Sports News In Telugu
-
జాతీయ రైఫిల్ కొత్త అధ్యక్షుడిగా కాళికేశ్
న్యూఢిల్లీ: జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) నూతన అధ్యక్షుడిగా కాళికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ ఎన్నికయ్యారు. శనివారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన రైఫిల్ సంఘం జనరల్ బాడీ మీటింగ్ ఎన్నికల్లో ఒరిస్సాకు చెందిన మాజీ ఎంపి కాళికేశ్ 36–21 ఓట్ల తేడాతో ప్రత్యర్థి వి.కె.ధల్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. కొన్నాళ్లుగా కాళికేశ్ ఎన్ఆర్ఏఐ రోజూవారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యల్లో ఎవరైనా గరిష్టంగా 12 ఏళ్లకు మించి పదవుల్లో ఉండటానికి వీలు లేదు. దీంతో 2010 నుంచి 2022 వరకు పలు దఫాలు అధ్యక్షుడిగా ఎన్నికైన రణీందర్ సింగ్ గతేడాది కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు.అప్పటినుంచి సీనియర్ ఉపాధ్యక్షుడైన కాళికేశ్ జాతీయ రైఫిల్ సంఘం వ్యవహారాలను చక్కబెట్టారు. తాజా ఎన్నికతో ఆయన 2025 వరకు అధ్యక్ష పదవిలో ఉంటారు. ఆయన తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన హయాంలోనే పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. అంతకుముందు జరిగిన రియో–2016, టోక్యో–2020 ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఒక్క పతకం కూడా గెలుపొందలేకపోయారు. -
IPL 2024: ఫైనల్లో ఎస్ఆర్హెచ్ చిత్తు.. చాంపియన్‌గా కేకేఆర్
-
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్‌లో నటాషా (ఫొటోలు)
-
కింగ్స్ పోరులో పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
-
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
-
IPL 2024: మేము కొడితే ఇంతలా రీసౌండ్ వస్తుందని మాకే తెలియదు!
-
IPL 2024: రాయల్స్ రాజసమా? కోల్‌కతా మరో మోతా?
-
రాజ్‌కోట్ టెస్ట్: టీమిండియాకు షాక్.. అశ్విన్ ఔట్
ఢిల్లీ: టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. అతని తల్లికి ఆరోగ్యం బాగోలోద ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే అశ్విన్ మ్యాచ్ నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్ఇండియా జట్టు అందిస్తుందని పేర్కొంది. R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency. In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR — BCCI (@BCCI) February 16, 2024 ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఎక్స్(ట్విటర్) వేదికగా ఒక పోస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో తన తల్లికి దగ్గర ఉండడం కోసం అశ్విన్ రాజ్‌కోట్ నుంచి చెన్నై వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆమె తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మ్యాచ్‌లో అశ్విన్ శుక్రవారం ఒక వికెట్ తీసి 500 వికెట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా ఘనతకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇటువంటి తరుణంలో జట్టుకు అశ్విన్ దూరం కావడం పెద్దదెబ్బే. -
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024.. రోహిత్ పరిస్థితేంటి..!
-
ప్రపంచ కప్ ఓటమికి మనోడే మనకు విలన్!
-
రెండోసారి కప్ గెలిచిన సన్ రైజర్స్ కావ్య పాప సందడి మాములుగా లేదు
-
ప్రపంచ ఛాంపియన్లు వీళ్లే.. ఓ క్రీడాంశంలో భారత్ కూడా..!
వివిధ క్రీడాంశాల్లో (పురుషులు) ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లపై (టీమ్ గేమ్స్) ఓ లుక్కేద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరిగే 17 రకాల క్రీడల్లో 17 దేశాలకు చెందిన జట్లు జగజ్జేతలుగా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో భారత్ కూడా ఉంది. క్యారమ్స్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. ఈ జాబితాలో యూఎస్ఏ అత్యధికంగా మూడు క్రీడాంశాల్లో వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. గోల్ఫ్, లాక్రాస్, అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాంశాల్లో యూఎస్ఏ డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. యూఎస్ఏ తర్వాత స్పెయిన్ అత్యధికంగా రెండు క్రీడాంశాల్లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. స్పెయిన్ బాస్కెట్‌బాల్, టెన్నిస్‌లలో వరల్డ్ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. పాకిస్తాన్ సైతం ఓ క్రీడాంశంలో వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. కబడ్డీలో పాక్ జగజ్జేతగా ఉంది. వివిధ క్రీడల్లో వరల్డ్ ఛాంపియన్లు (పురుషులు).. క్యారమ్స్: భారత్ క్రికెట్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్: అర్జెంటీనా గోల్ఫ్: యూఎస్ఏ లాక్రాస్: యూఎస్ఏ అమెరికన్ ఫుట్‌బాల్: యూఎస్ఏ టెన్నిస్: స్పెయిన్ బాస్కెట్‌బాల్: స్పెయిన్ బ్యాడ్మింటన్: డెన్మార్క్ కబడ్డీ: పాకిస్తాన్ చెస్: నార్వే హాకీ: జర్మనీ వాలీబాల్: బ్రెజిల్ బేస్‌బాల్: జపాన్ రగ్భీ: సౌతాఫ్రికా సాఫ్ట్‌బాల్: ఆస్ట్రేలియా టేబుల్ టెన్నిస్: చైనా -
టీమిండియాకు షాక్.. రెండో వన్డేలో విండీస్ విజయం
రెండో వన్డేలో టీమిండియాకు కరిబీయన్ జట్టు షాకిచ్చింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 36.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యఛేదనకు బరిలోకి వెస్టీండీస్ తరఫున ఓపెనర్ కైల్ మేయర్స్ 36 పరుగులతో రాణించాడు. విండీస్ కెప్టెన్ షై హోప్(63 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కీసీ కార్టీ(48) పరుగులతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. కాగా.. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లతో రాణించగా.. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. విండీస్ తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌లో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓవర్లలోనే 181 పరుగులకు చాప చుట్టేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55), శుభ్‌మన్ గిల్ ( 49 బంతుల్లో 34) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. -
టీమిండియా సెలెక్టర్లకు విషమ పరీక్ష.. ఛాలెంజ్ విసురుతున్న మరో ఓపెనర్..!
ఇటీవలికాలంలో అదిరిపోయే ప్రదర్శనలతో భారత క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన కొందరు క్రికెటర్లలో 21 ఏళ్ల చెన్నై కుర్రాడు సాయి సుదర్శన్ ప్రథముడు. గత ఐపీఎల్ సీజన్‌తో వెలుగులోకి వచ్చిన సాయి.. ఆ సీజన్లో వరుసగా 22, 62, 53, 19, 20, 41, 43, 96 స్కోర్లు (8 మ్యాచ్‌ల్లో 141.41 స్ట్రయిక్ రేట్‌తో 51.71 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 362 పరుగులు) చేసి సత్తా చాటాడు. ఐపీఎల్-2023లో సాయి మెరిసినప్పటికీ, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్ల ఆసాధారణ ప్రదర్శన అతనిని డామినేట్ చేసింది. అయితే అంతటితో ఆగని సాయి.. ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ రెచ్చిపోయాడు. ఈ దేశవాలీ లీగ్‌లో 90, 14, 7, 83, 41 స్కోర్లు చేసిన సాయి.. ఈ లీగ్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్‌రేట్‌తో 64.20 సగటున 2 అర్ధసెంచరీ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ వరుస సక్సెస్‌లతో సాయికి టీమిండియా నుంచి పిలుపు అందుతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్లతో టీమిండియా యంగ్ ఓపెనర్ల బెంచ్ బలంగా ఉండటంతో సాయికి అవకాశం దక్కలేదు. అయితే, ఈ సీజన్లోనే ఎలాగైనా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలగా ఉండిన సాయి.. ప్రస్తుతం జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 100 స్ట్రయిక్‌రేట్‌తో 170 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 170 పరుగులు చేశాడు. నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన సాయి, ఈ సారి మాత్రం భారత సెలెక్టర్లకు గట్టి ఛాలెంజ్ విసిరాడు. టీమిండియాలో చోటు కోసం తనను తప్పక పరిగణలోకి తీసుకోవాలని బ్యాట్‌తో సవాల్ చేశాడు. సాయి ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసి భారత సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉన్నవాళ్లకు అవకాశాలు లేక సతమతమవుతుంటే కొత్తగా సాయి తయారయ్యాడేంట్రా అని అనుకుంటున్నారు. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ అయ్యే లోగా సాయి మరో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడితే ఏం చేయాలో తెలియక వారు లోలోన మధన పడుతున్నారు. మొత్తానికి యువ ఓపెనర్ల విషయం భారత సెలెక్టర్లను విషమ పరీక్షలా మారింది. -
ధోనిసేన శుభారంభం.. ఎగసిన సీఎస్కే జెండా
-
బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే సెమీస్ బెర్త్!
సాధారణంగా అయితే బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ అంటే ఎలాంటి విశ్లేషణలు లేకుండా మనదే గెలుపు ఖాయమని అందరిలో నమ్మకం. అయితే కొంత కాలంగా బంగ్లాతో మ్యాచ్‌లు కూడా ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. తుది ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చినా... మ్యాచ్‌లో వేర్వేరు దశల్లో బంగ్లా అనూహ్యంగా చెలరేగి మన జట్టును ఇబ్బంది పెడుతోంది. పాక్‌తో మ్యాచ్ తరహాలో అభిమానులు కూడా అదనంగా కొన్నిసార్లు తమ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్ చేరడం దాదాపు ఖాయం కానుండగా, తమకంటే చిన్న జట్లపై రెండు విజయాలు సాధించిన బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. అడిలైడ్: గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయాన్ని మరచి కొత్త ఉత్సాహంతో మరో పోరుకు భారత్ సన్నద్ధమైంది. సఫారీలను ఓడించి ఉంటే ఇప్పటికే మన సెమీస్ అవకాశాలపై మరింత స్పష్టత వచ్చేది. అయితే పెర్త్ పిచ్ అలాంటి అవ కాశం ఇవ్వలేదు. ఇప్పుడు గ్రూప్–2లో బలహీన జట్లలో ఒకటైన బంగ్లాదేశ్‌ను నేడు రోహిత్ సేన ఎదుర్కొంటోంది. బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే భారత్ సహజంగానే ఫేవరెట్ కాగా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాల్సి ఉంటుంది. తమ స్థాయిని బట్టి చూస్తే టోర్నీలో ఇప్పటికే సంతృప్తికర ప్రదర్శన ఇచ్చిన బంగ్లా ఈ మ్యాచ్‌లో ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. పంత్‌కు చాన్స్! వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు కోహ్లి, సూర్యకుమార్ రెండు అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆనందపరిచారు. రోహిత్ కూడా నెదర్లాండ్స్‌పై అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే టోర్నీలో ఇప్పటికీ తనేంటో కేఎల్ రాహుల్ నిరూపించుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో అతను 4, 9, 9 చొప్పున పరుగులు చేశాడు. అయితే రాహుల్ విలువేంటో తమకు తెలుసని, జట్టులోంచి అతడిని తప్పించే అవకాశమే లేదని కోచ్ ద్రవిడ్ ఖరాఖండీగా చెప్పేశాడు కాబట్టి స్థానంపై ఎలాంటి సందేహాలు లేవు. కీపర్ దినేశ్ కార్తీక్ గాయం విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కార్తీక్‌కు ఆడించడంకంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్న పంత్‌కు అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయం కావచ్చు. బౌలింగ్‌లో ముగ్గురు రెగ్యులర్ పేసర్లకు తోడు స్పిన్నర్‌గా అశ్విన్‌నే కొనసాగిస్తారా చూడాలి. బంగ్లా లైనప్‌లో నలుగురు ఎడంచేతివాటం బ్యాటర్లు ఉండటంతో అశ్విన్ సరైనోడు కావచ్చు. బౌలింగ్‌పైనే ఆశలు... లీగ్ దశలో జింబాబ్వే, నెదర్లాండ్స్‌లపై స్వల్ప తేడాలతో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టుకు ఆ రెండు విజయాలు బౌలింగ్ కారణంగానే వచ్చాయి. ముఖ్యంగా పేసర్ తస్కీన్ అహ్మద్ జట్టు భారం మోస్తున్నాడు. ముస్తఫిజుర్ మళ్లీ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. హసన్ మహమూద్ కూడా కీలక పేసర్. ఆఫ్‌స్పిన్నర్ మొసద్దిక్ కూడా ప్రభావం చూపగలడు. అయితే వీరంతా కూడా బలమైన భారత బ్యాటింగ్‌ను నిలువరించడం అంత సులువు కాదు. బ్యాటింగ్‌లోనైతే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. నజ్ముల్, లిటన్, సర్కార్, అఫీఫ్లు ఏమాత్రం రాణిస్తారనేదానిపైనే జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి కెప్టెన్ షకీబ్ ఫామ్‌లో లేకపోవడమే ఇబ్బందిగా మారింది. పైగా ‘మేం వరల్డ్ కప్ గెలవడానికి రాలేదు’ అంటూ అతను వ్యాఖ్యానించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవే. పిచ్, వాతావరణం అడిలైడ్ ఓవల్ మైదానం మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే... టి20ల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య 11 మ్యాచ్‌లు జరగ్గా, 10 భారత్ గెలిచింది. వరల్డ్‌కప్‌లో 2016లో ఆఖరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్‌లో పరుగు తేడాతో భారత్ నెగ్గింది. 5 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన బంగ్లా వరుసగా 2 ఫోర్లు కొట్టి సంబరాలు చేసుకోగా, తర్వాతి 3 బంతుల్లో భారత్ ఒక్క పరుగూ ఇవ్వకుండా 3 వికెట్లు తీయడాన్ని అభిమానులు మరచిపోలేరు. చదవండి: కేఎల్ రాహుల్‌కు కోహ్లి పాఠాలు -
Ind Vs Pak: ఏం మాట్లాడాలో తెలియట్లేదు.. నా కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్..
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి(82 నాటౌట్-53 బంతుల్లో 6X4, 4X6) అద్బుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ అభిమానలు రోమాలు నిక్కొబొడిచేలా చేసింది. మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ' కోహ్లి మాట్లాడాడు. 'ఈ వాతావరణం అద్భుతంగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇదంతా ఎలా జరగిందో ఐడియా లేదు. నిజంగా మాటలు రావట్లేదు. ఇద్దరం చివరి వరకు క్రీజులో నిలబడితే విజయం సాధిస్తామని హార్దిక్ పాండ్య బలంగా నమ్మాడు. షహీన్ అఫ్రిదీ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్‌కు రాగానే ఆ ఓవర్లో పరుగులు రాబట్టాలని డిసైడ్ అయ్యాం. హరిస్ రౌఫ్ వాళ్లకు ప్రధాన బౌలర్. అతని బౌలింగ్‌లో రెండు సిక్సులు బాదా. స్పిన్నర్ నవాజ్‌కు ఇంకో ఓవర్ మిగిలి ఉందని తెలుసు. అందుకే సింపుల్ కాల్కులేషన్తో హరీస్ బౌలింగ్‌లో అటాక్ చేస్తే పాక్ టీం భయపడుతుందని అనుకున్నాం. చివర్లో 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సి ఉండగా.. రెండు సిక్సర్లతో 6 బంతుల్లో 16 పరుగులే కావాల్సి వచ్చింది. నా సహజ ప్రవృత్తిని కట్టుబడి ఆడా. ఇప్పటివరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే నా కేరీర్లో బెస్ట్. కానీ ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అంతకంటే ఎక్కువ. హార్దిక్ నన్ను పద పదే ఎంకరేజ్ చేశాడు. క్రౌడ్ నుంచి స్పందన అద్భుతం. నా ఫ్యాన్స్ ఎప్పుడూ నాకు అండగా ఉంటున్నారు. వాళ్లకు రుణపడి ఉంటా' - మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ. 160 పరుగుల లక్ష్య చేదనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో ఉన్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయపథంలో నడిపాడు కోహ్లి. చిరకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌తో క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ క్రీడా పోటీలకు వేదికలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడాపోటీలకు వేదికలు ఖరారయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి ఐదు చోట్ల పోటీలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు 15 వ్యక్తిగత విభాగాల్లో 2,763 మంది, ఏడు టీమ్ విభాగాల్లో 2,207 మంది దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిరిజన పాఠశాలల క్రీడా పోటీల్లో 20 రాష్ట్రాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అత్యధికంగా ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 480 చొప్పున, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ 61, సిక్కిం 83, ఉత్తర ప్రదేశ్ 96 మంది క్రీడాకారులతో బరిలోకి దిగనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎన్.ప్రభాకర్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా ఏకలవ్య జాతీయ పోటీలను సమర్థవంతంగా చేపడతామన్నారు. పోటీలు ప్రారంభానికి ముందే ఏపీ క్రీడాకారులకు నిపుణులైన శిక్షకులతో తర్ఫీదు ఇవ్వనున్నట్టు వివరించారు. కచ్చితంగా పతకాలు వచ్చే విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. -
అర్షదీప్ సింగ్‌కు కోహ్లీ మద్దతు
-
Asia Cup 2022 IND VS PAK: ఉత్కంఠ పోరులో పాక్ విజయం
దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా పాక్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో.. ఆసిఫ్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్ జారవిడిచాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ ఫలితం తారుమారు అయిపోయింది. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆసిఫ్ అలీ 16 పరుగులు సాధించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ 71 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. మహ్మద్ నవాజ్(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్, బిష్ణోయ్, ఆర్ష్‌దీప్, హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(60) అర్ధ సెంచరీతో చేలరేగగా.. రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్(28) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా నిరాశపరిచారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, మహ్మద్ హస్నైన్,నవాజ్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. 147 పరుగుల వద్ద మహ్మద్ రిజ్వాన్(71) వికెట్ పాక్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పాక్ విజయానికి 18 బంతుల్లో 33 పరుగులు కావాలి. మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ 136 పరుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న నవాజ్(42).. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. పాక్ విజయానికి అఖరి నాలుగు ఓవర్లలో 43 పరుగులు కావాలి. 14 ఓవర్లకు స్కోర్: 119/2 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ధీటుగా ఆడుతోంది. 14 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్(55), నవాజ్(33) పరుగులతో ఉన్నారు. 12 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్: 96/2 12 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్(46), నవాజ్(20) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ 63 పరుగుల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జమాన్.. చాహల్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 9 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్: 67/2 8 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్: 57/1 8 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్(32), ఫఖర్ జమాన్(10) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. బాబర్ ఔట్ 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బాబర్ ఆజాం.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 4 ఓవర్లకు పాకిస్తాన్ స్కోర్: 22/1 చేలరేగిన కింగ్ కోహ్లి.. పాకిస్తాన్ టార్గెట్ 182 పరుగులు పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(60) అర్ధ సెంచరీతో చేలరేగగా.. రోహిత్ శర్మ(28), కేఎల్ రాహుల్(28) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా నిరాశపరిచారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, మహ్మద్ హస్నైన్,నవాజ్ తలా వికెట్ సాధించారు. అర్ధసెంచరీతో చేలరేగిన కింగ్ కోహ్లి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి అద్భుతమైన అర్ధసెంచరీ సాధించాడు. 36 బంతుల్లో కోహ్లి తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం విరాట్ 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టీమిండియాకు బిగ్ షాక్.. హార్దిక్ ఔట్ టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా.. ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ హస్నైన్ బౌలింగ్‌లో నవాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో దీపక్ హుడా, విరాట్ కోహ్లి ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 126 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన పంత్.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. 13 ఓవర్లకు టీమిండియా స్కోర్: 118/3 13 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(33), పంత్(9) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. సూర్యకుమార్ ఔట్ 91 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. నవాజ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్(13) ఔటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్ 62 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రాహుల్(28).. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, కోహ్లి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 54 పరుగులు వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. దూకుడుగా ఆడుతోన్న భారత ఓపెనర్లు టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), కేఎల్ రాహుల్(19) పరుగులతో ఉన్నారు. రెండు ఓవర్లకు భారత్ స్కోర్: 20/0 రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(15), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. ఆసియాకప్-2022లో భాగంగా సూపర్-4 దశలో భారత్- పాక్ జట్లు దుబాయ్ వేదికగా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌కు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇక హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండ్యా తిరిగి జట్టలోకి వచ్చాడు. అదే విధంగా దీపక్ హుడా, రవి బిష్ణోయ్‌కు తొలిసారిగా తుది జట్టులోకి చోటు దక్కింది. మరోవైపు పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయ పడిన పేసర్ దహాని స్థానంలో మహ్మద్ హస్నైన్కకు చోటుదక్కింది. తుది జట్లు టీమిండియా: రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ పాకిస్తాన్: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్ చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ! -
Asia Cup 2022: శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
8 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్తాన్ ఘన విజయం ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆఫ్గనిస్తాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తద్వారా ఆఫ్గనిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో చేధించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(37),గుర్బాజ్(40) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా ఒక్కడే ఒక వికెట్ సాధించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆఫ్గాన్ బౌలర్లు చేలరేగడంతో 105 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్స 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చేలరేగి ఆడుతోన్న ఆఫ్గనిస్తాన్ ఓపెనర్లు 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ ఓపెనర్లు చేలరేగి ఆడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. క్రీజులో హజ్రతుల్లా జజాయ్(32), రహ్మానుల్లా గుర్బాజ్(40) పరుగులతో ఉన్నారు. నాలుగు ఓవర్లకు ఆఫ్గనిస్తాన్ స్కోర్: 41/0 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ నాలుగు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో హజ్రతుల్లా జజాయ్(14), రహ్మానుల్లా గుర్బాజ్(17) పరుగులతో ఉన్నారు. 105 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 105 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. నబీ, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో భానుక రాజపక్స 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 13 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. 11 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 66/6 వరుసగా శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్ వేసిన ముజీబ్ బౌలింగ్‌లో హసరంగ ఔట్ కాగా.. తర్వాత ఓవర్ వేసిన నబీ బౌలింగ్‌లో షనక పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 66/6 నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక 49 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన గుణతిలక.. ముజీబ్ బౌలింగ్‌లో జనత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో హసరంగా, భానుక రాజపక్స ఉన్నారు 6 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 41/3 ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక తిరిగి పుంజుకుంది. 6 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో దనుష్క గుణతిలక(15), భానుక రాజపక్స(19) పరుగులతో ఉన్నారు. తొలి ఓవర్లో రెండు వికెట్లు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఫజల్హక్ ఫరూఖీ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆఫ్గానిస్తాన్‌కు అద్భుతమైన శుభారంభం అందించాడు. ఐదో బంతికి కుశాల్ మెండీస్, అఖరి బంతికి అసలంకను ఎల్బీ రూపంలో ఫరూఖీ పెవిలియన్‌కు పంపాడు. తొలి ఓవర్ ముగిసేసరికి శ్రీలంక స్కోర్: 3/2 ఆసియాకప్-2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్, శ్రీలంక జట్లు తలపడునున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా శ్రీలంక తరపున దిల్షన్ మదుశంక, మతీషా పతిరన ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. తుది జట్లు శ్రీలంక దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీశ పతిరణ ఆఫ్గానిస్తాన్ హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ(కెప్టెన్), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ -
Asia Cup 2022: గడ్డు పరిస్థితులు.. స్పందించిన కోహ్లి!
Asia Cup 2022- India Vs Pakistan- Virat Kohli: ‘‘నా ఆట ఎలా ఉందో నాకు తెలుసు.. అయినా.. అంతర్జాతీయ క్రికెట్లో వైవిధ్యమైన బంతులతో ఇబ్బంది పెట్టే ఎంతో మంది బౌలర్లు.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటేనే ఇక్కడిదాకా రాగలము.. ప్రస్తుత గడ్డు దశను నేను సులువుగానే దాటగలను’’ అని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లి.. ఇంగ్లండ్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ఆసియా కప్-2022 ఆరంభం నేపథ్యంలో తిరిగి జట్టుతో చేరాడు. ఇక ఆగష్టు 28 నాటి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగా వేచిచూస్తున్నారో.. చిరకాల ప్రత్యర్థిపై కోహ్లి బ్యాట్ ఝులిపించి ఫామ్‌లోకి వస్తాడా? లేదా? అని అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దశను సులువుగానే అధిగమిస్తా! ఈ నేపథ్యంలో క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా కోహ్లి ఆట గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన కోహ్లి తన ఆట తీరుపై తొలిసారిగా స్పందించాడు. కఠిన పరిస్థితులను, సమస్యలను ఎలా అధిగమించాలో తనకు తెలుసన్నాడు. ఈ సందర్భంగా 2014 నాటి ఇంగ్లండ్ పర్యటన గురించి కోహ్లి ప్రస్తావించాడు. నా అనుభవాలు విలువైనవి! ‘‘ఇంగ్లండ్ టూర్లో జరిగిన తప్పిదాల గురించి నేను తెలుసుకున్నాను. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని దానిని సరిదిద్దుకున్నాను. నిజానికి ఇప్పుడు కూడా నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నాను. ఒక్కసారి తిరిగి రిథమ్‌లోకి వస్తే కచ్చితంగా ఇంకా మెరుగ్గా ఆడగలను. కాబట్టి నాకిది ఇప్పుడు అసలు సమస్యే కాదు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగా నేనూ అందుకు అతీతం కాదు. అయితే, ఈ గడ్డు దశ నన్ను భయపెట్టలేదు. నా అనుభవాలు ఎంతో విలువైనవి. అవి నాకెంతో నేర్పించాయి.. నేర్పిస్తున్నాయి కూడా! కచ్చితంగా ఈ దశను నేను సులువుగానే అధిగమిస్తాను’’ అని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం! Asia Cup 2022: ఆసియాకప్ విజేత ఎవరో చెప్పేసిన షేన్ వాట్సన్ -
Asia Cup 2022: కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్‌మెషీన్.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే?
