NZ vs BAN: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రాస్ టేలర్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో టేలర్ 112 టెస్టుల్లో 44.66 సగటుతో 7,683 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 290. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత టేలర్‌దే. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ అతడి కేరిర్‌లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు 38 ఏళ్ల టేలర్ తన కెరీర్‌లో రెండే వికెట్లు (2010లో) తీశాడు. అయితే చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపించకపోవడంతో కివీస్ కెప్టెన్ లాథమ్ అతనితో సరదాగా బౌలింగ్ చేయించాడు. తన మూడో బంతికే అతను బంగ్లా చివరి వికెట్ (ఇబాదత్)ను అవుట్ చేసి ఘనంగా ఆటను ముగించడం విశేషం.
న్యూజిలాండ్ ఘన విజయం
తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ జట్టు ఇన్నింగ్స్, 117 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 395 పరుగుల ఆధిక్యం కోల్పోయి ఫాలోఆన్ ఆడిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (102; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. జేమీసన్‌కు 4, వాగ్నర్‌కు 3 వికెట్లు దక్కాయి.
చదవండి: Virat Kohli: శతక్కొట్టి కూతురికి బర్త్ డే గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.. కానీ..!
Gotta love Ross Taylor getting his 3rd Test wicket in his final Test to win the match. pic.twitter.com/8KsjuWMExR
— Andrew Donnison (@Donno79) January 11, 2022
Comments
Please login to add a commentAdd a comment