టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి. భారత్ విషయానికి వస్తే గ్రూపు-ఏలో ఉంది.
గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు పాకిస్తాన్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ జట్లు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడుతుంది. అనంతరం జూన్ 9న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది.
సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే..
ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు చేరే జట్లను న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంచనా వేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కచ్చితంగా సెమీస్‌కు చేరుతాయని, నాలుగో జట్టుగా ఇంగ్లండ్ లేదా పాకిస్తాన్ వచ్చే అవకాశముందని గప్టిల్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ తరపున 112 టీ20లు ఆడిన గప్టిల్ 3531 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా గప్టిల్ కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment