![PSL 2023: Quetta Gladiators Beat Karachi Kings By 4 Wickets - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/7/Untitled-2.jpg.webp?itok=ZAgi28og)
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో క్వెట్టా గ్లాడియేటర్స్ 5 మ్యాచ్‌ల తర్వాత ఓ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన గ్లాడియేటర్స్.. 2 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కరాచీ కింగ్స్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. గ్లాడియేటర్స్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (56 బంతుల్లో 86; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన అర్ధసెంచరీతో గ్లాడియేటర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. గప్తిల్‌కు మరో ఎండ్ నుంచి ఎవరి సపోర్ట్ లేనప్పటికీ, ఒంటరి పోరాటంచేసి తన జట్టును గెలిపించుకున్నాడు.
గప్తిల్‌కు సర్ఫరాజ్ అహ్మద్ (29), మహ్మద్ నవాజ్ (15), డ్వేన్ ప్రిటోరియస్ (10 నాటౌట్) నుంచి ఓ మోస్తరు మద్దతు లభించింది. కరాచీ బౌలర్లలో తబ్రేజ్ షంషి 2 వికెట్లు పడగొట్టగా.. ఆమెర్ యామిన్, ముహ్మద్ మూసా, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు కరాచీ ఇన్నింగ్స్‌లో రొస్సింగ్టన్ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో మెరవగా.. ఇమాద్ వసీం (30 నాటౌట్), ఆమెర్ యామిన్ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో నసీం షా, ఐమల్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ నవాజ్, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 7) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పెషావర్ జల్మీ-లాహోర్ ఖలందర్స్ తలపడనుండగా.. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇస్లామాబాద్-ముల్తాన్ సుల్తాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment