first T20 match
-
IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం. ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్‌కు ముందు వరకు వీరిద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్‌కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు. నిబంధనలు ఇలా... ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్‌కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు. వీరికి అవకాశం ఉందా... నితీశ్ రెడ్డి గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్‌ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్‌గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది. కల నిజమైంది: నితీశ్ రెడ్డి గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్‌లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. టీమ్‌లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్‌లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్‌లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
India vs South Africa 1st T20: ఆరంభం అదిరింది
తిరువనంతపురం: ప్రపంచకప్‌నకు ముందు చివరి టి20 సిరీస్ ఆడుతున్న భారత్ సులువైన శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత సీమర్లు దీపక్ చహర్ (2/24), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ (3/32), హర్షల్ పటేల్ (2/26) నిప్పులు చెరిగారు. అనంతరం బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు. దాంతో ఆసక్తికరంగా జరుగుతుందనుకున్న తొలిపోరు ఏకపక్షంగా ముగిసింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేసింది. కేశవ్ మహరాజ్ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. తర్వాత భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి గెలిచింది. సూర్య, రాహుల్ మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. సిరీస్ లో రెండో టి20 అక్టోబర్ 2న గువాహటిలో జరుగుతుంది. చహర్, అర్ష్‌దీప్ దడదడ 1 పరుగుకే వికెట్! బవుమా (0) క్లీన్‌బౌల్డ్. రెండో ఓవర్లో అదే పరుగు వద్ద రెండో వికెట్... డికాక్ (1)కూడా బౌల్డే! దీన్నుంచి తేరుకోకముందే ఆ ఓవర్లోనే రోసో (0), మిల్లర్ (0) ఇద్దరు వరుస బంతుల్లోనే డకౌట్. మూడో ఓవర్లో స్టబ్స్ (0) కూడా ఖాతా తెరువలేదు. 1, 3వ ఓవర్లు వేసిన దీపక్ చహర్ (2/2), ఒక్క రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ (3/7) పేస్‌కు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కకావికలమైంది. జట్టు స్కోరు 9/5. ఇలా పది పరుగులైనా చేయకముందే సగం వికెట్లను కోల్పోయింది. మార్క్రమ్ (25; 3 ఫోర్లు, 1 సిక్స్), పార్నెల్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఇద్దరూ కాసేపు నిలబడటంతో కష్టంగా జట్టు స్కోరు 50 దాటింది. అనంతరం కేశవ్ మహరాజ్ కొట్టిన కాసిన్ని మెరుపులతో మొత్తానికి వంద పైచిలుకు స్కోరైతే చేయగలిగింది. ఇంత తక్కువ స్కోరులోనూ 19వ ఓవర్ పరుగందుకోవడం భారత శిబిరానికి మింగుడుపడని అంశం. అర్ష్‌దీప్ ఓవర్లో కేశవ్ మహరాజ్ 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు వచ్చాయి. సూర్య, రాహుల్ ఫిఫ్టీ–ఫిఫ్టీ లక్ష్యం ఛేదించే క్రమంలో భారత టాపార్డర్కూ కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. సీనియర్లు రోహిత్ శర్మ (0), కోహ్లి (3) దక్షిణాఫ్రికా పేసర్లు రబడ, నోర్జేలకు తలవంచారు. దీంతో భారత్ పవర్‌ప్లేలో 17 పరుగులే చేయగలిగింది. పిచ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్న మరో ఓపెనర్ రాహుల్, హిట్టర్ సూర్యకుమార్ జాగ్రత్త పడ్డారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడకుండా ఆచితూచి ఆడారు. సగం ఓవర్లు ముగిసినా భారత్ స్కోరు 50ని చేరుకోలేదు. 10 ఓవర్లలో 47/2 స్కోరే చేసింది. తర్వాత సూర్య బ్యాట్ ఝుళిపించాడు. రాహుల్ కూడా పరుగుల వేగం పెంచాడు. కుదిరిన బంతిని 4గా, చెత్త బంతిని 6గా దంచేశారు. దీంతో మరో 6.4 ఓవర్లలోనే మిగతా 63 పరుగుల్ని చకచకా చేసేసింది. లక్ష్యం చేరుకున్న 17వ ఓవర్లోనే సూర్య 33 బంతుల్లో, రాహుల్ 56 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) అర్ష్‌దీప్ 1; బవుమా (బి) దీపక్ చహర్ 0; రోసో (సి) పంత్ (బి) అర్ష్‌దీప్ సింగ్ 0; మార్క్రమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ పటేల్ 25; డేవిడ్ మిల్లర్ (బి) అర్ష్‌దీప్ 0; స్టబ్స్ (సి) అర్ష్‌దీప్ (బి) చహర్ 0; పార్నెల్ (సి) సూర్యకుమార్ (బి) అక్షర్ 24; కేశవ్ (బి) హర్షల్ 41; రబడ (నాటౌట్) 7; నోర్జే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–8, 4–8, 5–9, 6–42, 7–68, 8–101. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–24–2, అర్ష్‌దీప్ సింగ్ 4–0–32–3, అశ్విన్ 4–1–8–0, హర్షల్ పటేల్ 4–0– 26–2, అక్షర్ పటేల్ 4–0–16–1. భారత్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 51; రోహిత్ శర్మ (సి) డికాక్ (బి) రబడ 0; విరాట్ కోహ్లి (సి) డికాక్ (బి) నోర్జే 3; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 50; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–9, 2–17. బౌలింగ్: రబడ 4–1–16–1, పార్నెల్ 4–0–14–0, నోర్జే 3–0–32–1, షమ్సీ 2.4–0–27–0, కేశవ్ మహరాజ్ 3–0–21–0. 56: అంతర్జాతీయ టి20ల్లో ఎక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రాహుల్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. గతంలో ఈ రికార్డు గంభీర్ (54 బంతుల్లో ఆస్ట్రేలియాపై 2012లో) ఉంది. 732: ఒకే ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్యకుమార్ 21 మ్యాచ్‌లు ఆడి 732 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్ (689 పరుగులు; 2018లో) పేరిట ఉంది. 16: ఒకే ఏడాది అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కు ఎక్కువ విజయాలు (16) అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. ధోని (2016లో 15 విజయాలు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. -
తొలి టీ20లో భారత్ విజయం (ఫొటోలు)
-
IND VS WI 1st T20: టీమిండియా ఆల్‌రౌండ్ షో.. 68 పరుగులతో గెలుపు
