Theunis de Bruyn
-
30 ఏళ్లకే కెరీర్ ముగించిన సౌతాఫ్రికా క్రికెటర్
Theunis De Bruyn: సౌతాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రూన్ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆరేళ్ల కెరీర్లో కేవలం 13 టెస్ట్‌లు, 2 టీ20లు మాత్రమే ఆడిన డి బ్రూన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన డి బ్రూన్.. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. టెస్ట్‌ల్లో 19.5 సగటున 468 పరుగులు చేసిన డి బ్రూన్ .. 2018లో శ్రీలంకపై సెంచరీ చేశాడు. ఇదే అతని కెరీర్లో ఏకైక సెంచరీ. ఇది మినహా డి బ్రూన్ కెరీర్లో కనీసం అర్ధసెంచరీ కూడా లేదు. టీ20ల్లో కేవలం 2 మ్యాచ్‌లు ఆడిన డి బ్రూన్.. కేవలం 26 పరుగులు మాత్రమే సాధించాడు. డి బ్రూన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్ టైటాన్స్ వెల్లడించింది. జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించడాన్ని డి బ్రూన్ గౌరవంగా ఫీలవుతున్నాడని టైటాన్స్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. డి బ్రూన్ తన ఆరాధ్య క్రికెటర్లతో డ్రెస్సింగ్ షేర్ చేసుకోవడం పట్ల చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది. కాగా, డి బ్రూన్ ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లీగ్‌లో క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచింది. SA20 ఇనాగురల్ లీగ్‌లో 238 పరుగులు చేసిన డి బ్రూన్.. ఎడిషన్ సెకెండ్ హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
AUS vs SA: ఆసీస్‌తో కీలక టెస్టు.. దూరమైన సౌతాఫ్రికా బ్యాటర్
South Africa tour of Australia, 2022-23- 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సౌతాఫ్రికా బ్యాటర్ థీనిస్ డి బ్రూయిన్ దూరం కానున్నాడు. మొదటిసారి తండ్రి కానున్న తరుణంలో బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శనివారం వెల్లడించింది. కాగా వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా డీన్ ఎల్గర్ బృందం ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మొదటి రెండో టెస్టుల్లో ఓడి చేదు అనుభవం మూటగట్టుకుంది. దీంతో ఇప్పటికే ఆతిథ్య ఆస్ట్రేలియాకు సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మరింత వెనుకబడిపోయింది. ఆసీస్‌తో మిగిలిన ఒక టెస్టు, ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ గెలవడం సహా టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్ ఫలితం తేలితేనే ఫైనల్ అవకాశాలపై క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించాలని ప్రొటిస్ పట్టుదలగా ఉంది. ఆసీస్- ప్రొటిస్ మధ్య జనవరి 4న మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక 30 ఏళ్ల బ్రూయిన్ విషయానికొస్తే.. గబ్బా టెస్టులో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. మెల్బోర్న్లో ఆడే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాసీ వాన్ డెర్ డసెన్ స్థానంలో బాక్సింగ్ డే టెస్టులో ఆడిన బ్రూయిన్.. మొత్తంగా 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆట పరంగా విఫలమైనా... వ్యక్తిగత జీవితంలో మాత్రం శుభవార్త అందుకోనున్నాడు. చదవండి: Rishabh Pant: సుశీల్ జీ మీకు రుణపడిపోయాం.. లక్ష్మణ్ ట్వీట్ వైరల్; ‘రియల్ హీరో’లకు తగిన గౌరవం ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు!