Ind Vs Aus BGT 2023 2nd Test Day 2 Highlights And Updates:
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. రెండోరోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62 పరుగుల ఆధిక్యంలో ఉంది.
5.5: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
జడేజా బౌలింగ్‌లో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (6) అవుట్. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు.
ఒక్క పరుగు ఆధిక్యం
83.3: కుహ్నెమన్ బౌలింగ్‌లో షమీ బౌల్డ్. 262 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా. ఆసీస్‌కు ఒక్క పరుగు ఆధిక్యం
81.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్(74) అవుటయ్యాడు. దీంతో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆసీస్ కంటే ఇంకా 4 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు: 259/9 (82). షమీ, సిరాజ్ క్రీజులో ఉన్నారు.
80.2: అశ్విన్ అవుట్.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
దంచికొడుతున్న అక్షర్
అక్షర్ పటేల్ 67 పరుగులతో, అశ్విన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 252/7 (80). ఆసీస్ కంటే టీమిండియా ఇంకా 11 పరుగులు వెనుకబడి ఉంది.
అక్షర్ అర్ధ శతకం
74.5: కుహ్నెమన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్న టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. భారత్ స్కోరు: 230/7 (75)
నిలకడగా ఆడుతున్న అశ్విన్, అక్షర్
69: అక్షర్ పటేల్ 34, అశ్విన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 202-7
టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 179/7 (62)
అశ్విన్(11), అక్షర్ పటేల్ (28) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. భరత్ ఔట్
139 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన భరత్.. లియోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
135 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన విరాట్ కోహ్లి మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
125 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన జడేజా.. మర్ఫీ బౌలింగ్‌లో లల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో కోహ్లి, శ్రీకర్ భరత్ ఉన్నారు.
46 ఓవర్లకు భారత్ స్కోర్: 120/4
భారత ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా చక్కదిద్దే పనిలో పడ్డారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. కోహ్లి(31), రవీంద్ర జడేజా(26) పరుగులతో క్రీజులో ఉన్నారు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 120/4
లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే!
లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 88/4 (35). రవీంద్ర జడేజా(15), కోహ్లి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
66 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. లియోన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తన వందో టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగాడు. లియోన్ బౌలింగ్‌లో పుజారా ఎల్బీగా వెనుదిరిగాడు. 20 ఓవర్లకు టీమిండియా స్కోర్: 55/3
రెండో వికెట్ కోల్పోయిన భారత్
53 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ లియోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
రాహుల్ అవుట్
17.1: కేఎల్ రాహుల్(17) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్‌లో ఈ ఓపెనర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్కోరు: 46-1. పుజారా, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు.
►14 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(13), రోహిత్(24) పరుగులతో ఉన్నారు
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టు
ఢిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆస్ట్రేలియా తమ బౌలింగ్ ఎటాక్‌ను స్పిన్‌తో మొదలపెట్టింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతిని డెబ్యూ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ చేతికి ఇచ్చాడు. ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ 13, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తుది జట్లు:
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమన్, డేవిడ్ వార్నర్ సబ్‌స్టిట్యూట్‌గా మాథ్యూ రెర్షా.
Comments
Please login to add a commentAdd a comment