
గుప్టిల్ అర్ధ సెంచరీ
వెల్లింగ్టన్: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అర్ధ సెంచరీ సాధించాడు. 64 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 23వ అర్ధసెంచరీ. వన్డేల్లో అతడి ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి.
4 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత జాగ్రత్తగా ఆడి హాఫ్ సెంచరీ కొట్టాడు. 27 పరుగలకే మెక్ కల్లమ్ వికెట్ పోగొట్టుకున్న కివీస్ ను ఆదుకున్నాడు. విలియమ్సన్ తో కలిసి రెండో వికెట్ కు 70 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.