భారత్, పాక్ మ్యాచ్‌లో ఉండే హైవోల్టేజ్ ఎలా ఉంటుందో రెండు దేశాల అభిమానుల్లో ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. నరనరానా దేశభక్తి పొంగే మ్యాచ్ కావడంతో ఉత్కంఠతో పాటు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. పెద్దోళ్ల నుంచి బుడ్డోళ్ల వరకు ఇరు దేశాల అభిమానులు గెలుపు మాదంటే మాది అని కత్తులు దూసుకుంటారు. తాజాగా ఆసియాకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో నవ్వులు పూయిస్తుంది.
ఆ వీడియోలో ఇద్దరు బుడ్డోళ్లు ఉంటారు. ఒకడు పాకిస్తాన్‌కు చెందినవాడు.. మరొక బుడ్డోడు టీమిండియాకు అభిమాని. మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నువ్వా-నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు. వీరికి మధ్యలో ఉన్న ఒక వ్యక్తి వారిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ బుడ్డోళ్లు ఇద్దరు సదరు వ్యక్తిని కనీసం లెక్క కూడా చేయరు.. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుందని జాఫర్ భయ్యా చిన్న ఉదాహరణతో ఇలా వివరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు 14 సార్లు తలపడితే 8సార్లు టీమిండియా, ఐదు సార్లు పాకిస్తాన్ విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా మెషిన్ రన్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. సెంచరీ చేసి నాలుగేళ్లు కావొస్తుండడం.. అతనికిది వందో టి20 కావడంతో కోహ్లిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాగా టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కనున్నాడు.
India and Pakistan fans on social media today 😄 #INDvsPAK #AsiaCup pic.twitter.com/8O6P24MrCT
— Wasim Jaffer (@WasimJaffer14) August 28, 2022
చదవండి: Asia Cup IND Vs PAK: పాక్‌తో మ్యాచ్.. జోరుగా బెట్టింగ్‌లు, టీమిండియా గెలవాలని పూజలు
Asia Cup 2022 Ind Vs Pak: నల్ల బ్యాండ్‌లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే?
Comments
Please login to add a commentAdd a comment