
గుప్తిల్ అరుదైన ఘనత!
వెల్లింగ్టన్:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి క్వార్టర్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ రోజు ఆటలో 150 పరుగుల మార్కును దాటిన గుప్తిల్ నాకౌట్ దశలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు నాకౌట్ అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్(149) పేరిటి ఉంది. గుప్తిల్ 135 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు. అతనికి జతగా కోరీ అండర్ సన్(3) పరుగులతో క్రీజ్ లో ఉండటంతో న్యూజిలాండ్ 41.0 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
నాకౌట్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వారి వివరాలు..
మార్టిన్ గుప్తిల్ 150*
ఆడమ్ గిల్ క్రిస్ట్149
రికీ పాంటింగ్ 140
వీవీ రిచర్డ్స్ 138
రోహిత్ శర్మ 137
క్రిస్ హారీస్ 130