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎందురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దాయాదుల పోరుకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆసియాకప్-2022లో భాగంగా ఆగస్టు 28న దుబాయ్ వేదికగా భారత్-పాక్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా పాకిస్తాన్‌పైనే అడునున్నాడు. అయితే గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కోహ్లి పాక్ మ్యాచ్‌తోనే తిరిగి బరిలోకి దిగనున్నాడు. ఆసియాకప్‌లో తిరుగులేని కోహ్లి ఇక ఆసియా కప్ టోర్నీలో కోహ్లికి మెరుగైన రికార్డు ఉంది. 2010లో తొలిసారిగా ఆసియాకప్‌లో అడుగుపెట్టిన కోహ్లి తనకంటూ ఒక స్టార్‌డమ్‌ను ఏర్పరుచుకున్నాడు. ఇప్పటివరకు ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో 14 మ్యా్చ్లు ఆడిన కోహ్లి 766 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 2012 ఎడిషన్‌లో పాకిస్తాన్‌పై కోహ్లి భారీ సెంచరీతో చేలరేగాడు. ఈ మ్యాచ్‌లో 183 పరుగులు సాధించిన కోహ్లి.. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కోహ్లి ఇప్పటి వరకు 2010 ,2012, 2014, 2016లో జరిగిన ఆసియాకప్ ఈవెంట్లో భాగంగా ఉన్నాడు. 2014లో జరిగిన ఆసియాకప్ టోర్నీకి భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లి వ్యవహరించాడు. కాగా యూఏఈ వేదికగా జరిగిన 2018 ఎడిషన్‌కు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఇక ఆసియాకప్ టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే.. కోహ్లి ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి 153 పరుగులు సాధించాడు. కాగా ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగనుండటం 2016 తర్వాత తొలిసారి ఇదే. 2016లో జరిగిన ఈ ఈవెంట్లో భారత్ ఛాంపియన్ నిలిచింది. ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. The ultimate countdown for the #GreatestRivalry has begun! 🤩#BelieveInBlue and keep cheering for #TeamIndia in #AsiaCup2022! 💙#INDvPAK: Aug 28, starts 6 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/lePGPIINOD — Star Sports (@StarSportsIndia) August 23, 2022 చదవండి: ASIA CUP 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు! -
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు!
టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని నమోదు చేశాడు. హరారే వేదికగా జింబాబ్వేతో మూడో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 130 పరుగులు సాధించాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డు బద్దలు వన్డేల్లో జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్ అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 130 పరుగులు సాధించిన గిల్.. సచిన్ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. అనంతరం 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే తడబడుతోంది. జింబాబ్వే గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత్ ఆటగాళ్లు వీరే. శుబ్మాన్ గిల్ - 130 సచిన్ టెండూల్కర్ 127(నాటౌట్) అంబటి రాయుడు 124 యువరాజ్ సింగ్ 120 శిఖర్ ధావన్ 116 Shubman Gill scored a splendid 130 and is our Top Performer from the first innings 👏 A look at his batting summary here 👇👇#TeamIndia #ZIMvIND pic.twitter.com/Znz52wQjMo — BCCI (@BCCI) August 22, 2022 చదవండి: ZIM vs IND:'ఓపెనర్‌గా శార్దూల్ వచ్చాడు అనుకున్నా.. ఆటగాళ్లకు సరైన జెర్సీలు లేకుండా పోయాయి' -
భారత్ వేదికగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్ సీజన్
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 వేదికను ఒమన్ నుంచి భారత్‌కు తరిలించారు. ఒమన్‌కు బదులుగా భారత్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు లీగ్ నిర్వహకులు వెల్లడించారు. కాగా లెజెండ్స్ లీగ్ తొలి సీజన్ ఒమన్ వేదికగానే జరిగినప్పటికీ.. భారత్ నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలో వేదికను ఒమన్ నుంచి భారత్‌కు మార్చాలని లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిటీ నిర్ణయించింది. ఈ టోర్నీ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్ 10 వరకు జరగనుంది. లెజెండ్స్ లీగ్ రెండో సీజన్లో తొమ్మిది దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు పాల్గొనున్నారు. "భారత్‌లోనే టోర్నమెంట్ నిర్వహించాలని అభిమానుల అభ్యర్థనలు దృష్ట్యా వేదికలో మార్పు చేశాం. స్వదేశానికి లెజెండ్స్ లీగ్ టోర్నీను తీసుకురావడం సంతోషంగా ఉంది. భారత్‌లో క్రికెట్ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మొదటి సీజన్‌ను భారత్ నుంచే ఎక్కువ మంది వీక్షించారు. ఆ తర్వాతి స్థానంలో పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి" అని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో రామన్ రహే పేర్కొన్నారు. చదవండి: భారత్‌కు ఆసియా కప్, ప్రపంచకప్ అందించడమే నా ప్రధాన లక్ష్యం: కోహ్లి -
Rahul Dravid: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్..!
Rahul Dravid- Wriddhiman Saha: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అతడి మాటలు తననేమీ బాధించలేదని, ఇప్పటికీ సాహా పట్ల తన మనసులో గౌరవం అలాగే ఉందన్నాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలు, ఆటగాడిగా అందుకున్న విజయాలే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో సాహాకు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అతడు.. ద్రవిడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు రిటైర్మెంట్ గురించి ఆలోచించమని ఆయన సలహా ఇచ్చాడని ఆరోపించాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి తనకు హామీ ఉన్నప్పటికీ జట్టులో స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్... ‘‘భారత క్రికెట్ విజయాల్లో తను భాగం అయ్యాడు. తన పట్ల నాకు గౌరవం ఉంది. ఈ క్రమంలోనే తనతో మాట్లాడాను. అయితే, అతడికి ఈ విషయంలో క్లారిటీ అవసరం. నిజానికి అందరు ఆటగాళ్లతో ఎప్పుడూ మాట్లాడినట్లుగానే మాట్లాడాను. కాస్త నిజాయితీగా వ్యవహరించాల్సింది. మీడియా ద్వారా ఈ మాటలు వినాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా ప్రతిసారి మనం ఇచ్చిన సలహాలు, సందేశాలు ప్రతి ఆటగాడికి నచ్చాలని లేదు కదా! అందుకే తన మాటలకు ఎక్కువగా బాధపడలేదు. మన అభిప్రాయాలతో ఏకీభవించని కారణంగా వాళ్లను తప్పుపట్టాల్సింది కూడా ఏమీలేదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా జట్టు ఎంపిక విషయంలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించే తీరు గురించి చెబుతూ... ‘‘జట్టు ఎంపిక విషయంలో నేను లేదంటే... రోహిత్... ఆటగాళ్లతో కచ్చితంగా మాట్లాడతాం. వాళ్లు ఎందుకు తుది జట్టులో లేరో.. అందుకు గల కారణాలు వివరిస్తాం. సెలక్ట్ అవ్వని వాళ్లు బాధకు లోనుకావడం సహజమే. అయినా, వాళ్ల పట్ల నాకున్న గౌరవం ఏమాత్రం తగ్గదు. నా జట్టు పూర్తి నిజాయితీ, క్లారిటీ కలిగి ఉండాలని నేను కోరుకుంటాను’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే! -
IPL 2022 Mega Auction: వేలంలో అత్యధిక ధర.. అతడి కోసం ఏకంగా రూ. 20 కోట్లు!
IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. మరి కొన్ని గంటల్లో బెంగళూరు వేదికగా మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఈ ఆటగాళ్లు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. కాగా తమ అభిమాన ఆటగాళ్లని ఏ ఫ్రాంచైజీ కోనుగొలు చేస్తుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనడంతో వేలానికి సరికొత్త ప్రాధన్యత సంతరించుకొంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రానున్న వేలంలో శ్రేయస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లలో ఎవరో ఒకరు రూ. 20 కోట్ల భారీ ధర దక్కించుకుంటారని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపటిల్స్ రీటైన్ చేసుకోలేదు. అదే విధంగా డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ రీటైన్ చేసుకోలేదు. ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్ ,యుజ్వేంద్ర చాహల్ వంటి వారికి భారీ ధర దక్కనుందని వాట్సన్ భావిస్తున్నాడు. డేవిడ్ వార్నర్: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకోలేదు. దీంతో రానున్న వేలంలో అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడడం ఖాయం. ఐపీఎల్లో 41.59 బ్యాటింగ్ సగటుతో అద్భుతమైన రికార్డును వార్నర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా మంచి రికార్డులను కలిగి ఉన్నాడు. కాబట్టి ఐపీఎల్లో రూ. 20 కోట్ల మార్కును అధిగమించే తొలి వ్యక్తి కావచ్చు. కాగా ఈ వేలంలో వార్నర్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ కలిగి ఉన్నాడు. మిచెల్ మార్ష్: ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు బిగ్ బ్యాష్ లీగ్‌లో బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. అయితే వేలంలో రూ. 20 కోట్లు పొదే అవకాశం ఉన్న రెండో ఆటగాడిగా మిచెల్ మార్ష్‌ను షేన్ వాట్సన్ ఎంపిక చేశాడు. వేలంలో అతడి పేరును 2 కోట్ల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకోలేదు. కాగా గతంలో ఢిల్లీకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండడంతో అతడికి భారీ ధర దక్కనుంది. రూ. 20 కోట్ల మార్కును అధిగమించే మూడు ఆటగాడిగా శ్రేయస్‌ను వాట్సన్ ఎంపిక చేశాడు. చదవండి: Ind Vs Wi 3rd ODI- Virat Kohli Duck Out: ఏంటిది కోహ్లి.. 8, 18, 0... మరీ ఇంత చెత్తగా.. తుది జట్టులో ఉంటావా? లేదా? On the eve of the IPL mega auction, here are 5 players that I feel are the top picks for any team. One former teammate is at the top of my list @MELbet_in @melbet_bangla pic.twitter.com/ZJJi6erp5r — Shane Watson (@ShaneRWatson33) February 11, 2022 -
Lata Mangeshkar: లతా పాట.. టీమిండియా సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష!
