
మార్టిన్ గుప్తిల్ డబుల్ సెంచరీ
వెల్లింగ్టన్: :వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి క్వార్టర్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ డబుల్ సెంచరీ మార్కును చేరాడు. 152 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 203 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచకప్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందగా, న్యూజిలాండ్ తరుపున ఏకైక బ్యాట్స్ మెన్ .ఇదిలా ఉండగా వన్డేల్లో ఇదే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు .
అంతకుముందు నాకౌట్ దశలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును దాటిన గుప్తిల్.. విండీస్ బౌలర్లపై ఊచకోత కోశాడు. గుప్తిల్ దూకుడుతో న్యూజిలాండ్ 47.1 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ ఐదు వికెట్లు కోల్పోయిన 343 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆదిలో బ్రెండన్ మెక్ కల్లమ్(12) పెవిలియన్ కు చేరినా.. తరువాత ఆటగాళ్లు రాణించి న్యూజిలాండ్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.