Telugu Sports News
-
IND VS ENG 5th Test: రెండో రోజు ముగిసిన ఆట
India vs England 5th Test Day 2 Live Updates రెండో రోజు ముగిసిన ఆట.. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా భారత-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. పెవిలియన్‌కు క్యూ కడుతున్న టీమిండియా ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. పరుగు వ్యవధిలో భారత జట్టు 3 వికెట్లు కోల్పోయింది. 428 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ నష్టపోయింది. హార్ట్లీ బౌలింగ్‌లో అశ్విన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా 427 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 101వ ఓవర్లో బషీర్ బౌలింగ్‌లో జురెల్ (15), టామ్ హార్ట్లీ వేసిన ఆతర్వాతి ఓవర్లో జడేజా (15) ఔటయ్యారు. 101.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 427/7గా ఉంది. అశ్విన్ క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 209 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 92.1 ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా షోయబ్ బషీర్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ బౌల్డ్. ఈ అరంగేట్ర టీమిండియా బ్యాటర్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 406-5(93). పడిక్కల్ స్థానంలో ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్ అరంగేట్రం ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం తర్వాత తొలి బంతికే ఔటైన సర్ఫరాజ్ టీ విరామం అనంతరం తొలి బంతికే సర్ఫరాజ్ ఖాన్ (56) ఔటయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 84.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 376/4గా ఉంది. పడిక్కల్‌కు (44) జతగా జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫిప్టీ.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 81 ఓవర్లకు భారత్ స్కోర్: 366/3 ►76 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (27), పడిక్కల్ (34) పరుగులతో క్రీజులో ఉన్నారు. 68: మూడు వందల పరుగుల మార్కు దాటిన టీమిండియా సర్ఫరాజ్ ఖాన్ ఏడు, పడిక్కల్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ ఔట్ 279 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 110 పరుగులు చేసిన గిల్.. ఆండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ(103) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి అరంగేట్ర ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ వచ్చాడు. 62 ఓవర్లకు భారత స్కోర్: 275/1 గిల్ సూపర్ సెంచరీ.. శుబ్‌మన్ గిల్ సైతం తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 137 బంతుల్లో గిల్ సెంచరీని పూర్తి చేశాడు. లంచ్ విరామానికి టీమిండియా స్కోర్: 264/1. భారత్ ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రోహిత్ శర్మ సెంచరీ.. ధర్మశాల టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్‌కు ఇది 12వ టెస్టు సెంచరీ. ఓవరాల్‌గా ఇది 48వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 58 ఓవర్లకు బారత స్కోర్: 257/1 సెంచరీకి చేరువలో రోహిత్, గిల్.. రోహిత్ శర్మ(90), గిల్(87) సెంచరీకి చేరువయ్యారు. 54 ఓవర్లకు భారత స్కోర్: 241/1. టీమిండియా ప్రస్తుతం 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. శుబ్‌మన్ గిల్ ఫిప్టీ.. టీమిండియా యువ ఆటగాడు మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 52 పరుగులతో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(75) క్రీజులో ఉన్నాడు. 41 ఓవర్లకు భారత్ స్కోర్: 189/1 ►38 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 180 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(72), శుబ్‌మన్ గిల్(47) పరుగులతో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న టీమిండియా.,. రెండో రోజు ఆటను టీమిండియా దూకుడుగా ఆరంభించింది. ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్‌ను రోహిత్ శర్మ టార్గెట్ చేశాడు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(63), శుబ్‌మన్ గిల్(27) పరుగులతో ఉన్నారు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్‌ను స్పిన్నర్ ప్రారంభించాడు. ప్రస్తుతం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(52), గిల్(26) ఉన్నారు. -
తొలి వన్డేలో టీమిండియా విజయం
India vs Australia, 1st ODI Updates: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 పరుగులు నాటౌట్) తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడి పాత్ర పోషించగా.. జడేజా(69 బంతుల్లో 45 పరుగులు నాటౌట్) తన స్టైల్ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. టీమిండియా విజయానికి చేరువైంది. కేఎల్ రాహుల్ అర్థసెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. జడేజా అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులతో ఆడుతున్న టీమిండియా విజయానికి 17 పరుగుల దూరంలో ఉంది. ► ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా వంద పరుగుల మార్క్‌ను అందుకుంది. ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 25వ ఓవర్లో ఈ మార్క్‌ను అందుకుంది. రాహుల్ 32, జడేజా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ► పాండ్యా, రాహుల్ ఇన్నింగ్స్‌తో గాడిన పడిందనుకున్న టీమిండియాకు షాక్ తగిలింది. 25 పరుగులు చేసిన పాండ్యా స్టోయినిస్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. భారత్ విజయానికి 102 పరుగులు అవసరం ఉంది. ► గిల్(20) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ►189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ఆరంభంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ముందుగా మూడు పరుగులు చేసిన ఇషాన్ కిషన్ స్టోయినిస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగ్గా.. విరాట్ కోహ్లి నాలుగు పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత మరుసటి బంతికే ఎల్బీ రూపంలో సూర్యకుమార్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ►189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. స్టోయినిష్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 188 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 188 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్, హార్దిక్, తలా వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్(81) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ►184 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన స్టోయినిస్.. షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ►174 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన గ్రీన్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ►140 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లబుషేన్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. మార్ష్ ఔట్ ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 81 పరుగులతో దూకుడుగా ఆడుతోన్న మిచెల్ మార్ష్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన మార్ష్.. సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 77 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి మార్నస్ లాబుషేన్ వచ్చాడు. 11 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 70/1 (11) 50 పరుగుల మార్కును దాటిన ఆసీస్ మిచెల్ మార్ష్, స్మిత్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి మార్ష్ 6 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేయగా.. స్మిత్ 3 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరి నిలకడైన ఆటతో ఆసీస్ 50 పరుగుల మార్కును దాటింది. స్కోరు: 53-1(9) 5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 29/1 స్మిత్ 5, మార్ష్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 పరుగులు వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా తొలి వన్డేలో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అదే విధంగా యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తుది జట్లు భారత్: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
రెండో రోజు ముగిసిన ఆట.. 62 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
Ind Vs Aus BGT 2023 2nd Test Day 2 Highlights And Updates: ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. రెండోరోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. 5.5: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా జడేజా బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (6) అవుట్. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు. ఒక్క పరుగు ఆధిక్యం 83.3: కుహ్నెమన్ బౌలింగ్‌లో షమీ బౌల్డ్. 262 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా. ఆసీస్‌కు ఒక్క పరుగు ఆధిక్యం 81.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్(74) అవుటయ్యాడు. దీంతో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆసీస్ కంటే ఇంకా 4 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు: 259/9 (82). షమీ, సిరాజ్ క్రీజులో ఉన్నారు. 80.2: అశ్విన్ అవుట్.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా దంచికొడుతున్న అక్షర్ అక్షర్ పటేల్ 67 పరుగులతో, అశ్విన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 252/7 (80). ఆసీస్ కంటే టీమిండియా ఇంకా 11 పరుగులు వెనుకబడి ఉంది. అక్షర్ అర్ధ శతకం 74.5: కుహ్నెమన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్న టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. భారత్ స్కోరు: 230/7 (75) నిలకడగా ఆడుతున్న అశ్విన్, అక్షర్ 69: అక్షర్ పటేల్ 34, అశ్విన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 202-7 టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 179/7 (62) అశ్విన్(11), అక్షర్ పటేల్ (28) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. భరత్ ఔట్ 139 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన భరత్.. లియోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 135 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లి మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 125 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన జడేజా.. మర్ఫీ బౌలింగ్‌లో లల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో కోహ్లి, శ్రీకర్ భరత్ ఉన్నారు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 120/4 భారత ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా చక్కదిద్దే పనిలో పడ్డారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. కోహ్లి(31), రవీంద్ర జడేజా(26) పరుగులతో క్రీజులో ఉన్నారు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 120/4 లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే! లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 88/4 (35). రవీంద్ర జడేజా(15), కోహ్లి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 66 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. లియోన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా టీమిండియా వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తన వందో టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగాడు. లియోన్ బౌలింగ్‌లో పుజారా ఎల్బీగా వెనుదిరిగాడు. 20 ఓవర్లకు టీమిండియా స్కోర్: 55/3 రెండో వికెట్ కోల్పోయిన భారత్ 53 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ లియోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రాహుల్ అవుట్ 17.1: కేఎల్ రాహుల్(17) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్‌లో ఈ ఓపెనర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: 46-1. పుజారా, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. ►14 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(13), రోహిత్(24) పరుగులతో ఉన్నారు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టు ఢిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆస్ట్రేలియా తమ బౌలింగ్ ఎటాక్‌ను స్పిన్‌తో మొదలపెట్టింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతిని డెబ్యూ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ చేతికి ఇచ్చాడు. ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ 13, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తుది జట్లు: భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమన్, డేవిడ్ వార్నర్ సబ్‌స్టిట్యూట్‌గా మాథ్యూ రెర్షా. -
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన విండీస్! యువ స్పిన్నర్ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో వెస్టిండీస్ యువ స్పిన్నర్ కెవిన్ సింక్లెయిర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు టీ20ల్లో విండీస్ తరపున 6 మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్.. 8.33తో ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా తన లిస్ట్-ఏ కెరీర్లో 16 మ్యాచ్‌లు ఆడిన సింక్లెయిర్ 18 వికెట్లు సాధించాడు. మరో వైపు రోస్టన్ ఛేజ్ గాయం కారణంగా ఈ సీరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో విండీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. మూడు వన్డేలు కూడా కింగ్స్టన్ ఓవల్ వేదికగానే జరగనున్నాయి. కాగా ప్రస్తుతం విండీస్.. కివీస్‌తో టీ20 సిరీస్‌లో తలపడుతోంది. కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ 1-0తో అధిక్యంలో ఉంది. కాగా స్వదేశంలో భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను విండీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కివీస్‌తో వన్డే సిరీస్‌కు విండీస్ జట్టు నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్. చదవండి: Asia Cup 2022: 'ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వద్దు.. అతడినే రోహిత్ జోడిగా పంపండి' -
ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం!
