ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ సిరీస్‌లో అతడు సారథ్యం వహించిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండింట ఓటమి.. ఓ మ్యాచ్‌ను డ్రా ముగించింది. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. ఆఖరి టెస్టుకు పేలవ ఫామ్ కారణంగా తనంతట తనే తప్పుకున్నాడు.
అయితే ఐదో టెస్టు నుంచి వైదొలగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. డూ ఆర్‌డై మ్యాచ్‌లో రోహిత్ జట్టును ముందుండి నడిపించి ఉంటే బాగుండేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
"సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడి ఉండాల్సింది. అతడు జైశ్వాల్‌తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పి సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించి ఉంటే బాగుండేది. రోహిత్ శర్మ రెగ్యూలర్ కెప్టెన్. పరుగులు సాధించికపోయినా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతడిపై ఉంది.
ఈ సిరీస్‌లో రోహిత్ ఒక్కడే కాదు, స్టార్ ప్లేయర్లు ఎవరూ ఫామ్‌లో లేరు. కోహ్లి, ఖవాజా వంటి ప్లేయర్లు కూడా తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. అయినప్పటికి వారు జట్టులో కొనసాగారు. లబుషేన్, స్మిత్‌లు కూడా కాస్త ఆలస్యంగా తమ ఫామ్‌ను తిరిగి పొందారు.
ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్క బ్యాటర్ కష్టపడ్డారు. కేఎల్ రాహుల్ ఆరంభంలో రాణించినప్పటికి, తర్వాత మాత్రం విఫలమయ్యాడు. కాబట్టి ఒక నాయకుడిగా రోహిత్ శర్మ జట్టు నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయం కాదు. ఏదైనా జట్టులో ఉండి సాధించాలి.
కీలకమైన మ్యాచ్‌లోనే ఆడనప్పుడు, అతడు ఇక టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటే బెటర్. ఐదో టెస్టులో రోహిత్ లేని లోటు కన్పించింది. బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. ఆ సమయంలో రోహిత్ ఉండి ఉంటే బాగుండేదని ప్రతీ ఒక్కరికి అన్పించింది" అని తన యూట్యూబ్ ఛానల్‌లో కైఫ్ పేర్కొన్నాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది.
చదవండి: IND vs AUS: సిడ్నీ పిచ్‌పై ఐసీసీ రేటింగ్..
Comments
Please login to add a commentAdd a comment