ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే యమా క్రేజ్ ఉంటుంది. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ వస్తుందంటే చాలు అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. గతంలో టీమిండియా, పాకిస్తాన్‌లు దైపాక్షిక సిరీస్‌లు ఆడిన సందర్భాల్లోనే అభిమానులు విపరీతంగా చూసిన దాఖలాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌లు 200 సార్లు తలపడ్డాయి. పాకిస్థాన్ 87 విజయాలతో ముందంజలో ఉండగా.. భారత్ 71 మ్యాచ్‌లు గెలిచి 38 డ్రా చేసుకుంది.
ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు చెదరడంతో కేవలం మేజర్ టోర్నీల్లో మాత్రమే తలపడుతూ వస్తున్నాయి. ఐసీసీ టోర్నీలతో పాటు ఆసియా కప్ కూడా ఇందులో భాగమే. ఆసియా కప్‌లో దాయాదులు ఎన్నిసార్లు తలపడ్డారు.. అత్యధిక పరుగులు ఎవరివి.. అత్యధిక వికెట్లు తీసినది ఎవరు అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
►1984 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు 14 మ్యాచులు జరిగాయి. ఇందులో భారత్ 8 మ్యాచుల్లో గెలవగా.. పాకిస్తాన్ 5 సార్లు నెగ్గింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.
►ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ - 2022 15వ ఎడిషన్. గతంలో దీనిని వన్డే ఫార్మాట్ లో నిర్వహించినా తర్వాత వన్డే లేదా టీ20 ప్రపంచకప్ ముందు నిర్వహిస్తే దానికనుగుణంగా ఈ మెగా టోర్నీని జరుపుతూ వస్తున్నారు
►అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ఉన్నందున ఇప్పుడు టోర్నీని టీ20 ఫార్మాట్ లో జరుపుతున్నారు. ఇందులో భాగంగా 2016లో నిర్వహించిన టీ20 మ్యాచ్ లో భారత్ నే విజయం వరించింది. అంతేగాక ఆసియా కప్ లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మూడు మ్యాచులలో భారత్ దే గెలుపు. ఆసియా కప్ లో చివరిసారి పాకిస్తాన్.. 2014లో భారత్ పై నెగ్గింది.
►ఆసియా కప్ లో ఇరు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక టీ20లో భారత్ విజయం సాధించింది. అయితే రెండు జట్ల నడుమ ఇప్పటివరకు 9 టీ20లు జరుగగా.. అందులో భారత్ 6 గెలిచింది. పాకిస్తాన్ 2 నెగ్గింది. ఒకటి టై అయింది.
ఇరు దేశాల మధ్య జరిగిన మ్యాచులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్స్
►షోయభ్ మాలిక్ - ఆరు ఇన్నింగ్స్ లలో 432 పరుగులు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
►రెండో స్థానంలో రోహిత్ శర్మ - 8 ఇన్నింగ్స్లలో 367 పరుగులు
►మూడో స్థానంలో విరాట్ కోహ్లీ- 4 ఇన్నింగ్స్‌లలలో 255 పరుగులు ఉన్నారు.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
►సయీద్ అజ్మల్ - నాలుగు ఇన్నింగ్స్ లలో 8 వికెట్లు
►అనిల్ కుంబ్లే- మూడు ఇన్నింగ్స్లలో ఏడు వికెట్లు
►అబ్దుల్ రజాక్-మూడు ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు
ఆసియా కప్‌లో రెండు దేశాల మధ్య అత్యధిక స్కోరు : ఇండియా.. 330-4 (2012లో), పాకిస్తాన్.. 329/6(2012లో)
అత్యల్ప స్కోరు : ఇండియా (169 ఆలౌట్.. 1995లో) పాకిస్తాన్ (83 ఆలౌట్.. 2016లో)
Comments
Please login to add a commentAdd a comment