బెల్ఫాస్ట్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఐర్లాండ్ అధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ (36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐరీష్ బౌలర్లలో జోష్ లిటిల్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 123 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్..19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండీ బల్బిర్నీ 46 పరుగులతో రాణించగా, అఖరిలో డాకెరల్ 25 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో కెప్టెన్ నబీ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ముజీబ్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరిచింది. ఇక ఇరు జట్లు మధ్య మూడో టీ20 బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: IND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్ దూరం! -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. ప్రాక్టీస్ షురూ చేసిన కింగ్ కోహ్లి!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆసియాకప్ కోసం తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గరువారం ముంబైలోని బికేసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కోహ్లి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న కోహ్లి తిరిగి ఆసియా కప్‌లో బరిలోకి దిగననున్నాడు. ఇక కోహ్లి గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతడు అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి మూడేళ్లు దాటుతోంది. ఈ ఏడాది నాలుగు అంతర్జాతీయ టీ20 ఆడిన కోహ్లి 81 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కోహ్లి ఆసియా కప్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా ఆసియా కప్‌లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న తల పడనుంది. అయితే పాకిస్తాన్‌పై కింగ్ కోహ్లికి తిరుగులేని రికార్డు ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత బ్యాటర్లు అంతా విఫలమైనా.. కోహ్లి మాత్రం అర్ధసెంచరీతో మెరిశాడు. మరోసారి పాక్‌పై కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా శ్రీలంక-ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం భారత్, పాక్ జట్లు తమ జట్లను ప్రకటించాయి. మిగితా జట్లను కూడా ఆయా దేశ క్రికెట్ బోర్డులు ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఆసియకప్కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్. స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ ఆసియకప్కు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ మరియు ఉస్మాన్ ఖదీర్ #ViratKohli has started the practice for #AsiaCup 2022 at BKC Complex Mumbai.pic.twitter.com/KkhgGWGYti — Lakshya Lark (@lakshyalark) August 11, 2022 చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి.. -
IND vs WI: విండీస్‌తో మూడో టీ20.. శ్రేయస్ అవుట్! హుడాకు ఛాన్స్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జోరుకు వెస్టిండీస్ కళ్లెం వేసింది. సెయింట్స్ కిట్స్ వేదికగా సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఇక మంగళవారం జరగనున్న మూడో టీ20లో విజయం సాధించి విండీస్‌పై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. కాగా విండీస్-భారత్ మధ్య మూడో టీ20 సెయింట్స్ కిట్స్ వేదికగానే జరగనుంది. ఈ మ్యాచ్ కూడా 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మూడో టీ20 రాత్రి 9:30 గంటలకు మొదలు కానుంది. ఇక రెండో టీ20లో భారత బౌలర్లు రాణించినప్పటికీ.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్(0 ,10)ను ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ జోడిగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో పంత్‌ను పంపే ఆలోచనలో జట్టు మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన సూర్య స్థాయికి తగ్గట్లు రాణించలేదు. దీంతో అతడిని ఎప్పటిలాగే నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపాలని కోచ్, కెప్టెన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక వేళ ముగ్గురు స్పిన్నర్లను భారత్ ఆడించాలని భావిస్తే అవేశ్ ఖాన్ స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రానున్నాడు. భారత తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: Ind Vs WI T20 Series: ఓపెనర్‌గా డీకే! ఐదో స్థానంలో రోహిత్ ఎందుకు రాకూడదు? రూల్ అంటే రూలే మరి! -
IND VS WI 1st T20: టీమిండియా ఆల్‌రౌండ్ షో.. 68 పరుగులతో గెలుపు
ట్రినిడాడ్: ఫార్మాట్ మారినా వెస్టిండీస్ తలరాత మాత్రం మారలేదు. తొలి టి20లో టీమిండియా 68 పరుగులతో జయభేరి మోగించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆశ్చర్యకరంగా సూర్యకుమార్‌తో ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. ఉన్నంతసేపు చక్కటి షాట్లు ఆడిన సూర్య (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) త్వరగానే పెవిలియన్ చేరగా, అయ్యర్ (0), రిషభ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (1) నిరాశపరిచారు. ‘హిట్‌మ్యాన్’ క్రీజులో ఉండటంతో కీలకమైన వికెట్లు పడినా ఆ లోటేమి కనపడలేదు. 