
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 22–40తో ఓడింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఆరో ఓటమి. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ ఒక్కడే కాస్త మెరుగైన ప్రదర్శన చేసి 12 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 43–23తో యు ముంబాను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో యూపీ యోధ; దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ తలపడతాయి.
చదవండి: SA vs IND: కోహ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్.. వెంటనే మయాంక్ ఔటయ్యాడు.. వీడియో వైరల్