టై కి దారితీసింది. వాస్తవానికి ఇందులో గప్టిల్, స్టోక్స్ తప్పేం లేదు. ఇక సూపర్ ఓవర్లో కూడా మళ్లీ గప్టిల్ రూపంలోనే న్యూజిలాండ్ దురదృష్టం వెంటాడింది. చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సిన సమయంలో గప్టిల్ రనౌట్ కావడం.. సూపర్ ఓవర్ కూడా టై కావడం.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ జగజ్జేతగా నిలవడం అలా జరిగిపోయింది. ఈ రెండింటిలోను గప్టిల్ ప్రత్యక్ష పాత్ర లేకపోయినప్పటికి పరోక్ష పాత్ర కాదనలేనిది. ఇక ఈ మెగాటోర్నీలో గప్టిల్ తనస్థాయి దగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 186 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. -
‘ధోని రనౌట్ పాపమే చుట్టుకుంది’
విశ్వవేదికపై గెలుపు ముంగిట న్యూజిలాండ్ బొక్కబోర్లపడటానికి ఆ జట్టు చేసుకున్న కర్మే కారణమని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు. భారత్‌తో జరిగిన సెమీస్ పోరులో కివీస్ చేసిన తప్పుకు ఫలితమే ప్రపంచకప్ ఫైనల్ ఓటమని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని రనౌట్‌ను ప్రస్తావిస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఆ మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకి, ధోని రనౌట్‌తో భారత పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. అయితే తుది సమరంలో మ్యాచ్ టై కావడం.. ఆ తర్వాత నిర్వహించిన సూపర్ ఓవర్ ఆఖరు బంతికి రెండో పరుగు తీస్తూ గప్టిల్ రనౌటవ్వడం అంతా కర్మ సిద్దాంత ఫలితమేనని #Karma యాష్‌ట్యాగ్‌తో నిందిస్తున్నారు. అయితే ధోని రనౌట్ విషయంలో కివీస్ నిబంధనలకు విరుద్ధంగా ఫీల్డింగ్ పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. మూడో పవర్ ప్లేలో నిబంధనల ప్రకారం 30యార్డ్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. కానీ ఆ సమయంలో కివీస్ ఆరుగురు ఫీల్డర్లను పెట్టిందని ప్రచారం జరిగింది. దీన్ని అంపైర్లు గుర్తించి ఉంటే అది నోబాల్ అయ్యేది. ఆ తరువాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో.. ధోని కూడా పరుగు కోసం ప్రయత్నించివాడు కాదన్నది అభిమానుల ఉద్దేశం. ఇదే విషయాన్ని ప్రస్తవిస్తూ ఈ పాపమే గప్టిల్, కివీస్‌కు చుట్టుకుందని మండిపడుతున్నారు. What's active on twitter?#Karma Seriously...... Seems kindergartners active on twiiter!!!!!!!!!! pic.twitter.com/qfYhxirhzN — Bivek Chandak (@ChandakBivek) July 15, 2019 -
హీరో.. విలన్.. గప్టిలే!
లండన్: మూడు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీని రనౌట్ చేయడం ద్వారా పూర్తిగా మ్యాచ్ గతినే మార్చేశాడు కివీస్ ఆటగాడు మార్టిన్ గఫ్టిల్. ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్ టీమిండియా గెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ, మార్టిన్ గప్టిల్ విసిరిన బుల్లెట్ త్రోకు సీన్ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్‌కు ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా ఓడిపోయింది. అయితే, ఇది ఇక్కడితో ముగియలేదు. సేమ్ సీన్ ఫైనల్ మ్యాచ్‌లోనూ పునరావృతమైంది. అదీ కూడా గఫ్టిల్కే. సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండు పరుగు తీయబోయిన ధోనీ.. గఫ్టిల్ సూపర్ త్రోకు రన్నౌట్ అయ్యాడు. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ చివరి బంతికి రెండో పరుగు తీయబోయి గఫ్టిల్ రనౌట్‌గా వెనుదిరగడంతో విశ్వకప్ ఇంగ్లండ్ వశమైంది. ఆర్చర్ వేసిన సూపర్ ఓవర్ చివరి బంతిని బాదిన గఫ్టిల్ మొదటి పరుగును సురక్షితంగా పూర్తి చేశాడు. విజయం కోసం కావాల్సిన రెండో బంతి కోసం.. అతను ప్రయత్నించాడు. దీంతో ఫీల్డర్ నుంచి నేరుగా బంతిని అందుకున్న జోస్ బట్లర్ వికెట్లను గిరాటేశాడు. దీంతో గఫ్టిల్ రన్నౌట్ అయ్యాడు. ధోనీ రన్నౌట్ భారత్ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకోగా.. గఫ్టిల్ రనౌట్ కివీస్ జట్టుకు వరల్డ్ కప్‌ను దూరం చేసింది. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో అతను విసిరిన బంతి అనుకోకుండా స్టోక్స్ బ్యాటుకు తగిలి బౌండరీకి దూసుకుపోవడంతో ఇంగ్లండ్ జట్టుకు అదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఇదీ కూడా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. (చదవండి: నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు) గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. -
నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంగ్లండ్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఒక అరుదైన ఘట్టానికి వేదికగా క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. విశ్వకప్ ఫైనల్ మ్యాచ్ టై కావడం.. సూపర్ ఓవర్‌కు వెళ్లడం.. సూపర్ కూడా టై కావడం ఇదే తొలిసారి. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపుతూ.. చూసే ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టి.. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్‌కు గురిచేసిన ఫైనల్ మ్యాచ్.. ఆద్యంతం రోమాంఛితంగా సాగింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా వీక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్.. ఇరుజట్లు వీరోచితంగా పోరాడాయి. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టేందుకు తమ శాయశక్తులు ఒడ్డాయి. సమ ఉజ్జీలుగా కనిపించిన ఇరుజట్లు చివరి బంతి వరకు సింహాల్లా పోరాడాయి. ఫలితం మ్యాచ్ టై కావడమే.. కాకుండా సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ జట్టు వీరోచితంగా పోరాడినా.. ఆ జట్టుకు అదృష్టం కలిసిరాలేదని చెప్పాలి. ముఖ్యంగా 50 ఓవర్లో జరిగిన ఓ అరుదైన, అద్భుత ఘటన కివీస్ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరం. ఈ దశలో కివీస్ విజయానికి అడ్డుగోడలా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ నిలబడ్డాడు. చివరి ఓవర్లో మొదటి రెండు బంతులు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని స్టోక్స్ సిక్సర్‌గా మలిచాడు. మరో మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతికి ఓ అద్భుతం చోటుచేసుకొని.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నాలుగో బంతిని డీప్‌లోకి తరలించిన స్టోక్స్.. రెండు పరుగులు తీశాడు. అయితే, రెండో పరుగు తీస్తున్న సమయంలో మార్టిన్ గఫ్టిల్ విసిరిన బంతి.. నేరుగా స్టోక్స్ బ్యాట్‌కు తగిలి.. బౌండరీ దిశగా దూసుకుపోయింది. నమ్మశక్యం కాని ఈ పరిణామంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. నిజానికి ఇందులో స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ లేదు. రెండో పరుగు తీస్తున్న సమయంలో అతను బంతిని చూడనేలేదు. కానీ గఫ్టిల్ విసిరిన బంతి నేరుగా వచ్చి స్టోక్స్ బ్యాటుకు తగిలింది. ఇలా ఈ బంతికి అనూహ్యంగా ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం వరించేది. కానీ, అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేసి.. ఇద్దరు రన్నౌట్ కావడంతో ఇంగ్లండ్ 241 పరుగుల వద్ద నిలిచిపోయింది. మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా కావడం.. దీంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించడం తెలిసిందే. -
ఒకే ఓవర్లో రెండు గోల్డెన్ డక్‌లు
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకంది. కివీస్ ఓపెనర్లు ఇద్దరూ అనూహ్యంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు అదిరే ఆరంభం లభించింది. ఈ సీజన్లో తన దైన మార్క్‌తో ఆకట్టుకుంటున్న షెల్డన్ కాట్రెల్ కివీస్‌ను కోలుకోని దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే కివీస్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న కాట్రెల్ అదే ఓవర్ ఐదో బంతికి మరో ఓపెనర్ కోలిన్ మున్రోను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ తన ఇద్దరు ఓపెనర్లను తొలి ఓవర్లోనే కోల్పోయింది. ఇలా ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం గమనార్హం. -
పుల్‌షాట్ ఆడబోయి..
బర్మింగ్హమ్: హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరితే అంతకన్నా దురదృష్టం ఉండదు. బ్యాట్స్‌మన్ స్వీయ తప్పిదం కారణంగానే వికెట్‌ను హిట్ వికెట్‌గా సమర్పించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ హిట్ వికెట్‌గా నిష్క్రమించాడు. న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో భాగంగా ఫెహ్లుక్వాయో వేసిన 15 ఓవర్ చివరి బంతికి గప్టిల్ అదుపు తప్పి కాలితో వికెట్లను పడగొట్టడంతో హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. పుల్‌షాట్ ఆడబోయిన గప్టిల్ బ్యాలెన్స్ చేసుకోవడంలో విఫలం కావడంతో వికెట్లను తాకాడు. (ఇక్కడ చదవండి: విన్నర్ విలియమ్సన్) దాంతో బెయిల్స్ పడిపోవడం గప్టిల్ నవ్వుకుంటూ పెవిలియన్ చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. గప్టిల్ మంచి టచ్‌లోకి వచ్చిఏ సమయంలో వికెట్‌ను ఇలా అనవరసరంగా కోల్పోవడంతో అది చూసిన కివీస్ అభిమానులు మాత్రం కాసింత డీలా పడ్డారు. సఫారీలతో మ్యాచ్‌లో గప్టిల్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ వరల్డ్‌కప్ ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.(ఇక్కడ చదవండి: అయ్యో.. అది ఔటా?) -
స్వీయ తప్పిదం గప్టిల్ నవ్వుకుంటూ..
-
సెంచరీతో కివీస్‌ను గెలిపించిన గప్టిల్
క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (88 బంతుల్లో 118; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) బంగ్లాదేశ్‌పై మళ్లీ శతక్కొట్టాడు. దీంతో శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్ నెగ్గిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్లో మిథున్ (57; 7 ఫోర్లు, 1 సిక్స్), షబ్బీర్ రహ్మాన్ (43; 7 ఫోర్లు) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 3, ఆస్టల్, నీషమ్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్ 36.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసి గెలిచింది. తొలి వన్డేలో అజేయ సెంచరీ బాదిన గప్టిల్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాడు. 76 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తిచేసుకున్నాడు. రెండో వికెట్‌కు కెప్టెన్ విలియమ్సన్ (65 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి 143 పరుగులు జోడించాడు. అనంతరం టేలర్ (21 నాటౌట్, 3 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్ మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు. -
భారత్‌తో టి20 సిరీస్‌కు గప్టిల్ దూరం
భారత్‌కు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్‌కు టి20 సిరీస్‌కు ముందు కూడా మరో ఎదురు దెబ్బ తగిలింది. గాయంతో చివరి వన్డేకు దూరమైన ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఇంకా కోలుకోలేదు. దాంతో అతను టి20 సిరీస్‌నుంచి కూడా తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్‌ను ఎంపిక చేసినట్లు కివీస్ బోర్డు వెల్లడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 6, 8, 10 తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. -
కివీస్‌కు ఎదురుదెబ్బ
వెల్లింగ్టన్: ఇప్పటికే టీమిండియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. భారత్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న గప్టిల్.. టీ20 సిరీస్ మొత్తానికి దూరమవుతున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో జేమ్స్ నీషమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. తొలుత ప్రకటించిన టీ20 జాబితాలో నీషమ్ లేకపోయినప్పటికీ, గప్టిల్ గాయం కారణంగా అతన్ని ఉన్నపళంగా జట్టులోకి తీసుకున్నారు. భారత్‌తో చివరిదైన ఐదో వన్డేకు గప్టిల్ దూరమైన సంగతి తెలిసిందే. గప్టిల్ కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో టీ20 సిరీస్‌కు సైతం దూరం కావాల్సి వస్తుందని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు. ‘టీ20 సిరీస్‌కు గప్టిల్‌కు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఐదు రోజుల వ్యవధిలోనే ముగియనుంది. ఈ వ్యవధిలో గప్టిల్ కోలుకోవడం కష్టం. దాంతో అతనికి సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చాం. ఈ నెల 13వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌తో ఆరంభమయ్యే వన్డే సిరీస్ నాటికి గప్టిల్ జట్టుతో కలిసే అవకాశం ఉంది’ అని గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి టీ20 ఫిబ్రవరి6వ తేదీన వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుండగా, ఫిబ్రవరి 8వ తేదీన ఆక్లాండ్ వేదికగా రెండో టీ20 , ఫిబ్రవరి 10వ తేదీన హామిల్టన్ వేదికగా మూడో టీ20 జరుగనున్నాయి. -
వెన్నుముక గాయంతో ఐదో వన్డేకు గప్టిల్ దూరం
-
చివరి వన్డేకు గప్టిల్ దూరం?
వెల్లింగ్టన్: భారత్‌తో జరుగనున్న చివరిదైన ఐదో వన్డేకు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వెన్నుముక గాయంతో బాధపడుతున్న గప్టిల్ ఐదో వన్డే నుంచి వైదొలగడం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో కొలిన్ మున్రో తిరిగి తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. భారత్‌తో సిరీస్‌లో గప్టిల్ ఇప్పటివరకూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. గత నాలుగు వన్డేల్లో అతను చేసిన పరుగులు 47. భారత్‌తో నాలుగో వన్డేలో గప్టిల్ సిక్సర్, రెండు ఫోర్లతో దూకుడు మీద కనిపించనప్పటికీ 14 పరుగులే చేశాడు. ఒకవేళ గప్టిల్ ఐదో వన్డేకు దూరమైన పక్షంలో మరో ఓపెనింగ్ జోడిని కివీస్ పరీక్షించడానికి సమాయత్తం కావాలి. ఇప్పటికే నికోలస్‌ను ఓపెనర్‌గా పంపి కివీస్ ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే భారత్ కైవసం చేసుకుంది. వరుస మూడు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. నాల్గో వన్డేలో ఘోర ఓటమి పాలైంది. ఇక చివరి వన్డేలో విజయం సాధించాలనే పట్టుదలతో భారత్ జట్టు ఉంది. ఈ సిరీస్‌ను 4-1తో భారత్ గెలిస్తే కొత్త రికార్డును సృష్టించనుంది. న్యూజిలాండ్‌లో నాలుగు వన్డేలను గెలిచిన చరిత్ర భారత్‌కు లేదు. దాంతో తుది వన్డేలో గెలిస్తే భారత్ జట్టు కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. అదే సమయంలో కివీస్ కూడా ఆఖరి వన్డేను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే యోచనలో ఉంది. ఈ తరుణంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. రేపు(ఆదివారం) వెల్లింగ్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య ఐదో వన్డే జరుగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం గం.7.30 ని.లకు మ్యాచ్ ఆరంభం కానుంది. -
అప్డేట్స్: కివీస్‌పై భారత్ గెలుపు
నేపియర్: ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై కూడా అదే ఊపును కొనసాగించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కోహ్లిసేన అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు కుల్దీప్ (4/39), షమీ(3/19), చహల్( 2/43), కేదార్ జాదవ్(1/17)లు చెలరేగటంతో 38 ఓవర్లలో 157 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌటైంది. ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(66), రాయుడు(6) ఉన్నారు. 132 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఫెర్గుసన్ బౌలింగ్‌లో సారథి విరాట్ కోహ్లి(45) కీపర్ క్యాచ్ ఔట్. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్ శిఖర్ ధావన్(60), సారథి విరాట్ కోహ్లి(41). ప్రస్తుతం టీమిండియా 26 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 123 పరుగులు చేసింది. వన్డే కెరీర్లో 26వ అర్ధ సెంచరీ సాధించిన శిఖర్ ధావన్ ఆటకు స్వల్ప అంతరాయం కలగడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించి 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన అంపైర్లు. విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసిన అంపైర్లు లంచ్ విరామం అనంతరం కోహ్లి సేనుక షాక్ తగిలింది. 41 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(11) గప్టిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా పది ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (29), కోహ్లి(2)లు క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిని టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శిఖర్ ధావన్(29)లు శుభారంభాన్ని అందించారు. లంచ్ విరామ సమయానికి భారత్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్ టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ 157 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్(0) వెనుదిరగటంతో 38 ఓవర్లలోనే కివీస్ కథ ముగిసింది. అంతక ముందు కుల్దీప్ బౌలింగ్‌లోనే విలియమ్సన్(64), బ్రాస్‌వెల్(7), ఫెర్గుసన్(0)లు వెనుదిరిగారు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో సాన్‌ట్నర్(14) ఎల్బీడబ్య్లూగా వెనుదిరిగాడు. ఓ వైపు వరసుగా వికెట్లు పడుతున్నా.. మరోవైపు కివీస్ సారథి విలియమ్సన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తనదైన క్లాస్ షాట్లతో అలరించాడు. . ఈ క్రమంలోనే వన్డే కెరీర్లో 36వ హాఫ్ సెంచరీ సాధించాడు. కేదార్ జాదవ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరేరీతిలో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడంతో కివీస్ బ్యాట్స్‌మన్ నికోలస్(12) పెవిలియన్ బాట పట్టాడు. కుల్దీప్ ఆ రీతిలో క్యాచ్ అందుకుంటాడని ఊహించని నికోలస్ అనూహ్యంగా ఔట్ అవుటవ్వడంతో భారంతో క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం కివీస్ 26 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఇక కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్(22), లాథమ్(11)లను మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఔట్ చేశాడు. 18పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను ఆ జట్టు సారథి విలియమ్సన్, టేలర్లు ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించిన అనంతరం చహల్ బౌలింగ్‌లో టేలర్ రిటర్న్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లాథమ్‌ను కూడా చహల్ క్రీజులో ఎక్కువసేపు నిలువనీయలేదు. లాథమ్ కూడా చహల్ బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతక ముందు ఆదిలోనే గప్టిల్, మున్రో వికెట్లను తీసి కివీస్‌కు కోహ్లి సేన గట్టి షాక్ ఇచ్చింది. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన వరుస ఓవర్లలో కివీస్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు. తొలుత కివీస్ స్టార్ బ్యాట్స్‌మన్ గప్టిల్(5)ను తన అద్భుత బంతికి బోల్తా కోట్టించిన షమీ.. తన తరువాతి ఓవర్లోనే మరో ఓపెనర్ మున్రో(8)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ సారథి విలియమ్సన్ తొలుత బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు. -
శతక్కొట్టిన గప్టిల్
మౌంట్ మాంగనీ: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (139 బంతుల్లో 138; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఆల్‌రౌండర్ జిమ్మీ నిషామ్ (13 బంతుల్లో 47; 6 సిక్సర్లు) సిక్సర్ల జడివాన కురిపించడంతో న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 45 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. మొదట న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 371 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (74 బంతుల్లో 76; 6 ఫోర్లు), రాస్ టేలర్ (37 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో 14 సిక్స్‌లు నమోదయ్యాయి. వన్డేల్లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్న గప్టిల్ 6000 పరుగుల మైలు రాయిని దాటాడు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 326 పరుగుల వద్ద ఆలౌటైంది. కుశాల్ పెరీరా (86 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. ఓపెనర్లు డిక్వెలా (50 బంతుల్లో 76; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (62 బంతుల్లో 43; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. గప్టిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. శనివారం రెండో వన్డే కూడా ఇక్కడే జరుగుతుంది. 6, 6, 6, 6, 2 (+నోబాల్), 6, 1 ఆరంభం నుంచి గప్టిల్ ధాటి కొనసాగగా... చివర్లో జిమ్మీ నిషామ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47వ ఓవర్ చివరి బంతికి క్రీజ్‌లోకి దిగిన అతను ఒక్క ఓవర్లోనే 34 పరుగులు బాది జట్టు స్కోరును అమాంతం పెంచేశాడు. తిసార పెరీరా వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో నిషామ్ ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. వరుస 4 బంతుల్లో 4 సిక్సర్ల తర్వాత నోబాల్‌కు తోడు 2 పరుగులు తీయగా, మరుసటి బంతికి మళ్లీ సిక్స్ కొట్టాడు. పెరీరా లెంగ్త్ మార్చిన వేసిన చివరి బంతికి కూడా భారీ సిక్సర్‌కే ప్రయత్నించినా మిడ్ వికెట్ దిశగా ఒక పరుగే వచ్చింది. -
మార్టిన్ గప్టిల్ ‘టీ20 బ్లాస్ట్’
నార్తాంప్టన్: న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో గప్టిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వర్సెస్టర్‌షైర్ తరపున బరిలోకి దిగిన గప్టిల్.. శుక్రవారం నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం సాధించాడు. ఫలితంగా ఓవరాల్ టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా నాల్గో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 35 బంతుల్లో టీ20 ఫార్మాట్లో సెంచరీ చేసిన క్రికెటర్లలో డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), రోహిత్ శర్మ(భారత్), లూయిస్ వాన్‌డెర్(నమీబియా)లు ఉన్నారు. కాగా, టీ20ల్లో వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 30 బంతుల్లో సెంచరీ సాధించి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. నార్తాంప్టన్‌షైర్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గప్టిల్ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. జట్టు స్కోరు 162 పరుగుల వద్ద ఉండగా గప్టిల్(102: 38 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అతనికి జతగా జో క్లార్క్(61;33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో వర్సెస్టర్‌షైర్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
రెండు రికార్డులు బ్రేక్ చేశాడు..!