ట్రినిడాడ్: ఫార్మాట్ మారినా వెస్టిండీస్ తలరాత మాత్రం మారలేదు. తొలి టి20లో టీమిండియా 68 పరుగులతో జయభేరి మోగించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆశ్చర్యకరంగా సూర్యకుమార్‌తో ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. ఉన్నంతసేపు చక్కటి షాట్లు ఆడిన సూర్య (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) త్వరగానే పెవిలియన్ చేరగా, అయ్యర్ (0), రిషభ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (1) నిరాశపరిచారు. ‘హిట్‌మ్యాన్’ క్రీజులో ఉండటంతో కీలకమైన వికెట్లు పడినా ఆ లోటేమి కనపడలేదు. 11.3 ఓవర్లలోనే భారత్ 100 దాటింది. కెప్టెన్ రోహిత్ 35 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. జడేజా (16) తక్కువ స్కోరే చేయగా, ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (19 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. జోసెఫ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనకు విండీస్ విలవిల్లాడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేసింది. బ్రూక్స్ (20) టాప్ స్కోరర్ కాగా... అర్‡్షదీప్, అశ్విన్, బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. రెండో టి20 సోమవారం బసెటెర్లో జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హెట్‌మైర్ (బి) హోల్డర్ 64; సూర్యకుమార్ (సి) హోల్డర్ (బి) హోసీన్ 24; అయ్యర్ (సి) హోసీన్ (బి) మెక్కాయ్ 0; పంత్ (సి) హోసీన్ (బి) పాల్ 14; పాండ్యా (సి) మెక్కాయ్ (బి) జోసెఫ్ 1; జడేజా (సి) పాల్ (బి) జోసెఫ్ 16; కార్తీక్ నాటౌట్ 41; అశ్విన్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–44, 2–45, 3–88, 4–102, 5–127, 6–138. బౌలింగ్: మెక్కాయ్ 4–0–30–1, హోల్డర్ 4–0–50–1, హోసీన్ 4–0–14–1, జోసెఫ్ 4–0–46–2, స్మిత్ 2–0–18–0, కీమో పాల్ 2–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) భువనేశ్వర్ (బి) అర్‡్షదీప్ 15; బ్రూక్స్ (బి) భువనేశ్వర్ 20; హోల్డర్ (బి) జడేజా 0; పూరన్ (సి) పంత్ (బి) అశ్విన్ 18; పావెల్ (బి) బిష్ణోయ్ 14; హెట్‌మైర్ (సి) సూర్యకుమార్ (బి) అశ్విన్ 14; హోసీన్ (బి) అర్‡్షదీప్ 11; స్మిత్ (స్టంప్డ్) పంత్ (బి) బిష్ణోయ్ 0; కీమోపాల్ నాటౌట్ 19; జోసెఫ్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–22, 2–27, 3–42, 4–66, 5–82, 6–86, 7–86, 8–101. బౌలింగ్: భువనేశ్వర్ 2–1–11–1, అర్‡్షదీప్ 4–0–24–2, జడేజా 4–0–26–1, అశ్విన్ 4–0–22–2, పాండ్యా 2–0–12–0, బిష్ణోయ్ 4–0–26–2. -
Ind Vs SA 1st T20: మిల్లర్, డసెన్ విధ్వంసం.. భారత్ ఓటమి
న్యూఢిల్లీ: టి20ల్లో భారత్ జైత్రయాత్ర ముగిసింది. వరుసగా 13వ విజయం సాధించేందుకు ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినా... అనుభవం లేని బౌలింగ్‌తో భారత్ తేలిపోయింది. గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్‌డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్‌లో సఫారీకి శుభారంభం అందించారు. 200కుపైగా పరుగులు చేశాక భారత్ ఓడటం ఇదే తొలిసారి కాగా...దక్షిణాఫ్రికా టి20ల్లో ఇదే అత్యధిక ఛేదన. రెండో టి20 ఆదివారం కటక్‌లో జరుగుతుంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్‌కు చివరి నిమిషంలో దూరమయ్యాడు. ఇషాన్ కిషన్ అర్ధ శతకం భారత్ తొలి 5 ఓవర్లలో 36/0 స్కోరే చేసింది. ఈ సాదాసీదా స్కోరు తర్వాతి 5 ఓవర్లలో పూర్తిగా మారింది. ఓపెనర్లు కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (15 బంతుల్లో 23, 3 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పారు. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో గైక్వాడ్ సిక్స్, కిషన్ 2 ఫోర్లు బాదాడు. భారత్ స్కోరు 50 దాటింది. పార్నెల్ ఓవర్లోనూ భారీ సిక్సర్ బాదిన రుతురాజ్ మరో షాట్‌కు యత్నించి బవుమా చేతికి చిక్కాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) క్రీజులోకి రాగా... 8, 9, 10వ ఓవర్లలో ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు దంచేయడంతో జట్టు స్కోరు 100 దాటింది. అయ్యర్ బ్యాట్ ఝళిపిస్తున్న దశలో కేశవ్ వేసిన 11వ ఓవర్లో సఫారీ వికెట్ కీపర్ డికాక్ సులువైన స్టంపింగ్‌ను మిస్ చేశాడు. సిక్సర్‌తో కిషన్ (37 బంతుల్లో; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేసుకొని తర్వాతి బంతిని గాల్లోకి లేపగా అది మిడ్వికెట్లో ముగ్గురు ఫీల్డర్ల మధ్యలో నేలపాలైంది. ధాటిగా ఆడిన పంత్, పాండ్యా ఇషాన్, అయ్యర్ 6.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. కేశవ్ మహరాజ్ వేసిన 13వ ఓవర్లో కిషన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుసగా 2 సిక్సర్లు, 2 బౌండరీలతో 20 పరుగులు పిండాడు. ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి రివ్యూతో బయటపడ్డాడు. కానీ ఆఖరి బంతికి మళ్లీ షాట్ ఆడి లాంగాన్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే శ్రేయస్ జోరుకు ప్రిటోరియస్ బ్రేకులేశాడు. అయితే ఆఖరి 4 ఓవర్లలో కెప్టెన్ పంత్, హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా బౌలర్లకు ముచ్చెమటలు తప్పలేదు. 17వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ బౌండరీతో పంత్ 18 పరుగులు రాబట్టగా, 18వ ఓవర్లో హార్దిక్ 4, 6తో 13 పరుగులు వచ్చాయి. మళ్లీ పాండ్యా సిక్స్, ఫోర్‌తో 19 ఓవర్లోనే భారత్ 200 పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో పంత్ అవుటవ్వగా, పాండ్యా సిక్సర్‌తో మరో 9 పరుగులు జతయ్యాయి. మిల్లర్, డసెన్ మెరుపు ఫిఫ్టీలతో... భారీ లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే కెప్టెన్ బవుమా (10) వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్‌లో 3 సిక్సర్లతో చెలరేగిన ప్రిటోరియస్ (13 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్సర్లు)ను తర్వాతి ఓవర్లోనే హర్షల్ పటేల్ బౌల్డ్ చేశాడు. కాసేపటికి ఓపెనర్ డికాక్ (22)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చడంతో భారత్ శిబిరంలో ఉత్సాహం పెరిగింది. కానీ తర్వాత వచ్చిన మిల్లర్, డసెన్ భారీ షాట్లతో కొండంత లక్ష్యాన్ని కరిగించడంతో ఆ ఉత్సాహం కాస్తా నీరుగారింది. మిల్లర్ 22 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. హర్షల్ వేసిన 17వ ఓవర్లో డసెన్ 6, 6, 4, 0, 6, 0తో 22 పరుగులు పిండేశాడు. దీంతో 37 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అతని ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. 36 బంతుల్లో 78 పరుగుల అసాధ్యమైన సమీకరణాన్ని ఇద్దరు మెరుపులతో మార్చేశారు. వారి బ్యాటింగ్ వేగానికి భారత పేసర్లు అడ్డుకట్ట వేయలేకపోవడంతో 200 పైచిలుకు పరుగులు చేసినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. 29 పరుగుల వద్ద వాన్ డెర్ డసెన్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ వదిలేయడం కూడా దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. ఆ తర్వాత డసెన్ మరో 46 పరుగులు సాధించాడు. దినేశ్ కార్తీక్ నాడు–నేడు భారత్ తమ తొలి టి20 మ్యాచ్‌ను 2006లో ఆడింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్ భారత్‌కు 160వది...