
Martin Guptil Comments Vs Pakistan Match In T20 Worldcup.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పాకిస్తాన్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.''రానున్న టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్ మిగతా అన్ని మ్యాచ్‌ల కంటే కాస్త కఠినంగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌తో గెలవడం మాకు కష్టతరమైన పనిగా అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ జట్టు బలంగా తయారైందని.. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. టెస్టులు.. పరిమిత ఓవర్ల సంగతి ఎలా ఉన్నా టి20ల్లో మాత్రం పాక్ ఎప్పుడు బలంగానే కనిపిస్తుంది. ఆ జట్టుతో సిరీస్ రద్దు కాకపోయుంటే బాగుండేదనిపిస్తుంది. ఒకవేళ ఆ సిరీస్ మేము ఆడి ఉంటే పాకిస్తాన్ ఆటతీరు మరింత స్పష్టంగా తెలిసేది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2021: టాస్ గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్ చేరినట్టేనా!
కాగా టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్ ఏలో ఉన్న న్యూజిలాండ్‌తో పాటు పాకిస్తాన్, భారత్, అఫ్గానిస్తాన్‌తో పాటు టోర్నీకి అర్హత సాధించే జట్లు ఉండనున్నాయి. ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ముఖాముఖిగా ఐదుసార్లు తలపడగా.. 3-2 తేడాతో పాకిస్తాన్ ఆధిక్యంలో ఉంది. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు ఇరు జట్లు టి20ల్లో 24సార్లు తలపడగా.. 10 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించగా.. మిగిలిన 14 సార్లు పాకిస్తాన్ గెలిచింది. కాగా న్యూజిలాండ్ అక్టోబర్ 26న తమ మొదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది.
చదవండి: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే...
పాక్ జట్టుకు బంపర్ ఆఫర్.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడిస్తే..
Comments
Please login to add a commentAdd a comment