
విండీస్ టార్గెట్ 394 పరుగులు
వెల్లింగ్టన్: ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అజేయ డబుల్ సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 393 పరుగులు చేసింది. విండీస్ కు 394 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఎడాపెడా బాదుతూ కెరీర్ లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.
మెక్ కల్లమ్(12) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా గుప్టిల్ అనూహ్యంగా చెలరేగడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. గుప్టిల్ 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లతో 237 పరుగులు చేశాడు. రోంచీ 9, ఇలియట్ 27, ఆండర్సన్ 15, రాస్ టేలర్ 41, విలియమ్సన్ 33, మెక్ కల్లమ్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. విండీస్ బౌలర్లలో టేలర్ 3, రసెల్ 2, వికెట్లు పడగొట్టారు.