భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’(Border Gavaskar Trophy)లో భాగంగా చివరి టెస్టు జరిగిన సిడ్నీ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సానుకూల నివేదిక ఇచ్చింది. ఈ పిచ్‌ను ‘సంతృప్తికరం’ అనే రేటింగ్‌ను ఇచ్చింది. సీమ్ బౌలింగ్‌కు విపరీతంగా స్పందించడంతో పాటు అనూహ్య బౌన్స్‌తో కనిపించిన ఈ పిచ్‌పై పేస్ బౌలర్లు చెలరేగారు.
గ్రౌండ్స్‌మన్ ఈ టెస్టు కోసం కొత్త తరహా పచ్చికను ఉపయోగించారు. ఫలితంగా సిడ్నీలో తక్కువ సమయంలో ముగిసిన టెస్టుల జాబితాలో (బంతుల పరంగా) ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.
ఐసీసీ ఇచ్చిన నివేదిక వల్ల మున్ముందు ఇలాంటి ‘సంతృప్తికర’ పిచ్‌లను రూపొందించేందుకు తాము సిద్ధమవుతామని ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పందించింది. మరో వైపు తొలి నాలుగు టెస్టులు జరిగిన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్ మైదానాలు ‘చాలా బాగున్నాయి’ అనే రేటింగ్‌తో ఐసీసీ కితాబునిచ్చింది.
సిడ్నీలో ఘోర ఓటమి..
కాగా ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ సిరీస్‌తో పాటు భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంతయ్యాయి.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భారత్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది.
ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం ఈసారి సత్తాచాటలేకపోయాడు. ఇక సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అనంతరం జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు టీమిండియా సిద్దం కానుంది.
చదవండి: ‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’
Comments
Please login to add a commentAdd a comment