
'టాప్'కు చేరిన గప్టిల్
మెల్ బోర్న్: న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తాజా వన్డే వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వ్యక్తిగత స్కోరు 9 పరుగులకు చేరగానే అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. 541 పరుగులతో టాప్ లో కొనసాగుతున్న శ్రీలంక బ్యాట్స్ మన్ కుమార సంగక్కరను రెండో స్థానానికి పడిపోయాడు. 547 పరుగులతో గప్టిల్ అందరికంటే ముందున్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో గప్టిల్ 15 పరుగులు చేసి అవుటయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో గప్టిల్ డబుల్ సెంచరీ(237) సాధించాడు. వన్డే ప్రపంచకప్ లో అత్యధిక వ్యక్తిస్కోరు రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు.
అంతేకాదు ఈ ప్రపంచకప్ లో అత్యధిక ఫోర్లు (59) బాదిన ఘనత కూడా అతడిదే. సంగక్కర(57) రెండోస్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్(48) మూడో స్థానంలో నిలిచాడు.