లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సథరన్ సూపర్ స్టార్స్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్.. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు.
గప్తిల్ శివాలెత్తిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ సూపర్ స్టార్స్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు) 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సథరన్ సూపర్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో గోస్వామి 18, మసకద్జ 1, చతురంగ డిసిల్వ 26, చిరాగ్ గాంధీ 36, పవన్ నేగి 8, జెసల్ కరియా 1, చిగుంబర 20 (నాటౌట్), సుబోత్ భాటి 1 (నాటౌట్) పరుగు చేశారు. మణిపాల్ టైగర్స్ బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనురీత్ సింగ్, పియెనార్, రాహుల్ శుక్లా, ఏంజెలో పెరీరా తలో వికెట్ దక్కించుకున్నారు.
195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. హమీద్ హసన్ (3/20), అబ్దుర్ రజాక్ (2/30), మోను కుమార్ (2/44), జెసల్ కరియా (2/29), పవన్ నేగి (1/0) ధాటికి 13.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో ఉతప్ప 17, అసేల గుణరత్నే 22, తిసార పెరీరా 37, అనురీత్ సింగ్ 10, హర్భజన్ సింగ్ 11, ఏంజెలో పెరీరా 5 పరుగులు చేయగా.. సౌరభ్ తివారి, అమిత్ వర్మ, పియెనార్ డకౌట్లు అయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సథరన్ సూపర్ స్టార్స్ ప్రస్తుత ఎల్‌ఎల్‌సీ ఎడిషన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది.టైగర్స్ ఇంకా బోణి కొట్టాల్సి ఉంది.
చదవండి: భారత్‌కు బిగ్ షాక్.. ఆసీస్ సిరీస్‌కూ స్టార్ ప్లేయర్ దూరం!
Comments
Please login to add a commentAdd a comment