నాటి తొలి మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత కూడా అతను మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. జూన్ 1న 37వ పుట్టిన రోజు జరుపుకున్న కార్తీక్ ఒక్కడే అప్పటి బ్యాచ్‌నుంచి ఇంకా రిటైర్ కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) కేశవ్ 76; రుతురాజ్ (సి) బవుమా (బి) పార్నెల్ 23; అయ్యర్ (బి) ప్రిటోరియస్ 36; పంత్ (సి) వాన్‌డెర్ డసెన్ (బి) నోర్జే 29; పాండ్యా నాటౌట్ 31; దినేశ్ కార్తీక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–57, 2–137, 3–156, 4–202. బౌలింగ్: కేశవ్ 3–0–43–1, రబడ 4–0–35–0, నోర్జే 4–0–36–1, పార్నెల్ 4–0–32–1, షమ్సీ 2–0–27–0, ప్రిటోరియస్ 3–0–35–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ఇషాన్ (బి) అక్షర్ 22; బవుమా (సి) పంత్ (బి) భువనేశ్వర్ 10; ప్రిటోరియస్ (బి) హర్షల్ 29; వాన్‌డెర్ డసెన్ నాటౌట్ 75; మిల్లర్ నాటౌట్ 64; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–22, 2–61, 3–81. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–43–1, అవేశ్ 4–0–35–0, చహల్ 2.1–0–26–0, పాండ్యా 1–0–18–0, హర్షల్ 4–0–43–1; అక్షర్ 4–0–40–1. That's that from the 1st T20I. South Africa win by 7 wickets and go 1-0 up in the 5 match series.#TeamIndia will look to bounce back in the 2nd T20I. Scorecard - https://t.co/YOoyTQmu1p #INDvSA @Paytm pic.twitter.com/1raHnQf4rm — BCCI (@BCCI) June 9, 2022 -
మ్యాచ్ పోయింది... క్యాచ్ అదిరింది!
నార్తాంప్టన్: వర్షం ఆటంకం కలిగించిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో భారత మహిళలపై గెలిచింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. సీవర్ (27 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్), అమీ జోన్స్ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. శిఖా పాండేకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కూడా వర్షం దోబూచులాడటంతో ఆట సరిగ్గా సాగనేలేదు. లక్ష్యఛేదనలో భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. షఫాలీ (0) డకౌట్ కాగా, స్మృతి మంధాన (29; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. హర్లీన్ (17 నాటౌట్), దీప్తి శర్మ (3 నాటౌట్) క్రీజులో ఉండగా మళ్లీ వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను ఆపేసి డక్‌వర్త్ పద్ధతిలో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటిం చారు. ఆటను నిలిపివేసే సమయానికి డక్‌వర్త్ పద్ధతిలో భారత్ గెలవాలంటే స్కోరు 73గా ఉండాల్సింది. సూపర్... సూపర్...ఉమన్ హర్లీన్ అబ్బాయిల క్రికెట్ ఎక్కడ... అమ్మాయిల క్రికెట్ ఎక్కడ! వారి మెరుపులు చుక్కలు... మరి వీరి మెరుపులు మామూలు సిక్సర్లు! అంటే సరిపోతుందేమో కానీ... పురుషుల ఫిట్నెస్ భళా అతివల ఫిట్నెస్ డీలా అంటే కుదరదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మనమ్మాయే... పేరు హర్లీన్ డియోల్. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఈమె తొలి టి20లో అసాధారణ క్యాచ్ పట్టింది. బహుశా మహిళల క్రికెట్లో ఇలాంటి క్యాచ్ ఇదే మొదటిది. అందుకనే ప్రత్యర్థి ఇంగ్లండ్ శిబిరం కూడా ఆమె క్యాచ్‌కు చప్పట్లు కొట్టింది. ఆనంద్ మహీంద్రాలాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఔరా అన్నారంటే అర్థం చేసుకోండి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో శిఖా పాండే 19వ ఓవర్ వేసింది. ఐదో బంతిని అమీ జోన్స్ భారీ షాట్ ఆడింది. బౌండరీ లైన్‌కు తాకెంత దగ్గర్లో హర్లీన్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంది. బౌండరీ అవతల పడిపోతానని తెలిసిన ఆమె బంతిని గాల్లో వదిలి లైన్ దాటింది. మళ్లీ అక్కడ్నుంచి బంతి నేలను తాకేలోపే మైదానంలోకి డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ అందుకుంది. -
పాక్‌ను గెలిపించిన రిజ్వాన్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ రిజ్వాన్ (50 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచి పాక్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 189 పరుగుల లక్ష్యాన్ని పాక్ 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో ఫహీమ్ అష్రఫ్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 188 పరుగులు సాధించింది. మార్క్రమ్ (51; 8 ఫోర్లు, సిక్స్), క్లాసెన్ (50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. రెండో టి20 మ్యాచ్ సోమవారం జరుగుతుంది. -
ఆసీస్ విజయం
బ్రిస్బేన్: న్యూజిలాండ్ మహిళల జట్టుతో మూడు టి20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ ఏడాది మార్చిలో భారత్‌తో టి20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత ఆస్ట్రేలియా ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లీ గార్డ్నర్ (41 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్ లానింగ్ (24), రాచెల్ హేన్స్ (23) సహకరించారు. కెప్టెన్ సోఫీ డివైన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 121 పరుగులే చేయగలిగింది. సుజీ బేట్స్ (38 బంతుల్లో 33; 2 ఫోర్లు), సోఫీ డివైన్ (29) ఫర్వాలేదనిపించారు. రెండో టి20 నేడు జరుగుతుంది. -
సఫారీని గెలిపించిన ఇన్‌గిడి
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): ఇంగ్లండ్ గెలవాల్సిన మ్యాచ్ ఇది. చేతిలో 5 వికెట్లున్న ఇంగ్లండ్ ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు చేస్తే సరిపోతుంది. దక్షిణాఫ్రికాకు ఓటమి ఖాయమైన వేళ... సఫారీ పేసర్ లుంగి ఇన్‌గిడి (3/30) అద్భుతమే చేశాడు. అంతకుముందు 2 ఓవర్ల స్పెల్‌లో 25 పరుగులిచ్చిన ఈ పేసర్ ఆఖరి ఓవర్లో ఐదు పరుగులిచ్చి కరన్ (2), మొయిన్ అలీ (5)లను ఔట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి రషీద్ రెండో పరుగు తీయబోయి రనౌటయ్యాడు. దీంతో అనూహ్యంగా తొలి టి20లో దక్షిణాఫ్రికా జట్టు పరుగు తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ బవుమా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు), డికాక్ (15 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాన్ డెర్ డసెన్ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేడి ఓడింది. ఓపెనర్ జేసన్ రాయ్ (38 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ మోర్గాన్ (34 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో గెలుపుబాట పట్టింది. చివరి 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో 19వ ఓవర్‌ను మోర్గాన్ 4, 4, 6తో చితకబాదాడు. 16 పరుగులు వచ్చాయి కానీ ఆఖరి బంతికి మోర్గాన్ అవుట్ కావడంతో కథ మారింది. -
శ్రీలంక జట్టు వచ్చేసింది!
గువహటి: భారత్‌తో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు గురువారం ఇక్కడకు చేరుకుంది. లసిత్ మలింగ నాయకత్వంలో వచ్చిన జట్టు సభ్యులకు ఘనస్వాగతం లభించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో లంక జట్టుకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆదివారం ఇరు జట్ల మధ్య ఇక్కడ తొలి టి20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుత స్థితిలో మ్యాచ్ నిర్వహణపై కూడా సందేహాలు కనిపిస్తున్నాయి. అయితే తాము జాగ్రత్తలు తీసుకున్నట్లు అసోం క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రతినిధులు వెల్లడించారు. సుమారు 39,500 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల బర్సపర స్టేడియంలో టి20 కోసం ఇప్పటికే 27 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని వారు చెప్పారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఇప్పటికే అభిమానులు క్రిస్మన్, కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కాబట్టి క్రికెట్‌కు సమస్య లేదని స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లు శుక్రవారంనాడు నగరానికి చేరుకునే అవకాశం ఉంది. నేడు ఇరు జట్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లు ఏర్పాటు చేశారు. -
పొగమంచులో...పొట్టి పోరు!
భారత జట్టు బంగ్లాదేశ్‌తో ఇప్పటి వరకు ఎనిమిది టి20 మ్యాచ్‌లు ఆడితే అన్నింటా విజయం మనదే. వరల్డ్ కప్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరు మినహా అన్నీ ఏకపక్షంగా సాగినవే. దుర్బేధ్యమైన టీమిండియా ఇప్పుడు స్వదేశంలో తొలిసారిగా బంగ్లాతో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. కోహ్లి లేకున్నా భారత్ బలం ఏమాత్రం తగ్గలేదు. కానీ షకీబ్, తమీమ్‌లాంటి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతున్న బంగ్లా ఎంత వరకు పోటీనిస్తుందో చూడాలి. అయితే అన్నింటికి మించి ఢిల్లీ కాలుష్యం నీడలో ఈ మ్యాచ్ జరగడంపైనే అందరి దృష్టి నెలకొంది. పొగమంచుతో కమ్మేసిన నగరంలో మూడు గంటలకుపైగా ఆటగాళ్లు ప్రత్యర్థితో పాటు వాతావరణంతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది. న్యూఢిల్లీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించిన తర్వాత భారత జట్టు టి20 ఫార్మాట్‌తో కొత్త సిరీస్‌ను మొదలు పెడుతోంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతోంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఫిక్సింగ్ వివాదంతో ఐసీసీ నిషేధానికి గురైన షకీబ్ లేకపోవడంతో డీలా పడిన బంగ్లాదేశ్ టీమ్‌లో కూడా పలువురు యువ ఆటగాళ్లు తొలి విజయం అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు. శివమ్ దూబేకు చాన్స్.. గత సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి సారిగా బెంగళూరులో టి20 మ్యాచ్‌లో ఆడింది. అందులో ఆడిన వారిలో దాదాపు అందరికీ ఇక్కడ తుది జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ చెలరేగిపోతే మనకు తిరుగుండదు. మరో ఓపెనర్‌గా శిఖర్ ధావన్ రాణించడం కీలకం. బెంగళూరు మ్యాచ్ తర్వాత విజయ్ హజారేలో వన్డేలు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. ఇక్కడ అతను ఎంత దూకుడుగా ఆడతాడనేది ఆసక్తికరం. కోహ్లికి బదులుగా రాహుల్‌కు అవకాశం లభించవచ్చు. అయితే సంజు సామ్సన్ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. తర్వాతి స్థానాల్లో పంత్, అయ్యర్లు చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. రోహిత్ శర్మ మీడియా సమావేశాన్ని బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్‌కు బదులుగా జట్టులోకి వచ్చిన శివమ్ అదే తరహాలో విధ్వంసకర బ్యాటింగ్ చేయగల సమర్థుడు. కొంత విరామం తర్వాత టీమ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ చహల్‌ను కూడా ఆడించాలనే ఆలోచనతో మేనేజ్మెంట్ ఉంది. దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్‌లలో ఇద్దరు పేసర్లు బరిలోకి దిగుతారు. బెంగళూరులో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమిని పక్కన పెడితే స్వదేశంలో ఐపీఎల్‌తో అపార అనుభవం ఉన్న మన జట్టును నిలువరించడం దాదాపు అసాధ్యం. ముగ్గురే కీలకం... మహ్ముదుల్లా, ముష్ఫికర్, ముస్తఫిజుర్... బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌లో ఏమైనా విజయావకాశాలు ఉండాలంటే ఈ ముగ్గురిపైనే ఆధారపడి ఉంది. పైకి ఎన్ని మాటలు చెప్పినా... టాప్ ఆల్‌రౌండర్ షకీబ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. పైగా వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ తమీమ్ కూడా లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనపడింది. కెప్టెన్‌గా అదనపు బాధ్యత మోస్తున్న మహ్ముదుల్లా ధాటిగా ఆడగల సమర్థుడు. ముష్ఫికర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో గతంలో ఉన్నంత పదును కనిపించకపోయినా ఇప్పటికీ బంగ్లాకు అతను పెద్ద బలం. పైగా ఐపీఎల్లో ఆడుతున్న అనుభవం కూడా ఉంది. బంగ్లా రికార్డు చూస్తే ఈ ముగ్గురు కాకుండా మిగతావారి ఆట గాలిలో దీపంలాంటిదే. సీపీఎల్‌లో అనుభవం తర్వాత లిటన్ దాస్ బ్యాటింగ్ కొంత మెరుగుపడింది. కొత్త ఆటగాడు నయీమ్‌కు అవకాశం దక్కవచ్చు. అల్ అమీన్, అబూ హైదర్‌లాంటి బౌలర్లు భారత్‌ను ఎంత మేరకు నిలువరిస్తారనేది సందేహమే. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్/సామ్సన్, పంత్, అయ్యర్, శివమ్ దూబే, కృనాల్, వాషింగ్టన్, చహల్, దీపక్ చహర్, శార్దుల్/ఖలీల్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), దాస్, సర్కార్, నయీమ్, ముష్ఫికర్, మొసద్దిక్, అఫీఫ్, అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమీన్, అబూ హైదర్/తైజుల్. పిచ్, వాతావరణం టి20 ఫార్మాట్‌కు తగినట్లుగా బ్యాటింగ్‌కు అనుకూలం. కొంత వరకు స్పిన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీపావళి తర్వాత ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ ప్రకటించిన సమయంలో పూర్తి కాలుష్యభరిత వాతావరణంలో మ్యాచ్ జరుగుతోంది. ఆటకు అంతరాయం కలగకపోయినా క్రికెటర్లకు ఇబ్బంది మాత్రం తప్పకపోవచ్చు. -