11.3 ఓవర్లలోనే భారత్ 100 దాటింది. కెప్టెన్ రోహిత్ 35 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. జడేజా (16) తక్కువ స్కోరే చేయగా, ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (19 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. జోసెఫ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనకు విండీస్ విలవిల్లాడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేసింది. బ్రూక్స్ (20) టాప్ స్కోరర్ కాగా... అర్‡్షదీప్, అశ్విన్, బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. రెండో టి20 సోమవారం బసెటెర్లో జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హెట్‌మైర్ (బి) హోల్డర్ 64; సూర్యకుమార్ (సి) హోల్డర్ (బి) హోసీన్ 24; అయ్యర్ (సి) హోసీన్ (బి) మెక్కాయ్ 0; పంత్ (సి) హోసీన్ (బి) పాల్ 14; పాండ్యా (సి) మెక్కాయ్ (బి) జోసెఫ్ 1; జడేజా (సి) పాల్ (బి) జోసెఫ్ 16; కార్తీక్ నాటౌట్ 41; అశ్విన్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–44, 2–45, 3–88, 4–102, 5–127, 6–138. బౌలింగ్: మెక్కాయ్ 4–0–30–1, హోల్డర్ 4–0–50–1, హోసీన్ 4–0–14–1, జోసెఫ్ 4–0–46–2, స్మిత్ 2–0–18–0, కీమో పాల్ 2–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) భువనేశ్వర్ (బి) అర్‡్షదీప్ 15; బ్రూక్స్ (బి) భువనేశ్వర్ 20; హోల్డర్ (బి) జడేజా 0; పూరన్ (సి) పంత్ (బి) అశ్విన్ 18; పావెల్ (బి) బిష్ణోయ్ 14; హెట్‌మైర్ (సి) సూర్యకుమార్ (బి) అశ్విన్ 14; హోసీన్ (బి) అర్‡్షదీప్ 11; స్మిత్ (స్టంప్డ్) పంత్ (బి) బిష్ణోయ్ 0; కీమోపాల్ నాటౌట్ 19; జోసెఫ్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–22, 2–27, 3–42, 4–66, 5–82, 6–86, 7–86, 8–101. బౌలింగ్: భువనేశ్వర్ 2–1–11–1, అర్‡్షదీప్ 4–0–24–2, జడేజా 4–0–26–1, అశ్విన్ 4–0–22–2, పాండ్యా 2–0–12–0, బిష్ణోయ్ 4–0–26–2. -
IND VS WI 1st T20: తొలి టీ20లో భారత్ విజయం
తొలి టీ20లో భారత్ విజయం బ్రియన్ లారా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆతిథ్య జట్టు మొదటి టీ20లో 68 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. 5 వికెట్లు కోల్పోయిన విండీస్ 11.1 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 82 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. హెట్మెయిర్ 13 పరుగులు, అకేల్ హోసేన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 17 బంతుల్లో 14 పరుగులు చేసిన పావెల్ రవి బిష్ణోయ్ ఓవర్లో 5వ వికెట్‌గా వెనుదిరిగాడు. 42 పరుగులకు 3 వికెట్లు 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 6 ఓవర్లలో 42 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్ క్రీజులో ఉన్నారు. చెలరేగిన రోహిత్, కార్తీక్.. విండీస్ టార్గెట్ 191 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(64), దినేష్ కార్తీక్(41) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో జోసఫ్ రెండు వికెట్లు,మెక్కాయ్,హోల్డర్,కీమో పాల్, హోసన్ తలా వికెట్ సాధించారు. దుమ్మురేపిన రోహిత్.. 15 ఓవర్లకు భారత్ స్కోర్: 131/5 భారత కెప్టెన్ రోహిత్ దుమ్ము రేపాడు. 44 బంతుల్లో 64 పరుగులు చేసిన రోహిత్.. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ హార్ధిక్ పాండ్యా రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పాండ్యా.. జోసఫ్ బౌలింగ్‌లో మెక్కాయ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 14 ఓవర్లకు టీమిండియా స్కోర్: 124/4, క్రీజులో రోహిత్ శర్మ(63), జడేజా(9) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా..పంత్ ఔట్ 88 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన పంత్ కీమో పాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 73/2 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(33),పంత్(6) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్.. 45 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మోక్కాయ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ అకేల్ హోసేన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో రోహిత్ శర్మ, పంత్ ఉన్నారు.7 ఓవర్లకు భారత్ స్కోర్: 50/2 తొలి వికెట్ కోల్పోయిన భారత్ 44 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ అకేల్ హోసేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రోహిత్ శర్మ(15), శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 20/0 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(9), సూర్యకుమార్ యాదవ్(10) పరుగులతో ఉన్నారు. బ్రియన్ లారా స్టేడియం వేదికగా తొలి టీ20లో వెస్టిండీస్‌తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్ వెస్టిండీస్: షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్(కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, కీమో పాల్ -
సూపర్ సిరాజ్.. మూడు బంతుల్లో రెండు వికెట్లు.. వీడియో వైరల్!
పోర్ట్ ఆఫ్‌స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 117 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక పలుమార్లు వర్షం అంతరాయం కలిగించచిన ఈ మ్యాచ్ ను 36 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగుుల చేసింది. భారత బ్యాటర్లలో శుభమాన్ గిల్(96), శిఖర్ ధావన్(58) పరుగులతో రాణించారు. అనంతరం డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో విండీస్ టార్గెట్‌ను 257 పరుగులగా నిర్దేశించారు. ఇక 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను ఆదిలోనే భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సిరాజ్ తొలి బంతికే కైల్ మైర్స్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. మూడో బంతికే బ్రూక్స్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఒక్క పరుగుకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం ఏ దశలోనే విండీస్ కోలుకోలేక పోయింది. ఈ క్రమంలో విండీస్ 26 ఓవవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో చహల్ 4, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణా చెరో వికెట్ తీసుకున్నారు. ఇక సిరాజ్ బౌలింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మూడో వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ ►టాస్: ఇండియా- బ్యాటింగ్ ►మ్యాచ్‌కు వర్షం ఆటంకి ►ఇండియా స్కోరు: 225-3 (36 ఓవర్లు) ►డక్‌వర్త్ లూయీస్ పద్ధతి(డీఎల్ఎస్)లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యం 257 పరుగులు ►వెస్టిండీస్ స్కోరు: 137-10 (26 ఓవర్లు) ►విజేత: ఇండియా- డీఎల్ఎస్ పద్ధతిలో 119 పరుగుల తేడాతో గెలుపు ►మూడు మ్యాచ్‌ల సిరీస్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన ఇండియా ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు- నాటౌట్) ►ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: శుబ్‌మన్ గిల్(64, 43, 98 పరుగులు) చదవండి: Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?! A remarkable over from @mdsirajofficial, bagging #Mayers and #Brooks while only giving away one run. Spectacular. Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/mFZVgPOkbC — FanCode (@FanCode) July 27, 2022 -
రవి దహియాకు అరుదైన గౌరవం
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్టార్ రెజ్లర్ రవి దహియాకు చక్కని గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు జరిగే క్వీన్స్ బ్యాటన్ రిలేను బుధవారం భారత్‌లో రవి ప్రారంభించాడు. తనకిది అరుదైన గౌరవమని, బర్మింగ్‌హామ్‌లో స్వర్ణం గెలిచేందుకు తీవ్రంగా చెమటోడ్చుతున్నట్లు రవి చెప్పాడు. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
బాక్సర్ లవ్లీనాకు బంపరాఫర్.. డీఎస్పీగా ఉద్యోగం, అదనంగా నెలకు రూ.లక్ష
Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆమె సెమీస్ చేరారు. అయితే వరల్డ్ నంబర్ వన్ టర్కీకి చెందిన బుసెనజ్తో జరిగిన సెమీస్‌లో ఓడిపోవడంతో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత ఆమెకు డీఎస్పీ ఉద్యోగంతోపాటు కోటి రూపాయల పారితోషికం ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఉదయం లవ్లీనాకు డీఎస్పీ నియామక పత్రం అందజేశారు. నెలవారీ జీతంతోపాటు లవ్లీనాకు బాక్సింగ్ ట్రైయినింగ్ ఖర్చుల కోసం అదనంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. దాంతోపాటు పంజాబ్‌లోని పటియాలలో కోచింగ్ తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే అంతర్జాతీయ స్థాయి కోచ్‌తో గువాహటిలోనే ట్రయినింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలిస్ శాఖకు కృతజ్ఞతలు చెప్పిన లవ్లీనా.. తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమేనని అన్నారు. (చదవండి: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి రజని) -
Savita Punia: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి
Savita Punia To Lead Indian Women Hockey Team: సీనియర్ గోల్‌కీపర్ సవిత పూనియాను భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా నియమించారు. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అనుభవజ్ఞురాలైన సవితకు జట్టు పగ్గాలు అప్పగించారు. ఒమన్‌లోని మస్కట్‌లో ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఇందులో 16 మంది టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి గోల్‌కీపర్ ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు Champions keep playing until they get it right. 🏋️🏃♀️🏑#WeareTeamIndia #SavitaPunia #IndianWomenHockeyTeam #HockeyIndia #gymtime #sportswomen pic.twitter.com/pKTiurTrV1 — Savita Punia (@savitahockey) November 24, 2021 -
Ind Vs Sa 3rd Test: వారం రోజుల క్రితం చెత్త ప్రదర్శన.. ఇప్పుడేమో 5 వికెట్లతో చెలరేగి..
Ind Vs Sa 3rd Test: దాదాపు వారం రోజుల క్రితం... రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి బుమ్రా చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై అతని బౌలింగ్ అస్త్రాలేవీ పని చేయకపోగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు తేదీ మారింది, వేదిక మారింది. తాను అరంగేట్రం చేసిన న్యూలాండ్స్ మైదానంలో బుమ్రా మళ్లీ కదం తొక్కాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టి పడేస్తూ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. బుమ్రాకు తోడు షమీ, ఉమేశ్ కూడా ఆకట్టుకోవడంతో మూడో టెస్టులో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఓవరాల్‌గా 70 పరుగుల ముందంజలో ఉన్న టీమిండియా చేతిలో 8 వికెట్లున్నాయి. మ్యాచ్ మూడో రోజు గురువారం ఎంత స్కోరు సాధిస్తుందనే దానిపైనే టెస్టు, సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్ (10), మయాంక్ (7) వెనుదిరగ్గా... కెప్టెన్ కోహ్లి (14 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. పీటర్సన్ అర్ధ సెంచరీ... తొలి ఓవర్లోనే వికెట్‌తో భారత్‌కు రెండో రోజు శుభారంభం లభించింది. బుమ్రా వేసిన రెండో బంతికే మార్క్రమ్ (8) క్లీన్‌బౌల్డ్ కాగా, కేశవ్ మహరాజ్ (25)ను ఉమేశ్ వెనక్కి పంపాడు. ఈ దశలో పీటర్సన్, వాన్ డర్ డసెన్ (21) కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. లంచ్ సమయానికి భారత్‌కు మరో వికెట్ దక్కలేదు. తర్వాతి సెషన్లో మాత్రం భారత బౌలర్లు ఒక్కసారిగా జోరు ప్రదర్శించారు. వాన్ డర్ డసెన్‌ను అవుట్ చేసి 67 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని ఉమేశ్ విడదీశాడు. ఆ తర్వాత షమీ ఓవర్‌తో భారత్‌కు మరింత పట్టు చిక్కింది. A classy knock from Keegan Petersen during the #Proteas first innings👏 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/2dXHRtyMEB — Cricket South Africa (@OfficialCSA) January 12, 2022 క్రీజ్‌లో నిలదొక్కుకున్న తెంబా బవుమా (52 బంతుల్లో 28; 4 ఫోర్లు)ను, మరో రెండు బంతులకే కైల్ వెరీన్ (0) కూడా షమీ పెవిలియన్ చేర్చాడు. జాన్సెన్ (7)ను బుమ్రా బౌల్డ్ చేయడంతో రెండో సెషన్ ముగిసింది. విరామం తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటి వరకు పోరాడిన పీటర్సన్‌ను బుమ్రా అవుట్ చేయగా, రబడ (15) చలువతో స్కోరు 200 దాటింది. చివరి వికెట్ కూడా తీసిన బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పుజారా (బి) బుమ్రా 3; మార్క్రమ్ (బి) బుమ్రా 8; కేశవ్ మహరాజ్ (బి) ఉమేశ్ 25; కీగన్ పీటర్సన్ (సి) పుజారా (బి) బుమ్రా 72; వాన్ డర్ డసెన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 21; బవుమా (సి) కోహ్లి (బి) షమీ 28; వెరీన్ (సి) పంత్ (బి) షమీ 0; జాన్సెన్ (బి) బుమ్రా 7; రబడ (సి) బుమ్రా (బి) శార్దుల్ 15; ఒలీవియర్ (నాటౌట్) 10; ఎన్గిడి (సి) అశ్విన్ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్) 210. వికెట్ల పతనం: 1–10, 2–17, 3–45, 4–112, 5–159, 6–159, 7–176, 8– 179, 9–200, 10–210. బౌలింగ్: బుమ్రా 23.3– 8–42–5, ఉమేశ్ యాదవ్ 16–3–64–2, షమీ 16–4–39–2, శార్దుల్ 12–2–37–1, అశ్విన్ 9–3–15–0. ►బుమ్రా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే వచ్చాయి. ►కోహ్లి టెస్టుల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్, గావస్కర్, అజహర్ తర్వాత ఈ మైలురాయిని దాటిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు -
క్యాచ్ మిస్ చేసిన పుజారా.. ఐదు పరుగుల పెనాల్టీ
కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో మూడో టెస్టులో పుజారా క్యాచ్ మిస్ చేయడం వల్ల టీమిండియా మూల్యం చెల్లించుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దుల్ వేసిన బంతిని బవుమా ఆడగా బంతి మొదటి స్లిప్ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఉన్న పుజారా అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లిన కీపర్ పంత్ కూడా క్యాచ్ వదిలేశాడు. దీంతో పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రాహుల్ (10), మయాంక్ (7) వెనుదిరగ్గా... కెప్టెన్ కోహ్లి (14 బ్యాటింగ్), పుజారా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు అవుటైన తర్వాత మరో 11.1 ఓవర్ల పాటు వీరిద్దరు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 17/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. కీగన్ పీటర్సన్ (72; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, బుమ్రా 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
Indian Open Super Series: సైనా, ప్రణయ్ ముందంజ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో సైనా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సైనా తొలి గేమ్‌ను 22–20తో గెల్చుకొని, రెండో గేమ్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి తెరెజా స్వబికోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సైనాను విజేతగా ప్రకటించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్లు కేయుర మోపాటి శుభారంభం చేయగా ... సామియా, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో ఓడిపోయారు. కేయుర 15–21, 21–19, 21–8తో స్మిత తోష్నివాల్ (భారత్)పై నెగ్గింది. సామియా 18–21, 9–21తో మాళవిక బన్సోద్ (భారత్) చేతిలో, సాయి ఉత్తేజిత 21–9, 12–21, 19–21తో తాన్యా (భారత్) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–14, 21–7తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై, లక్ష్య సేన్ 21–15, 21–7తో అధామ్ హతీమ్ ఎల్గామల్ (ఈజిప్ట్)పై గెలిచారు. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి–అశ్విని జంట మహిళల డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–7, 19–21, 21–13తో జనని–దివ్య (భారత్) జోడీపై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో శ్రీవేద్య గురజాడ (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జంట 21–9, 21–7తో మేఘ–లీలా లక్ష్మి (భారత్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 21–10తో రవి–చిరాగ్ అరోరా (భారత్) జంటపై గెలిచింది. విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 16–21, 16–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు
Conflict Between Jasprit Bumrah Vs Marco Jansen Viral: కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రొటిస్ బ్యాట్స్‌మన్ మార్కో జాన్సెన్ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇందులో ఆసక్తికరమేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. జోహన్నెస్‌బర్గ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో బమ్రా, మార్కో జాన్సెన్ మధ్య మాటలయుద్ధం జరిగింది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో బుమ్రాకు జాన్సెన్ వరుస బౌన్సర్లు సంధించాడు. ఓపికతో ఉన్న బుమ్రాను తన మాటలతో మార్కో జాన్సెన్ మరింత కవ్వించాడు. దీంతో బుమ్రా కూడా ధీటుగా బదులిస్తూ జాన్సెన్ వద్దకు వచ్చాడు. ఇది చూసిన అంపైర్లు జోక్యం చేసుకొని వారిద్దరిని విడగొట్టడంతో గొడవ ముగిసింది. ఈ గొడవను మిగతావాళ్లు అక్కడే మరిచిపోయారు.. కానీ బుమ్రా మాత్రం మనసులోనే ఉంచుకున్నాడు. చదవండి: Jasprit Bumrah: బుమ్రా అరుదైన ఘనత.. కపిల్, పఠాన్ల సరసన తాజాగా మూడో టెస్టులో మార్కో జాన్సెన్ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా బుమ్రా తన పవరేంటో చూపించాడు. రెండో రోజు టీ విరామం అనంతరం బుమ్రా వేసిన ఓవర్లో జాన్సెన్ను బౌన్సర్లతో భయపెట్టాడు. ఇక ఒక సూపర్ డెలివరీకి జాన్సెన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. షార్ట్‌పిచ్ అయిన బంతి నేరుగా ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టడంతో మార్కో జాన్సెన్ కనీసం బుమ్రా వైపు కూడా చూడకుండాను వెనుదిరగడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. బుమ్రాతో గెలుకున్నాడు.. ఫలితం అనుభవించాడు.. అంటూ కామెంట్స్ చేశారు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా బుమ్రాకు తోడు షమీ, ఉమేశ్ కూడా ఆకట్టుకోవడంతో మూడో టెస్టులో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా 70 పరుగుల ముందంజలో ఉంది. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Bumrah v Jansen 🥵 pic.twitter.com/rRgSpJ7UTj — J (@jaynildave) January 12, 2022 -
బుమ్రా అరుదైన ఘనత.. కపిల్, పఠాన్ల సరసన
