మరికొద్ది గంటల్లో టీమిండియా, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. టి20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు పాకిస్తాన్ మాత్రం భారత్‌పై మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఎవరు గెలుస్తారన్న సంగతి పక్కనబెడితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఒక అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ 3497 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 3487 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కేవలం పది పరుగుల దూరంలో మాత్రమే ఉన్న రోహిత్‌కు ఈ రికార్డు అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక మూడో స్థానంలో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి 99 మ్యాచ్‌ల్లో 3308 పరుగులతో ఉన్నాడు. కాగా కోహ్లికి పాకిస్తాన్‌తో మ్యాచ్ వందో టి20 కావడం విశేషం. మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కనున్నాడు.
చదవండి: Asia Cup 2022: ఇండియా-పాక్ మ్యాచ్ చూస్తే రూ. 5000 జరిమానా..!
Comments
Please login to add a commentAdd a comment