
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతన్న మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకంది. కివీస్ ఓపెనర్లు ఇద్దరూ అనూహ్యంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు అదిరే ఆరంభం లభించింది. ఈ సీజన్‌లో తన దైన మార్క్‌తో ఆకట్టుకుంటున్న షెల్డన్ కాట్రెల్ కివీస్‌ను కోలుకోని దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే కివీస్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న కాట్రెల్ అదే ఓవర్ ఐదో బంతికి మరో ఓపెనర్ కోలిన్ మున్రోను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ తన ఇద్దరు ఓపెనర్లను తొలి ఓవర్‌లోనే కోల్పోయింది. ఇలా ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment