
గుప్టిల్ సెంచరీ
వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీ సాధించాడు.
వెల్లింగ్టన్: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీ సాధించాడు. 111 బంతుల్లో 12 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ కాగా, ఈ టోర్నమెంట్ లో రెండోది.
4 పరుగుల వ్యక్తిగత వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత జాగ్రత్తగా ఆడి సెంచరీ కొట్టాడు.27 పరుగులకే మెక్ కల్లమ్ వికెట్ పోగొట్టుకున్న కివీస్ ను ఆదుకున్నాడు. విలియమ్సన్, రాస్ టేలర్ తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
విలియమ్సన్, గుప్టిలన్ రెండో వికెట్ కు 70 బంతుల్లో 62 పరుగులు జోడించారు. టేలర్ తో కలిసి మూడో వికెట్ కు 114 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 35 ఓవర్లలో 187/2 స్కోరు చేసిన కివీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.