
క్రైస్ట్‌చర్చ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో మోర్గాన్ బృందం ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 153 పరుగులు సాధించింది. రాస్ టేలర్ (35 బంతుల్లో 44; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ రెండు వికెట్లు తీయగా... స్యామ్ కరన్, రషీద్, బ్రౌన్‌లకు చెరో వికెట్ దక్కింది. అనంతరం ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేమ్స్ విన్స్ (38 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (21 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), బెయిర్‌స్టో (35; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఆకట్టుకున్నారు. కివీస్ స్పిన్నర్ సాన్‌ట్నెర్ మూడు వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment