
ఫైనల్లో కివీస్‌ను, టైటిల్‌ను గెలవొచ్చు
సునీల్ గావస్కర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ , స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్‌నే ప్రభావితం చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విశ్లేషించారు. ‘హిట్‌మ్యాన్’ 25, 30 పరుగులకే పరిమితం కాకుండా ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టోర్నీలో రోహిత్ మెరుపు ఆరంభాల కోసం ప్రతిసారి ఎదురుదాడికి దిగుతున్నాడు. కానీ ఇదే క్రమంలో వెంటనే అవుటవుతున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై చేసిన 41 పరుగులే రోహిత్ అత్యధిక స్కోరుగా ఉంది. దీనిపై గావస్కర్ మాట్లాడుతూ ‘ఒకవేళ రోహిత్ 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తే భారత్ 180 నుంచి 200 పరుగులు సాధిస్తుంది. అప్పుడు రెండు, మూడు వికెట్లు పడినా ఇన్నింగ్స్‌కు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి సులువుగా 350 పరుగుల మార్క్‌ను దాటేస్తుంది. ఈ విషయాన్ని భారత కెపె్టన్ గుర్తుంచుకోవాలి.
ఓపెనింగ్ మెరుపులు మెరిపించి వెళ్లడం కంటే కూడా కాస్త దూకుడుగా ఆడుతూ కనీసం 25–30 ఓవర్ల పాటు క్రీజును అట్టిపెట్టుకుంటే మ్యాచ్ రూపురేఖలే మారుతాయ్. రోహిత్ ఆట ఇన్నింగ్స్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకోవచ్చు’ అని అన్నారు. భారత కెప్టెన్ పాక్‌పై 20, న్యూజిలాండ్‌పై 15, ఆ్రస్టేలియాపై 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అర్ధసెంచరీ కూడా బాదలేకపోయాడు.
న్యూజిలాండ్‌కు నాసిర్ హుస్సేన్ మద్దతు
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయమైన జట్టే అయినప్పటికీ ఫైనల్లో ట్రోఫీ గెలిచే అర్హత న్యూజిలాండ్‌కే ఉందని ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ‘కివీ క్రికెటర్లు చోకర్లు కాదు. ఒత్తిడిలోనూ నిలబడే స్థైర్యం వారికుంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అమీతుమీలో వారంతా శక్తికిమించే పోరాడతారు’ అని వివరించాడు.