లతా మంగేష్కర్ క్రికెట్‌కు వీరాభిమాని. క్రికెట్‌తో ఆమె అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఘటన మాత్రం 1983లో జరిగింది. భారత జట్టు ఇంగ్లండ్‌లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. విజేతలను అభినందించి నగదు పురస్కారం అందించాలని బీసీసీఐ భావించింది. కానీ బోర్డు నాటి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రపంచ కప్ జరిగిన సమయంలో క్రికెటర్లకు రోజూవారీ ఖర్చులకు తలా 20 పౌండ్లు ఇచ్చేందుకే అధికారులు కిందా మీదా పడ్డారు. అలాంటిది ప్రోత్సాహకం ఏమిస్తారు? బీసీసీఐ అధికారి రాజ్‌సింగ్ దుంగార్పూర్ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆ సమయంలో భారత సినీ సంగీతాన్ని శాసిస్తున్న తన స్నేహితురాలు లతా మంగేష్కర్తో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న దుంగార్పూర్ విజ్ఞప్తికి వెంటనే ‘ఓకే’ చెప్పిన లతా పైసా కూడా తీసుకోకుండా వేదికపై పాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆ కచేరీకి భారీస్థాయిలో అభిమానులు తరలి వచ్చారు. దాని ద్వారా సుమారు రూ. 20 లక్షలు పోగయ్యాయి. భారత జట్టు సభ్యులు 14 మందికి ఒక్కొక్కరికీ కనీసం రూ. లక్ష చొప్పున బహుమతిగా ఇచ్చేందుకు ఆ డబ్బు సరిపోయింది. అప్పటినుంచి లతాకు, భారత క్రికెట్‌కు మధ్య అనుబంధం విడదీయరానిదిగా మారిపోయింది. నాటినుంచి ఇప్పటి వరకు భారత్‌లో జరిగే ఏ అంతర్జాతీయ మ్యాచ్‌కైనా రెండు వీఐపీ సీట్లు లతా మంగేష్కర్ కోసం రిజర్వ్ చేయడం బీసీసీఐ రివాజుగా మార్చేసింది! చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఘోర పరాభవం.. హెడ్‌కోచ్‌పై వేటు.. మాజీ కెప్టెన్ ఏమో!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు పడింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం నేపథ్యంలో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఇక సిల్వర్‌వుడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలకంగా వ్యవహరించిన మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తన పదవి నుంచి దిగిపోయిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో జో రూట్ బృందం ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 0-4 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుని అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ రూట్, కోచ్ సిల్వర్‌వుడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మేనేజ్మెంట్ తీరును కూడా పలువురు దిగ్గజాలు విమర్శించారు. ఈ క్రమంలో ఎండీ, హెడ్‌కోచ్ తమ పదవుల నుంచి వైదొలగడం గమనార్హం. ఈ సందర్భంగా సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ... ‘‘ఇంగ్లండ్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మేటి ఆటగాళ్లు, సిబ్బందితో కలిసి ప్రయాణించడం నాకు గర్వకారణం. గడిచిన రెండేళ్లు ఎంతో ముఖ్యమైనవి. అయితే రూటీ(టెస్టు కెప్టెన్ జో రూట్), మోర్గ్స్(పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్)తో కలిసి పనిచేయడం... కఠిన సవాళ్లను ఎదుర్కోవడం పట్ల గర్వంగా ఉంది. కోచ్‌గా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఎండీ ఆష్లే స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. టెస్టు సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో కేర్ టేకర్ కోచ్‌ను అతడు నియమించనున్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్ Just put out the one mitt - and it stuck! #Ashes pic.twitter.com/10yK7Cadc3 — cricket.com.au (@cricketcomau) January 16, 2022 Chris Silverwood has left his role as England Men’s Head Coach. We wish him all the best for the future. — England Cricket (@englandcricket) February 3, 2022 -
అత్యాశ లేదు... కానీ ఇప్పుడైతే ‘21’ మాత్రం సరిపోదు: టెన్నిస్ స్టార్
Rafael Nadal Comments: - మలోర్కా (స్పెయిన్): పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (21) గెలిచి శిఖరాన ఉన్న రాఫెల్ నాదల్ మరిన్ని మెగా టోర్నీలు గెలవాలని భావిస్తున్నాడు. ఇప్పటివరకు సాధించిన ఘనతతో ఆగిపోనని... అయితే అందు కోసం దేనికైనా సిద్ధమే అన్నట్లుగా వెంటపడనని కూడా నాదల్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అనంతరం తన స్వస్థలం చేరుకొని సొంత అకాడమీలో నాదల్ మీడియాతో మాట్లాడాడు. ‘నేను భవిష్యత్తులో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుస్తాననేది చెప్పలేను. కొన్నాళ్ల క్రితం వరకు కూడా గెలుపు సంగతేమో కానీ ఆడగలిగితే చాలని భావించాను. మిగతా ఇద్దరికంటే నేను ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు సాధించాలని కోరుకుంటున్నాను. అలా జరిగితే చాలా సంతోషం. కానీ ఎలాగైనా గెలవాలనే పిచ్చి మాత్రం నాకు లేదు. నిజంగా ఇది నిజం. నా దారిలో వచ్చేవాటిని అందుకుంటూ పోవడమే తప్ప అత్యాశ కూడా పడటం లేదు. అయితే నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడైతే ‘21’ మాత్రం సరిపోదు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు’ అని ఈ దిగ్గజ ఆటగాడు అన్నాడు. ఇక సుదీర్ఘ కాలంగా కాలి నొప్పితో బాధపడుతున్నా అలాగే ఆటను కొనసాగించానని అతను పేర్కొన్నాడు. ‘ఆడుతున్నప్పుడు నా పాదం ఇప్పటికీ నన్ను ఇబ్బంది పెడుతుంది. అయితే అత్యుత్తమ స్థాయి ఆట ఆడేటప్పుడు దానిని పట్టించుకోలేదు. తాజా విజయంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే ఇక ముందూ టెన్నిస్‌ను బాగా ఆస్వాదించగలను. సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడాలని కోరుకుంటున్నా’ అని స్పెయిల్ బుల్ స్పష్టం చేశాడు. నాదల్–ఫెడరర్ కలిసి... దిగ్గజ ఆటగాళ్లు నాదల్, రోజర్ ఫెడరర్ మరో సారి ఒకే జట్టులో కలిసి ఆడనున్నారు. సెప్టెంబర్ 23నుంచి జరిగే ‘లేవర్ కప్’ టోర్నీలో వీరిద్దరు టీమ్ యూరోప్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. 2017లో ఇదే టోర్నీలో వీరిద్దరు జోడీగా ఆడి డబుల్స్ మ్యాచ్ గెలిచారు. చదవండి: Novak Djokovic: నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్.. జొకోవిచ్ దిగిరానున్నాడా! Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes. ⁰ 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r — #AusOpen (@AustralianOpen) January 30, 2022 -
Pro Kabaddi League: అయ్యో.. మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
Pro Kabaddi League: - బెంగళూరు: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ‘టై’ లేదంటే ఓటమితో పదేపదే నిరాశపరుస్తోన్న తెలుగు జట్టు గురువారం జరిగిన మరో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. తమిళ్ తలైవాస్‌తో జరిగిన ఈ పోరులో తెలుగు టైటాన్స్ 25–43 స్కోరుతో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో గల్లా రాజు (9 పాయింట్లు) రాణించాడు. తలైవాస్ జట్టులో రెయిడర్ అజింక్యా పవార్ 10 పాయింట్లు సాధించాడు. ఇంతవరకు ఒక్కటే మ్యాచ్ గెలిచిన టైటాన్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌లను ‘టై’ చేసుకుంది. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! -
Yash Dhull: మరో ఉన్ముక్త్ చంద్ కాకుంటే చాలు.. అశ్విన్ కౌంటర్!
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకునే అశూ.. యూట్యూబ్ చానెల్లో క్రికెట్‌కు సంబంధించి తన అభిప్రాయాలు పంచుకుంటాడు. ఇటీవల పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అశ్విన్ తనదైన శైలిలో బ్యాట్ చేతబట్టి స్టెప్పులేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు. అండర్-19 భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్‌కు అండగా నిలిచాడు. ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. యశ్ ధుల్ సారథ్యంలోని జట్టు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్‌గా తనదైన వ్యూహాలతోనే కాదు... బ్యాటర్‌గానూ 110 పరుగులతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు యశ్. ఈ క్రమంలో అతడిపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా... ‘‘కెప్టెన్ యశ్ ధుల్ తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అద్భుత ప్రయాణానికి ఇది నాంది అని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన ఓ నెటిజన్... ‘‘ఏదేమైనా యశ్... మరో ఉన్ముక్త్ చంద్లా అయిపోకూడదు’’ అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు అశూ కౌంటర్ వేశాడు. ‘‘కాస్త ఆశావాదాన్ని ప్రోత్సహించండయ్యా’’ అని సదరు నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. కాగా 2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ జట్టు తరఫున ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ అమెరికాకు వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుని.. ‘బిగ్‌బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఉన్ముక్త్ మాదిరే.. యశ్ ధుల్ కాకూడదంటూ నెటిజన్ పేర్కొనగా.. అశూ అందుకు తనదైన శైలిలో బదులిచ్చాడు. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! hope it doesnt goes the unmukt chand way — Rohit Pungalia (@RohitPungalia) February 2, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind Vs Wi: నీకు మా మద్దతు ఉంటుందని ద్రవిడ్ చెప్పారు.. అందుకే..
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షల్.. డెబ్యూలోనే ఇరగదీసిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తుది జట్టులోకి తన ఎంపిక సరైందేనని నిరూపించాడు. ఇక టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మకు కివీస్‌తో సిరీసే మొదటిదన్న సంగతి తెలిసిందే. హర్షల్‌కు కూడా అరంగేట్రం కారణంగా ఈ సిరీస్ మరింత స్పెషల్. ఈ నేపథ్యంలో కెప్టెన్, కోచ్ తన పట్ల వ్యవహరించిన తీరు గురించి హర్షల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అతడు...‘‘రోహిత్ శర్మ మన చేతికి బంతిని ఇస్తాడు. ఒకవేళ మన పట్ల తనకు నమ్మకం ఉంటే ఏం చేయాలన్న విషయం గురించి చెప్పడు. ‘‘ఏం చేయాలో తెలుసు కదా.. అదే చేసెయ్’’ మరి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. నిజంగా తను చాలా మంచి కెప్టెన్. అలాంటి వ్యక్తి సారథ్యంలో ఆడటాన్ని ఎవరైనా పూర్తిగా ఆస్వాదిస్తారు. ఒకవేళ పరుగులు ఎక్కువగా ఇస్తున్నానని అనిపిస్తే.. నా వద్ద ప్లాన్ ఏ, బీ, సీ సిద్ధంగా ఉంటాయి. వాటినిక అమలు చేసేందుకు కెప్టెన్ సహకారం ఉంటుంది. నిజంగా రోహిత్.. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తనతో మాట్లాడిన విధానాన్ని హర్షల్ పటేల్ గుర్తు చేసుకున్నాడు. ‘‘మాకు తెలుసు నువ్వు ఆత్మవిశ్వాసం గల బౌలర్‌వి. నువ్వు చేయగలవో.. ఏం చేయాలనుకుంటున్నావో.. చేసెయ్. మైదానంలో దిగిన తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ఏదేమైనా నీకు మా మద్దతు ఉంటుంది’’ అని ద్రవిడ్ తనకు భరోసా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ -2021 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన హర్షల్ పటేల్... 32 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకుని 30 ఏళ్ల 361 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. విండీస్‌తో సిరీస్‌కు భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! -
IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ అక్కడే: గంగూలీ
ఐపీఎల్-2022 నిర్వహణ ఎక్కడ అన్న సందేహాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెరదించారు. టోర్నీ మొత్తం భారత్‌లోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే, కోవిడ్ వ్యాప్తి, కేసుల పెరుగుదల అంశంపై ఈ విషయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాగా క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలానికి బీసీసీఐ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆక్షన్ నిర్వహించనున్నారు. ఇక భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్-2022ను యూఏఈ లేదంటే దక్షిణాఫ్రికా, శ్రీలంక తదితర దేశాల్లో నిర్వహిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడిన గంగూలీ... ‘‘ఈ ఏడాది ఐపీఎల్ భారత్‌లోనే నిర్వహిస్తాం. అయితే, కరోనా విజృంభణ తారస్థాయికి చేరనంత వరకే! వేదికల విషయానికొస్తే.... మహారాష్ట్రలోని ముంబై, పుణెలో మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో ఉన్నాం. నాకౌట్ దశకు త్వరలోనే వేదికను ఖరారు చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే మాత్రం భారత్ నుంచి వేదికను మార్చే అవకాశం ఉందని పరోక్షంగా వెల్లడించారు. కాగా ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్, సీసీఐతో పాటు పుణెలోని స్టేడియంలో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్లే ఆఫ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా కొత్తగా రెండు జట్లు లక్నో, అహ్మదాబాద్ రాకతో ఐపీఎల్ 2022 సీజన్లో 74 లీగ్ మ్యాచ్‌లు జరుగనున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! -
వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా!
ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం దగ్గరపడుతుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. ఇప్పటికే పాత జట్లు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేయగా.. కొత్తగా వచ్చిన రెండు జట్లు కూడా ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇక ఈ మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఇక రానున్న మెగా వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్‌కి అత్యధిక ధర దక్కనుందని మాజీ ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అభిప్రాడ్డాడు. ఆర్సీబీ, కేకేఆర్,పంజాబ్ కింగ్స్, సీఎస్కే అతడి కోసం పోటీ పడతాయి అని హాగ్ అంచనా వేశాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ డు ప్లెసిస్‌ను రీటైన్ చేసుకోలేదు. కాగా ఐపీఎల్- 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో డు ప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. "డు ప్లెసిస్ తన నాయకత్వ లక్షణాల కారణంగా వేలంలో అతడికి భారీ ధర దక్కనుంది. అతడిని దక్కించుకోవడానికి ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సీఎస్కే జట్లు పోటీ పడతాయి. అతడు ఓపెనర్‌గా అద్భుతంగా రాణించగలడు. కాగా అతడికి గతేడాది 7 కోట్లకు చెన్నై అంటి పెట్టుకుంది. కానీ ఈ సారి అతడికి ఏకంగా రూ. 11 కోట్లు దక్కే అవకాశం ఉంది. అదే విధంగా శ్రేయస్ అయ్యర్, కగిసో రబడ, మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్ల కోసం ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ పోటీ పడతాయి. అయ్యర్‌కి ఐపీఎల్లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి అతడిని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ దక్కించుకోనే అవకాశాలు ఉన్నాయి. అతడిని రూ. 4 కోట్లకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక షమీ, రబడాకి కూడా 4 నుంచి 5 కోట్ల మధ్య దక్కే అవకాశం ఉంది" అని హాగ్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగాడు.. భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.. దటీజ్ యష్ ధుల్! -
హైదరాబాద్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్, గోల్ఫర్ ట్వెసాకు 15 లక్షల చెక్
Kakinada Sea Ports Limited Sponsorship: హైదరాబాద్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ ప్రణవిచంద్ర, గోల్ఫర్ ట్వెసా మలిక్‌లకు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు కాకినాడ సీపోర్ట్ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యదర్శి విభా జైన్ ఈ ఇద్దరు క్రీడాకారిణులకు చెరో రూ. 15 లక్షల చెక్‌లు అందించగా... తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా! -
రవి దహియాకు అరుదైన గౌరవం
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్టార్ రెజ్లర్ రవి దహియాకు చక్కని గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు జరిగే క్వీన్స్ బ్యాటన్ రిలేను బుధవారం భారత్‌లో రవి ప్రారంభించాడు. తనకిది అరుదైన గౌరవమని, బర్మింగ్‌హామ్‌లో స్వర్ణం గెలిచేందుకు తీవ్రంగా చెమటోడ్చుతున్నట్లు రవి చెప్పాడు. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
Savita Punia: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి
Savita Punia To Lead Indian Women Hockey Team: సీనియర్ గోల్‌కీపర్ సవిత పూనియాను భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా నియమించారు. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అనుభవజ్ఞురాలైన సవితకు జట్టు పగ్గాలు అప్పగించారు. ఒమన్‌లోని మస్కట్‌లో ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఇందులో 16 మంది టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి గోల్‌కీపర్ ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు Champions keep playing until they get it right. 🏋️🏃♀️🏑#WeareTeamIndia #SavitaPunia #IndianWomenHockeyTeam #HockeyIndia #gymtime #sportswomen pic.twitter.com/pKTiurTrV1 — Savita Punia (@savitahockey) November 24, 2021 -
Ind Vs Sa 3rd Test: వారం రోజుల క్రితం చెత్త ప్రదర్శన.. ఇప్పుడేమో 5 వికెట్లతో చెలరేగి..
Ind Vs Sa 3rd Test: దాదాపు వారం రోజుల క్రితం... రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి బుమ్రా చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై అతని బౌలింగ్ అస్త్రాలేవీ పని చేయకపోగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు తేదీ మారింది, వేదిక మారింది. తాను అరంగేట్రం చేసిన న్యూలాండ్స్ మైదానంలో బుమ్రా మళ్లీ కదం తొక్కాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టి పడేస్తూ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. బుమ్రాకు తోడు షమీ, ఉమేశ్ కూడా ఆకట్టుకోవడంతో మూడో టెస్టులో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఓవరాల్‌గా 70 పరుగుల ముందంజలో ఉన్న టీమిండియా చేతిలో 8 వికెట్లున్నాయి. మ్యాచ్ మూడో రోజు గురువారం ఎంత స్కోరు సాధిస్తుందనే దానిపైనే టెస్టు, సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్ (10), మయాంక్ (7) వెనుదిరగ్గా... కెప్టెన్ కోహ్లి (14 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. పీటర్సన్ అర్ధ సెంచరీ... తొలి ఓవర్లోనే వికెట్‌తో భారత్‌కు రెండో రోజు శుభారంభం లభించింది. బుమ్రా వేసిన రెండో బంతికే మార్క్రమ్ (8) క్లీన్‌బౌల్డ్ కాగా, కేశవ్ మహరాజ్ (25)ను ఉమేశ్ వెనక్కి పంపాడు. ఈ దశలో పీటర్సన్, వాన్ డర్ డసెన్ (21) కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. లంచ్ సమయానికి భారత్‌కు మరో వికెట్ దక్కలేదు. తర్వాతి సెషన్లో మాత్రం భారత బౌలర్లు ఒక్కసారిగా జోరు ప్రదర్శించారు. వాన్ డర్ డసెన్‌ను అవుట్ చేసి 67 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని ఉమేశ్ విడదీశాడు. ఆ తర్వాత షమీ ఓవర్‌తో భారత్‌కు మరింత పట్టు చిక్కింది. A classy knock from Keegan Petersen during the #Proteas first innings👏 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/2dXHRtyMEB — Cricket South Africa (@OfficialCSA) January 12, 2022 క్రీజ్‌లో నిలదొక్కుకున్న తెంబా బవుమా (52 బంతుల్లో 28; 4 ఫోర్లు)ను, మరో రెండు బంతులకే కైల్ వెరీన్ (0) కూడా షమీ పెవిలియన్ చేర్చాడు. జాన్సెన్ (7)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో రెండో సెషన్ ముగిసింది. విరామం తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటి వరకు పోరాడిన పీటర్సన్‌ను బుమ్రా అవుట్ చేయగా, రబడ (15) చలువతో స్కోరు 200 దాటింది. చివరి వికెట్ కూడా తీసిన బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పుజారా (బి) బుమ్రా 3; మార్క్రమ్ (బి) బుమ్రా 8; కేశవ్ మహరాజ్ (బి) ఉమేశ్ 25; కీగన్ పీటర్సన్ (సి) పుజారా (బి) బుమ్రా 72; వాన్ డర్ డసెన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 21; బవుమా (సి) కోహ్లి (బి) షమీ 28; వెరీన్ (సి) పంత్ (బి) షమీ 0; జాన్సెన్ (బి) బుమ్రా 7; రబడ (సి) బుమ్రా (బి) శార్దుల్ 15; ఒలీవియర్ (నాటౌట్) 10; ఎన్గిడి (సి) అశ్విన్ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1–10, 2–17, 3–45, 4–112, 5–159, 6–159, 7–176, 8– 179, 9–200, 10–210. బౌలింగ్: బుమ్రా 23.3– 8–42–5, ఉమేశ్ యాదవ్ 16–3–64–2, షమీ 16–4–39–2, శార్దుల్ 12–2–37–1, అశ్విన్ 9–3–15–0. ►బుమ్రా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే వచ్చాయి. ►కోహ్లి టెస్టుల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్, గావస్కర్, అజహర్ తర్వాత ఈ మైలురాయిని దాటిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
క్యాచ్ మిస్ చేసిన పుజారా.. ఐదు పరుగుల పెనాల్టీ
కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో మూడో టెస్టులో పుజారా క్యాచ్ మిస్ చేయడం వల్ల టీమిండియా మూల్యం చెల్లించుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దుల్ వేసిన బంతిని బవుమా ఆడగా బంతి మొదటి స్లిప్ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఉన్న పుజారా అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లిన కీపర్ పంత్ కూడా క్యాచ్ వదిలేశాడు. దీంతో పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్ (10), మయాంక్ (7) వెనుదిరగ్గా... కెప్టెన్ కోహ్లి (14 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
Indian Open Super Series: సైనా, ప్రణయ్ ముందంజ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో సైనా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సైనా తొలి గేమ్‌ను 22–20తో గెల్చుకొని, రెండో గేమ్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి తెరెజా స్వబికోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సైనాను విజేతగా ప్రకటించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్లు కేయుర మోపాటి శుభారంభం చేయగా ... సామియా, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో ఓడిపోయారు. కేయుర 15–21, 21–19, 21–8తో స్మిత తోష్నివాల్ (భారత్)పై నెగ్గింది. సామియా 18–21, 9–21తో మాళవిక బన్సోద్ (భారత్) చేతిలో, సాయి ఉత్తేజిత 21–9, 12–21, 19–21తో తాన్యా (భారత్) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–14, 21–7తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై, లక్ష్య సేన్ 21–15, 21–7తో అధామ్ హతీమ్ ఎల్గామల్ (ఈజిప్ట్)పై గెలిచారు. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి–అశ్విని జంట మహిళల డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–7, 19–21, 21–13తో జనని–దివ్య (భారత్) జోడీపై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో శ్రీవేద్య గురజాడ (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జంట 21–9, 21–7తో మేఘ–లీలా లక్ష్మి (భారత్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 21–10తో రవి–చిరాగ్ అరోరా (భారత్) జంటపై గెలిచింది. విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 16–21, 16–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు
Conflict Between Jasprit Bumrah Vs Marco Jansen Viral: కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రొటిస్ బ్యాట్స్‌మన్ మార్కో జాన్సెన్ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇందులో ఆసక్తికరమేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. జోహన్నెస్‌బర్గ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో బమ్రా, మార్కో జాన్సెన్ మధ్య మాటలయుద్ధం జరిగింది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో బుమ్రాకు జాన్సెన్ వరుస బౌన్సర్లు సంధించాడు. ఓపికతో ఉన్న బుమ్రాను తన మాటలతో మార్కో జాన్సెన్ మరింత కవ్వించాడు. దీంతో బుమ్రా కూడా ధీటుగా బదులిస్తూ జాన్సెన్ వద్దకు వచ్చాడు. ఇది చూసిన అంపైర్లు జోక్యం చేసుకొని వారిద్దరిని విడగొట్టడంతో గొడవ ముగిసింది. ఈ గొడవను మిగతావాళ్లు అక్కడే మరిచిపోయారు.. కానీ బుమ్రా మాత్రం మనసులోనే ఉంచుకున్నాడు. చదవండి: Jasprit Bumrah: బుమ్రా అరుదైన ఘనత.. కపిల్, పఠాన్ల సరసన తాజాగా మూడో టెస్టులో మార్కో జాన్సెన్ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా బుమ్రా తన పవరేంటో చూపించాడు. రెండో రోజు టీ విరామం అనంతరం బుమ్రా వేసిన ఓవర్లో జాన్సెన్ను బౌన్సర్లతో భయపెట్టాడు. ఇక ఒక సూపర్ డెలివరీకి జాన్సెన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. షార్ట్‌పిచ్ అయిన బంతి నేరుగా ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టడంతో మార్కో జాన్సెన్ కనీసం బుమ్రా వైపు కూడా చూడకుండాను వెనుదిరగడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. బుమ్రాతో గెలుకున్నాడు.. ఫలితం అనుభవించాడు.. అంటూ కామెంట్స్ చేశారు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా బుమ్రాకు తోడు షమీ, ఉమేశ్ కూడా ఆకట్టుకోవడంతో మూడో టెస్టులో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా 70 పరుగుల ముందంజలో ఉంది. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Bumrah v Jansen 🥵 pic.twitter.com/rRgSpJ7UTj — J (@jaynildave) January 12, 2022 -
బుమ్రా అరుదైన ఘనత.. కపిల్, పఠాన్ల సరసన
Seventh Five Wicket Haul For Bumrah 27 Test Joins Elite List.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డు అందుకున్నాడు. కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించాడు. కేప్‌టౌన్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో టీమిండియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్ 2010-11లో ఏడు వికెట్లు తీయగా.. అదే మ్యాచ్‌లో శ్రీశాంత్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక బుమ్రా టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే రావడం విశేషం. ఇక 27 టెస్టుల్లో అత్యధికంగా ఏడుసార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించిన బుమ్రా కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ల సరసన నిలిచాడు. చదవండి: Virat Kohli: సెంచరీ మిస్సయ్యాడు.. అయినా రికార్డు అందుకున్నాడు ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(5/42)తో పాటు ఉమేశ్ యాదవ్(2/64), షమీ(2/39), శార్ధూల్ ఠాకూర్(1/37) రాణించారు. ఫలితంగా టీమిండియాకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీగన్ పీటర్సన్(72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, పుజారా ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను 57/2 స్కోర్ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్(7)ను రబాడ, కేఎల్ రాహుల్(10)ను జన్సెన్ పెవిలియన్‌కు పంపారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 70 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. A five-wicket haul for Jasprit Bumrah and South Africa's innings is wrapped up for 210 👏🏻 India lead by a slender 13 runs. Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/cmqKWckoIX — ICC (@ICC) January 12, 2022 -
రోహిత్ శర్మ న్యూ లుక్.. భార్య రితికా ఫన్నీ కామెంట్
ముంబై: గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ.. ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బరువు తగ్గడంతో పాటు న్యూ లుక్‌తో అదరగొట్టాడు. గత కొంత కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీ రిహాబిటేషన్‌లో గడుపుతున్న రోహిత్.. బాగా సన్నబడిపోయి, క్లీన్ షేవ్‌తో కనిపించాడు. న్యూ లుక్కు సంబంధించిన ఫోటోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) ఇందులో అతను దేనివైపో తీక్షణంగా చూస్తున్నట్టు ఫోజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. రోహిత్ లుక్‌పై అభిమానులు, టీమిండియా క్రికెటర్లతో పాటు అతని భార్య రితికా సజ్దే కూడా స్పందించింది. క్లీన్ షేవ్‌తో రోహిత్ యంగ్‌గా మారిపోయాడని అభిమానులు, సహచర క్రికెటర్లు అంటుండగా.. భార్య రితికా మాత్రం ఫన్నీ కామెంట్ చేసింది. "వై సో బ్రూడీ(అసంతృప్తితో ఆలోచించడం)" అంటూ రాసుకొచ్చింది. రోహిత్ న్యూ లుక్‌పై రితిక చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. చదవండి: Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు.. -
Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు..
