
బర్మింగ్‌హమ్: హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరితే అంతకన్నా దురదృష్టం ఉండదు. బ్యాట్స్‌మన్ స్వీయ తప్పిదం కారణంగానే వికెట్‌ను హిట్ వికెట్‌గా సమర్పించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ హిట్ వికెట్‌గా నిష్క్రమించాడు. న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో భాగంగా ఫెహ్లుక్వాయో వేసిన 15 ఓవర్ చివరి బంతికి గప్టిల్ అదుపు తప్పి కాలితో వికెట్లను పడగొట్టడంతో హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. పుల్‌షాట్ ఆడబోయిన గప్టిల్ బ్యాలెన్స్ చేసుకోవడంలో విఫలం కావడంతో వికెట్లను తాకాడు.
(ఇక్కడ చదవండి: విన్నర్ విలియమ్సన్)
దాంతో బెయిల్స్ పడిపోవడం గప్టిల్ నవ్వుకుంటూ పెవిలియన్ చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. గప్టిల్ మంచి టచ్‌లోకి వచ్చిఏ సమయంలో వికెట్‌ను ఇలా అనవరసరంగా కోల్పోవడంతో అది చూసిన కివీస్ అభిమానులు మాత్రం కాసింత డీలా పడ్డారు. సఫారీలతో మ్యాచ్‌లో గప్టిల్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ వరల్డ్‌కప్ ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.(ఇక్కడ చదవండి: అయ్యో.. అది ఔటా?)
Comments
Please login to add a commentAdd a comment