![Martin Guptill Goes Berserk With Insane Hitting In Legends 90](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Guptill.jpg.webp?itok=jTntjVIm)
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. లెజెండ్స్ 90 లీగ్ టోర్నీలో గప్టిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గప్టిల్.. సోమవారం రాయ్‌పూర్ వేదికగా బిగ్ బాయ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గప్టిల్, ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంతో రాయ్‌పూర్ స్టేడియం దద్దరిల్లిపోయింది. కేవలం 49 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గప్టిల్.. 16 సిక్స్‌లు, 12 ఫోర్లతో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ రిషి ధావన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ వారియర్స్ నిర్ణీత 90 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్ జట్టు.. నిర్ణీత 90 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. బిగ్ బాయ్స్ బ్యాటర్లలో రాబిన్ బిస్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సౌరబ్ తివారీ(37) పరుగులతో రాణించారు. ఛత్తీస్‌గఢ్ వారియర్స్ బౌలర్లలో మనన్ శర్మ రెండు, అభిమన్యు మిథన్, ఖాలీం ఖాన్ తలా వికెట్ సాధించారు.
తిరుగులేని గప్టిల్..
కాగా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో గప్టిల్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 16 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతనిథ్యం వహించిన గప్టిల్.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా గప్టిల్ ఉన్నాడు. 122 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 3531 పరుగులు చేశాడు. వన్డేల్లోనూ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (7,346) చేసిన మూడో బ్యాటర్‌గా ఉన్నాడు. అతడి కంటే ముందు రాస్ టేలర్ (8,607), స్టీఫెన్ ప్లెమింగ్ (8,007) ఉన్నారు.
చదవండి: ICC Champions Trophy: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
Absolute carnage in Raipur! 🤯
Martin Guptill goes absolutely berserk, smashing 160 runs off just 49 deliveries, including 16 maximums! 😱#Legend90onFanCode pic.twitter.com/6Bpkw4aEA4— FanCode (@FanCode) February 10, 2025
Comments
Please login to add a commentAdd a comment