న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ టిమ్ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు.
సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్ గప్తిల్‌ను అధిగమించాడు. గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్‌తో కలుపుకుని 123 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్‌లో 110 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్‌లు ఆడాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఆసీస్ గెలుపులో మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment