కివీస్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్(PC: ICC)
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును గప్టిల్ బద్దలు కొట్టాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడో టీ20 సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు.
కాగా విండీస్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గప్టిల్ 13 బంతుల్లో 15 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో 3497 పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా గప్టిల్- రోహిత్ శర్మ మధ్య నెంబర్ 1 స్థానం కోసం పోటీ కొనసాగుతూనే ఉంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో కివీస్ 145 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య వెస్టిండీస్.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్(53), బ్రూక్స్(56 నాటౌట్) విజృంభించడంతో జయకేతనం ఎగురవేసింది. 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. తద్వారా 8 వికెట్ల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకుంది. ఇక మొదటి రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ వరుసగా 13, 90 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగుల జాబితాలో టాప్-5లో ఉన్న పురుష క్రికెటర్లు
1.మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)- 3497
2.రోహిత్ శర్మ(ఇండియా)- 3487
3.విరాట్ కోహ్లి(ఇండియా)- 3308
4.పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్)- 2975
5.ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 2855
చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన
Rishabh Pant- Urvashi Rautela: మరీ అంత స్ట్రెస్ తీసుకోకు: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ మరో కౌంటర్!
Martin Guptill to the top!
— ICC (@ICC) August 15, 2022
The @BLACKCAPS opener goes to No.1, though there is an Asia Cup around the corner for two batters in the chasing pack 🏏
More on Guptill's record and #WIvNZ: https://t.co/aws5Z9q9hL pic.twitter.com/cTijVVXjPY
Comments
Please login to add a commentAdd a comment