ఇంగ్లండ్ శుభారంభం
క్రైస్ట్‌చర్చ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో మోర్గాన్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 153 పరుగులు సాధించింది. రాస్ టేలర్ (35 బంతుల్లో 44; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ రెండు వికెట్లు తీయగా... స్యామ్ కరన్, రషీద్, బ్రౌన్‌లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేమ్స్ విన్స్ (38 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (21 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), బెయిర్‌స్టో (35; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఆకట్టుకున్నారు. కివీస్ స్పిన్నర్ సాన్ట్నెర్ మూడు వికెట్లు తీశాడు. -
నేడు విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో తొలి టి20
-
సాగర తీరాన సమరం
‘టి20 మ్యాచ్లకంటే మరో రెండు వన్డేలే ఉంటే బాగుండేది’ భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. కోహ్లి మాత్రమే కాదు ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానుల అభిప్రాయం సైతం బహుశా ఇదే కావచ్చు. సరిగ్గా వన్డే వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో టి20 మ్యాచ్‌లు ఆడటం జట్టుకు పెద్దగా ప్రయోజనకరం కాకపోయినా పర్యటన సంప్రదాయాల్లో భాగంగా పొట్టి ఫార్మాట్ కూడా ఆడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారత్, ఆస్ట్రేలియా ధనాధన్ క్రికెట్లో తలపడబోతున్నాయి. తుది ఫలితం ఎలా ఉన్నా స్టార్ ఆటగాళ్లతో కూడిన ఇరు జట్లు ప్రేక్షకులకు మాత్రం మాంచి వినోదం పంచడం ఖాయమనిపిస్తోంది. వైజాగ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్ సమంగా ముగిసింది. దానికి కొనసాగింపుగానా అన్నట్లు ఇప్పుడు మన దేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్లో ఇటీవల న్యూజిలాండ్‌లో మన టీమ్ ఓడగా... మరోవైపు బిగ్‌బాష్ లీగ్ ద్వారా కంగారూ జట్టులో కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. వన్డేలను వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోనున్న రెండు జట్లు అంతకుముందు టి20ల్లో ఎలా చెలరేగుతాయో చూడాలి. కోహ్లి, బుమ్రా రాకతో... కివీస్‌తో సిరీస్‌కు దూరమైన కెప్టెన్ కోహ్లి, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి బరిలోకి దిగుతుండటంతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది. సొంతగడ్డపై అనుకూలత, బ్యాటింగ్ పిచ్ బలంతో మన లైనప్ భారీ స్కోరు చేసేందుకు మంచి అవకాశం ఉంది. ఎంతో కాలంగా భారత్ జయాపజయాలను ప్రభావితం చేస్తున్న టాప్–3 చెలరేగితే 20 ఓవర్లలో ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా పని ఉండదు. విశాఖలో ఘనమైన రికార్డులు ఉన్న కోహ్లి, రోహిత్‌ల నుంచి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు. నాలుగు అంతర్జాతీయ టి20 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన రోహిత్ శర్మ స్వదేశంలో మరోసారి అలాంటి లక్ష్యానికి గురి పెట్టినా ఆశ్చర్యం లేదు. న్యూజిలాండ్‌తో చివరి టి20 మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడి ఆకట్టుకున్న విజయ్ శంకర్ లోయర్ ఆర్డర్‌కు మారతాడు. వన్డేల్లో చోటు కోల్పోయినా... టి20ల్లో రెగ్యులర్‌గా మారిన దినేశ్ కార్తీక్‌పై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతుందా లేక ఏరికోరి ఎంపిక చేసుకున్న కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్లో ఆడిస్తుందా చూడాలి. ఈ రెండు టి20 మ్యాచ్‌లలోనూ చెలరేగితే దినేశ్ కార్తీక్ వన్డే అవకాశాలు మెరుగుపడతాయేమో. ప్రాక్టీస్ సెషన్లో ధోని దాదాపు ప్రతీ బంతిని మైదానం దాటించేలా భారీ షాట్లు ఆడాడు. అటు పేస్, ఇటు స్పిన్ పిచ్‌లపై కూడా హిట్టింగ్‌కే ప్రాధాన్యతనిస్తూ చెలరేగిపోయాడు. బుమ్రాతో పాటు ఉమేశ్ యాదవ్ కొత్త బంతిని పంచుకుంటాడు. గాయంతో సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరం కావడం భారత్‌కు కొంత ప్రతికూలాంశం. స్పిన్ భారం యజువేంద్ర చహల్పైనే ఉంది. అతని లెగ్ స్పిన్ బౌలింగ్‌లో సొంతగడ్డపైనే తీవ్రంగా ఇబ్బంది పడిన ఆసీస్ ఈసారి ఎలా ఎదుర్కొంటుందనేది సందేహమే. కుల్దీప్కు విశ్రాంతినివ్వడంతో టీమ్‌లోకి తొలిసారి ఎంపికైన మరో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేకు తుది జట్టులో అంత తొందరగా అవకాశం లభించకపోవచ్చు. ఇటీవల రాణించడంతో మార్కండేకు చాన్స్ వచ్చిందని, అయితే అతని వల్ల తమ వరల్డ్ కప్ ఆలోచనల్లో ఉన్న జట్టు కూర్పులో ఎలాంటి తేడా రాదని విరాట్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కొత్త ఆటగాళ్లు రాణిస్తారా... ఆస్ట్రేలియా జట్టులో ఇప్పుడు చూడదగ్గ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతను మార్కస్ స్టొయినిస్. సాధారణంగా ప్రత్యర్థి జట్టు క్రికెటర్ గురించి ప్రశంసించని విరాట్ కోహ్లి... అతడిని ఆకాశానికెత్తాడు. ఇటీవల ఆల్‌రౌండర్‌గా స్టొయినిస్ ఆట చాలా బాగుండటమే దానికి కారణం. మరోవైపు బిగ్‌బాష్‌లో ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’గా నిలిచిన డార్సీ షార్ట్పైనా ఆసీస్ మంచి అంచనాలు పెట్టుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ప్రదర్శన భారత్‌కు వచ్చేసరికి పునరావృతం అవుతుందని గ్యారంటీ ఏమీ లేదు. సొంతగడ్డపైనే కంగారూలు వర్షం కారణంగా సిరీస్ చేజార్చుకోకుండా బయటపడ్డారు. కాబట్టి ప్రముఖంగా వినిపిస్తున్న ఆటగాళ్లు కూడా ఏమేరకు రాణిస్తారనే చెప్పలేం. అయితే ఫించ్, మ్యాక్స్‌వెల్, లిన్ల దూకుడైన ఆటతో పాటు కమిన్స్, కూల్టర్ నీల్, రిచర్డ్సన్ల ఐపీఎల్ అనుభవం కచ్చితంగా ఆ జట్టుకు ఉపకరిస్తుంది. తొలి మ్యాచ్ గెలిస్తే ఆసీస్ ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుంది. కానీ, భారత్ అలాంటి అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరం. ప్రాక్టీస్ సందర్భంగా స్పిన్‌ను ఆడే విషయంలో ఆసీస్ ఆటగాళ్ళకు మాజీ స్టార్ మాథ్యూ హేడెన్ సూచనలివ్వడం కనిపించింది. వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం రికార్డు 2012లో ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరగాల్సిన తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి సైతం పడకుండానే పూర్తిగా రద్దయింది. సరిగ్గా మూడేళ్ల క్రితం 2016 ఫిబ్రవరి 14న జరిగిన టి20 మ్యాచ్‌లో భారత్ 9 వికెట్లతో శ్రీలంకను చిత్తు చేసింది. అశ్విన్ 8 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో లంక 82 పరుగులకే కుప్పకూలగా... భారత్ 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరల్డ్ కప్ సన్నాహాలకు ఈ సిరీస్‌కు కొంత తేడా ఉంటుందనేది వాస్తవం. వరల్డ్ కప్ జట్టులో ఉండేవారు టి20 క్రికెట్ వల్ల ఎక్కువగా ప్రభావితం కావద్దు. ఈ ఫార్మాట్లో ఉండే కొన్ని అవలక్షణాలు వన్డేలకు అంటకుండా వారే జాగ్రత్త పడాలి. వరల్డ్ కప్‌కు ముందు ఐపీఎల్ ఆడుతుండటం శారీరకంగా కూడా తీవ్ర శ్రమతో కూడుకున్నది. అయితే తమ శరీర సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి అతిగా శ్రమించి వరల్డ్ కప్‌లో భారత్‌కు ఆడేటప్పుడు కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. పుల్వామాలో అమరులైన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ సమయంలో మాది ఒకటే మాట. పాక్‌తో మ్యాచ్ ఆడే విషయంలో దేశం ఏం కోరుకుంటుందో, బీసీసీఐ ఏం నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి ఉండాలనేది మా ప్రధాన అభిప్రాయం. అయితే ఈ అంశంలో చివరకు ప్రభుత్వం, బోర్డు తీసుకునే నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. – కోహ్లి, భారత కెప్టెన్ తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, ధావన్, దినేశ్ కార్తీక్ /లోకేశ్ రాహుల్, ధోని, రిషభ్ పంత్, విజయ్ శంకర్, కృనాల్ పాండ్యా, ఉమేశ్ యాదవ్, యజువేంద్ర చహల్, బుమ్రా. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), హ్యాండ్స్కోంబ్, షార్ట్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, టర్నర్, క్యారీ, కూల్టర్ నీల్, కమిన్స్, జంపా, రిచర్డ్సన్. పిచ్, వాతావరణం సహజంగానే టి20 ఫార్మాట్‌కు తగినట్లుగా వైజాగ్ పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుందని, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్యురేటర్ నాగమల్లయ్య చెప్పారు. వాతావరణ సమస్య లేదు. వైజాగ్‌లో బాగా ఎండలు ఉన్నాయి. మ్యాచ్ రోజు కూడా ఇదే కొనసాగవచ్చు. రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ధనాధన్ దెబ్బ ఎవరిది?
ఏడాది ఆరంభంలో టెస్టు సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా 1–3తో పరాజయంపాలై వెనుదిరిగింది. ఆ పర్యటనకు కొనసాగింపులా పరిమిత ఓవర్ల కోసం మళ్లీ ఇక్కడికి వచ్చి ఇప్పటికే వన్డేల్లో చిత్తుగా ఓడింది. భారత్ తమ ఆధిపత్యం నిలబెట్టుకుంటూ నంబర్‌వన్ స్థాయిలో చెలరేగింది. ఇక సీన్ మూడో ఫార్మాట్‌కు మారింది. టి20ల్లోనూ తమ సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉండగా... ఇక్కడైనా గెలిచి కాస్త పరువు కాపాడుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్‌కు ధోని సొంత మైదానం సిద్ధమైంది. రాంచీ: ఒకరు కాదు, ఇద్దరు కాదు... జట్టులో ఒకరితో మరొకరు పోటీ పడుతూ సత్తా చాటిన వేళ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ టి20 సిరీస్‌ను గెలుచుకోవడంపై కూడా జట్టు దృష్టి పెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ జరిగే తొలి టి20లో భారత్, ఆసీస్‌తో తలపడుతుంది. కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో వన్డేల్లో కుదేలైన ఆసీస్... పొట్టి ఫార్మాట్లోనైనా రాత మార్చుకునే ప్రయత్నం లో ఉంది. ఇరు జట్ల మధ్య 2016 జనవరిలో ఆఖరిసారిగా టి20 సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియా గడ్డపైనే జరిగిన ఈ పోరును భారత్ 3–0తో గెలుచుకోవడం ఈ ఫార్మాట్లో ప్రత్యర్థిపై మన ఆధిక్యాన్ని చూపిస్తోంది. తొలి టి20 మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం లేకపోయింది. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల శుక్రవారం సెషన్ రద్దయింది. రాహుల్ ఉంటాడా! కుటుంబ కారణాలతో వన్డేలకు దూరమైన శిఖర్ ధావన్ తిరిగి రావడం మినహా భారత వన్డే, టి20 జట్లలో పెద్దగా తేడా లేదు. మరో అవకాశం లేకుండా రోహిత్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్ మినహా తన స్థాయి ముద్ర చూపించలేకపోయిన కోహ్లి, ఈ ఫార్మాట్లో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి సారి భారత్ తలపడిన 2016 టి20 వరల్డ్ కప్ మ్యాచ్‌లోనే కోహ్లి తన కెరీర్లో అత్యుత్తమ టి20 ఇన్నింగ్స్ ఆడాడు. జాదవ్, ధోని కూడా తమ వంతు పాత్రకు సిద్ధం కాగా... వన్డే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ హార్దిక్ పాండ్యా తన కెరీర్‌కు ఊపునిచ్చిన ఫార్మాట్లో మళ్లీ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక్క నాలుగో స్థానం విషయంలోనే కాస్త సందేహం నెలకొంది. మనీశ్ పాండేను కొనసాగిస్తారా లేక అతని స్థానంలో లోకేశ్ రాహుల్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. ఆసీస్‌తో ఒక్క వన్డే కూడా ఆడని రాహుల్‌కు టి20ల్లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో బౌలర్‌గా తన సత్తా చాటి కోహ్లిలో నమ్మకాన్ని పెంచిన యజువేంద్ర చహల్‌కు తుది జట్టులో చోటు ఖాయం కాగా, మరో స్పిన్నర్ కోసం అక్షర్, కుల్దీప్ పోటీలో ఉన్నారు. వెటరన్ ఆశిష్ నెహ్రాను సిరీస్ కోసం ఎంపిక చేయడం అంటే అతనికి ఖాయంగా తుది జట్టులో చోటు ఉన్నట్లే. కాబట్టి అతని కోసం పేస్ విభాగంలో మాత్రం ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది. బుమ్రా టి20 స్పెషలిస్ట్ కాబట్టి భువనేశ్వర్ తప్పుకోవాల్సి రావచ్చు. తన ఎంపికను సరైందిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత నెహ్రాపైనే ఉంది. అయితే తుది జట్టులో ఒకటి రెండు మార్పులు జరిగినా, జరగకపోయినా ప్రస్తుత భారత జట్టు మాత్రం అభేద్యంగా కనిపిస్తోంది. ఇదే జోరులో తొలి మ్యాచ్ కూడా గెలుచుకుంటే సిరీస్‌కు పట్టు చిక్కుతుంది. కొత్తగా నలుగురు! వన్డేల్లో ఆడని నలుగురు కొత్త ఆటగాళ్లు ఆసీస్ టీమ్‌లోకి వచ్చారు. ఆల్‌రౌండర్లు డాన్ క్రిస్టియాన్, మొయిజెస్ హెన్రిక్స్, లెఫ్టార్మ్ పేసర్ జేసన్ బెహ్రన్‌డార్ఫ్, వికెట్ కీపర్ టిమ్ పైన్ జట్టులో ఉన్నారు. వార్నర్, ఫించ్, స్మిత్‌లపై అతిగా ఆధార పడటమే వన్డేల్లో ఆసీస్ పరాజయానికి కారణమైంది. ఇప్పుడు కూడా వార్నర్, ఫించ్ విధ్వంసకర ఓపెనింగ్ భాగస్వామ్యం అందించగలరు. అయితే కెప్టెన్ స్మిత్ ఫామ్ ఆ జట్టును ఆందోళనపరుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి అతని వరుస వైఫల్యా లు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం కెప్టెన్సీ మీద కూడా పడుతోంది. కనీసం ఇప్పుడైనా అతను రాణించాలని జట్టు కోరుకుంటోంది. వన్డేల్లో ఫెయిలై తుది జట్టులో స్థానం కోల్పోయిన మ్యాక్స్‌వెల్‌పై టి20ల్లోనైనా ఆసీస్ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతుందో లేదో చూడాలి. అతని విధ్వంసకర బ్యాటింగ్ ఈ ఫార్మాట్లో పనికి రావచ్చు. మ్యాక్సీని కాదంటే అతని స్థానంలో ఆల్‌రౌండర్ హెన్రిక్స్ వస్తాడు. వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన కూల్ట ర్నీల్తో పాటు మరో పేసర్ రిచర్డ్సన్ కూడా జట్టులో ఉంటాడు. మూడో పేసర్‌గా బెహ్రన్‌డార్ఫ్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. లెగ్‌స్పిన్నర్ జంపా టి20ల్లో ప్రభావం చూపించగలడు. అతని స్థానంలో మరో సరైన ప్రత్యామ్నాయం కూడా ఆసీస్‌కు లేదు. ఈ ఫార్మాట్లో భారత్ చేతిలో చెత్త రికార్డు ఉన్న ఆస్ట్రేలియా దానిని మెరుగు పర్చుకోగలదా చూడాలి. ►9 భారత్, ఆస్ట్రేలియా మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 9 గెలిచి 4 ఓడింది. ►1 ఈ మైదానంలో గతంలో జరిగిన ఏకైక టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ 69 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, పాండే/రాహుల్, జాదవ్, ధోని, పాండ్యా, చహల్, బుమ్రా, కుల్దీప్/ అక్షర్, నెహ్రా/భువనేశ్వర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, ఫించ్, హెడ్, మ్యాక్స్‌వెల్/హెన్రిక్స్, క్రిస్టియాన్, పైన్, కూల్టర్‌నీల్, జంపా, రిచర్డ్సన్, బెహ్రన్‌డార్ఫ్. పిచ్, వాతావరణం సాధారణ టి20 తరహా పిచ్. భారీ స్కోరుకు అవకాశం. అయితే రెండు రోజులుగా వర్షం వల్ల వికెట్‌పై తేమ ప్రభావం ఉండవచ్చు. రాంచీతో పాటు పరిసరాల్లో వానలు కురుస్తున్నాయి. శనివారం కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. ► రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
క్రికెట్ మాట్లాడదాం క్రికెట్ విందాం క్రికెట్ చూద్దాం