IND Vs SA: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న వేళ, కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో వికెట్ కీపర్ ఎప్పటికీ విజయవంతమైన ఓపెనింగ్ బ్యాటర్ కాలేడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను అనవసరంగా వికెట్ కీపింగ్ రొంపిలోకి లాగొద్దని సూచించాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రాహుల్‌పై వికెట్ కీపింగ్ భారాన్ని మోపడం సబబు కాదని, ఇలా చేయడం వల్ల అతనితో పాటు జట్టు కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించాడు. క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కీపర్ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా రాణించింది లేదని ఈ సందర్భంగా ఉదహరించాడు. కీపింగ్ చేసి ఓపెనర్‌గా సక్సెస్ కావడం వన్డే, టీ20ల్లో చూసామని, సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం అలా జరగడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నాడు. ఉపఖండపు పిచ్‌లపై సగటున ఓ జట్టు 150 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే.. కీపింగ్ చేసి మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి రాణించడం అత్యాశ అవుతుందని తెలిపాడు. పంత్‌ను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తే.. మరో రెగ్యులర్ వికెట్ కీపర్ వైపు చూడాలి కాని, రాహుల్‌ను డిస్టర్బ్ చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. చదవండి: IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి, బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే..! -
IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి
కేప్‌టౌన్: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో సెంచరీ మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అదేంటీ.. కోహ్లి కొత్తగా సెంచరీ సాధించడమేంటీ అని అనుకుంటున్నారా..? అయితే, కోహ్లి ఈ సారి సెంచరీ మార్కును అందకుంది బ్యాటింగ్‌లో కాదు. అతను సెంచరీ పూర్తి చేసింది ఫీల్డింగ్‌లో. Virat Kohli completes 1️⃣0️⃣0️⃣ catches in Test cricket 🙌 He is the sixth Indian fielder, who isn't a wicket-keeper, to get to the milestone in Tests. Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/g7eoPK0wnB — ICC (@ICC) January 12, 2022 దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా క్యాచ్ అందుకోవడం ద్వారా కోహ్లి టెస్ట్‌ల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేశాడు. తద్వారా రాహుల్ ద్రవిడ్(164 టెస్ట్‌ల్లో 210 క్యాచ్‌లు), వీవీఎస్ లక్ష్మణ్(134 మ్యాచ్‌ల్లో 135), సచిన్ టెండూల్కర్(200 మ్యాచ్‌ల్లో 115), సునీల్ గవాస్కర్(125 మ్యాచ్‌ల్లో 108), అజహారుద్దీన్(99 టెస్ట్‌ల్లో 105)ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా(వికెట్‌కీపర్ కాకుండా) నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి కెరీర్లో 99వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లి సెకెండ్ స్లిప్‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో బవుమా(28) పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజ్‌లో పీటర్సన్(61), వెర్రిన్ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, ఉమేశ్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, షమీ ఓ వికెట్ సాధించాడు. అంతకుముందు తొలి రోజు భారత్ 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక -
IPL 2022: కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలైన లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది. జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ(జనవరి 12) ఉదయం ఇరు జట్లకు మెయిల్ చేసింది. గతంలో ఆటగాళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జనవరి 31ని గడువు తేదీగా నిర్ణయించిన బీసీసీఐ.. ముగ్గుర ఆటగాళ్ల ఎంపికకు అంత సమయం అవసరం లేదని భావించి, సవరించిన తేదీని ఇవాళ ప్రకటించింది. నిన్న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ మరో కీలక ప్రకటన కూడా చేసింది. బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి ఎట్టకేలకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో పాటు మెగా వేలానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. వేలానికి బెంగళూరును వేదికగా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్.. తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకుంది. అయితే కెప్టెన్ విషయంలో మాత్రం ఈ ఫ్రాంచైజీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. చదవండి: Ind Vs Sa ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక -
IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో జయంత్ యాదవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా జనవరి 19 నుంచి ప్రొటిస్‌తో టీమిండియా వన్డే సిరీస్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ కోవిడ్ కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో జయంత్ యాదవ్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా నవదీప్ సైనీని కూడా జట్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ మహ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా సైనీకి అవకాశం ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. -
IND Vs SA: కోహ్లి ఈగోను పక్కకు పెట్టాడు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Gautam Gambhir Hails Virat Kohli: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 79 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయం ఏదైన కోహ్లిపై విమర్శనాస్త్రాలు సంధించే గంభీర్.. తొలిసారిగా కోహ్లిని ఉద్దేశించి పాజిటివ్‌గా మాట్లడాడు. కేప్‌టౌన్ టెస్ట్‌లో కోహ్లి.. తన ఈగోను బ్యాగ్‌లో పెట్టి బ్యాటింగ్ చేశాడని, ఆ కారణంగానే కీలక ఇన్నింగ్స్ ఆడగలిగాడని పేర్కొన్నాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అహాన్ని పక్కకు పెట్టాలని కోహ్లి తన సహచరులకు సూచించేవాడని, తాజా ఇన్నింగ్స్‌లో కోహ్లి ఆ ఫార్ములాను పక్కాగా అమలు చేశాడని కితాబునిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో సఫారీ పేసర్లు కవ్వించే బంతులు విసిరినా ఏకాగ్రత కోల్పోకుండా సంయమనంతో బ్యాటింగ్ చేసిన కోహ్లి.. జట్టుకు గౌవరప్రదమైన స్కోర్ అందించాడని ప్రశంసించాడు. ఓపెనర్ల వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తన సహజ శైలికి భిన్నంగా ఎంతో ఓర్పుతో 201 బంతులను ఎదుర్కొని కీలక ఇన్నింగ్స్ ఆడాడని ఆకాశానికెత్తాడు. చాలా కాలం తర్వాత కోహ్లి.. తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడని ప్రశంసలు కురిపించాడు. కోహ్లి ఆడిన ఈ క్లాసీ ఇన్నింగ్స్ శతకంతో సమానమని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, కోహ్లి రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన సఫారీలు తొలి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేయగా.. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. చదవండి: ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్ కెప్టెన్.. టీమిండియా నుంచి అతడొక్కడే! -
IPL 2022: ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి ఆసీస్ స్టార్ పేసర్ రీ ఎంట్రీ.. భారీ ధర!
IPL 2022 Auction: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో పునరాగమనం చేయనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. మెగా వేలం-2022లో పాల్గొనేందుకు స్టార్క్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్ రిచ్ లీగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమతున్నట్లు సమాచారం. కాగా చివరిసారిగా 2015లో ఐపీఎల్లో ఆడాడు స్టార్క్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత పనిభారం తగ్గించుకునే క్రమంలో క్యాష్ రిచ్ లీగ్ నుంచి నిష్క్రమించాడు. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో తిరిగి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు స్టార్క్ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో అతడు మాట్లాడుతూ... ‘‘పేపర్‌వర్క్ పూర్తి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటివరకైతే నా పేరు నమోదు చేసుకోలేదు. పోటీలో మాత్రం ఉంటాననే భావిస్తున్నా. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్ జట్లు చేరనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ బెంగళూరులో మెగా వేలం నిర్వహించనుంది. ఇక స్టార్క్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. నాలుగో టెస్టుల్లో కలిపి ఇప్పటి వరకు 14 వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ స్టార్క్ గనుక వేలంలోకి వస్తే అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయం. ఈ క్రమంలో పెద్ద మొత్తమే చెల్లించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2014, 15 సీజన్లలో ఆడిన స్టార్క్ 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే.. -
IPL: కోహ్లి, ధోని జట్ల ప్రపంచ రికార్డు..
CSK And RCB In Top 10 Popular Teams: ఐపీఎల్ జట్లైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)లు ప్రపంచ స్థాయిలో అరుదైన ఘనతను సాధించాయి. గతేడాది విశ్వవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఎంగేజ్మెంట్లు (లైకులు, షేర్స్, కామెంట్స్ విషయంలో) కలిగిన భారత క్రీడా క్లబ్‌లుగా రికార్డు నెలకొల్పాయి. ఆర్సీబీ 820 మిలియన్ల ఎంగేజ్మెంట్లతో 8వ స్థానంలో నిలవగా.. సీఎస్కే 752 మిలియన్ల ఎంగేజ్మెంట్లతో 9వ ప్లేస్‌లో ఉంది. ఈ జాబితాలో ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ 2.6 బిలియన్ల ఎంగేజ్మెంట్లతో ప్రథమ స్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానాల్లో బార్సిలోనా (2.3 బిలియన్స్), రియల్ మాడ్రిడ్ (1.3 బిలియన్స్), పారిస్ సెయింట్ జర్మైన్ (1.2 బిలియన్స్), చెల్సీ (1.2 బిలియన్స్), లివర్ పూల్ (1.1 బిలియన్స్), గలాటాసరే (857 మిలియన్స్) వంటి ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్‌లు ఉన్నాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఫుట్ బాల్ క్లబ్‌ల సరసన కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ, ధోని సారధ్యంలోని సీఎస్కే జట్లు నిలిచాయి. కాగా, ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీలైన లక్నో, అహ్మదాబాద్‌ల కోసం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ బిడ్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: బీసీసీఐ జాక్‌పాట్ కొట్టేసింది.. అదనంగా 130 కోట్లు! -
ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్ కెప్టెన్.. టీమిండియా నుంచి అతడొక్కడే!
ICC Test Rankings: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా పలు టెస్టు సిరీస్‌లు జరుగుతున్న తరుణంలో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ 924 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సైతం రెండో ర్యాంకును కాపాడుకోగా... న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి ఎగబాకి విలియమ్సన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా టీమిండియా బ్యాటర్లలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ(781), టెస్టు సారథి విరాట్ కోహ్లి(740) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నారు. వరుసగా 5, 8 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని పదో ర్యాంకు సాధించాడు. బౌలింగ్ విభాగంలో... టీమిండియా నుంచి అశ్విన్ ఒక్కడే.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో ఆసీస కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 895 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకోగా... టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 861 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడిన కివీస్ బౌలర్ కైలీ జెమీషన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. షాహిన్ ఆఫ్రిది, కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్, టిమ్ సౌథీ, జోష్ హాజిల్‌వుడ్, నీల్ వాగ్నర్, హసన్ అలీ మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. భారత్ తరఫున అశ్విన్ మినహా ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే.. 🔼 Steve Smith overtakes Kane Williamson 🔼 Kyle Jamieson launches into third spot The latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 👇 Full list: https://t.co/0D6kbTluOW pic.twitter.com/vXD07fPoES — ICC (@ICC) January 12, 2022 -
అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్..
టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్కరమ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ప్రత్యర్ధి జట్టుపై అత్యంత తక్కువ సగటు(16.26)తో బ్యాటింగ్ చేసిన మూడో ఓపెనర్‌గా మార్క్రామ్ నిలిచాడు. కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 8 పరుగులు చేసిన మార్కరమ్ ఈ ఆప్రతిష్టతను మూట కట్టుకున్నాడు. అంతకు ముందు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ 15.50 సగటుతో తొలి స్ధానంలో ఉండగా, 16.26 ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డెన్నిస్ అమ్మీస్ రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ సిరీస్‌లో మార్కరమ్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు కలిపి కేవలం 60 పరుగులు మాత్రమే సాదించాడు. ఇక కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే.. -
IND vs SA 3rd Test: రెండో రోజు ముగిసిన ఆట.. 70 పరుగుల లీడ్‌లో టీమిండియా
Ind Vs Sa 3rd Test Updates 9:32 PM: రెండో రోజు ముగిసిన ఆట.. 70 పరుగుల లీడ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, పుజారా ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను 57/2 స్కోర్ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్(7)ను రబాడ, కేఎల్ రాహుల్(10)ను జన్సెన్ పెవిలియన్‌కు పంపారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 70 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. అంతకుముందు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో సఫారీ జట్టు 210 పరుగులకే ఆలౌటైంది. 8:46 PM: టీమిండియాకు వరుస షాక్‌లు.. 4 పరుగుల వ్యవధిలో ఓపెనర్లు ఔట్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 210 పరుగులకు కట్టడి చేసిన ఆనందం టీమిండియాకు ఎంతో సేపు నిలువలేదు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు పరుగుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. 5వ ఓవర్లో రబాడ్ బౌలింగ్‌లో ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్(7) ఔట్ కాగా, ఆరో ఓవర్లో జన్సెన్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్(10) పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా టీమిండియా 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం టీమిండియా 37 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజ్‌లో పుజారా, కోహ్లి ఉన్నారు. 8:11 PM: ఐదేసిన బుమ్రా.. దక్షిణాఫ్రికా 210 ఆలౌట్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. ఎంగిడి 3 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా(5/42)తో పాటు ఉమేశ్ యాదవ్(2/64), షమీ(2/39), శార్ధూల్ ఠాకూర్(1/37) రాణించారు. ఫలితంగా టీమిండియాకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీగన్ పీటర్సన్(72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 7:45 PM: రబాడ(14) ఔట్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 200 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి రబాడ(15) ఔటయ్యాడు. క్రీజ్‌లో ఒలీవియర్(4), ఎంగిడి ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 23 పరుగులు వెనుకపడి ఉంది. 6: 50 PM: ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా మార్కో జాన్సెన్ను బుమ్రా బౌల్డ్ చేశాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా శిబిరంలో జోష్ నింపాడు. ఇక కొరకరాని కొయ్యగా తయారైన పీటర్సన్ 70 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఇప్పటి వరకు 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, షమీ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రొటిస్ ప్రస్తుత స్కోరు: 176/7 (62.2). భారత్ కంటే 47 పరుగులు వెనుకబడి ఉంది. 6: 12 PM: టీమిండియా బౌలర్ షమీ మరోసారి ఆకట్టుకున్నాడు. క్రీజులోకి వచ్చీ రాగానే వెరెనెను అవుట్ చేశాడు. పంత్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో ప్రొటిస్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 160/6 (56). 6: 07 PM: పీటర్సన్, బవుమా భాగస్వామ్యాన్ని షమీ విడగొట్టాడు. కీలక వికెట్ పడగొట్టాడు. అద్భుతమైన బంతితో అతడిని ఊరించి పెవిలియన్‌కు పంపాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లికి క్యాచ్ ఇచ్చి బవుమా వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. కాగా ఈ క్యాచ్‌తో కోహ్లి టెస్టుల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. వెరెనె, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 159/6 (55.4). 5: 30 PM: ►ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ నిలకడగా ఆడుతున్నాడు. ఆచితూచి ఆడుతూనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 8 ఫోర్లు బాది 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా తెంబా బవుమా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 22 బంతులు ఎదుర్కొన్న బవుమా 15 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి. ►5: 05 PM: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి డసెన్ పెవిలియన్ చేరాడు. తెంబా బవుమా, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. 4: 03 PM: ►లంచ్ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు: 100/3 (35). 3: 47 PM: ►ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. 88 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్ల సాయంతో 33 పరుగులు పూర్తి చేసుకున్నాడు. పీటర్సన్‌తో డసెన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుత స్కోరు: 91/3 (32). భారత బౌలర్లలో బుమ్రాకు రెండు, ఉమేశ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. ►3: 07 PM: దక్షిణాఫ్రికా ప్రస్తుత స్కోరు: 54/3 (21.4) . భారత్ కంటే 167 పరుగులు వెనకబడి ఉంది. ►3: 00 PM: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. కేశవ్ మహరాజ్‌ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేశాడు. డసెన్, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. ►2: 05 PM: దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే బుమ్రా అద్భుత బంతితో మార్కరమ్‌ను బౌల్డ్ చేశాడు. కీగన్ పీటర్సన్ క్రీజులోకి వచ్చాడు. 2: 00 PM: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ఆరంభమైంది. మార్క్రమ్ (8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రొటిస్ బ్యాటర్లు ఎయిడెన్ మార్కరమ్ 8, కేశవ్ మహరాజ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంతకుముందు టీమిండియా 223 పరుగులకు ఆలౌట్ అయింది. ►తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Kagiso Rabada well and truly enjoyed his 50th Test cap for the #Proteas🤩 Day one full highlights: https://t.co/IfnLVkYlH0#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/G2t8387kyj — Cricket South Africa (@OfficialCSA) January 12, 2022 -
అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే..
టీమిండియా అండర్-19 ఆటగాడు హర్నూర్ సింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన అండర్-19 అసియా కప్‌లోను రాణించిన హర్నూర్.. అండర్-19 వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లోనూ చేలరేగి ఆడుతున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్నూర్ సింగ్ సెంచరీ సాధించి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్ 72 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియాపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 268 పరుగులకు ఆలౌటైంది. ఇది ఇలా ఉంటే.. త్వరలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో హర్నూర్ సింగ్‌ను దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే పలు ప్రాంఛైజీలు కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలస్తోంది. మెగా వేలంలో అతడికి భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కరలేదు. అతడి కోసం వేలంలో చాలా ప్రాంఛైజీలు పోటీపడతాయని క్రికెట్ నిపుణులు అంచానా వేస్తున్నారు. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం బీసీసీఐ నిర్వహించనుంది. చదవండి: IPL 2022: బీసీసీఐ పంట పండింది.. జాక్‌పాట్.. వివో నుంచి బోర్డుకు మరో రూ. 454 కోట్లు! -
IPL 2022: బీసీసీఐ జాక్‌పాట్ కొట్టేసింది.. అదనంగా 130 కోట్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ మారనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు లీగ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్ కంపెనీ ‘వివో’ తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ‘వివో’ స్థానంలో భారత్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ ‘టాటా గ్రూప్’ లీగ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ నిర్ధారించారు. ఐపీఎల్ రెండు సీజన్లకు (2022, 2023) ఇది వర్తిస్తుంది. 2018–2022 వరకు ఐదేళ్ల కాలానికిగాను రూ.2,200 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ‘వివో’ ఒప్పందం చేసుకుంది. అయితే 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణలు జరిగి భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ఆ ఏడాది లీగ్ నుంచి వివో తప్పుకోగా, తాత్కాలిక ప్రాతిపదికన ‘డ్రీమ్ 11’ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే 2021లో మళ్లీ ‘వివో’నే కొనసాగింది. ‘వివో’ ఒప్పందాన్ని 2023 వరకు బీసీసీఐ పొడిగించింది. తాజాగా ‘వివో’ వైదొలగడంతో టాటా సంస్థ వచ్చే రెండేళ్ల పాటు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇదీ లెక్క... వివో తప్పుకోవడంతో పాటు టాటా స్పాన్సర్‌గా రావడంతో బీసీసీఐ పంట పండింది. ఒకేసారి రెండు సంస్థల నుంచి ఆదాయం వస్తుండటంతో బోర్డు జాక్‌పాట్ కొట్టింది. టాటా గ్రూప్ రెండేళ్ల కోసం రూ. 670 కోట్లు (ఏడాదికి రూ. 335 కోట్లు) చెల్లిస్తుంది. అయితే 2022లో రూ. 547 కోట్లు, 2023లో రూ. 577 కోట్లు చెల్లిస్తామని ‘వివో’ గతంలో ఒప్పందం (రెండేళ్లకు మొత్తం రూ. 1,124 కోట్లు) కుదుర్చుకుంది. ఇప్పుడు బీసీసీఐకు ఎలాంటి అభ్యంతరం లేకున్నా వివో తమంతట తామే తప్పుకునేందుకు సిద్ధమైంది కాబట్టి ‘టాటా’ ఇస్తున్న మొత్తం పోగా, మిగిలిన నష్టాన్ని వారే భర్తీ చేయాల్సి ఉంటుంది. దాంతో వివో బోర్డుకు మరో రూ. 454 కోట్లు చెల్లిస్తుంది. ఈ క్రమంలో బోర్డు అదనంగా 130 కోట్లు పొందనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండు కొత్త జట్లకు బీసీసీఐ అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. అహ్మదాబాద్, లక్నో జట్లకు ఆమోద ముద్ర వేసిన బోర్డు... మొదటి ప్రాధాన్యంగా ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకునేందుకు రెండు వారాల సమయం ఇస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ వేలం జరుగుతుంది. చదవండి: SA vs IND: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంఫర్ ఆఫర్.. ఐదేళ్ల తర్వాత! -
Saina Nehwal: సిద్దార్థ క్షమాపణపై స్పందించిన సైనా.. ఎందుకు వైరల్ అవుతుందో..
సినీ నటుడు సిద్దార్థ తనకు క్షమాపణ చెప్పడం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పందించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని, అయితే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏదేమైనా సిద్దార్థను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మన దేశం సురక్షితంగా ఉందని ఎలా చెప్పుకోగలమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన నటుడు సిద్ధార్థ అభ్యంతరకర అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయగా తీవ్ర దుమారం రేగింది. జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. సైనా తండ్రి హర్వీర్ సింగ్, భర్త పారుపల్లి కశ్యప్ కూడా సిద్ధార్థ తీరును ఖండించారు. ఈ నేపథ్యంలో సైనా పేరు ట్విటర్లో మారుమోగిపోయింది. సిద్ధార్థ వ్యవహార శైలిపై రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన అతడు... సైనాను క్షమాపణ కోరుతూ సుదీర్ఘ లేఖ రాశాడు. ‘‘నువ్వు ఎల్లప్పటికీ నా చాంపియన్‌వే’’ అని ట్వీట్ చేశాడు. తాజాగా ఈ లేఖపై స్పందించిన సైనా.. టైమ్స్ నౌతో మాట్లాడుతూ... ‘‘మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నిజానికి నా పేరు ట్విటర్లో ట్రెండ్ అవడం చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే అతడు నా గురించి ఏం రాశాడో తెలిసింది. అతడితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీసులు అతడికి ఉండాలి’’ అని హుందాతనాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో.. ఈ వివాదం ఇప్పటికైనా ముగిసిపోతుందా లేదా అన్న అంశం గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కాగా పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సైనాను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించిన విషయం విదితమే. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 -
అయ్యో కోహ్లి... నీ కంటే ఉమేశ్ యాదవ్ ముందున్నాడు.. పర్లేదులే!
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాప్రికాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 79 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేశాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగల్గింది. కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు,1 సిక్స్ ఉంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన రబడా బౌలింగ్‌లో.. బౌన్సర్‌ని సిక్స్‌గా కోహ్లి మలిచాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒకే సిక్స్ నమోదైంది. అది కూడా కోహ్లిదే కావడం విశేషం. కాగా ప్రముఖ గణాంకవేత్త మోహన్‌దాస్ మీనన్ నివేదిక ప్రకారం.. 2019 నుంచి టెస్టు క్రికెట్లో కోహ్లికి ఇది ఐదవ సిక్స్ కావడం గమనార్హం. ఇదే సమయంలో రోహిత్ శర్మ(31), మయాంక్(25),పంత్(18) సిక్స్‌లతో కోహ్లి కన్నా ముందు వరుసలో ఉన్నారు. అంతే కాకుండా టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 11 సిక్స్‌లతో కోహ్లి కన్న ముందుంజలో ఉండడం గమనార్హం. ఇది ఇలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఒంటరి పోరాటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి దక్షిణాప్రికా 17 పరుగులు చేసింది. కెప్టెన్ ఎల్గర్‌ను ఆదిలోనే బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! -
India Vs Sa 3rd Test: కోహ్లి మరీ స్లోగా... 158 బంతుల్లో.. అయినా..
