India Vs West Indies, 1st T20 Highlights: India Beat West Indies By 68 Runs - Sakshi
Sakshi News home page

IND VS WI 1st T20: టీమిండియా ఆల్‌రౌండ్‌ షో.. 68 పరుగులతో గెలుపు

Published Fri, Jul 29 2022 11:43 PM | Last Updated on Sat, Jul 30 2022 8:46 AM

IND VS WI 1st T20: India won by 68 runs - Sakshi

ట్రినిడాడ్‌: ఫార్మాట్‌ మారినా వెస్టిండీస్‌ తలరాత మాత్రం మారలేదు. తొలి టి20లో టీమిండియా 68 పరుగులతో జయభేరి మోగించింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆశ్చర్యకరంగా సూర్యకుమార్‌తో ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేశాడు. ఉన్నంతసేపు చక్కటి షాట్లు ఆడిన సూర్య (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) త్వరగానే పెవిలియన్‌ చేరగా, అయ్యర్‌ (0), రిషభ్‌ పంత్‌ (14), హార్దిక్‌ పాండ్యా (1) నిరాశపరిచారు.

‘హిట్‌మ్యాన్‌’ క్రీజులో ఉండటంతో కీలకమైన వికెట్లు పడినా ఆ లోటేమి కనపడలేదు. 11.3 ఓవర్లలోనే భారత్‌ 100 దాటింది. కెప్టెన్‌ రోహిత్‌ 35 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. జడేజా (16) తక్కువ స్కోరే చేయగా, ఆఖర్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దినేశ్‌ కార్తీక్‌ (19 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. జోసెఫ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనకు విండీస్‌ విలవిల్లాడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేసింది. బ్రూక్స్‌ (20) టాప్‌ స్కోరర్‌ కాగా... అర్‌‡్షదీప్, అశ్విన్, బిష్ణోయ్‌ తలా 2 వికెట్లు తీశారు. రెండో టి20 సోమవారం బసెటెర్‌లో జరుగుతుంది. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హోల్డర్‌ 64; సూర్యకుమార్‌ (సి) హోల్డర్‌ (బి) హోసీన్‌ 24; అయ్యర్‌ (సి) హోసీన్‌ (బి) మెక్‌కాయ్‌ 0; పంత్‌ (సి) హోసీన్‌ (బి) పాల్‌ 14; పాండ్యా (సి) మెక్‌కాయ్‌ (బి) జోసెఫ్‌ 1; జడేజా (సి) పాల్‌ (బి) జోసెఫ్‌ 16; కార్తీక్‌ నాటౌట్‌ 41; అశ్విన్‌ నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 190.

వికెట్ల పతనం: 1–44, 2–45, 3–88, 4–102, 5–127, 6–138. బౌలింగ్‌: మెక్‌కాయ్‌ 4–0–30–1, హోల్డర్‌ 4–0–50–1, హోసీన్‌ 4–0–14–1, జోసెఫ్‌ 4–0–46–2, స్మిత్‌ 2–0–18–0, కీమో పాల్‌ 2–0–24–1. 

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) భువనేశ్వర్‌ (బి) అర్‌‡్షదీప్‌ 15; బ్రూక్స్‌ (బి) భువనేశ్వర్‌ 20; హోల్డర్‌ (బి) జడేజా 0; పూరన్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 18; పావెల్‌ (బి) బిష్ణోయ్‌ 14; హెట్‌మైర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అశ్విన్‌ 14; హోసీన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 11; స్మిత్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) బిష్ణోయ్‌ 0; కీమోపాల్‌ నాటౌట్‌ 19; జోసెఫ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 122. 

వికెట్ల పతనం: 1–22, 2–27, 3–42, 4–66, 5–82, 6–86, 7–86, 8–101. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2–1–11–1, అర్‌‡్షదీప్‌ 4–0–24–2, జడేజా 4–0–26–1, అశ్విన్‌ 4–0–22–2, పాండ్యా 2–0–12–0, బిష్ణోయ్‌ 4–0–26–2.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement