బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. సిడ్నీ వేదికగా శుక్రవారం(జనవరి 3) నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భారత్ అమీ తుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సిడ్నీ టెస్టుకు యువ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఆకాష్ దీప్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆకాష్ కేవలం 43 ఓవర్ల బౌలింగ్ మాత్రమే చేశాడు. దీంతో అతడికి ఆఖరి టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించిందంట.
ఆకాష్ స్ధానంలో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనాధికరిక టెస్టుల్లో కృష్ణ అద్భుతంగా రాణించాడు.
ఈ క్రమంలోనే తొలి రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రానాను కాదని ప్రసిద్ద్‌కు చాన్స్ ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో బుమ్రా తర్వాత అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన ఆకాష్ దీప్.. సిడ్నీ టెస్టుకు దూరమైతే భారత్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
బ్రిస్బేన్ టెస్టు డ్రా ముగియడంలో దీప్‌ది కీలక పాత్ర. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైతే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.
చదవండి: బుమ్రా లేకుంటే బీజీటీ ఏకపక్షమే: గ్లెన్ మెక్‌గ్రాత్
Comments
Please login to add a commentAdd a comment