Asia Cup 2022 IND VS PAK: ఉత్కంఠ పోరులో పాక్‌ విజయం | Asia Cup 2022: Ind vs Pak Super 4 match Updates and Highlights | Sakshi
Sakshi News home page

Asia Cup 2022 IND VS PAK: ఉత్కంఠ పోరులో పాక్‌ విజయం

Published Sun, Sep 4 2022 6:50 PM | Last Updated on Sun, Sep 4 2022 11:42 PM

Asia Cup 2022: Ind vs Pak Super 4 match Updates and Highlights - Sakshi

దుబాయ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌ 4 మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా పాక్‌ ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో.. ఆసిఫ్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అర్ష్‌దీప్‌ సింగ్‌ జారవిడిచాడు.

దీంతో ఒక్క సారిగా మ్యాచ్‌ ఫలితం తారుమారు అయిపోయింది. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆసిఫ్ అలీ 16 పరుగులు సాధించి పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా పాక్‌ బ్యాటర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌ 71 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడగా..  మహ్మద్‌ నవాజ్‌(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, బిష్ణోయ్‌, ఆర్ష్‌దీప్‌, హార్దిక్‌, చాహల్‌ తలా వికెట్‌ సాధించారు. 

కాగా అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.  భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(60) అర్ధ సెంచరీతో చేలరేగగా..  రోహిత్‌ శర్మ(28), కేఎల్‌ రాహుల్‌(28) పరుగులతో రాణించారు.  కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌, హార్ధిక్‌ పాండ్యా నిరాశపరిచారు. ఇక పాకిస్తాన్‌ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్‌ షా, మహ్మద్ హస్నైన్,నవాజ్‌ తలా వికెట్‌ సాధించారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది.  147 పరుగుల వద్ద మహ్మద్‌ రిజ్వాన్‌(71) వికెట్‌ పాక్‌ కోల్పోయింది.  హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇ‍చ్చి ఔటయ్యాడు. పాక్‌ విజయానికి 18 బంతుల్లో 33 పరుగులు కావాలి.
మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
136 పరుగుల వద్ద పాకిస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న నవాజ్‌(42).. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. పాక్‌ విజయానికి అఖరి నాలుగు ఓవర్లలో 43 పరుగులు కావాలి.

14 ఓవర్లకు స్కోర్‌: 119/2
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ధీటుగా ఆడుతోంది. 14 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్‌(55), నవాజ్‌(33) పరుగులతో ఉన్నారు.

12 ఓవర్లకు పాకిస్తాన్‌ స్కోర్‌: 96/2
12 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్‌(46), నవాజ్‌(20) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
63 పరుగుల వద్ద పాకిస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జమాన్‌.. చాహల్‌ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 9 ఓవర్లు ముగిసే సరికి పాక్‌ స్కోర్‌: 67/2

8 ఓవర్లకు పాకిస్తాన్‌ స్కోర్‌: 57/1
8 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్‌(32), ఫఖర్‌ జమాన్‌(10) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌.. బాబర్‌ ఔట్‌
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బాబర్‌ ఆజాం.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 4 ఓవర్లకు పాకిస్తాన్‌ స్కోర్‌: 22/1

చేలరేగిన కింగ్‌ కోహ్లి.. పాకిస్తాన్‌ టార్గెట్‌ 182 పరుగులు
పాకిస్తాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.  భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(60) అర్ధ సెంచరీతో చేలరేగగా..  రోహిత్‌ శర్మ(28), కేఎల్‌ రాహుల్‌(28) పరుగులతో రాణించారు.  కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌, హార్ధిక్‌ పాండ్యా నిరాశపరిచారు. ఇక పాకిస్తాన్‌ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్‌ షా, మహ్మద్ హస్నైన్,నవాజ్‌ తలా వికెట్‌ సాధించారు.

అర్ధసెంచరీతో చేలరేగిన కింగ్‌ కోహ్లి
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లి అద్భుతమైన అర్ధసెంచరీ సాధించాడు. 36 బంతుల్లో కోహ్లి తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం విరాట్‌ 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక 18 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

టీమిండియాకు బిగ్‌ షాక్‌.. హార్దిక్‌ ఔట్‌
టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యా.. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ హస్నైన్ బౌలింగ్‌లో నవాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో దీపక్‌ హుడా, విరాట్‌ కోహ్లి ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
126 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన పంత్‌.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో హార్దిక్‌ పాండ్యా, కోహ్లి ఉన్నారు.

13 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 118/3
13 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(33), పంత్‌(9) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌.. సూర్యకుమార్‌ ఔట్‌
91 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. నవాజ్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(13) ఔటయ్యాడు. క్రీజులోకి రిషబ్‌ పంత్‌ వచ్చాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. రాహుల్‌ ఔట్‌
62 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రాహుల్‌(28).. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌, కోహ్లి ఉన్నారు.



తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
54 పరుగులు వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు.
దూకుడుగా ఆడుతోన్న భారత ఓపెనర్లు
టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా  పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(27), కేఎల్‌ రాహుల్‌(19) పరుగులతో ఉన్నారు.

రెండు ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 20/0
రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(15), కేఎల్‌ రాహుల్‌(5) పరుగులతో ఉన్నారు.

ఆసియాకప్‌-2022లో భాగంగా సూపర్‌-4 దశలో భారత్‌- పాక్‌ జట్లు దుబాయ్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది.

ఈ మ్యాచ్‌కు వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇక హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న హార్దిక్‌ పాండ్యా తిరిగి జట్టలోకి వచ్చాడు.  అదే విధంగా దీపక్‌ హుడా, రవి బిష్ణోయ్‌కు తొలిసారిగా తుది జట్టులోకి చోటు దక్కింది. మరోవైపు పాకిస్తాన్‌ ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయ పడిన పేసర్‌ దహాని స్థానంలో మహ్మద్ హస్నైన్కకు చోటుదక్కింది. 

తుది జట్లు
టీమిండియా: రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్

పాకిస్తాన్‌: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్
చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్‌ శర్మ!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement