థీనిస్ డి బ్రూయిన్ (PC: Proteas Men)
South Africa tour of Australia, 2022-23- 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సౌతాఫ్రికా బ్యాటర్ థీనిస్ డి బ్రూయిన్ దూరం కానున్నాడు. మొదటిసారి తండ్రి కానున్న తరుణంలో బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శనివారం వెల్లడించింది. కాగా వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా డీన్ ఎల్గర్ బృందం ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.
ఇందులో భాగంగా మొదటి రెండో టెస్టుల్లో ఓడి చేదు అనుభవం మూటగట్టుకుంది. దీంతో ఇప్పటికే ఆతిథ్య ఆస్ట్రేలియాకు సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మరింత వెనుకబడిపోయింది. ఆసీస్‌తో మిగిలిన ఒక టెస్టు, ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ గెలవడం సహా టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్ ఫలితం తేలితేనే ఫైనల్ అవకాశాలపై క్లారిటీ వస్తుంది.
ఈ నేపథ్యంలో ఆఖరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించాలని ప్రొటిస్ పట్టుదలగా ఉంది. ఆసీస్- ప్రొటిస్ మధ్య జనవరి 4న మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక 30 ఏళ్ల బ్రూయిన్ విషయానికొస్తే.. గబ్బా టెస్టులో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. మెల్‌బోర్న్‌లో ఆడే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాసీ వాన్ డెర్ డసెన్ స్థానంలో బాక్సింగ్ డే టెస్టులో ఆడిన బ్రూయిన్.. మొత్తంగా 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆట పరంగా విఫలమైనా... వ్యక్తిగత జీవితంలో మాత్రం శుభవార్త అందుకోనున్నాడు.
చదవండి: Rishabh Pant: సుశీల్ జీ మీకు రుణపడిపోయాం.. లక్ష్మణ్ ట్వీట్ వైరల్; ‘రియల్ హీరో’లకు తగిన గౌరవం
ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది
Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!
Comments
Please login to add a commentAdd a comment