♦ భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు రంగం సిద్ధం ♦ నేడు తొలి టి20 మ్యాచ్ ♦ సమంగా కనిపిస్తున్న ఇరు జట్లు ♦ హోరాహోరీ పోరు ఖాయం ►... ఎందుకంటే ఇలాంటి సిరీస్ ప్రతిసారీ రాదు. ఇలాంటి పోరాటాన్ని తరచుగా చూడలేం. ప్రపంచకప్ ముగిసిన దగ్గర్నించి నాణ్యమైన క్రికెట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన భారత అభిమానులకు రాబోయే రెండు నెలలూ పండగే. ►సొంతగడ్డపై తిరుగులేని రికార్డుతో భారత్ ఓవైపు... విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న దక్షిణాఫ్రికా మరోవైపు... భారీ హిట్టర్లు... నాణ్యమైన బౌలర్లు... మెరుపు ఫీల్డర్లు... ఆఖరి క్షణం దాకా పోరాడే తత్వం... అందుకే చూసినోళ్లకు చూసినంత వినోదం. ►చరిత్రలో తొలిసారి జాతి నేతల పేర్ల మీద జరుగుతున్న గాంధీ-మండేలా సిరీస్... మహాత్మా గాంధీ జయంతి రోజే ప్రారంభమవుతోంది. హిమాలయాల ఒడిలో రెండు జట్లు ధనాధన్ పోరుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ధర్మశాల: గత ఏడాది బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత భారత జట్టు 3 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడింది. అటు దక్షిణాఫ్రికా మాత్రం 10 మ్యాచ్‌లలో బరిలోకి దిగింది. అయితే సొంతగడ్డపై ఐపీఎల్ ద్వారా అపార అనుభవం సంపాదించిన మన ఆటగాళ్లకు పొట్టి క్రికెట్ సమరం కొత్త కాదు. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు (శుక్రవారం) ఇక్కడ తొలి పోరుకు రంగం సిద్ధమైంది. ధోని నాయకత్వంలో కొంత విరామం తర్వాత భారత్ మళ్లీ బరిలోకి దిగుతుండగా, అటు డు ప్లెసిస్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా సన్నద్ధమైంది. అంతా స్టార్లే టి20 మ్యాచ్ కోసం భారత బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. గాయంనుంచి పూర్తిగా కోలుకొని బంగ్లా ‘ఎ’పై సత్తా చాటిన శిఖర్ ధావన్ శుభారంభం అందించగలడు. మరో ఓపెనర్‌గా రోహిత్ శర్మ, రహానేలలో ఒకరు బరిలోకి దిగుతారు. ఆ తర్వాత కోహ్లి, రైనా, ధోనిలు చెలరేగితే భారీస్కోరు ఖాయం. ఇక్కడి పిచ్‌ను దృష్టిలో ఉంచుకొంటే బిన్నీ తుది జట్టులో ఖాయంగా ఉండే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. అశ్విన్‌తో పాటు హర్భజన్, మిశ్రాలలో ఒకరికే చోటు దక్కుతుంది. పేస్ విభాగంలో మాత్రం అనుభవలేమి కనిపిస్తోంది. గతంలో ప్రధాన పేసర్‌గా జట్టుకు అనేక విజయాలు అందించిన భువనేశ్వర్ కుమార్ గత ఆరు నెలలుగా మ్యాచ్ ఆడలేదు. ఇక ఐపీఎల్ అనుభవంతో మోహిత్ శర్మ ఆకట్టుకోవచ్చు. కేవలం టి20లకే ఎంపికైన శ్రీనాథ్ అరవింద్‌కు చోటు దక్కుతుందా లేదా చూడాలి. జట్టులో అందరికీ ఐపీఎల్ అనుభవం ఉండటం కీలకం కానుంది. కోలుకుంటారా... మరో వైపు వార్మప్ మ్యాచ్‌కు విలువ లేకపోయినా, భారీ స్కోరు చేసి కూడా ఓడటం దక్షిణాఫ్రికాను కాస్త ఇబ్బంది పెట్టింది. అయితే స్వింగ్‌కు అనుకూలించే ధర్మశాల పిచ్‌పై తొలి మ్యాచ్ ఆడటం తమకు శుభారంభం ఇస్తుందని ఆ జట్టు నమ్ముతోంది. బ్యాటింగ్‌లో డివిలియర్స్, డు ప్లెసిస్, మిల్లర్, డుమినిలాంటి హిట్టర్లు టీమ్‌లో ఉండగా డి కాక్ కూడా చక్కటి షాట్లు ఆడగలడు. భారత్‌లాగే ఐపీఎల్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్న ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు అనుకూలాంశం. సుదీర్ఘ పర్యటన కావడంతో టి20ల్లో తమ అగ్రశ్రేణి బౌలర్లకు సఫారీలు విశ్రాంతినిచ్చారు. ఫలితంగా కైల్ అబాట్, క్రిస్ మోరిస్ జట్టు బాధ్యతలు మోస్తున్నారు. ఎడీ లీ, రబడ, జోండోలకు అనుభవం లేదు. వీరంతా ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చారు. టి20ల్లో మంచి రికార్డు ఉన్న ప్రధాన స్పిన్నర్ తాహిర్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఆసీస్ దిగ్గజం మైక్ హస్సీ దక్షిణాఫ్రికా సలహాదారుడిగా పని చేస్తుండటం ఆ జట్టుకు అదనపు బలం. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, మోహిత్, హర్భజన్/అక్షర్ దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), డి కాక్, డివిలియర్స్, డుమిని, మిల్లర్, బెహర్దీన్, మోరిస్, డి లాంజ్, అబాట్, రబడ, తాహిర్. దూకుడు అంటే మాటల దాడినో, భౌతికంగా ఢీకొట్టడమో కాదు. నిబంధనలకు లోబడే హద్దులు దాటకుండా దూకుడు ఉంటే తప్పు లేదు. కానీ క్రమశిక్షణ చర్యతో మ్యాచ్‌కు దూరమయ్యేంత కాదు. మేం అనుకున్న సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇంకా దొరకలేదని చెప్పగలను. కాబట్టి అందుబాటులో ఉన్న ఆటగాళ్లనుంచే అత్యుత్తమమైనవారిని ఎంచుకోవాలి. ఈ సిరీస్‌లో వచ్చే ప్రపంచకప్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. దానికి చాలా సమయముంది. మన ఆటగాళ్లను వంతులవారీగా పరీక్షించుకునేందుకు, ఫామ్‌లోకి వచ్చేందుకు ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయి. -ధోని పేసర్లు మా బలమే అయినా ఇక్కడ మేం తాహిర్పై చాలా ఆధార పడుతున్నాం. అతను ఈ మ్యాచ్‌లో కీలకం అవుతాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితాన్ని పట్టించుకోవడం లేదు. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. సుదీర్ఘ పర్యటన మా ఆటగాళ్లందరికీ సవాల్లాంటిది. ఐపీఎల్ జట్టులోని స్నేహాలు ఇక్కడి పోటీతత్వానికి అడ్డు రావు. కాకపోతే బలాలు, బలహీనతలపై అవగాహన ఉంది కాబట్టి విజయం కోసం కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. - డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ పిచ్, వాతావరణం వేగవంతమైన వికెట్, అవుట్ ఫీల్డ్ ఉన్నాయి. ఆరంభంలో బంతి స్వింగ్ అయినా... చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు కూడా అనుకూలిస్తుందని క్యురేటర్ చెప్పారు. మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి టాస్ కీలకం కానుంది. శుక్రవారం వర్ష సూచన లేదు. సా. గం. 7.00నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం టి20ల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 గెలిచి, 2 ఓడింది. భారత గడ్డపై ఇరు జట్ల మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం.