
అయ్యో..గప్టిల్!
ఢిల్లీ:భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు, ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని అంచనా వేయడంలో విఫలమైన గప్టిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఉమేశ్ యాదవ్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతికి గప్టిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది.
ఆ బంతిని ఎలా ఆడాలా? అని ఆలోచించుకునే లోపే ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. దాంతో న్యూజిలాండ్ స్కోరు బోర్డు మీద పరుగులేమీ లేకుండానే వికెట్ ను చేజార్చుకుంది. తొలి వన్డేలో 12 పరుగులు చేసిన గప్టిల్.. రెండో వన్డేలో మరింత పేలవంగా వెనుదిరగడంతో న్యూజిలాండ్ ఆదిలోనే ఇబ్బందుల్లో పడింది. భారత పర్యటనలో భాగంగా చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మాత్రమే హాఫ్ సెంచరీ మినహా గప్టిల్ ఇప్పటివరకూ పెద్దగా రాణించలేదు.