ఆక్లాండ్:న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ సరికొత్త టీ 20 రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ ట్వంటీ 20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తన దేశానికి చెందిన బ్రెండన్ మెకల్లమ్ రికార్డును గప్టిల్ బద్ధలు కొట్టాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గప్టిల్ ఈ మార్కును చేరాడు. 54 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులు సాధించడంతో టీ 20ల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గప్టిల్ గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం గప్టిల్ 2,188 పరుగులతో ముందంజంలో ఉండగా, మెకల్లమ్ 2,140 రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విరాట్ కోహ్లి(1,956) మూడో స్థానంలో నిలిచాడు. కాగా, మెకల్లమ్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా గప్టిల్ బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ తరపున వేగవంతంగా టీ 20 సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 49 బంతుల్లో శతకం సాధించడం ద్వారా మెకల్లమ్ రికార్డును గప్టిల్ సవరించాడు. అంతకుముందు న్యూజిలాండ్ తరపున వేగవంతమైన ట్వంటీ 20 సెంచరీని మెకల్లమ్(50 బంతుల్లో) పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ గప్టిల్ కు తోడు మరో ఓపెనర్ మున్రో (33 బంతుల్లో 76: 6ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో కివీస్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (24 బంతుల్లో 59: 4ఫోర్లు, 5 సిక్సర్లు), షార్ట్ (44 బంతుల్లో 76: 8ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అందించారు. 121 పరుగుల వద్ద వార్నర్ ను కివీస్ బౌలర్ సోదీ బౌల్డ్ చేశాడు. ఆపై క్రిస్ లిన్ (18), మాక్స్వెల్ (14 బంతుల్లో 31: 3ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి షార్ట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో అరోన్ ఫించ్ (14 బంతుల్లో 36: 3ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో 18.5 ఓవర్లలో మరో 7 బంతులుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ట్వంటీ20 చరిత్రలో రికార్డు ఛేజింగ్ ఆసీస్ (245/5) పేరిట నమోదైంది. గతంలో ఈ ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాపై 231 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో విండీస్ ఛేదించింది. -
'ఎప్పటికైనా రోహిత్ రికార్డ్ నేనే బద్దలుకొడతా'
వన్డే క్రికెట్లో సెంచరీలకు, డబుల్ సెంచరీలకు, రికార్డులకు మారుపేరైన జట్టు టీమిండియా. ఇదివరకే వన్డే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలు అద్భుత ద్విశతకాలను సాధించారు. వీరితో పాటు డబుల్ సాధించిన మరో విధ్వంసక క్రికెటర్ మార్టిన్ గప్టిల్. అయితే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును రోహిత్ (264 పరుగులు) తన పేరిట లిఖించుకున్నాడు. కానీ రోహిత్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమిస్తానని చాలెంజ్ విసిరాడు న్యూజిలాండ్ క్రికెటర్ గప్టిల్. వన్డే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానం గప్టిల్ (237 పరుగులు)దేనన్న విషయం తెలిసిందే. 264 అంటేనే అసాధ్యమైన పని తనకు తెలుసునని అయితే ఏదో ఒకరోజు కచ్చితంగా తానే రోహిత్ రికార్డును బద్ధలుకొడతానని గప్టిల్ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో 189, 180 పరుగుల భారీ ఇన్నింగ్స్‌లతో తాను డబుల్ సెంచరీలు చేజార్చుకున్నానని, అయితే 237 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆ కోరిక నెరవేరిందన్నాడు గప్టిల్. అయితే రోహిత్ (264) రికార్డుపేనే తాను దృష్టి పెట్టానని, ఎప్పటికైనా ఆ అరుదైన ఫీట్‌ను అధిగమించి అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని ఈ కివీస్ స్టార్ క్రికెటర్ ఉందన్నాడు. -
మార్టిన్ గప్టిల్ సెన్సేషనల్ క్యాచ్..
-
మార్టిన్ గప్టిల్ సెన్సేషనల్ క్యాచ్..
ముంబై: ఐపీఎల్10లో భాగంగా వాంఖెడే మైదానంలో నిన్న (గురువారం) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ అద్బుతంగా క్యాచ్ పట్టి ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్యాచ్ పట్టినతీరు చూస్తే ఆహా అనాల్సిందే. మ్యాక్స్‌వెల్ బౌలింగ్ లో ముంబై ఓపెనర్ సిమ్మన్స్ భారీ షాట్ ఆడగా ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు గప్టిల్ క్యాచ్ పట్టేందుకు అమాంతం గాల్లోకి ఎగిరాడు. తొలుత రెండు చేతులతో క్యాచ్ పట్టాలని భావించిన గప్టిల్ అది అసాధ్యమని.. ఆ తర్వాత క్షణాల్లో కేవలం ఒంటిచేత్తో అద్భుతంగా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఆపై బౌండరీ లైన్ ను తాకకుండా జాగ్రత్తగా శరీరాన్ని నియంత్రించుకోవడంపై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ముంబై స్కోరు 106 పరుగుల వద్ద సిమ్మన్స్ (32 బంతుల్లో 59: 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్ రూపంలో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. గప్టిల్ పట్టిన క్యాచ్‌కు పంజాబ్ ఆటగాళ్లతో పాటు ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ముగ్దులయ్యారు. ఈ క్యాచ్‌తో గప్టిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ లభించింది. ఈ మ్యాచ్‌లో గప్టిల్ చిరుతలా మైదానంలో వేగంగా కదిలి మరో రెండు క్యాచులు పట్టి నితీశ్ రాణా, రోహిత్ శర్మలు ఔట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. మెరుగైన ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా ఉత్కంఠపోరులో ముంబైపై 7 పరుగుల తేడాతో పంజాబ్ నెగ్గిన విషయం తెలిసిందే. What a beautiful catch... Amazingly done by #Guptill — Abhinav Joshi (@ABHlNAV) 11 May 2017 Woah....! Martin Guptill superman catch✈✈ Catch of the season.😎#MIvKXIP pic.twitter.com/XQ3bByi51v — Sourav Rawat (@SouravRawat_17) 11 May 2017 -
గప్టిల్ 180 నాటౌట్
15 ఫోర్లు, 11 సిక్సర్లతో చెలరేగిన బ్యాట్స్‌మన్ దక్షిణాఫ్రికాపై కివీస్ విజయం హామిల్టన్: న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గాయంతో దాదాపు నెల రోజుల పాటు ఆటకు దూరమైన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ పునరాగమనంలో దక్షిణాఫ్రికాను వణికించాడు. గప్టిల్ (138 బంతుల్లో 180 నాటౌట్; 15 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో బుధవారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (67; 4 ఫోర్లు), ఆమ్లా (40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆ జట్టు ఒక దశలో 128/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. అనంతరం 30 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (59 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అనంతరం న్యూజిలాండ్ 45 ఓవర్లలో 3 వికెట్లకు 280 పరుగులు చేసి గెలిచింది. గప్టిల్, రాస్ టేలర్ (97 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 180 పరుగులు జోడించడం విశేషం. ఘనమైన బ్యాటింగ్...: భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ గప్టిల్ తొలి 11 బంతుల్లో 2 పరుగులే చేశాడు. ఆ తర్వాత చెలరేగిపోయిన అతను 9 బంతుల వ్యవధిలో 2 సిక్సర్లు, 3 ఫోర్లు బాది 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 62 పరుగుల వద్ద ప్రిటోరియస్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినా, రివ్యూలో అది నాటౌట్‌గా తేలడంతో గప్టిల్ బతికిపోయాడు. కొద్ది సేపటి తర్వాత మోరిస్ బౌలింగ్‌లో సింగిల్ తీసి గప్టిల్ 82 బంతుల్లోనే వన్డేల్లో తన 12వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టేలర్ అండతో చివర్లో మరింత చెలరేగిపోయిన గప్టిల్, 45వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది కివీస్‌ను గెలిపించాడు. గప్టిల్ కొట్టిన 11 సిక్సర్లలో 4 సెడెన్ పార్క్ బయట పడ్డాయి. తాహిర్ బౌలింగ్‌లోనే అతను ఐదు సిక్సర్లు బాదడం విశేషం. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. చివరి వన్డే శనివారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. ► కివీస్ తరఫున ఇది (180 నాటౌట్) మూడో అత్యధిక స్కోరు కాగా... మొదటి రెండు (237 నాటౌట్, 189 నాటౌట్) కూడా గప్టిల్ పేరిటే ఉన్నాయి. కనీసం 180 కంటే ఎక్కువ పరుగులు మూడు సార్లు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా గప్టిల్ కావడం విశేషం. ► వన్డేల్లో తొలి ఇన్నింగ్స్‌లో రెండు వైపుల నుంచి స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఈ వన్డేలో కివీస్ స్పిన్నర్లు జీతన్, సాన్‌ట్నర్ కొత్త బంతితో బౌలింగ్ చేశారు. -
భారీ శతకం.. గప్టిల్ ఖాతాలో అరుదైన రికార్డులు
హామిల్టన్: న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా గప్టిల్ అజేయ శతకంతో చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 279 పరుగులు చేసింది. కెప్టెన్ డివిలియర్స్(72), డుప్లిసెస్(67) లు హాఫ్ సెంచరీలు చేయగా, ఓపెనర్ ఆమ్లా(40) రాణించాడు. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్ బ్రౌన్ లై(4) వికెట్ ను త్వరగా కోల్పోయింది. మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 138 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్లతో 180 పరుగులు చేసి చివరి వరకూ నిలిచాడు. ఈ క్రమంలో రెండు రికార్డులను తనఖాతాలో వేసుకున్నాడు. ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో గప్టిల్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఛేజింగ్‌లో అత్యదిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో షేన్ వాట్సన్ (185 నాటౌట్), ధోనీ(183 నాటౌట్), కోహ్లీ(183)ల తర్వాత స్థానం గప్తిల్(180 నాటౌట్)దే. రెండవ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగతంగా అత్యధిక రన్స్ చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ గా గప్టిల్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. ఓపెనర్ బ్రౌన్లీ(4) ఔటయ్యాక కెప్టెన్ విలియమ్సన్ (21)తో కలిసి రెండో వికెట్ కు 72 పరుగులు జోడించాడు గప్టిల్. విలియమ్సన్ ఔటయ్యాక క్రీజులోకొచ్చిన టేలర్‌తో కలిసి పరుగుల సునామీ సృష్టించాడు. టేలర్ హాఫ్ సెంచరీ(66 : 7 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించాడు. టేలర్, గప్టిల్ మూడో వికెట్ కు 180 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. గప్టిల్ సిక్సర్లు, ఫోర్లతో చేలరేగడంతో మరో 30 బంతులు మిగిలుండగానే మూడు వికెట్లు కోల్పోయి కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగో వన్డే గెలుపుతో సిరీస్ 2-2 తో సమమైంది. నిర్ణయాత్మకమైన చివరి వన్డే ఈ నెల 4న ఆక్లాండ్‌లో జరుగుతుంది. -
రెండో వన్డేకు గప్టిల్ దూరం
నేపియర్: చాపెల్-హ్యాడ్లీ వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న గప్టిల్ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రకటించింది. గత వన్డేలో 61 పరుగులతో ఆకట్టుకున్న గప్టిల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గురువారం జరిగే రెండో వన్డేకు గప్టిల్ దూరం కావడం న్యూజిలాండ్ కు కాస్త ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. గప్టిల్ స్థానంలో డీన్ బ్రౌన్లీ చోటు కల్పించారు. 2014లో చివరిసారి న్యూజిలాండ్ జట్టుకు ఆడిన బ్రౌన్లీ దాదాపు రెండేళ్ల తరువాత చోటు దక్కించుకున్నాడు. -
గప్టిల్‌కు ఉద్వాసన
వెల్లింగ్టన్:గత కొంతకాలంగా పేలవమైన కొనసాగిస్తున్న న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌కు ఉద్వాసన పలికారు. పాకిస్తాన్‌తో స్వదేశంలో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు గప్టిల్‌ను న్యూజిలాండ్ సెలక్టర్లు పక్కను పెట్టేశారు.ఈ మేరకు 13మంది సభ్యులతో కూడిన న్యూజిలాండ్ టెస్టు జట్టులో గప్టిల్ తో పాటు, స్పిన్నర్లు, ఇష్ సోథీ, జీతన్ పటేల్, ఫాస్ట్ బౌలర్ డాగ్ బ్రాస్ వెల్, వికెట్ కీపర్ ల్యూక్ రోంచీలకు స్థానం దక్కలేదు. న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాడైన గప్టిల్ ను పక్కకు పెట్టడానికి ప్రధాన కారణం అతని నిలకడలేమి. భారత్ జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో గప్టిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్ ల్లో 21,0, 13, 24, 72, 29 పరుగులు నమోదు చేశాడు. మొత్తంగా 159 పరుగులు చేసి 26.0 సగటుతో నిలిచాడు. మరోవైపు ఆక్లాండ్ ఆటగాడు జీత్ రీవల్, కోలిన్ డీ గ్రాండ్ హోమ్మీలకు తొలిసారి టెస్టుల్లో చోటు కల్పించారు.ఇదిలా ఉండగా, మరోసారి టాడ్ ఆస్టల్కు టెస్టు జట్టులోకి స్థానం దక్కించుకున్నాడు. స్వతహాగా బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన ఆస్టల్ను స్పిన్ ఆప్షన్‌గా ఉపయోగించుకుంటామని న్యూజిలాండ్ సెలక్టర్ గావిన్ లార్సెన్ పేర్కొన్నాడు.గప్టిల్ స్థానంలో జీత్ రీవల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని లార్సెన్ తెలిపాడు.. -
అతన్ని త్వరగా ఔట్ చేయడం వల్లే..!
సిరీస్ నిలబడాలంటే చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ సత్తా చాటింది. 261 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కివీస్ బౌలర్లు సఫలం అయ్యారు. స్టార్ బ్యాట్స్‌మెన్‌తో కూడిన భారత లైనప్‌ను 241 పరుగులకే నిలువరించి.. 19 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకున్నారు. సిరీస్ 2-2తో సమం చేసి.. చివరిదైనా ఐదో వన్డేలో క్లైమాక్స్‌కు తెరతీశారు. నిజానికి రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో భారత జట్టు మొదట్లో నిలకడగా ఆడింది. ఓపెనర్ రహానే 57 పరుగులతో జట్టును లక్ష్యసాధన దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. అతడు సెకండ్ వికెట్‌గా వచ్చిన కోహ్లి (45)తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఆ తర్వాత ధోనీ-రహానే జోడీ కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది, 11 పరుగులు చేసి ధోనీ ఔటవ్వడం.. ఆ తర్వాత 39 పరుగులకే ఐదు వికెట్లు చకచకా పడటంతో టీమిండియా పని అయిపోయింది. చివర్లో టెయిల్ ఎండర్లు పోరాటపటిమ చూపినా పరాజయం తప్పలేదు. అయితే.. న్యూజిలాండ్ గెలుపులో కోహ్లినే త్వరగా ఔట్ చేయడమే అత్యంత కీలక పరిణామమని కివీస్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ అభిప్రాయపడ్డాడు. 84 బంతుల్లో 72 పరుగులు చేసి కివీస్ ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచిన అతడికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 పరుగుల వద్ద కోహ్లిని ఔట్ చేయడం తమకు ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. 'విరాట్ క్లాస్ ఆటగాడు. అతన్ని త్వరగా ఔట్ చేయడం ఆనందమే కదా’ అని అన్నాడు. మాస్టర్ ఛేజర్గా పేరొందిన డ్యాషింగ్ బాట్స్మన్ కోహ్లి ఇటీవల టీమిండియాకు లక్ష్యసాధనలో అద్భుత విజయాలు అందించిన సంగతి తెలిసిందే. మొహాలీలో జరిగిన మూడో వన్డేలో అజేయంగా 154 పరుగులు చేసిన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ధర్మశాలలో జరిగిన మొదటి వన్డేలో 85 పరుగులు చేసి కివీస్ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. కాబట్టి ఈసారి అతన్ని త్వరగా ఔట్ చేయడం వల్లే తమకు విజయం దక్కిందని కివీస్ జట్టు ఆనందపడుతోంది. -
అయ్యో..గప్టిల్!
ఢిల్లీ:భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని అంచనా వేయడంలో విఫలమైన గప్టిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఉమేశ్ యాదవ్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతికి గప్టిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆ బంతిని ఎలా ఆడాలా? అని ఆలోచించుకునే లోపే ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. దాంతో న్యూజిలాండ్ స్కోరు బోర్డు మీద పరుగులేమీ లేకుండానే వికెట్ ను చేజార్చుకుంది. తొలి వన్డేలో 12 పరుగులు చేసిన గప్టిల్.. రెండో వన్డేలో మరింత పేలవంగా వెనుదిరగడంతో న్యూజిలాండ్ ఆదిలోనే ఇబ్బందుల్లో పడింది. భారత పర్యటనలో భాగంగా చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మాత్రమే హాఫ్ సెంచరీ మినహా గప్టిల్ ఇప్పటివరకూ పెద్దగా రాణించలేదు. -
దుమ్మురేపిన గప్టిల్, విలియమ్సన్
టి20ల్లో ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నమోదు రెండో మ్యాచ్‌లో పాక్‌పై కివీస్ గెలుపు హామిల్టన్: మార్టిన్ గప్టిల్ (58 బంతుల్లో 87 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్ (48 బంతుల్లో 72 నాటౌట్; 11 ఫోర్లు) ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. దాంతో పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో న్యూ జిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధిం చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో టి20 గురువారం జరుగుతుంది. సెడాన్ పార్క్ వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (39; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 17.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 171 పరుగులు చేసి నెగ్గింది. ప్రతి బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నం చేయడంతో స్కోరు బోర్డు వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో విలియమ్సన్ 35 బంతుల్లో; గప్టిల్ 40 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా గప్టిల్, విలియమ్సన్ అదే జోరును కొనసాగిస్తూ తొలి వికెట్‌కు అజేయంగా 171 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. టి20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2009లో ఇంగ్లండ్‌పై గ్రేమ్ స్మిత్, బోస్మన్ (దక్షిణాఫ్రికా)లు నెలకొల్పిన 170 పరుగుల భాగస్వామ్యాన్ని వీళ్లు అధిగమించారు. గప్టిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
'టాప్'కు చేరిన గప్టిల్
మెల్ బోర్న్: న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తాజా వన్డే వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వ్యక్తిగత స్కోరు 9 పరుగులకు చేరగానే అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. 541 పరుగులతో టాప్ లో కొనసాగుతున్న శ్రీలంక బ్యాట్స్ మన్ కుమార సంగక్కరను రెండో స్థానానికి పడిపోయాడు. 547 పరుగులతో గప్టిల్ అందరికంటే ముందున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో గప్టిల్ 15 పరుగులు చేసి అవుటయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో గప్టిల్ డబుల్ సెంచరీ(237) సాధించాడు. వన్డే ప్రపంచకప్ లో అత్యధిక వ్యక్తిస్కోరు రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు ఈ ప్రపంచకప్ లో అత్యధిక ఫోర్లు (59) బాదిన ఘనత కూడా అతడిదే. సంగక్కర(57) రెండోస్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్(48) మూడో స్థానంలో నిలిచాడు. -
విండీస్ టార్గెట్ 394 పరుగులు
వెల్లింగ్టన్: ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అజేయ డబుల్ సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 393 పరుగులు చేసింది. విండీస్ కు 394 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఎడాపెడా బాదుతూ కెరీర్ లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. మెక్ కల్లమ్(12) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా గుప్టిల్ అనూహ్యంగా చెలరేగడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. గుప్టిల్ 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లతో 237 పరుగులు చేశాడు. రోంచీ 9, ఇలియట్ 27, ఆండర్సన్ 15, రాస్ టేలర్ 41, విలియమ్సన్ 33, మెక్ కల్లమ్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. విండీస్ బౌలర్లలో టేలర్ 3, రసెల్ 2, వికెట్లు పడగొట్టారు. -
మార్టిన్ గుప్తిల్ డబుల్ సెంచరీ
వెల్లింగ్టన్: :వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి క్వార్టర్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ డబుల్ సెంచరీ మార్కును చేరాడు. 152 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 203 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచకప్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందగా, న్యూజిలాండ్ తరుపున ఏకైక బ్యాట్స్ మెన్ .ఇదిలా ఉండగా వన్డేల్లో ఇదే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు . అంతకుముందు నాకౌట్ దశలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును దాటిన గుప్తిల్.. విండీస్ బౌలర్లపై ఊచకోత కోశాడు. గుప్తిల్ దూకుడుతో న్యూజిలాండ్ 47.1 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయిన 343 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆదిలో బ్రెండన్ మెక్ కల్లమ్(12) పెవిలియన్ కు చేరినా.. తరువాత ఆటగాళ్లు రాణించి న్యూజిలాండ్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. -
గుప్తిల్ అరుదైన ఘనత!
వెల్లింగ్టన్:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి క్వార్టర్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ రోజు ఆటలో 150 పరుగుల మార్కును దాటిన గుప్తిల్ నాకౌట్ దశలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు నాకౌట్ అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్(149) పేరిటి ఉంది. గుప్తిల్ 135 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. అతనికి జతగా కోరీ అండర్ సన్(3) పరుగులతో క్రీజ్ లో ఉండటంతో న్యూజిలాండ్ 41.0 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. నాకౌట్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వారి వివరాలు.. మార్టిన్ గుప్తిల్ 150* ఆడమ్ గిల్ క్రిస్ట్149 రికీ పాంటింగ్ 140 వీవీ రిచర్డ్స్ 138 రోహిత్ శర్మ 137 క్రిస్ హారీస్ 130 -
గుప్టిల్ సెంచరీ
వెల్లింగ్టన్: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీ సాధించాడు. 111 బంతుల్లో 12 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ కాగా, ఈ టోర్నమెంట్ లో రెండోది. 4 పరుగుల వ్యక్తిగత వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత జాగ్రత్తగా ఆడి సెంచరీ కొట్టాడు.27 పరుగులకే మెక్ కల్లమ్ వికెట్ పోగొట్టుకున్న కివీస్ ను ఆదుకున్నాడు. విలియమ్సన్, రాస్ టేలర్ తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. విలియమ్సన్, గుప్టిలన్ రెండో వికెట్ కు 70 బంతుల్లో 62 పరుగులు జోడించారు. టేలర్ తో కలిసి మూడో వికెట్ కు 114 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 35 ఓవర్లలో 187/2 స్కోరు చేసిన కివీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. -
గుప్టిల్ అర్ధ సెంచరీ
వెల్లింగ్టన్: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అర్ధ సెంచరీ సాధించాడు. 64 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 23వ అర్ధసెంచరీ. వన్డేల్లో అతడి ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. 4 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత జాగ్రత్తగా ఆడి హాఫ్ సెంచరీ కొట్టాడు. 27 పరుగలకే మెక్ కల్లమ్ వికెట్ పోగొట్టుకున్న కివీస్ ను ఆదుకున్నాడు. విలియమ్సన్ తో కలిసి రెండో వికెట్ కు 70 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. -
గెలుపు దక్కుతుందా....!
న్యూజిలాండ్ పర్యటనలో ఇంకా విజయం రుచి చూడని భారత్ తొలి గెలుపు అందుకోవాలని పట్టుదలగా ఉంది. తొలి రెండు వన్డేల్లో పోరాడి ఓడిన జట్టు అదే స్ఫూర్తితో మూడో మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. అయితే సిరీస్‌ను డ్రా చేసుకుని మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు రావాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే నాలుగో వన్డే భారత్‌కు కీలకంగా మారింది. హామిల్టన్: న్యూజిలాండ్‌తో గత మ్యాచ్‌లో ఓటమిని తప్పించుకొని ‘టై’గా ముగించగలిగిన ధోని సేన ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఇక్కడి సెడాన్ పార్క్‌లో నేడు నాలుగో వన్డే మ్యాచ్ జరగనుంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో విజయం సాధించే అవకాశం టీమిండియాకు లేకపోయినా మిగతా రెండు మ్యాచ్‌లు గెలిస్తే సిరీస్‌ను కాపాడుకునే స్థితిలో జట్టు ఉంది. జట్టు బ్యాటింగ్ మెరుగ్గా కనిపిస్తుండగా, కివీస్ పరిస్థితులకు తగినదిగా భావించిన భారత బౌలింగ్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. అయితే గత మ్యాచ్ ప్రదర్శన అనంతరం మరో సారి అదే జట్టును ధోని కొనసాగించే అవకాశం ఉంది. మరో వైపు మూడో వన్డేలో అనూహ్యంగా విజయాన్ని కోల్పోయిన కివీస్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను అందుకోవాలని భావిస్తోంది. రైనా ఇప్పుడైనా... కోహ్లి, ధోనిల అద్భుత ఫామ్‌ను మినహాయిస్తే... గత మ్యాచ్‌లో ఓపెనర్లు ఆకట్టుకున్నారు. ఇక రవీంద్ర జడేజా జోరుతో అతని బ్యాటింగ్ బెంగ కూడా తీరింది. అయితే రైనా ఫామ్ మాత్రం ఆందోళనకరంగా ఉంది. గత 30 ఇన్నింగ్స్‌లలో అతను ఒకే ఒక్క అర్ధ సెంచరీ చేశాడు. మరో వైపు రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయినా...అతనికి మరో అవకాశం ఖాయం. బౌలర్ల ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. షమీ, భువనేశ్వర్‌లపై రాణించాల్సిన ఒత్తిడి ఉంది. ఇక అశ్విన్ ఏ మాత్రం ప్రభావం చూపకపోయినా, గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రదర్శన అతని స్థానాన్ని పదిలం చేసింది. మూడో పేసర్‌గా ఆరోన్‌కు మరోసారి అవకాశం దక్కొచ్చు. మెకల్లమ్‌పై ఒత్తిడి... మరో వైపు న్యూజిలాండ్ జట్టులో బౌలర్ బెన్నెట్ స్థానంలో మిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ జట్టు టాప్-4 బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉండి జట్టును నడిపిస్తున్నారు. ఆ పునాదిపైనే చివరి 15 ఓవర్లలో కివీస్ భారీగా పరుగులు సాధిస్తోంది. ఈ క్రమంలో అండర్సన్, రోంచి కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. అయితే కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం తన స్థాయిలో మెరుపులు చూపించలేకపోతున్నాడు. గత రెండు వన్డేల్లో అతను డకౌటయ్యాడు. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రహానే, రైనా, జడేజా, అశ్విన్, ఆరోన్, షమీ, భువనేశ్వర్. న్యూజిలాండ్: బ్రెండన్ మెక్కల్లమ్ (కెప్టెన్), గుప్టిల్, రైడర్, విలియమ్సన్, టేలర్, అండర్సన్, రోంచి, నాథన్ మెక్కల్లమ్, సౌతీ, మెక్లీనగన్, బెన్నెట్/మిల్స్. పిచ్ దాదాపు మూడో వన్డే తరహాలోనే నెమ్మదైన పిచ్ ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సమయంలో మరింత నెమ్మదించవచ్చు. అయితే వికెట్ ఎలా ఉన్నా లక్ష్యఛేదనకే ధోని మొగ్గు చూపే అవకాశం ఉంది. గత మూడు వన్డేల్లోనూ టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగే ఎంచుకుంది. ఆసియా బయట జరిగిన గత 20 మ్యాచుల్లో టాస్ గెలిచిన ప్రతిసారీ భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం. ‘నాకు ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం రావడంతోనే గత మ్యాచ్‌లో బాగా బ్యాటింగ్ చేయగలిగాను. నేను వికెట్లు తీయడం లేదనేది వాస్తవం. అయితే ఇది కొన్ని సార్లు జరుగుతూ ఉంటుంది. అయితే నా బౌలింగ్‌తో సంతృప్తిగా ఉన్నా. లెంగ్త్, స్పీడ్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాను. ప్రాక్టీస్‌లో తప్పులు సరిదిద్దుకుంటున్నా. మేం అద్భుతంగా ఆడకపోయినా అన్ని మ్యాచ్‌లలో విజయానికి చేరువయ్యాం. భారత్ బయట ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో భారత అభిమానులు మమ్మల్ని ప్రోత్సహించడం సంతోషంగా ఉంది’. -ఆర్. అశ్విన్, భారత బౌలర్ ‘గత మ్యాచ్‌లాంటివి జరిగితే ప్రతీ ఆటగాడు ఉద్వేగభరిత స్థితిలో ఆడతాడు. అలాంటప్పుడు తప్పులు సహజం. అయితే వాటిని పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాం. నాలుగో వన్డేలో గెలిచి సిరీస్‌ను సాధించాలని జట్టు పట్టుదలగా ఉంది’. -ల్యూక్ రోంచి, న్యూజిలాండ్ వికెట్ కీపర్ -
గుప్టిల్‌కు మొండిచెయ్యి
ఆక్లాండ్: మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌కు... టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కలేదు. వచ్చే నెల 6 నుంచి భారత్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు కివీస్ జట్టును ఆదివారం ప్రకటించారు. డిసెంబర్లో విండీస్‌తో ఆడిన జట్టునే యథావిధిగా కొనసాగించారు. కుటుంబ కారణాలతో సిరీస్ మధ్యలో రాస్ టేలర్ ఇంటికి వెళ్లే అవకాశం ఉండటంతో రైడర్‌ను కూడా ఎంపిక చేశారు. పీటర్ ఫుల్టన్, రూథర్‌ఫోర్డ్‌పై సెలక్టర్లు నమ్మకం పెట్టారు. భారత సంతతికి చెందిన స్పిన్నర్ సోధికి అవకాశం లభించింది. టెస్టు సిరీస్‌కు ముందు భారత్... కివీస్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఫుల్టన్, రూథర్‌ఫోర్డ్ ఈ మ్యాచ్‌లోనూ ఆడనున్నారు. టెస్టు జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), అండర్సన్, బౌల్ట్, బ్రాస్‌వెల్, ఫుల్టన్, రూథర్‌ఫోర్డ్, సోధి, సౌతీ, టేలర్, వాగ్నేర్, వాట్లింగ్, విలియమ్సన్. -
కివీస్‌దే నాలుగో వన్డే
నీల్సన్: టాప్ ఆర్డర్ రాణించడంతో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 58 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 285 పరుగులు చేసింది. గుప్టిల్ (81), టేలర్ (49), రైడర్ (47), విలియమ్సన్ (47) రాణించారు. బ్రేవో 2, హోల్డర్, బెస్ట్, నరైన్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 33.4 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం రావడంతో మ్యాచ్ సాధ్యపడలేదు. దీంతో డక్‌వర్త్ ప్రకారం ఫలితాన్ని నిర్ణయించారు. సిమన్స్ (43), బ్రేవో (43 నాటౌట్) మెరుగ్గా ఆడగా, ఎడ్వర్డ్స్ (24) ఫర్వాలేదనిపించాడు. మెక్లీంగన్, నాథన్ మెకల్లమ్, విలియమ్సన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. గుప్టిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఐదో వన్డే బుధవారం హామిల్టన్‌లో జరుగుతుంది. సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 285/6 (గుప్టిల్ 81, రైడర్ 47, రాస్ టేలర్ 49, బ్రేవో 2/35); వెస్టిండీస్ ఇన్నింగ్స్: 134/5 (33.4 ఓవర్లలో) (సిమన్స్ 43, బ్రేవో 43 నాటౌట్).