సిడ్నీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు క్యాచ్ జరవిడిచిన తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా- భారత జట్ల మధ్య గురువారం మూడో టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లబుషేన్, అరగేంట్ర ఆటగాడు విల్ పకోవ్‌స్కీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.(చదవండి: మహ్మద్ సిరాజ్ కంటతడి)
కాగా మెరుగ్గా ఆడుతున్న పకోవ్‌స్కీని పెవిలియన్‌కు చేర్చే అవకాశం రెండుసార్లు చేజారింది. 22వ ఓవర్‌లో అశ్విన్ బౌలింగ్‌లో ఒకసారి, మళ్లీ 25 ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ మిస్ చేయడంతో అతడికి లైఫ్ దొరికింది. సిరాజ్ విసిరిన షార్ట్‌బాల్‌ను ఎదుర్కొనే క్రమంలో పకోవ్‌స్కీ బంతిని గాల్లోకి లేపగా, పంత్ దానిని ఒడిసిపట్టినట్టే కనిపించిది. కానీ థర్డ్‌అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో పంత్ కీపింగ్ నైపుణ్యాలపై నెటిజన్లు మరోసారి మండిపడుతున్నారు. అతడికి బదులు వృద్ధిమాన్ సాహాను జట్టులోకి తీసుకున్నా బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. పంత్ టీమిండియా గిల్‌క్రిస్ట్ అయ్యే అంతటివాడు. అదే సమయంలో అతడు ఇండియా కమ్రాన్ అక్మల్ కూడా అవ్వగలడు. ఏంటిది పంత్? ఎందుకిలా చేశావు?’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. (చదవండి: ముంబైలో ఆడమన్నా ఆడతాం: ఆసీస్ కెప్టెన్)
పకోవ్‌స్కీ వికెట్ తీసిన సైనీ
ఇక అర్ధసెంచరీ(62) పూర్తి చేసుకున్న పకోవ్‌స్కీ ఎట్టకేలకు నవదీప్ సైనీ బౌలింగ్‌లో 34వ ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. టీమిండియా తరఫున 299వ ఆటగాడిగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సైనీ తొలి వికెట్‌గా.. ఆసీస్ అరంగేట్ర క్రికెటర్ పకోవ్‌స్కీను పెవిలియన్‌కు చేర్చడం విశేషం. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్, స్టీవ్ స్మిత్ క్రీజులో ఉన్నారు.
A rollercoaster of emotions for Will Pucovski! Initially given out, but on closer inspection he's recalled to the crease! #OhWhatAFeeling@Toyota_Aus | #AUSvIND pic.twitter.com/WgT5lCRjAE
— cricket.com.au (@cricketcomau) January 7, 2021
Comments
Please login to add a commentAdd a comment