Ind Vs Sa 3rd Test: వరుసగా రెండో టెస్టులోనూ బ్యాటింగ్‌లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. టాస్ గెలిచిన సానుకూలతను పూర్తి స్థాయిలో వాడుకోలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. దాంతో మరోసారి జట్టును రక్షించాల్సిన భారం బౌలర్లపైనే పడింది. ఆట ముగిసేలోగా గత మ్యాచ్ హీరో ఎల్గర్ వికెట్ తీయడం కాస్త సంతృప్తినిచ్చినా ఓవరాల్‌గా తొలి రోజు సఫారీలదే. అయితే మంగళవారం ఆటలో భారత కెప్టెన్ కోహ్లి ప్రదర్శనే చెప్పుకోదగ్గ అంశం. ఆరంభంలో ఓపిగ్గా క్రీజ్‌లో నిలబడిన అతను, ఆ తర్వాత తన స్థాయికి తగిన రీతిలో చక్కటి షాట్లతో అలరించాడు. కోహ్లి బ్యాటింగ్ చూస్తే రెండేళ్ల తర్వాత అతని నుంచి అంతర్జాతీయ సెంచరీ రావడం ఖాయమనిపించింది. దురదృష్టవశాత్తూ మళ్లీ ఆ అవకాశం చేజారినా, కోహ్లి బ్యాటింగ్ వల్లే టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రెండో రోజు ఆతిథ్య జట్టును మన బౌలర్లు ఎలా నిలువరిస్తారనేదే కీలకం. కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టెస్టులో మొదటి రోజు భారత బ్యాటర్లు ఆశించిన ప్రదర్శనను ఇవ్వలేకపోయారు. సఫారీ బౌలర్లు రాణించడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 77.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (201 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, చతేశ్వర్ పుజారా (77 బంతుల్లో 43; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రబడ 73 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జాన్సెన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా అవుట్ చేయగా... మార్క్రమ్ (8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో దిగింది. విహారి స్థానంలో కోహ్లి... సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ వచ్చారు. రాణించిన పుజారా... భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) ఈసారి మెరుగైన ఆరంభాన్ని అందించడంలో విఫలమయ్యారు. తడబడుతూనే ఆడిన వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఈ దశలో పుజారా, కోహ్లి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ పరిస్థితిని చక్కదిద్దారు. ఆశ్చర్యకరంగా పుజారా ధాటిని ప్రదర్శించగా, కోహ్లి అతి జాగ్రత్తగా ఆడాడు. పరిస్థితులు ఎలా ఉన్నా గట్టిగా క్రీజ్‌లో నిలవాలనే పట్టుదల కోహ్లిలో కనిపించింది. తాను ఆడిన 16వ బంతికి గానీ అతను ఖాతా తెరవలేదు. చక్కటి బంతితో పుజారాను అవుట్ చేసి జాన్సెన్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించగా పుజారానే 41 పరుగులు చేయడం విశేషం. పుజారా అవుటయ్యే సమయానికి కోహ్లి 80 బంతుల్లో 17 పరుగులే చేశాడు! ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే (9) విఫలమయ్యాడు. కోహ్లీ మరీ నెమ్మదిగా... అయితే వరుసగా రెండు వికెట్లు పడిన తర్వాత విరాట్ తనదైన శైలిలో బాధ్యత తీసుకొని చూడచక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అతని అందమైన కవర్ డ్రైవ్‌లు ఆటలో హైలైట్‌గా నిలిచాయి. 158 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. కోహ్లి, రిషభ్ పంత్ (50 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఐదో వికెట్‌కు 51 పరుగులు జత చేశారు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతుండటంతో చకచకా ఆడి పరుగులు రాబట్టే ప్రయత్నం చేసిన కోహ్లి అర్ధ సెంచరీ దాటిన తర్వాతే ఐదు బౌండరీలు కొట్టాడు. సహచరులు అండగా నిలిస్తే శతకం ఖాయమని అనిపించినా... రబడ వేసిన ఒక చక్కటి బంతిని ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి ఆట ముగిసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) వెరీన్ (బి) ఒలీవియర్ 12; మయాంక్ (సి) మార్క్రమ్ (బి) రబడ 15; పుజారా (సి) వెరీన్ (బి) జాన్సెన్ 43; కోహ్లి (సి) వెరీన్ (బి) రబడ 79; రహానే (సి) వెరీన్ (బి) రబడ 9; పంత్ (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 27; అశ్విన్ (సి) వెరీన్ (బి) జాన్సెన్ 2; శార్దుల్ (సి) పీటర్సన్ (బి) కేశవ్ 12; బుమ్రా (సి) ఎల్గర్ (బి) రబడ 0; ఉమేశ్ (నాటౌట్) 4; షమీ (సి) బవుమా (బి) ఎన్గిడి 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (77.3 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–31, 2–33, 3–95, 4–116, 5–167, 6–175, 7–205, 8–210, 9–211, 10–223. బౌలింగ్: రబడ 22–4–73–4, ఒలీవియర్ 18–5–42–1, జాన్సెన్ 18–6–55–3, ఎన్గిడి 14.3–7–33–1, కేశవ్ మహరాజ్ 5–2–14–1. -
Pro Kabaddi League: రాత మారలేదు.. మళ్లీ ఓడిన టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 22–40తో ఓడింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఆరో ఓటమి. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేసి 12 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–23తో యు ముంబాను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధ; దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. చదవండి: SA vs IND: కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్ -
జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ప్రొటీస్ జట్టు.. కెప్టెన్ డీన్ ఎల్గర్ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఓ అద్భుతమైన డెలివరీతో బుమ్రా.. ఎల్గర్‌ని పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీకి ఎల్గర్ అడ్డంగా దొరికిపోయాడు. బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీను ఎల్గర్ ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఉన్న పుజారా చేతికి వెళ్లింది. దీంతో పూర్తి నిరాశతో ఎల్గర్ వెనుదిరిగాడు. అంతకముందు కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను భారత్ చేయగల్గింది. సఫారీ బౌలర్లలో రబాడ 4, మార్కో జన్సెన్ 3, ఒలీవియర్, ఎంగిడి, కేశవ్ మహారాజ్ తలో వికెట్ సాధించారు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి దక్షిణాఫ్రికా 17 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. pic.twitter.com/mpeykpNAuU — Sunaina Gosh (@Sunainagosh7) January 11, 2022 చదవండి: SA vs IND: కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్ -
కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్
కేప్‌టౌన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్ 13 ఓవర్ ప్రారంభమైనప్పుడు.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి హెల్మెట్ ధరించి డ్రెస్సింగ్ రూమ్‌లో షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలెపెట్టాడు. ఈ క్రమంలో యాదృచ్ఛికంగా తరువాత బంతికే మయాంక్ అగర్వాల్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. కగిసో రబాడ బౌలింగ్‌లో స్లిప్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి, పుజరా జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజు లో నిలదొక్కుకున్నట్లు కనిపించిన పుజారా 43 పరుగుల వద్ద మార్కో జన్సెన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే మరో సారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ కోహ్లి(79) ఓంటరి పోరాటం చేయడంతో 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను బారత్ సాధించగలిగింది. pic.twitter.com/mpeykpNAuU — Sunaina Gosh (@Sunainagosh7) January 11, 2022 చదవండి: IND vs SA 3rd Test: భారత్ 223 ఆలౌట్, దక్షిణాఫ్రికా 17/1 -
టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంఫర్ ఆఫర్.. ఐదేళ్ల తర్వాత!
SA vs IND: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు సుందర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరో ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను సుందర్‌కి బ్యాకప్‌గా ఉంచునున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జయంత్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు భారత జట్టుతోనే ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒకవేళ వన్డేలకు సుందర్ దూరమైతే మరోసారి జయంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కాగా 2016లో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన జయంత్ యాదవ్.. ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా దూరం కావడంతో జయంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనిపిస్తోంది. ఇక భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జనవరి 19 న జరగనుంది. అదే విధంగా టీమిడియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్ రాహుల్ వన్డేలకు సారథ్యం వహించనున్నాడు. చదవండి: WTC 2021-23 Points Table: టాప్-3 లో పాకిస్తాన్.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! -
టాప్-3 లో పాకిస్తాన్.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో న్యూజిలాండ్ తొలి విజయం నమోదు చేసింది. హగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా కివీస్ ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 6వ స్ధానానికి చేరుకుంది. ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీలో ఆడిన రెండు టెస్ట్‌ల్లోనూ విజయాలు నమోదు చేసి 24 పాయింట్లతో(100 శాతం) శ్రీలంక అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 40 (83.3శాతం)తో రెండో స్దానంలో ఉంది. అదే విధంగా పాకిస్తాన్ 75 పాయింట్ల శాతం (36 పాయింట్లు)తో మూడో స్ధానంలో ఉండగా, టీమిండియా 53 పాయింట్లతో(55.21 శాతం)తో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది . చదవండి: NZ vs BAN: వికెట్ పడగొట్టాడు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు! -
వికెట్ పడగొట్టాడు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు!
NZ vs BAN: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రాస్ టేలర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో టేలర్ 112 టెస్టుల్లో 44.66 సగటుతో 7,683 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 290. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత టేలర్‌దే. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ అతడి కేరిర్‌లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు 38 ఏళ్ల టేలర్ తన కెరీర్లో రెండే వికెట్లు (2010లో) తీశాడు. అయితే చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపించకపోవడంతో కివీస్ కెప్టెన్ లాథమ్ అతనితో సరదాగా బౌలింగ్ చేయించాడు. తన మూడో బంతికే అతను బంగ్లా చివరి వికెట్ (ఇబాదత్)ను అవుట్ చేసి ఘనంగా ఆటను ముగించడం విశేషం. న్యూజిలాండ్ ఘన విజయం తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ జట్టు ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 395 పరుగుల ఆధిక్యం కోల్పోయి ఫాలోఆన్ ఆడిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (102; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. జేమీసన్‌కు 4, వాగ్నర్‌కు 3 వికెట్లు దక్కాయి. చదవండి: Virat Kohli: శతక్కొట్టి కూతురికి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.. కానీ..! Gotta love Ross Taylor getting his 3rd Test wicket in his final Test to win the match. pic.twitter.com/8KsjuWMExR — Andrew Donnison (@Donno79) January 11, 2022 -
యూకీ బాంబ్రీ శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌కు చేరగా... రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మెల్బోర్న్లో మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో యూకీ బాంబ్రీ 6–4, 6–2తో జావో డొమింగెస్ (పోర్చుగల్)పై నెగ్గగా... రామ్‌కుమార్ 3–6, 5–7తో మార్కోమొరోని (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అంకిత రైనా 0–6, 1–6తో సురెంకో (ఉక్రెయిన్) చేతిలో ఓటమి చవిచూసింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సింధు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో వీరిద్దరూ తొలి రౌండ్లో అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. టాప్ సీడ్ శ్రీకాంత్ 21–17, 21–10తో సిరిల్ వర్మ (భారత్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–5, 21–16తో కుదరవల్లి శ్రీకృష్ణప్రియ (భారత్)పై గెలిచింది. భారత్‌కే చెందిన అష్మిత చాలియా 24–22, 21–16తో ఐదో సీడ్ ఎవగెనియా కొసెత్‌స్కాయా (రష్యా)పై సంచలన విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ (భారత్) జంట 21–12, 21–10తో ప్రొజొరోవా–రుదకోవా (ఉక్రెయిన్) జోడీపై నెగ్గి ముందంజ వేసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–సాయిప్రతీక్ (భారత్) ద్వయం 21–16, 16–21, 21–17తో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీపై... సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) జంట 21–11, 21–11తో చిరాగ్ అరోరా–నిషు రాప్రియా (భారత్) ద్వయంపై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి.