sydeny
-
AUS vs SA: ఆసీస్‌తో కీలక టెస్టు.. దూరమైన సౌతాఫ్రికా బ్యాటర్
South Africa tour of Australia, 2022-23- 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సౌతాఫ్రికా బ్యాటర్ థీనిస్ డి బ్రూయిన్ దూరం కానున్నాడు. మొదటిసారి తండ్రి కానున్న తరుణంలో బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శనివారం వెల్లడించింది. కాగా వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా డీన్ ఎల్గర్ బృందం ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మొదటి రెండో టెస్టుల్లో ఓడి చేదు అనుభవం మూటగట్టుకుంది. దీంతో ఇప్పటికే ఆతిథ్య ఆస్ట్రేలియాకు సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మరింత వెనుకబడిపోయింది. ఆసీస్‌తో మిగిలిన ఒక టెస్టు, ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ గెలవడం సహా టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్ ఫలితం తేలితేనే ఫైనల్ అవకాశాలపై క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించాలని ప్రొటిస్ పట్టుదలగా ఉంది. ఆసీస్- ప్రొటిస్ మధ్య జనవరి 4న మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక 30 ఏళ్ల బ్రూయిన్ విషయానికొస్తే.. గబ్బా టెస్టులో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. మెల్బోర్న్లో ఆడే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాసీ వాన్ డెర్ డసెన్ స్థానంలో బాక్సింగ్ డే టెస్టులో ఆడిన బ్రూయిన్.. మొత్తంగా 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆట పరంగా విఫలమైనా... వ్యక్తిగత జీవితంలో మాత్రం శుభవార్త అందుకోనున్నాడు. చదవండి: Rishabh Pant: సుశీల్ జీ మీకు రుణపడిపోయాం.. లక్ష్మణ్ ట్వీట్ వైరల్; ‘రియల్ హీరో’లకు తగిన గౌరవం ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! -
‘ఏంటిది పంత్.. ఎందుకిలా చేశావు’
సిడ్నీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు క్యాచ్ జరవిడిచిన తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా- భారత జట్ల మధ్య గురువారం మూడో టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లబుషేన్, అరగేంట్ర ఆటగాడు విల్ పకోవ్‌స్కీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.(చదవండి: మహ్మద్ సిరాజ్ కంటతడి) కాగా మెరుగ్గా ఆడుతున్న పకోవ్‌స్కీని పెవిలియన్‌కు చేర్చే అవకాశం రెండుసార్లు చేజారింది. 22వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో ఒకసారి, మళ్లీ 25 ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. సిరాజ్ విసిరిన షార్ట్‌బాల్‌ను ఎదుర్కొనే క్రమంలో పకోవ్‌స్కీ బంతిని గాల్లోకి లేపగా, పంత్ దానిని ఒడిసిపట్టినట్టే కనిపించిది. కానీ థర్డ్అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో పంత్ కీపింగ్ నైపుణ్యాలపై నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు. అతడికి బదులు వృద్ధిమాన్ సాహాను జట్టులోకి తీసుకున్నా బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. పంత్ టీమిండియా గిల్‌క్రిస్ట్ అయ్యే అంతటివాడు. అదే సమయంలో అతడు ఇండియా కమ్రాన్ అక్మల్ కూడా అవ్వగలడు. ఏంటిది పంత్? ఎందుకిలా చేశావు?’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. (చదవండి: ముంబైలో ఆడమన్నా ఆడతాం: ఆసీస్ కెప్టెన్) పకోవ్‌స్కీ వికెట్ తీసిన సైనీ ఇక అర్ధసెంచరీ(62) పూర్తి చేసుకున్న పకోవ్‌స్కీ ఎట్టకేలకు నవదీప్ సైనీ బౌలింగ్‌లో 34వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. టీమిండియా తరఫున 299వ ఆటగాడిగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సైనీ తొలి వికెట్‌గా.. ఆసీస్ అరంగేట్ర క్రికెటర్ పకోవ్స్కీను పెవిలియన్‌కు చేర్చడం విశేషం. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్, స్టీవ్ స్మిత్ క్రీజులో ఉన్నారు. A rollercoaster of emotions for Will Pucovski! Initially given out, but on closer inspection he's recalled to the crease! #OhWhatAFeeling@Toyota_Aus | #AUSvIND pic.twitter.com/WgT5lCRjAE — cricket.com.au (@cricketcomau) January 7, 2021 -
ఉద్యాన వనాలుగా శ్మశానాలు
సిడ్నీ: ఊరవతలి దిబ్బపైనున్న శ్మశానంలో ఎండుటాకుల మధ్య నిట్ట నిలువుగా నిలబెట్టిన సమాధి రాళ్లను చూస్తే పగలే భయం వేస్తుంది. ప్రేతాత్మలను నమ్మే వారి సంగతి ఇక చెప్పక్కర్లేదు. అలాంటి చోటుకు వెళ్లి గతించిన ఆత్మీయులను తలచుకోవాలంటే, వారికి శ్రద్ధాంజలి ఘటించాలంటే గుండెల్లో గుబులు తప్పదు. ఆధునిక జీవన శైలిలో భాగంగా శ్మశానాలు కూడా ఇప్పుడు సుందర నందన ఉద్యాన వనాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సమాధి రాళ్ల స్థానంలో చెట్లు పుట్టుకొచ్చాయి. ఆత్మీయులను సమాధి చేసిన చోట పెంచుతున్న మొక్క ఏపుగా పెరుగుతుందా, లేదా ? ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, అసలు ఆ మొక్క ఎక్కడుందో గుర్తించేందుకు మొబైల్ యాప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ అదే కోవలో ఎకో ఫ్రెండ్లీ శ్మశానానికి డిజైన్ చేసింది. పరిసరాలు అహ్లాదకరంగా ఉండేందుకు చుట్టూ చెట్లు నాటినా, శ్రద్ధాంజలికి సంబంధించిన సంస్కారాలు చేసేందుకు వీలుగా సమాధి స్థలాన్ని ఖాళీగానే వదిలేస్తున్నారు. వాటిపై సమాధి రాళ్లు కూడా ఉండవు. పేరు, ఊరు రాసి మార్కు చేసి కూడా ఉండదు. అయితే ఎవరి సమాధి ఎక్కడుందో గుర్తించేందుకు వీలుగా జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వ్యవస్థ ద్వారా సమాధుల జాడ కచ్చితంగా తెలుసుకోవచ్చు. సిడ్నీకి శివారులో ఓ 25 ఎకరాల స్థలంలో ‘అకేషియా రిమంబ్రెన్స్ సాంక్చరీ’ అనే సంస్థ, సిడ్నీలోని క్రోఫీ ఆర్కిటెక్ట్స్‌తో కలసి ఉద్యానవనం లాంటి ఈ ఎకో ఫ్రెండ్లీ శ్మశానాన్ని నిర్మిస్తోంది. అందమైన ల్యాండ్ స్కేప్తోపాటు గలగలపారే సెలయేళ్లు, వివిధ రకాల పుష్పాలతో బంధువులు సేదతీరేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నామని సాంక్చరీ యజమానులు తెలియజేస్తున్నారు. లండన్‌లో కూడా ఇలాంటి ఓ శ్మశాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందని వారు చెప్పారు.