Seventh Five Wicket Haul For Bumrah 27 Test Joins Elite List.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డు అందుకున్నాడు. కేప్‌టౌన్ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించాడు. కేప్‌టౌన్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో టీమిండియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు హర్భజన్ సింగ్ 2010-11లో ఏడు వికెట్లు తీయగా.. అదే మ్యాచ్‌లో శ్రీశాంత్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక బుమ్రా టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే రావడం విశేషం. ఇక 27 టెస్టుల్లో అత్యధికంగా ఏడుసార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించిన బుమ్రా కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ల సరసన నిలిచాడు. చదవండి: Virat Kohli: సెంచరీ మిస్సయ్యాడు.. అయినా రికార్డు అందుకున్నాడు ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(5/42)తో పాటు ఉమేశ్ యాదవ్(2/64), షమీ(2/39), శార్ధూల్ ఠాకూర్(1/37) రాణించారు. ఫలితంగా టీమిండియాకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీగన్ పీటర్సన్(72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, పుజారా ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను 57/2 స్కోర్ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్(7)ను రబాడ, కేఎల్ రాహుల్(10)ను జన్సెన్ పెవిలియన్‌కు పంపారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 70 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. A five-wicket haul for Jasprit Bumrah and South Africa's innings is wrapped up for 210 👏🏻 India lead by a slender 13 runs. Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/cmqKWckoIX — ICC (@ICC) January 12, 2022 -
రోహిత్ శర్మ న్యూ లుక్.. భార్య రితికా ఫన్నీ కామెంట్
ముంబై: గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ.. ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బరువు తగ్గడంతో పాటు న్యూ లుక్‌తో అదరగొట్టాడు. గత కొంత కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీ రిహాబిటేషన్‌లో గడుపుతున్న రోహిత్.. బాగా సన్నబడిపోయి, క్లీన్ షేవ్‌తో కనిపించాడు. న్యూ లుక్కు సంబంధించిన ఫోటోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) ఇందులో అతను దేనివైపో తీక్షణంగా చూస్తున్నట్టు ఫోజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. రోహిత్ లుక్‌పై అభిమానులు, టీమిండియా క్రికెటర్లతో పాటు అతని భార్య రితికా సజ్దే కూడా స్పందించింది. క్లీన్ షేవ్‌తో రోహిత్ యంగ్‌గా మారిపోయాడని అభిమానులు, సహచర క్రికెటర్లు అంటుండగా.. భార్య రితికా మాత్రం ఫన్నీ కామెంట్ చేసింది. "వై సో బ్రూడీ(అసంతృప్తితో ఆలోచించడం)" అంటూ రాసుకొచ్చింది. రోహిత్ న్యూ లుక్‌పై రితిక చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. చదవండి: Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు.. -
Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు..
IND Vs SA: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న వేళ, కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో వికెట్ కీపర్ ఎప్పటికీ విజయవంతమైన ఓపెనింగ్ బ్యాటర్ కాలేడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బ్యాటింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను అనవసరంగా వికెట్ కీపింగ్ రొంపిలోకి లాగొద్దని సూచించాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రాహుల్‌పై వికెట్ కీపింగ్ భారాన్ని మోపడం సబబు కాదని, ఇలా చేయడం వల్ల అతనితో పాటు జట్టు కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించాడు. క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కీపర్ టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా రాణించింది లేదని ఈ సందర్భంగా ఉదహరించాడు. కీపింగ్ చేసి ఓపెనర్‌గా సక్సెస్ కావడం వన్డే, టీ20ల్లో చూసామని, సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం అలా జరగడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నాడు. ఉపఖండపు పిచ్‌లపై సగటున ఓ జట్టు 150 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే.. కీపింగ్ చేసి మళ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి రాణించడం అత్యాశ అవుతుందని తెలిపాడు. పంత్‌ను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తే.. మరో రెగ్యులర్ వికెట్ కీపర్ వైపు చూడాలి కాని, రాహుల్‌ను డిస్టర్బ్ చేయకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. చదవండి: IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి, బ్యాటింగ్‌లో అనుకుంటే పొరపాటే..! -
IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి
కేప్‌టౌన్: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో సెంచరీ మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అదేంటీ.. కోహ్లి కొత్తగా సెంచరీ సాధించడమేంటీ అని అనుకుంటున్నారా..? అయితే, కోహ్లి ఈ సారి సెంచరీ మార్కును అందకుంది బ్యాటింగ్‌లో కాదు. అతను సెంచరీ పూర్తి చేసింది ఫీల్డింగ్‌లో. Virat Kohli completes 1️⃣0️⃣0️⃣ catches in Test cricket 🙌 He is the sixth Indian fielder, who isn't a wicket-keeper, to get to the milestone in Tests. Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/g7eoPK0wnB — ICC (@ICC) January 12, 2022 దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా క్యాచ్ అందుకోవడం ద్వారా కోహ్లి టెస్ట్‌ల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేశాడు. తద్వారా రాహుల్ ద్రవిడ్(164 టెస్ట్‌ల్లో 210 క్యాచ్‌లు), వీవీఎస్ లక్ష్మణ్(134 మ్యాచ్‌ల్లో 135), సచిన్ టెండూల్కర్(200 మ్యాచ్‌ల్లో 115), సునీల్ గవాస్కర్(125 మ్యాచ్‌ల్లో 108), అజహారుద్దీన్(99 టెస్ట్‌ల్లో 105)ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా(వికెట్‌కీపర్ కాకుండా) నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి కెరీర్లో 99వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లి సెకెండ్ స్లిప్‌లో అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో బవుమా(28) పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజ్‌లో పీటర్సన్(61), వెర్రిన్ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, ఉమేశ్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, షమీ ఓ వికెట్ సాధించాడు. అంతకుముందు తొలి రోజు భారత్ 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక -
IPL 2022: కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలైన లక్నో, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ డెడ్‌లైన్ విధించింది. మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది. జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఇరు జట్లు చెరో ముగ్గురు ఆటగాళ్లను(ఇద్దరు స్వదేశీ, ఓ విదేశీ) ఎంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ(జనవరి 12) ఉదయం ఇరు జట్లకు మెయిల్ చేసింది. గతంలో ఆటగాళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జనవరి 31ని గడువు తేదీగా నిర్ణయించిన బీసీసీఐ.. ముగ్గుర ఆటగాళ్ల ఎంపికకు అంత సమయం అవసరం లేదని భావించి, సవరించిన తేదీని ఇవాళ ప్రకటించింది. నిన్న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ మరో కీలక ప్రకటన కూడా చేసింది. బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి ఎట్టకేలకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో పాటు మెగా వేలానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. వేలానికి బెంగళూరును వేదికగా ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్.. తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకుంది. అయితే కెప్టెన్ విషయంలో మాత్రం ఈ ఫ్రాంచైజీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. చదవండి: Ind Vs Sa ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక -
IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో జయంత్ యాదవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా జనవరి 19 నుంచి ప్రొటిస్‌తో టీమిండియా వన్డే సిరీస్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ కోవిడ్ కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో జయంత్ యాదవ్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా నవదీప్ సైనీని కూడా జట్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ మహ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా సైనీకి అవకాశం ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. -
IND Vs SA: కోహ్లి ఈగోను పక్కకు పెట్టాడు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Gautam Gambhir Hails Virat Kohli: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 79 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయం ఏదైన కోహ్లిపై విమర్శనాస్త్రాలు సంధించే గంభీర్.. తొలిసారిగా కోహ్లిని ఉద్దేశించి పాజిటివ్‌గా మాట్లడాడు. కేప్‌టౌన్ టెస్ట్‌లో కోహ్లి.. తన ఈగోను బ్యాగ్‌లో పెట్టి బ్యాటింగ్ చేశాడని, ఆ కారణంగానే కీలక ఇన్నింగ్స్ ఆడగలిగాడని పేర్కొన్నాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అహాన్ని పక్కకు పెట్టాలని కోహ్లి తన సహచరులకు సూచించేవాడని, తాజా ఇన్నింగ్స్‌లో కోహ్లి ఆ ఫార్ములాను పక్కాగా అమలు చేశాడని కితాబునిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో సఫారీ పేసర్లు కవ్వించే బంతులు విసిరినా ఏకాగ్రత కోల్పోకుండా సంయమనంతో బ్యాటింగ్ చేసిన కోహ్లి.. జట్టుకు గౌవరప్రదమైన స్కోర్ అందించాడని ప్రశంసించాడు. ఓపెనర్ల వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తన సహజ శైలికి భిన్నంగా ఎంతో ఓర్పుతో 201 బంతులను ఎదుర్కొని కీలక ఇన్నింగ్స్ ఆడాడని ఆకాశానికెత్తాడు. చాలా కాలం తర్వాత కోహ్లి.. తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడని ప్రశంసలు కురిపించాడు. కోహ్లి ఆడిన ఈ క్లాసీ ఇన్నింగ్స్ శతకంతో సమానమని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, కోహ్లి రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన సఫారీలు తొలి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్(3)ను బుమ్రా ఔట్ చేయగా.. క్రీజ్‌లో మార్క్రమ్(8), కేశవ్ మహారాజ్(6) ఉన్నారు. చదవండి: ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్ కెప్టెన్.. టీమిండియా నుంచి అతడొక్కడే! -
IPL 2022: ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి ఆసీస్ స్టార్ పేసర్ రీ ఎంట్రీ.. భారీ ధర!
IPL 2022 Auction: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో పునరాగమనం చేయనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. మెగా వేలం-2022లో పాల్గొనేందుకు స్టార్క్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్ రిచ్ లీగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమతున్నట్లు సమాచారం. కాగా చివరిసారిగా 2015లో ఐపీఎల్లో ఆడాడు స్టార్క్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత పనిభారం తగ్గించుకునే క్రమంలో క్యాష్ రిచ్ లీగ్ నుంచి నిష్క్రమించాడు. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో తిరిగి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు స్టార్క్ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో అతడు మాట్లాడుతూ... ‘‘పేపర్‌వర్క్ పూర్తి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటివరకైతే నా పేరు నమోదు చేసుకోలేదు. పోటీలో మాత్రం ఉంటాననే భావిస్తున్నా. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్ జట్లు చేరనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ బెంగళూరులో మెగా వేలం నిర్వహించనుంది. ఇక స్టార్క్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. నాలుగో టెస్టుల్లో కలిపి ఇప్పటి వరకు 14 వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ స్టార్క్ గనుక వేలంలోకి వస్తే అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయం. ఈ క్రమంలో పెద్ద మొత్తమే చెల్లించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2014, 15 సీజన్లలో ఆడిన స్టార్క్ 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే..