
లండన్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య విఖ్యాత లార్డ్స్ స్టేడియంలో నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా వెటరన్ సీమర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి వస్తున్నారు. వీళ్లిద్దరిని వెస్టిండీస్‌లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు నుంచి తప్పించారు. అయితే కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ మెకల్లమ్ కోరిక మేరకు ఇద్దరు అనుభవజ్ఞుల్ని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజి లాండ్ జట్టు తొలి రోజు నుంచే టెస్టు మ్యాచ్‌లో పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment