బుమ్రా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. వికెట్‌తో తొలిరోజు ముగించిన భారత్‌ | India Vs Australia 5th Test Day 1 Live Score Updates, Highlights And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

IND Vs AUS: బుమ్రా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. వికెట్‌తో తొలిరోజు ముగించిన టీమిండియా

Published Fri, Jan 3 2025 7:16 AM | Last Updated on Fri, Jan 3 2025 12:39 PM

India vs Aus 5th test day 1 live updates and highlights

India vs Aus 5th test day 1 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఈ క్రమంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్‌ అయింది. శుబ్‌మన్‌ గిల్‌(20), రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించగా.. రిషభ్‌ పంత్‌(40), కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(17 బంతుల్లో 22) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌ నాలుగు, స్టార్క్‌ మూడు, కమిన్స్‌ రెండు, నాథన్‌ లియాన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

వికెట్‌ తీసిన బుమ్రా
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(2)ను సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేశాడు. సిడ్నీలో శుక్రవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఆసీస్‌ మూడు ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 9 పరుగులు చేసింది. సామ్‌ కొన్‌స్టాస్‌ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.

185 పరుగులకు టీమిండియా ఆలౌట్‌..
సిడ్నీ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో రిషబ్‌ పంత్‌(40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరి కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా(22) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరితో పాటు జడేజా(26) పర్వాలేదన్పించాడు. ఇక ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌ 4 వికెట్లతో సత్తాచాటగా.. మిచెల్‌ స్టార్క్‌ మూడు, కమ్మిన్స్‌ రెండు, లియోన్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో ప్రసిద్‌ కృష్ణ(3) తొమ్మిదో వికెట్‌గా వెనునదిరిగాడు. సామ్‌ కొన్‌స్టాస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. వరుస ఫోర్లు కొట్టి బుమ్రా 12 పరుగులతో క్రీజులో ఉండగా.. సిరాజ్‌ ప్రసిద్‌ స్థానంలో వచ్చాడు. భారత్‌ స్కోరు: 168/9 (68.2).

సుందర్‌ ఔట్‌..
టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన వాషింగ్టన్‌ సుందర్‌.. కమ్మిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జస్ప్రీత్‌ బుమ్రా వచ్చాడు. 66 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 149/8

భారత్‌ ఏడో వికెట్‌ డౌన్‌..
రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన జడేజా.. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి జస్ప్రీత్‌ బుమ్రా వచ్చాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
పంత్‌ స్థానంలోక్రీజులోకి వచ్చిన నితీశ్‌ రెడ్డి తొలి బంతికే అవుటయ్యాడు. బోలాండ్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా నిష్క్రమించాడు. దీంతో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌క్రీజులోకి వచ్చాడు. భారత్‌ స్కోరు: 120/6 (57) 

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
పంత్‌(40) రూపంలో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. బోలాండ్‌ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పంత్‌ పెవిలియన్‌ చేరాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డిక్రీజులోకి వచ్చాడు.

56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 119/4 (56) .
జడ్డూ 14, పంత్‌ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీ బ్రేక్‌కు భారత్‌ స్కోర్‌: 107/4
టీ విరామానికి భారత్‌ 4 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(10), రిషబ్‌ పంత్(26) ఉన్నారు.

48 ఓవర్లకు భారత్‌ స్కోర్‌​: 100/4
రవీంద్ర జడేజా(10), రిషబ్‌ పంత్(26) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 28 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 48 ఓవర్లకు భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.

నిలకడగా ఆడుతున్న రిషబ్‌ పంత్‌..
విరాట్‌ కోహ్లి ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు రిషబ్‌ పంత్‌(19 నాటౌట్‌), రవీంద్ర జడేజా(4 నాటౌట్‌) ఆచితూచి ఆడుతున్నారు. 44 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 87/4
టీమిండియా నాలుగో వికెట్‌ డౌన్‌..
విరాట్‌ కోహ్లి రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి(17) ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 35 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 76/4

నిలకడగా ఆడుతున్న కోహ్లి, పంత్‌
లంచ్‌ అనంతరం తొలి రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులోకి రిషబ్‌ పంత్‌ వచ్చాడు. 30 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 67/3. క్రీజులో పంత్‌(7)తో పాటు విరాట్‌ కోహ్లి(14) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ ‍డౌన్‌.. గిల్‌ ఔట్‌
శుబ్‌మన్‌ గిల్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌​ కోల్పోయింది. లంచ్‌ విరామానికి ముందు లియోన్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ ఔటయ్యాడు. లంచ్‌ బ్రేక్‌కు భారత్‌ స్కోర్‌: 57/3



నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్‌..
శుబ్‌మన్‌ గిల్‌​, కోహ్లి నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. 19 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 50/2

జైశ్వాల్‌ ఔట్‌..
టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. అద్బుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్‌ ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు.

రాహుల్‌ ఔట్‌..
కేఎల్‌ రాహుల్‌ రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రాహుల్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్‌ గిల్‌ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 14/1

రోహిత్‌ ఔట్‌.. గిల్‌ ఇన్
సిడ్నీ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. ఆఖరి టెస్టులో టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా వ్యవహరిస్తున్నాడు.

రోహిత్‌తో పాటు గాయం కారణంగా ఆకాష్‌ దీప్‌ కూడా ఈ ‍మ్యాచ్‌కు అందుబాటులో లేడు. రోహిత్‌​ స్ధానంలో శుబ్‌మన్‌ గిల్‌ తుది జట్టులోకి రాగా.. ఆకాష్‌ స్ధానంలో ప్రసిద్ద్‌ కృష్ణ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మిచెల్‌ మార్ష్‌ స్ధానంలో వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది.

తుది జట్లు
ఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్‌, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీప‌ర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్‌), ప్ర‌సిద్ద్‌ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement